
హోంవర్క్ సున్నా.. ఆరోపణలు వంద.. ఇదే ఆ ఛానల్ పరిస్థితి: మంత్రి అచ్చెన్న
నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా వైసీపీ భర్తీ చేయలేదని విమర్శించారు.

నిరుద్యోగుల అవకాశాలపై సాక్షి విషం చిమ్ముతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా వైసీపీ భర్తీ చేయలేదని విమర్శించారు.

చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం 21వ వార్డు చెర్లోపల్లి ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న క్వారీలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న బ్లాస్టింగ్ల కారణంగా రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతుల పంట పొలాలకు సమీపంలో ఇష్టారాజ్యంగా క్వారీలు నిర్వహిస్తూ పేలుళ్లు జరపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుళ్ల కారణంగా రాళ్లు ఎగిరిపడి భూములు కంపిస్తున్నాయని, ఇళ్లు, బోర్లు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తుందా అని నిలదీశారు. కేంద్రానికి రోజా రిక్వెస్ట్.. హైవే సమస్యపై అలుపెరుగని పోరాటం!చెర్లోపల్లి రైతులు తమ ఆవేదనను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రోజా ఆరోపించారు. పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా, ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ కాలయాపన చేయడం సరికాదన్నారు. క్వారీలకు అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా? పర్యావరణ, గనుల, రెవెన్యూ, పోలీసు శాఖల నిబంధనలు పాటిస్తున్నారా? అనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. క్వారీ యాజమాన్యాలకు రాజకీయ అండదండలు ఉన్నాయని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై వస్తున్న క్వారీ వసూళ్ల ఆరోపణలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆ పని చేయకుంటే కూటమి ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమన్న రోజా ప్రమాదం జరిగే వరకు ఎదురుచూడొద్దు!ఒక ప్రాణం పోయిన తర్వాతో, రైతు భూమి నాశనమైన తర్వాతో పరిహారం ఇచ్చినా పోయిన జీవనాధారం తిరిగి రాదని రోజా స్పష్టం చేశారు. ప్రమాదాలు జరిగే వరకు ప్రభుత్వం నిద్రపోకుండా ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చెర్లోపల్లి ప్రాంతంలోని అక్రమ క్వారీలను వెంటనే నిలిపివేసి, అనుమతులు లేకుండా జరుగుతున్న బ్లాస్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు
ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్ అధికారిణి నేహా పచీసియా తీవ్ర అవినీతి, అక్రమ ఆరోపణల్లో చిక్కుకున్నారు. కట్నీ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP)గా విధులు నిర్వర్తించిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కుత్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు సీఎస్పీ నేహా పచీసియాను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమె భోపాల్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ అయి ఉంటారు.జైలులో ఉన్న హత్య కేసు నిందితుడు రమేష్ లోధి కుటుంబంపై అధికారాన్ని ఉపయోగించి ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ లేదా ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ. 82.86 లక్షల విలువైన ఆస్తిని కేవలం రూ. 18.20 లక్షలకే మారూఫ్ అహ్మద్ హనాఫీ అనే వ్యక్తికి విక్రయించేలా చేశారని విచారణలో తేలింది.రిజిస్ట్రేషన్ ప్రకారం రూ. 15 లక్షలు చెక్కు ద్వారా, రూ. 3.20 లక్షలు నగదుగా చెల్లించారు. కానీ, జులై 11, 2025 నాటికి కొనుగోలుదారుడు హనాఫీ బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 3,036 మాత్రమే ఉండటం గమనార్హం.రిజిస్ట్రేషన్ జరిగిన ఏప్రిల్ 15, 2026 నాడే హనాఫీ ఖాతాలోకి రూ. 10 లక్షలు సైన్ పార్ట్నర్స్ నుంచి, రూ. 5 లక్షలు క్షితిజ్ రాజ్ బారాపాత్రే అనే మరో వ్యక్తి ఖాతా నుంచి జమ అయ్యాయి. అయితే, ఈ రెండు ఖాతాలు ఒకే పాన్ కార్డుతో అనుసంధానమై ఉన్నాయని, బారాపాత్రే నేహా పచీసియాకు అత్యంత ఆప్తుడని విచారణలో బయటపడింది. ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడానికి లోధి కుటుంబం రద్దుచేసుకోడానికి ప్రయత్నించగా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, గతంలో కూడా ఒక ట్రాన్స్పోర్ట్ వ్యాపారి వద్ద రూ. 30,000 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై విచారణ నడుస్తోంది.2012లో ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు

ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రై కార్పొరేషన్లలోని ప్లానింగ్ విభాగం లీలలు హైదరాబాద్ సిటీ: ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల నుంచి ఓసీల జారీ వరకు.. ఫైల్‌కు ఇంత అని, అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం బట్టి రేట్లు నిర్ణయించి మరీ లంచాలు తీసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే నోటీసులు, కూల్చివేతలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతుండగా.. తామేమి తక్కువ కాదన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) యంత్రాంగం కూడా వారితో పోటీ పడుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల దోపిడికి అడ్డూ అదుపు ఉండడం లేదు. మాదాపూర్‌లో నోటరీ స్థలాల్లో నాలుగైదు అంతస్తుల భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి.. నిర్మాణదారుల నుంచి కొందరు అధికారులు వసూళ్లు చేస్తుండడం గమనార్హం. కూకట్పల్లి జోన్ పరిధిలోనూ పలువురు పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అంతా మేం చూసుకుంటాం.. అదనపు అంతస్తులు నిర్మించుకోండని భవన యజమానులకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్న ఓ వ్యక్తి అదనంగా మరో రెండంతస్తులు నిర్మించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోగా.. త్వరగా బయటి వైపు పనులు పూర్తి చేసి రంగులు వేయాలని సూచించినట్టు సమాచారం. చైన్‌మెన్ నుంచి టీపీఎస్, ఏసీపీ, సిటీ ప్లానర్ల వరకు అవినీతిలో భాగస్వాములుగా ఉంటున్నారు. ప్రతీ ఫైల్‌కు ముడుపులు ముట్టాల్సిందే అని కింది స్థాయి సిబ్బంది వద్ద పైఅధికారులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం

తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా ఆధారంగా భారీ భూదందాలు, దోపిడీ జరుగుతున్నాయని ఆరోపిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 22ఏ భూముల విషయంలో తప్పులు జరిగాయని ఒప్పుకుని మంత్రి క్షమాపణలు చెప్పడంపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అధికారులపై నెపం తోసి తప్పించుకోలేరని, ఎవరి ఆదేశాల మేరకు లక్షలాది మంది ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 22ఏ భూముల కేటాయింపులు, తొలగింపుల్లో వేల కోట్ల రూపాయల దందాలు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం 22ఏ జాబితాపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారని లక్ష్మణ్ గుర్తుచేశారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం ఉండే ప్రాంతాన్ని కూడా ఈ నిషేధిత జాబితాలోకి చేర్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కోటి ఎకరాలను ఈ పరిధిలోకి తెచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ఆస్తులను కాపాడటంలో విఫలమైందని, కాంగ్రెస్ పాలన రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని మండిపడ్డారు

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చింది. మండలిలోనూ చర్చ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో జగన్ హయాంలో గ్రూపు-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. వీటి పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. గ్రూపు -1 అక్రమాల పై సీబీఐ విచారణకు తాను సిద్దమని.. డీఎస్సీ పైనా సీబీఐ విచారణ చేయించటానికి చంద్రబాబు సిద్దమా అంటూ జగన్ సవాల్ చేసారు.డీఎస్సీ లో అక్రమాల పైన మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు తాము చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగానే ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన వివరణలో అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ గ్రూపు-1 పరీక్షల నిర్వహణలో జగన్ హయాంలో అక్రమాలు జరిగాయని తాజాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దీని పైన స్పందించిన జగన్ తమ హయాలో ఎలాంటి అవకతవకలు జరగలేదనే అంశం.. చంద్రబాబు వేసిన సిట్ తేల్చిందని జగన్ చెప్పుకొచ్చారు. అయినా, దుష్ప్రచారం ఆపటం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ చేసారు. ఏపీపీఎస్సీ గ్రూపు-1 చంద్రబాబు హయాంలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పారు. ఎన్నికల ముందు హడావుడిగా ఆయన విడుదల చేసారని.. తాము అధికారం చేపట్టకముందే ప్రిలిమ్స్ పూర్తయ్యాయని చెప్పారు. అందు లో పాస్ అయిన వారికి మెయిన్, ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు.పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!ప్రధానికి జగన్ లేఖగ్రూపు-1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ తేల్చిందని జగన్ పేర్కొన్నారు. వాల్యుయేషన్ లో ఎలాంటి తప్పులు జరగలేదని చెప్పినట్లు వివరించారు. అయినా, తప్పుడు ప్రచారాలు చేసారన్నారు. గ్రూపు- పరీక్ష నిర్వహణ పైన సీబీఐ విచారణకు తాను రెడీ అని జగన్ ప్రకటించారు. 2025 డీఎస్సీ పై విచారణకు చంద్రబాబు సిద్దమా అని

