
హోంవర్క్ సున్నా.. ఆరోపణలు వంద.. ఇదే ఆ ఛానల్ పరిస్థితి: మంత్రి అచ్చెన్న
నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా వైసీపీ భర్తీ చేయలేదని విమర్శించారు.

నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా వైసీపీ భర్తీ చేయలేదని విమర్శించారు.

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా.. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత.. ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు. ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో

పట్నా: బిహార్‌లో ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి దుస్థితిలో ఉన్నాయో అక్కడి సమస్తిపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చూస్తే అర్థమవుతుంది. పేద, దళిత బస్తీకి చెందిన చిన్నారులు కనీస సౌకర్యాలు లేకుండా ఈ బడిలో చదువుకుంటున్నారు. సమస్తిపూర్ నగరంలోని బీఈడీ కాలేజ్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు కనీస విద్యా సదుపాయాలు కూడా అందుబాటులో లేవు. పక్కా తరగతి గదులు లేకపోవడంతో పిల్లలు గుడిసెలాంటి రెండు గదుల్లో నేలపై కూర్చొని చదువుతున్నారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదు తరగతులకు కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయి. ఒక గదిలో 1, 2, 3 తరగతుల పిల్లలకు కలిపి బోధిస్తున్నారు. మరో గదిలో 4, 5 తరగతుల పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. పిల్లలు ఎక్కువగా నేలపైనే కూర్చుంటున్నారు. సరైన బెంచీలు, డెస్కులు లేవు. బ్లాక్‌బోర్డు కూడా సరిగా లేదు. వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పాఠశాలలో తగినన్ని ఫ్యాన్లు లేకపోవడంతో తరగతి గదుల్లో వేడి, ఉక్కపోతతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పాముల భయం పాఠశాలలో విద్యార్థులు పాముల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పాఠశాలలో సరైన బెంచీలు, డెస్కులు లేకపోవడంతో పిల్లలు నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో పాములు లోపలికి వస్తే వారిని కరిచే ప్రమాదం ఉంది. పాఠశాల చుట్టుపక్కల పాములు కనిపిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గుడిసెలాంటి నిర్మాణం, చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా పిల్లల్లో భయం నెలకొంది. తమ చిన్నారులను పాఠశాలకు పంపుతున్న తల్లిదండ్రులు కూడా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు సురక్షితంగా ఉండాల్సిన పాఠశాలలోనే పాముల భయం ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల భద్రతపై పాఠశాల యాజమాన్యం, అధికారులు

రోజంతా ఏసీ గదిలో ఉండటం హాయిగా అనిపిస్తుంది, సౌకర్యంగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు ఏసీలో ఉంటే చర్మం పొడిబారడం, కళ్లలో మంట, ముక్కు-గొంతు పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువసేపు ఏసీ గదిలో ఉంటే, గదిలోని తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది. పెదాలు పగలడం, దురద వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో కళ్ల మంట, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆస్తమా లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి చల్లని, పొడి గాలి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల శ్వాస సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఊపిరితిత్తుల వైద్యులు చెబుతున్నారు

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ వేకువ జామున ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇస్లామాబాద్ లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి చేర్చారు. 73 ఏళ్ల వయసున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించడానికి ఓ స్వతంత్ర వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు.2023 ఆగస్ట్ నుంచి ఆయన రావల్పిండి లోని అడియాలా జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా వెలుగులోకి రాలేదు. ఆరోగ్య పరిస్థితి గురించి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. ఆ దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే.. ఇమ్రాన్ ఖాన్ ను తాజా ఆసుపత్రికి తరలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనను తరలించే సమయంలో కూడా ఫొటోలు, వీడియోలు రాకుండా భద్రత సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.2022 ఏప్రిల్ వరకు ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. అనంతరం తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో జైలు పాలు కావాల్సొచ్చింది. ఆ తర్వాత ఆయన సతీమణి బుష్రా బీబీపై కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు, కేసులన్నీ కూడా పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని పీటీఐ వాదిస్తోంది. బెయిల్ కోసం చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు.పాకిస్తాన్ కు చుక్కలే: కేంద్రం డేగకన్ను: ఏకంగా రూ. 1,943 కోట్లతో మెరుపు తీగెలు లీజ్శిక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. అడియాలా జైలు గోడల మధ్య దాదాపు 1,111 రోజుల పాటు అంటే మూడేళ్లకు పైగా సుదీర్ఘ ఖైదు అనుభవిస్తూ వస్తోన్నారాయన. ఆరోగ్యం క్షీణించడంతో వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఇన్ని రోజుల తర్వాత మొదటిసారిగా బయటికొచ్చారు. హైబీపీ

