
Aug 17 2026 7:06 AM | Updated on Aug 17 2026 7:29 AM
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్‌ను ఈజీగా అందుకున్న సూపర్‌జెయింట్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు.
హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్‌గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు.
ట్రెంట్ రాకెట్స్‌కు మెయిడెన్ టైటిల్ మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్‌తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, డాని గిబ్సన్ 22 పరుగులతో పర్వాలేదనిపించింది.
ట్రెంట్ బౌలర్లలో కిమ్ గార్త్, సమంతా బేట్స్, చార్లీ ఫిలిప్స్, జార్జియా ఆడమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ మరో 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లే (41) రాణించగా.. బెత్ మూనీ (31 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. జార్జియా ఆడమ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అన్నాబెల్ సదర్లాండ్ (315 పరుగులు, 11 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.
చదవండి: 'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే'
హైదరాబాద్ ఉప్పల్‌లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు)
భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు)
నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు)
'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు)
చింతమనేని కోసం సర్వం కోల్పోయాం.. భాను ప్రకాష్ దంపతుల ఆవేదన!
ఆ రోజు ఇంట్లో ఏం జరిగింది! రూపా రెడ్డి భర్తపై పోలీసుల అనుమానాలు
100 షేర్లకు 1000 షేర్లు! లిస్టయిన 10 రోజుల్లోనే బంపరాఫర్..
ఎవరిది గొడ్డలి పార్టీ? ఇదిగో సాక్ష్యం.. ఈ వీడియో చూసే దమ్ముందా బాబు..