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకుని మంత్రి చర్చకు రావాలని ఏలేటి డిమాండ్ చేశారు. హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి శ్రీనివాస రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న (బుధవారం) సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. తన సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని మంత్రిని ఏలేటి మరోసారి డిమాండ్ చేశారు. తాను మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడే ఉంటానని, శ్రీనివాస రెడ్డి రావాలని డెడ్ లైన్ విధించారు. ఈ సందర్భంగా భూభారతి, 22ఏలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఫీనిక్స్, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థలకు భూ బదలాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను లాక్కున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకు తాను కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇస్తారా? లేక పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఎవరొచ్చినా సరే తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్వర్క్ జాడలు క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని

తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రెవెన్యూ శాఖలో అడ్డగోలు అవినీతి జరుగుతోందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 22A అనేది నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ ఆపడానికి తెచ్చిన చట్టమని.. ప్రైవేటు ఆస్తులపై కృత్రిమ వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడటానికి కాదని వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో హెచ్ఎండీఏ అనుమతులున్న వేలాది ప్రైవేటు ఆస్తులను ఏకపక్షంగా 22A జాబితాలో పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో 30 శాతం వసూళ్ల రాకెట్ నడుస్తోందని, నిషేధిత జాబితా నుంచి ఆస్తులు తొలగించుకోవడానికి దళారులు మార్కెట్ విలువలో ఏకంగా 30% కమీషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ హరీశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. యాదాద్రి జిల్లాలో 40వేల ఎకరాలను 22A లో పెట్టారని నాలుగు నెలల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చెప్పినా.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూములపై వివాదాలు సృష్టించి.. రాజకీయ పలుకుబడి ఉన్న బినామీ సంస్థలతో 50:50 జాయింట్ డెవలప్మెంట్కు ఇవ్వాలని యజమానులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రెవెన్యూ శాఖలో ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఇంత కుంభకోణం జరుగుతున్నా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నిషేధిత జాబితాలో చేర్చిన, తొలగించిన ప్రతి భూమిపైనా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో స్వతంత్ర విచారణ జరిపించాలి. ఈ

ఫోక్సో కేసులో నిందితుడిని వేధించి చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాయదుర్గం పోలీసులకు రాజేంద్రనగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: పోక్సో కేసులో నిందితుడిని వేధించి చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాయదుర్గం పోలీసులకు రాజేంద్రనగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. రిమాండ్ సమయంలో నిందితుడి ఒంటిపై గాయాలను న్యాయవాది కోర్టుకు చూపించారు. దీంతో రాజేంద్రనగర్ కోర్టు తక్షణమే నిందితుడిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. నిందితుడిని వేధింపులకు గురిచేసిన అంశంపై షోకాజ్ నోటీసులు జారీచేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాయదుర్గం పోలీసులను కోర్టు ఆదేశించింది. నిందితుడి రిమాండ్ రిజెక్ట్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: మల్లు రవి ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన అగ్రనేతలు

ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. చెన్నై, ఆగస్టు 19: ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వంలో మూడు శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు. డీఎంకే నేతల అవినీతికి సంబంధించిన రెండు ఫైల్స్ తన టేబుల్‌పైనే ఉన్నాయని.. సమయం వచ్చినప్పుడు ఆ ఫైల్స్ తెరుస్తానని స్పష్టం చేశారు. తనను బలవంతం చేసి.. ఆ ఫైల్స్ ఇప్పుడే తెరిచేలా చేయొద్దని డీఎంకే నేతలకు వార్నింగ్ ఇచ్చారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణ పనుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై బుధవారం తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి విజయ్ డీఎంకే పార్టీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఎప్పుడు.. ఏం చెప్పాలో నాకు తెలుసు. అందుకే ప్రజలు మాపై నమ్మకంతో ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఉప ఎన్నికల సమయంలో నేను మాట్లాడతాను. ప్రజలకు కొంత మంచి జరగనివ్వండి’ అని అన్నారు. ‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన డయాబెటిస్ ఉన్నవారు డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమా?