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా చెందిన ఇక్బాల్ అనే టీనేజర్ గత కొంతకాలంగా అత్యంత అరుదైన వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నాడు. నీటిలోంచి బయటకు అడుగుపెట్టగానే అతని శరీరమంతా భరించలేనంత తీవ్రమైన మంట పుడుతోంది. ఆ మంట నుంచి ఉపశమనం పొందడం కోసం ఆ బాలుడు రేయింబవళ్లు స్థానికంగా ఉండే చెరువుల్లోనే ఉంటున్నాడు. నీటిపైనే తేలుతూ జీవిస్తున్నాడు. చివరికి ఆహారం తినడం కూడా చెరువులోనే. అంతేకాదు తనను ఏదో అతీంద్రియ శక్తి ఆవహించడం వల్లే ఇలా జరుగుతోందని బాలుడు నమ్ముతున్నాడు. గతంలో కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు తీసుకెళ్లినా వ్యాధి నయం కాలేదు. దీర్ఘకాలిక చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ పేద కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. సోషల్ మీడియాలో ఇతని వీడియో వైరల్ అయింది. దాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్పందించారు. ఆయన మానవతా దృక్పథంతో స్పందించారు. ఆ టీనేజర్ దీనస్థితిని తెలుసుకుని అతడికి అత్యాధునిక వైద్యం అందించాలని ఆదేశించారు. అనంత్ అంబానీ ఆదేశాల మేరకు రిలయన్స్ బృందం రంగంలోకి దిగి, బాలుడిని ప్రత్యేక విమానం ద్వారా ముంబైకి తరలించింది. ప్రస్తుతం ఇక్బాల్‌ను ముంబైలోని ప్రముఖ 'సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్'లో చేర్పించారు. అక్కడ దేశంలోని అగ్రశ్రేణి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య పరీక్షలు, చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు. బాలుడికి సరైన కారణాన్ని గుర్తించి వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. గంటల తరబడి నీటిలోనే ఉండటం వల్ల బాలుడి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని వైద్యలు చెబుతున్నారు. శరీర చర్మం తెల్లగా మారి, మెత్తబడి ముడతలు పడటం , చర్మం పగుళ్లు ఇచ్చి తీవ్రమైన ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బాలుడి పరిస్థితిని వీడియో చూసిన ఎంతో మంది బాధపడుతున్నారు