కృష్ణాజిల్లా: గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఏఎన్ఎం ఉద్యోగిని, ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా మానసికంగా, లైంగికంగా తన ఇంటికి రావాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఈ నెల 17న ఆమె తండ్రి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే ఫిర్యాదు అనంతరం ఆమెను అధికారం అండతో బంటుమిల్లికి బదిలీ చేయించిట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలని బాధితురాలు కోరారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే మార్కెట్ యార్డు చైర్మన్ పదవితో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమని రవికుమార్ అన్నారు. ఆరోపణలపై డీఎస్పీ శ్రీనివాసకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) అందుకే సచిన్ క్రికెట్ దేవుడు.. 100 ఏళ్లయినా ఎవరు బ్రేక్ చేయలేని రికార్డు శ్రావణమాసం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

అంతా నువ్వే చేశావ్ నాన్న.. అంతా నువ్వే చేశావ్.. ఇదేదో బొమ్మరిల్లు సినిమా డైలాగు కాదండోయ్ జోగి రమేశ్ కొడుకు వ్యవహారంలో నడుస్తున్న డైలాగ్. వైసీపీ హయాంలో జోగి రమేశ్ ఎంతగా రెచ్చిపోయాడో అంతే లెవల్లో తన కుమారుడు వివాహం విషయంలో రెచ్చిపోయాడు. ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అంతా నువ్వే చేశావ్ నాన్న.. అంతా నువ్వే చేశావ్.. ఇదేదో బొమ్మరిల్లు సినిమా డైలాగు కాదండోయ్ జోగి రమేశ్ కొడుకు వ్యవహారంలో నడుస్తున్న డైలాగ్. వైసీపీ హయాంలో జోగి రమేశ్ ఎంతగా రెచ్చిపోయాడో అంతే లెవల్లో తన కుమారుడి వివాహా విషయంలో రెచ్చిపోయాడు. తన మాటే శాసనమంటూ తన కొడుకును శాసించాడు. తప్పని పరిస్థితి, చెప్పుకోలేని స్థితిలో ఆ కుమారుడు తలవంచాడు. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆస్తుల కోసం నరకం.. ఇస్లాంలోకి మారాలని నా కోడలిపై ఒత్తిడి మానసికంగా తీవ్ర వేధింపులు.. నా కుమారుడి మృతిలోనూ అతడి పాత్ర! షూటర్ సాదిక్ ఖాన్‌పై పోలీసులకు ఏఈ నూకరాజు వియ్యంకుడి ఫిర్యాదు కేసు నమోదు.. నూకరాజు భార్య, కుమార్తె కోసం గాలింపు ముమ్మరం కాకినాడ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు ఆత్మహత్య, కుటుంబసభ్యులు గల్లంతైన కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైఫిల్ షూటర్ సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నూకరాజు తన భార్య మీనా, కుమార్తె కొవ్వూరి సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డితోసహా ఆదివారం రాత్రి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. నూకరాజు అల్లుడు జగదీశ్వర్‌రెడ్డి గత నెల రెండో తేదీన మరణించారు. అయితే, తన కుమారుడి మరణానికి సాదిక్ ఖానే కారణమని ఆరోపిస్తూ జగదీశ్వర్‌రెడ్డి తండ్రి, నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి కాకినాడ సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సర్పవరం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. తన మనవడు కార్తికేయరెడ్డితో మాట్లాడగా, ఈ విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నారు. సాధిక్‌తోపాటు మరో వ్యక్తి పాత్ర ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి, అల్లుడి మరణానికీ సాధికే కారణం అనే కోణంలో అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.మరోవైపు గోదావరిలోకి దూకేందుకు ముందు నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో ఉంచిన మూడు కవర్లను పోలీసులు గుర్తించారు. సాదిక్ తనను, తన కుటుంబ సభ్యులను ఎలా వేధిస్తున్నాడనే విషయాలను వాటిలో ప్రస్తావిస్తూ లెటర్ రాసినట్టుగా భాస్కర్‌రెడ్డి తెలిపారు. అంతేకాదు తన కుమారుడు జగదీశ్వర్ రెడ్డిని ఏదో మందు ఇచ్చి సాదిక్‌ఖాన్ చంపినట్టు సౌజన్య ఆ లెటర్లో రాసిందని పోలీసులకు చెప్పారు. సౌజన్య ప్రైవేటు విషయాలను

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కార్యాలయాన్ని ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచి నమక్కల్ కవిజ్ఞర్ మాళిగైకి మార్చాలని తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం సిబ్బందికి సౌకర్యవంతమైన పని వాతావరణం కల్పించేందుకు ఈ మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించగా... కొత్త ఆఫీసు పనుల కోసం కేటాయించిన రూ. 5.5 కోట్ల టెండర్ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయంటూ బీజేపీ, డీఎంకేలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకుడు కేశవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్త ఆఫీస్ పనులు ఇప్పటికే ప్రారంభమైన నెల తర్వాత, ఎలాంటి ఆన్లైన్ విధానం అనుసరించకుండా రూ. 5.5 కోట్ల టెండర్‌ను విడుదల చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వచ్చి కేవలం 100 రోజులు కూడా కాకముందే పాలనలో పారదర్శకత లోపించిందని, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించడంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు, డీఎంకే ఎమ్మెల్యే ఈవీ వేలు స్పందిస్తూ.. సీఎం తన కార్యాలయాన్ని మార్చుకోవడం ఆయన వ్యక్తిగత విషయమని, అయితే ప్రజాధనంతో ముడిపడి ఉన్న టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న వార్తలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే, ఈ అవినీతి ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి కేవలం 100 చదరపు అడుగుల స్థలం కూడా లేదని, వారికి మెరుగైన పని వాతావరణం కల్పించేందుకే ఈ తాత్కాలిక మార్పు చేపట్టామని వివరించారు. ఈ పనులకు సంబంధించి టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆయన తేల్చిచెప్పారు

హైదరాబాద్: తనపై ఆరోపణల కారణంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డిపై టీపీసీసీ ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కోరారు మేఘారెడ్డి. తాను టికెట్ అమ్ముకున్నానన్న వ్యాఖ్యలపై పీసీసీకి ఫిర్యాదు చేశారు మేఘారెడ్డి. దీనిపై మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. చిన్నారెడ్డి మాటల రికార్డింగ్స్ ఉన్నాయి. పార్టీ పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీ అన్నీ పరిశీలిస్తోంది’ అని తెలిపారు. ఇక తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. ‘ మేము ప్రతి ఓటును కాపాడాలని చూస్తున్నాం. EC గైడ్ లైన్స్ తో చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ 3.38 కోట్ల ఓట్లు ఉన్నాయి. ASBD లపేరుతో 22% ఓట్లను తొలగించారు. ఓట్ తొలగింపునకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా బాద్యత వహించాలి. బీద ప్రజల ఓట్లు తొలగి పోతున్నాయి. కాంగ్రెస్ BLA లను 35వేలు మందిని ఇచ్చాం. కానీ EC 13వేల 100 మంది అని చూపిస్తున్నారు. 2002లో ఓటు వేసి ఉండాలని కండిషన్ తో చాలా మంది ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వలేకపోయారు. ఎన్యుమరేషన్ పామ్ ఇవ్వలేదని డిలీట్ చేస్తున్నారు. అన్ మ్యాప్డ్ ఓట్లు 32 లక్షల 37వేలు. డౌట్ ఫుల్ గా ఉన్నాయి 60 లక్షల 50 వేలు ఓట్లు చూపిస్తున్నారు. 92లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయి. 1.60 కోట్ల ఓట్లకు ఎందుకు క్వచ్చన్ మార్క్ పెట్టారో చెప్పాలి. కాంగ్రెస్ ప్రతి పౌరుడి ఓటు కాపాడాలని ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఇంకా టైం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. భార్య బర్త్‌డే.. సెలబ్రేషన్స్ ఫొటోలు షేర్చేసిన హీరో (ఫొటోలు) జెన్‌జీ స్టైల్లో జూడాలు.. కూటమి తీరుపై వినూత్న నిరసన (చిత్రాలు) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్