బెంగళూరు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐటీ ప్రాజెక్టులు, ట్రాఫిక్ సమస్యలు, అంతకుమించి ప్రాణాలను పిండేసే గుంతల రోడ్లు. రోజూ ప్రయాణంలో వాహనాలు దెబ్బతిని, గుంతల్లో పడి నడుములు విరగ్గొట్టుకునే పరిస్థితులపై మనలో చాలామంది శాపనార్థాలు పెట్టి ఊరుకుంటారు. కానీ, బెంగళూరుకు చెందిన ఒక యువ ఇంజనీర్ మాత్రం ఆ కోపానికే కొత్త రూపాన్ని ఇచ్చాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తూ.. రోడ్డుపై ఉన్న గుంతలను గుర్తించి, సంబంధిత కాంట్రాక్టర్‌పై నేరుగా ఫిర్యాదు నమోదు చేసే అత్యంత శక్తివంతమైన యాప్‌ను రూపొందించి సంచలనం సృష్టించాడు.తన కారు గుంతల్లో పడి తరచూ పాడైపోతుండటంతో విసిగిపోయిన ఈ ఇంజనీర్, అత్యాధునిక కోడెక్స్ ప్రాసెస్ సాయంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాడు. దీనికోసం తన కారుకు జీపీఎస్ , యాక్సిలెరోమీటర్ సౌకర్యం ఉన్న ఒక డ్యాష్ క్యామ్‌ను అమర్చాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు కదిలే తీరు, రోడ్డుపై ఉండే దృశ్యాలను ఈ కెమెరా నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇందులో అమర్చిన విజన్ మోడల్ సాంకేతికత రోడ్డుపై ఉండే ప్రతి గుంతను విశ్లేషించి.. అది చిన్నదా, మధ్యస్థమైనదా లేక ప్రాణాంతకమైన పెద్ద గుంతనా అనే విషయాన్ని క్షణాల్లో వర్గీకరిస్తుంది. గుంతలు పూడ్చడానికే డబ్బులు లేవుగా- మెడికల్ కాలేజీ అంటే నమ్మాలా?- అయ్యన్నక్యాచింగ్ పాయింట్.. 2,900 ప్రభుత్వ కాంట్రాక్టుల డేటా రీడింగ్!ఈ యాప్‌లో అసలైన మాస్టర్ ప్లాన్ ఇక్కడే ఉంది! భారతదేశంలో చాలా వరకు ప్రధాన రహదారులకు కాంట్రాక్టర్ల ఫ్రీ మెయింటైనెన్స్ గ్యారంటీ ఉంటుంది. నిబంధనల ప్రకారం రోడ్డు పాడైతే ఆ కాంట్రాక్టరే ఉచితంగా బాగు చేయాలి. దీనికోసం సదరు ఇంజనీర్ రూపొందించిన యాప్, దాదాపు 2,900 ప్రభుత్వ టెండర్ కాంట్రాక్ట్ పత్రాలను క్షుణ్ణంగా శోధిస్తుంది. గుంతలున్న నిర్దిష్ట రహదారి టెండర్ నంబర్ ఏమిటి? ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఎవరు? బాధ్యత వహించాల్సిన ప్రభుత్వ అధికారి ఎవరు? అనే వివరాలను చిటికెలో లాగేస్తుంది.కర్నాటక సర్కార్ కు బెంగళూరు వాసుల హెచ్చరిక..!

ఆరు నెలల ముచ్చట అనుకుంటే ఏడాది కావస్తోంది.. రికార్డు స్థాయి సుదీర్ఘ మిషన్‌తో సైనికులకు సముద్ర ప్రయాణం నరకంగా మారింది. యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరడం వరకే లోకానికి కనిపిస్తోంది. కానీ ఆ భారీ యుద్ధనౌకల లోపల తాగునీరు లేక, టాయిలెట్లు పనిచేయక, కనీసం తాగడానికి నీరు లేక.. కంపుకొడుతున్న బట్టలు ఉతుక్కునే దిక్కులేక వేలాది మంది జవాన్లు మనోవేదనతో కుమిలిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక ఇప్పుడు సైనికులను ఆత్మహత్యలు చేసుకునేంత ఒత్తిడిలోకి నెడుతుంది.అమెరికా రక్షణ శాఖ ప్రతిష్ఠాత్మకంగా భావించే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ విమానవాహక నౌక ఇప్పుడు ఓ కదులుతున్న జైలులా మారింది. సాధారణంగా నేవీ నిబంధనల ప్రకారం ఏ యుద్ధనౌక అయినా ఏడు నెలలకు మించి సముద్రంలో ఉండకూడదు. కానీ, అంతర్జాతీయంగా చెలరేగుతున్న యుద్ధాలు, ఉద్రిక్తతల నెపంతో నావికులకు ఇంటిబాట లేకుండా చేస్తున్నారు. వియత్నాం యుద్ధం తర్వాత అత్యధిక కాలం సముద్రంలోనే గడిపిన నౌకగా ఇటీవలే యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫ్రాంక్ నిలిచింది. సరిగ్గా 326 రోజుల పాటు ఆ నౌకను సముద్రంలోనే ఉంచారు. ఇప్పుడు అబ్రహాం లింకన్ నౌక కూడా ఆ రికార్డును దాటేసేలా కనిపిస్తోంది. డిసెంబర్ తర్వాత నావికులు కనీసం ఒడ్డుపై కాలు మోపిన పాపాన పోలేదు.నీళ్లు రావు.. టాయిలెట్లు పనిచేయవు!నౌకలో పరిస్థితి ఏమీ బాగోలేదని అక్కడ పనిచేస్తున్న జవాన్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయాన్నే కెప్టెన్ మైక్‌లో మాట్లాడేటప్పుడు ఈ రోజు అయినా ఇంటికి వెళ్లే వార్త చెప్తారా అని సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నౌకలో ప్రాథమిక సదుపాయాలు ఘోరంగా తయారయ్యాయి. వాటర్ ట్యాప్స్ చెడిపోయి, వేడినీళ్లు రాక జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్లు పొంగిపొర్లుతున్నాయని, షిప్ స్టోర్లలో కనీసం స్నానం చేసే సబ్బులు, టూత్‌పేస్టులు కూడా దొరకడం లేదని నావికులు వాపోతున్నారు. గతంలో కావలసినన్ని వస్తువులు కొనుక్కునే వెసులుబాటు ఉండేదని, ఇప్పుడు ప్రతీ దానికి