తమిళనాడు, కర్ణాటకలోని దేవాలయాలను సందర్శించిన తనపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న క్షుద్రపూజల ఆరోపణలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, దేవుడి దర్శనానికి వెళ్లడం తప్పా అని రేవంత్‌ను సూటిగా ప్రశ్నించారు. ఈ ఆరోపణలు తన వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలో భాగమని హరీశ్ రావు ఆరోపించారు. ఆధారాలు ఉంటే తక్షణమే బయటపెట్టాలని, లేనిపక్షంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన రేవంత్‌కు సవాల్ విసిరారు. గత ఆగస్టు 15 సమయంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలనుద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు పొరుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకు వెళ్లి క్షుద్రపూజలు చేయిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ టెంపుల్ విజిట్స్ వివరాలు ఎందుకు దాచారని ప్రశ్నించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రేవంత్ తన పేరు చెప్పకుండా విమర్శలు చేస్తున్నారని, పేరు చెబితే లీగల్ నోటీసులు పంపుతానని హరీశ్ రావు హెచ్చరించారు. దీంతో దేవాలయాల పర్యటనపై హరీశ్ రావు పూర్తి స్పష్టత ఇచ్చారు. తాను కేవలం ఆధ్యాత్మిక చింతనతోనే తిరుచ్చి శ్రీ రంగనాథస్వామి, కొల్లూరు మూకాంబికా ఆలయాలను సందర్శించానని హరీశ్ రావు వివరించారు. దేవుడి పేరుతో రాజకీయం చేయడం రేవంత్‌కే చెల్లిందని, ఉద్యమ చరిత్ర లేని ఆయనకు తనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, తనను అగ్గిపెట్టెతో పోల్చిన రేవంత్ వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 22ఏ భూముల సెక్షన్ అంశాన్ని హరీశ్ రావు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం అడ్డగోలుగా లక్షలాది ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. చివరికి సీఎం ఇల్లు, ఎయిర్పోర్ట్ భూములు కూడా ఆ జాబితాలో ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దోచుకోవడమే లక్ష్యంగా రిజిస్ట్రేషన్ల పేరుతో
సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే రూమర్లు, వివాదాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు, యంగ్ హీరో ధృవ్ విక్రమ్, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మధ్య నడిచిన ప్రేమాయణం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారన్న వార్తలు, తన పార్టనర్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే వీరి బ్రేకప్‌కి ధ్రువ్ కారణమంటూ వేళ్లన్నీ ఆయన వైపే చూపిస్తున్నాయి.* యానిమేషన్లో రామాయణం.. ‘మెగా 158’ మేకర్స్‌తో అనిల్ రావిపూడి సరికొత్త ప్రయోగం!తనపై వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్‌పై ధృవ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. "చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడే ఇక్కడ వ్యక్తిగత విషయాలపై పరిశీలనలు, విమర్శలు సర్వసాధారణమని నాకు తెలుసు. అలాగని ఇవి నన్ను అస్సలు బాధించలేదని, నాపై ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పలేను. అయితే జీవితంలో మనం ప్రేమించే వ్యక్తులకు అండగా నిలవడం, వారిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీ మార్గంలో ఉన్నప్పుడు, మన విలువలు స్పష్టంగా ఉన్నప్పుడు కాలక్రమేణా ఈ దుష్ప్రచారాలు, విమర్శలన్నీ సమసిపోతాయి" అని పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన అభిమానుల మద్దతే ముందుకు నడిపిస్తోందని తెలిపారు.అనుపమ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదంఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన గత సంబంధం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, దాదాపు రెండేళ్ల పాటు ఓ టాక్సిక్ రిలేషన్షిప్లో తీవ్ర మానసిక క్షోభను అనుభవించానని ఆమె వెల్లడించారు. అవతలి వ్యక్తి తన ప్రతి చిన్న విషయాన్ని, కెరీర్ నిర్ణయాలను నియంత్రించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ అనుభవాల వల్ల తీవ్రమైన ఆందోళన, పానిక్ అటాక్స్, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం

ఆయనకు సెగ తగలగానే హడావుడి ముఖ్యమంత్రికి చురుకు తగిల్తేగానీ సామాన్యుల బాధలు పట్టవా? 22ఏను.. ప్రజల్ని దోచుకునే ఆయుధంగా మార్చుకున్నారు: హరీశ్‌రావు ఆగ్రహం హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘భూములను అడ్డగోలుగా 22ఏ జాబితాలో వేయడం.. ఆ తర్వాత దాన్ని సరిచేయడానికి జీవోలు తెస్తాం, రివ్యూలు చేస్తామని డ్రామాలు ఆడడం ఎందుకు?’’ అని సర్కారుపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరు ‘హంతకుడే సంతాపసభ పెట్టినట్టు’ ఉందని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన ఏకంగా ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రభుత్వ భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో చేర్చారని.. చివరకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22ఏ ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. సీఎం ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావుడి మొదలైందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్.. నీకు చురుకు తగిలితే కానీ సామాన్యుల బాధలు పట్టవా?’’ అని ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ల గోడు ఎవరు వినాలని నిలదీశారు. ఎవరి భూమి 22ఏలో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు జరిగినపుడు తక్షణమే ఆ భూములను 22ఏ నుంచి తొలగించకుండా రివ్యూల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. 22ఏ అనేది ఈ ప్రభుత్వానికి ప్రజలను అడ్డగోలుగా దోచుకునే ఒక ఆయుధంగా మారిందని.. రెవెన్యూశాఖలో ఏ పని కావాలన్నా, 22ఏ నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30 శాతం కమీషన్ ఇవ్వాలనేది అందరికీ తెలిసిన బహిరంగ

AP: భూకబ్జా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి వాసంశెట్టి సుభాష్! AP: తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు ఉంటే వాటిని అధికారుల ముందు ఉంచాలని, మీడియా వేదికగా ఆరోపణలు చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదని అన్నారు. రంగబాబు అనే వ్యక్తి జూలై 17న గ్రీవెన్స్ కార్యక్రమంలో తనకు ఫిర్యాదు చేశారని మంత్రి తెలిపారు. ఆ ఫిర్యాదులో జోగు రమేష్ అనుచరులు తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నట్లు వివరించారు. ఇదే వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా సంబంధిత వ్యక్తులు ఆందోళనకు దిగిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. జోగి రమేష్‌తో పాటు మండలి చైర్మన్ మోషేన్ రాజు కూడా తన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ జూన్ 6న ధర్నా నిర్వహించారని మంత్రి పేర్కొన్నారు. ఆ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు భూమి ఎవరిది? దానికి సంబంధించిన హక్కులు ఎవరికి ఉన్నాయి? అనే విషయాన్ని అధికారిక రికార్డుల ఆధారంగా తేల్చాలని సూచించారు. భూమి వివాదాల విషయంలో సర్వే నంబర్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, ఇతర అధికారిక ఆధారాలే కీలకమని మంత్రి స్పష్టం చేశారు. సంబంధిత పత్రాలను పరిశీలించి అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఎవరి హక్కు ఎంతవరకు ఉందో రికార్డుల ఆధారంగా నిరూపించుకోవాలని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తిగా తనపై ఎవరైనా ఆరోపణలు చేస్తే మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. అందుకే తాను స్పందిస్తున్నానని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరారు. నిజంగా ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే పోలీసులను

విజయవాడలో డీఎస్సీ టీచర్ల భారీ ర్యాలీ.. వైసీపీ ఆరోపణలపై ఆగ్రహం..! ఏపీలో మెగా డీఎస్సీ 2025 చుట్టూ చెలరేగిన రాజకీయ వివాదాలు, ఆరోపణల నడుమ కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు తమ ఆత్మగౌరవాన్ని చాటుకునేందుకు గళమెత్తారు. వైసీపీ నేతలు మెగా డీఎస్సీపై చేస్తున్న తీవ్ర అవకతవకల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, విజయవాడ నగరంలో వేలాది మంది విజేతలు కలిసి ఆదివారం, ఆగస్టు 16, 2026 నాడు ఒక భారీ ఆత్మగౌరవ ప్రదర్శన నిర్వహించారు. తమ ఉద్యోగాలు కేవలం కష్టపడి సాధించిన ప్రతిభ ఆధారంగా వచ్చినవే తప్ప, ఏ రకమైన అక్రమాల వల్ల కాదని వారు స్పష్టం చేశారు. విజయవాడలోని ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైన ఈ సుదీర్ఘ ర్యాలీ, స్వరాజ్ మైదాన్ ప్రాంగణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగింది. దారిపొడవునా ఉపాధ్యాయుల నినాదాలతో విజయవాడ వీధులు హోరెత్తిపోయాయి. తమది ప్రతిభతో సాధించిన మెగా డీఎస్సీ అని, దగా డీఎస్సీ ఎంతమాత్రమూ కాదని రాసిన పెద్ద ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసనను ఎలుగెత్తి చాటారు. ఈ ఆత్మగౌరవ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి విచ్చేసిన వేలాది మంది ఎంపికైన అభ్యర్థులు పాల్గొని తమ గొంతును బలంగా వినిపించారు. తాము అహర్నిషలు శ్రమించి, రాత్రింబవళ్లు కష్టపడి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి పొందిన ఉద్యోగాలను ప్రతిపక్ష నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కించపరచడం ఎంతమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమ ప్రతిభపై విషప్రచారం, తప్పుడు ఆరోపణలు మానకపోతే విద్యార్థులకు పాఠాలు చెప్పడంతో పాటు, రాజకీయ వేదికలపై సరైన రాజకీయ గుణపాఠాలు కూడా చెబుతామని ప్లకార్డుల ద్వారా హెచ్చరించారు. ప్రదర్శన ముగింపులో భాగంగా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు ఏకమై వినతిపత్రం సమర్పించారు. ఈ ర్యాలీలో అత్యంత ఆసక్తికరమైన సంఘటన ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. డీఎస్సీ
శివమొగ్గలో అఘోర పూజలు, చేతబడులంటూ సీఎం వ్యాఖ్యలు... కోర్టుకు ఈడుస్తానన్న హరీశ్‌రావు సంగారెడ్డి ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, అల్లకల్లోలం సృష్టించడానికి కర్ణాటకలోని శివమొగ్గలో రహస్యంగా అఘోర పూజలు, చేతబడులు చేశారంటూ మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారని.. హరీశ్ రావు ప్రజలను రెచ్చగొట్టడంలో నంబర్ వన్ అని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు లేకుండా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని కచ్చితంగా కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టడానికి భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని తేల్చిచెప్పారు. ఈ వార్తకు సంబంధించిన