దేశమంతా స్వాతంత్ర వేడుకల్ని అట్టహాసంగా జరుపుకుంటోంది. ఏపీలోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులంతా స్వాతంత్ర వేడుకల్లో పాల్గొంటున్నారు. పతాకావిష్కరణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఎండ వేడిమికి తాళలేక కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా కంగారు పడ్డారు. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.Amaravati: చంద్రబాబు, నారాయణపై వైసీపీ కేసును తేల్చేసిన సుప్రీంకోర్టు..!తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇవాళ జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఎప్పటిలాగే పతాకావిష్కరణ తర్వాత ఆనం ప్రసంగించేందుకు సిద్దమయ్యారు. ప్రసంగం కూడా ప్రారంభించారు. ఉన్నట్లుండి ఆయనకు కళ్లు తిరగడంతో ప్రసంగాన్ని ఆపేశారు. వెంటనే కుప్పకూలిపోతుండగా.. పక్కనే ఉన్న పోలీసులు, అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. ఏపీలో డ్వాక్రా మహిళలకు పంద్రాగస్టు కానుక- మరో కొత్త పథకం..!మంత్రి ఆనం అస్వస్థతకు గురికావడంతో పరేడ్ గ్రౌండ్ లో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకొని పక్కన కూర్చోబెట్టారు. అనంతరం వెంటనే డాక్టర్లను పిలిపించారు. వారు మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం మంత్రి ఆనం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు, పరేడ్ మైదానంలో వేడుకలకు హాజరైన వారంతా ఊపిరిపీల్చుకున్నారు

ఈ ఏడాది వాతావరణ శాస్త్రవేత్తలు ఊహించినట్లే పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో (EL Nino)ప్రభావం మొదలైంది. అంతే కాదు ఇది క్రమంగా బలపడుతోంది. దీని వల్ల ప్రపంచ వాతావరణ పరిస్ధితుల్లో పెనుమార్పులు తప్పేలా లేవు. ముఖ్యంగా వివిధ దేశాల్లో రుతుపవనాలు, ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. ఆయా దేశాల్లో వాతావరణ పరిస్ధితుల ఆధారంగా కూడా ఉండబోతున్నాయి. దీంతో భారత్ సహా పలు దేశాలు ఎల్ నినో ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా ఎల్ నినో తీవ్రత వేగంగా పెరుగుతోంది. ఇది ఈ ఏడాది డిసెంబర్ నాటికి అత్యంత బలమైన వాతావరణ పరిణామంగా మారడానికి 90 శాతానికి పైగా అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక వాతావరణ పరిశోధనా సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల కేవలం సముద్ర ఉపరితలానికే పరిమితం కాకుండా, లోతైన పొరల్లోకి కూడా విస్తరిస్తోంది. Monsoon: బంగాళాఖాతంలో మొదలైన గర్జన ..! ఇక ఆగస్టు అంతా పండగే..! ఇది ఎల్ నినో మరింత తీవ్రరూపం దాల్చడానికి అవసరమైన అదనపు శక్తిని అందిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్త వాతావరణ వ్యవస్థల్లో పెను మార్పులు తప్పేలా లేవు. ఈసారి ఏర్పడబోయే ఎల్ నినో అత్యంత శక్తివంతమైన చారిత్రక వాతావరణ పరిణామంగా మారేందుకు 69 శాతం అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఒకవేళ ఇదే జరిగితే, ఆధునిక వాతావరణ పరిశీలనలు ప్రారంభమైన 1950 సంవత్సరం రికార్డుల తర్వాత నమోదైన అత్యంత బలమైన
పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రాంతమైన బలూచిస్థాన్ . ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడంతో బలూచ్ ప్రజల్లో ఎప్పటి నుంచో స్వతంత్ర ఆకాంక్ష ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బలూచిస్థాన్ వేర్పాటువాదులు తమ ప్రాంతాన్ని ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్’ పేరిట స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఆగస్టు 11న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుతామని ప్రకటించారు.బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా మారడానికి ఏమేం నిబంధనలు పాటించాల్సి ఉంటుంది? ఈ విషయంలో బలూచ్‌కు ఏ మేరకు భారత్ సాయం చేయగలదు. ఇప్పటి వరకూ బలూచిస్థాన్ విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించడానికి కారణాలేంటి? అనేది ఇప్పుడు చూద్దాం.ఏ ప్రాంతమైనా సరే స్వతంత్ర దేశంగా అవతరించడానికి మోంటెవీడియో కన్వెన్షన్‌లోని నాలుగు కీలక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 1933 డిసెంబర్ 26న ఉరుగ్వే రాజధాని మోంటివీడియోలో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందమే ఈ మోంటివీడియో తీర్మానం.మోంటివీడియో కన్వెన్షన్.. 4 నిబంధనలు..ఈ ఒప్పందంలోని ఆర్టికల్ 1 ప్రకారం ఓ ప్రాంతాన్ని దేశం లేదా రాజ్యంగా గుర్తించడానికి నాలుగు అంశాలు కీలకం. అందులో ఒకటి శాశ్వత జనాభా. స్వతంత్ర దేశంగా అవతరించాలని భావిస్తున్న ప్రాంతంలో ప్రజలు తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా నివాసం ఉండాలి.రెండోది.. ఆ ప్రాంతానికి నిర్దిష్ట భౌగోళిక సరిహద్దులు ఉండాలి. మూడోది ఆ ప్రాంతాన్ని పరిపాలించడానికి, చట్టాలను అమలు చేయడానికి ఒక ప్రభుత్వం ఉండాలి. నాలుగోది.. ఆ ప్రభుత్వానికి ఇతర దేశాలతో దౌత్య పరమైన, వాణిజ్య, చట్టపరమైన ఒప్పందాలు ఒప్పందాలు చేసుకునే అధికారం ఉండాలి.ఒక ప్రాంతానికి ఈ నాలుగు లక్షణాలు ఉంటే గనుక.. మోంటివీడియో కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 3 ప్రకారం ఇతర దేశాలు దాన్ని గుర్తించినా, గుర్తించకపోయినా సరే, దాని విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆ ప్రాంతానికి దేశంగా ఉండే అర్హత లభిస్తుంది.బలూచిస్థాన్ విషయానికి వస్తే.. ఈ ప్రాంతంలో ప్రజలు శాశ్వత నివాసం ఉంటున్నారు. ఇది ప్రస్తుతం పాకిస్థాన్ నియంత్రణలో ఉన్నప్పటికీ, నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంగా గుర్తించే వీలుంది. బలూచిస్థాన్ వేర్పాటువాద నాయకులు తమ భూభాగంపై సార్వభౌమాధికారం సాధిస్తేనే

మంట తట్టుకోలేక నీళ్లలోనే వారంలో ఐదు రోజులు..! శరీరం మంట తట్టుకోలేక నీటిలోనే రోజులకు రోజులు ఉంటున్న ముర్షిదాబాద్ బాలుడి వింత పరిస్థితి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఒక విచిత్రమైన, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పదహారేళ్ల బాలుడి ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒంటి నిండా అనియంత్రిత మంటలు రావడం వల్ల ఆ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆ టీనేజర్ రోజంతా నీళ్లలోనే గడుపుతుండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దాంగా ప్రాంతానికి చెందిన ఇక్బాల్ షేక్ అనే 16 ఏళ్ల కుర్రాడు ఈ వింత పరిస్థితితో నరకయాతన అనుభవిస్తున్నాడు. వారంలో దాదాపు నాలుగైదు రోజుల పాటు ఇతడు నీటిలోనే మునిగి తేలుతుంటాడు. ఒక్కోసారి రాత్రింబవళ్లు తేడా లేకుండా వరుసగా వారం రోజులు కూడా స్థానిక చెరువులోనే ఉండిపోతుండటం విశేషం. బాలుడి వింత ప్రవర్తన గురించి ఆరా తీయగా ఒక దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. నీటి నుంచి బయటకు రాగానే తన శరీరం అంతా విపరీతమైన మంట పుడుతుందని, ఆ తాపాన్ని భరించలేకపోతున్నానని ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం చెరువు నీటిలో ఉన్నప్పుడు మాత్రమే తనకు ఆ మంట నుంచి శమనం లభిస్తుందని చెబుతున్నాడు. గత ఐదేళ్లుగా ఇక్బాల్ జీవితం ఇలాగే సాగుతోందని స్థానికులు తెలుపుతున్నారు. నిరంతరం నీటిలో ఉండటం వల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. చర్మం దెబ్బతిని వివిధ రకాల చర్మ వ్యాధులు వ్యాపిస్తుండగా, ఎడతెరిపి లేని జలుబు, తీవ్రమైన దగ్గు అతడిని వేధిస్తున్నాయి. అతని ప్రాథమిక వైద్యం కోసం కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వ్యాధి మూలాలను గుర్తించి సరైన చికిత్స అందించడంలో అక్కడి వైద్యులు స్పష్టత ఇవ్వలేకపోయారు. మరొకవైపు, పేదరికంలో ఉన్న ఇక్బాల్ కుటుంబానికి కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించే స్థాయి లేదు

ఇరాన్ తాజా ప్రకటనలో అమెరికాపై పలు కీలక డిమాండ్లు చేసింది. తమపై అమలులో ఉన్న అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ నిధులను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కోరింది. అలాగే, ఇరాన్ నౌకాశ్రయాలపై అమలులో ఉన్న దిగ్బంధనాన్ని తొలగించాలని, తమ భూభాగం సమీపంలోని అమెరికా సైనిక ఉనికిని తగ్గించి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని కూడా స్పష్టం చేసింది. ఈ షరతులు అమలైన తర్వాతే హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇటీవల ఇరు దేశాల నడుమ జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై సూత్రప్రాయ అంగీకారం కుదిరినా, తుది ఒప్పందంపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా ముందుగా హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సాధారణ స్థితికి రావాలని కోరుతోంది. ఆ తర్వాతే ఆంక్షల సడలింపు, నిధుల విడుదల వంటి అంశాలను పరిశీలిస్తామని భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం ముందు తమ డిమాండ్లు అమలు చేయాల్సిందేనని పట్టుబడుతోంది. దీంతో రెండు దేశాల నడుమ చర్చలు ముందుకు సాగకుండా ప్రతిష్ఠంబన నెలకొంది. హర్మూజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఒమన్‌తో సాంకేతిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. అయితే అవి కేవలం నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించినవేనని, అమెరికాతో ఉన్న రాజకీయ, ఆర్థిక వివాదాలకు వాటికి సంబంధం లేదని స్పష్టం చేసింది. అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని మరోసారి ప్రకటించింది. అవసరమైతే చర్చల గడువును పొడిగించే అవకాశాన్ని కూడా ఇరు పక్షాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఎగుమతి అయ్యే చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ కారణంగా హర్మూజ్ జలసంధిపై ఏ చిన్న ఉద్రిక్తత ఏర్పడినా అంతర్జాతీయ