బ్రిటన్‌లోని ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతి పిన్న వయస్కుడైన బ్లాక్ ప్రొఫెసర్‌గా రికార్డు సృష్టించిన జాసన్ ఆర్డే (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇటీవల తనపై వచ్చిన ప్లేజియరిజం (రచన చౌర్యం) ఆరోపణల వివాదం నడుమ ఈ విషాదం చోటుచేసుకోవడం విద్యా వర్గాల్లో కలకలం రేపింది.కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో ఆయన స్పృహ లేకుండా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు అత్యవసర సేవలకు సమాచారం అందించారు. పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకునేసరికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రాథమికంగా ఈ మృతిలో నేరపూరిత కోణం ఏదీ లేదని పోలీసులు భావిస్తున్నా, పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఆయన ప్రచురించిన కొన్ని పరిశోధన పత్రాల్లోని అంశాలు ఇతరుల రచనల నుంచి కాపీ చేశారంటూ ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అంతర్గత విచారణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురై మృతి చెందినట్టు భావిస్తున్నారు. చిన్నతనంలో ఆటిజం కారణంగా 11 ఏళ్ల వరకు మాటలు రాని, 18 ఏళ్ల వరకు చదవడం, రాయడం తెలియని స్థితి నుంచి జాసన్ ఆర్డే అంచెలంచెలుగా ఎదిగారు. కేవలం 37 ఏళ్ల వయసులోనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 'సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్' ప్రొఫెసర్‌గా నియమితులై, ఆ వర్సిటీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన నల్లజాతి ప్రొఫెసర్‌గా చరిత్ర సృష్టించారు.ప్రొఫెసర్ ఆర్డే మృతి పట్ల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనో అసాధారణ మేధావి అని, స్ఫూర్తిదాయక మార్గదర్శకుడని కొనియాడింది. విద్యా రంగంలో తీవ్రమైన పోటీ, ఆరోపణల వల్ల కలిగే సామాజిక

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో శనివారం 'స్మార్ట్ రేషన్ కార్డుల' పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, యువత ప్రతిపక్షాల మాయలో పడకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.ఈ సందర్భంగా కొందరు మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసిన సీఎం, ఇది కేవలం కాగితం ముక్క కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవ కార్డు అని అన్నారు. గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చి స్కామ్‌లు చేస్తే, తాము సన్నబియ్యం అందించి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు. బతుకమ్మ చీరల పేరుతో గతంలో నాసిరకం పంపిణీ చేస్తే, తాము పాలపిట్ట, చిలకపచ్చ రంగు చీరలతో మహిళల గౌరవం పెంచామని తెలిపారు.ప్రతిపక్ష బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బాగుపడకూడదని, రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటూ బీఆర్ఎస్ నేతలు చేతబడులు, అఘోర పూజలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. కర్ణాటక, తమిళనాడు ఆలయాల్లో అర్ధరాత్రి చేసిన పూజల రహస్యాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.తాము మంజూరు చేసిన 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల గ్రామాల్లోనే ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్ వారు కట్టిన డబ్బా ఇళ్ల వద్ద ఓట్లు అడగగలరా?

కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాస్తే.. తమను అవమానిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలను వారు హెచ్చరించారు. అమరావతి, ఆగస్టు15: కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాస్తే.. తమను అవమానిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలను వారు హెచ్చరించారు. శనివారం విజయవాడలో డీఎస్సీ-2025 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులు మాట్లాడారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తామంతా తిప్పి కొట్టాలని నిర్ణయించినట్లు వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం విజయవాడలో ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10.30 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు వివరించారు. అనంతరం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీ చేయనున్నట్లు వివరించారు. ఈ ర్యాలీలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. ఈ ర్యాలీలో సుమారు 7 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొనున్నారని సమాచారం. గత వారం డీఎస్సీ-2025లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద భారీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాయలసీమ జిల్లాల్లో డీఎస్సీ 2025లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 2025లో కూటమి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లో భారీగా అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయంటూ వైసీపీ నేతలు ప్రచారానికి తెగబడ్డారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. అయినా వైసీపీ నేతలు మాత్రం ఆరోపణలను ఆపడం లేదు. దీంతో వైసీపీ నేతల విమర్శలను ఈ డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారే తిప్పికొడుతున్నారు. అందుకోసం వారు స్వయంగా రంగంలోకి దిగి.. వైసీపీ నేతలకు క్లారిటీ ఇస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. YouTuber Akhil Wife: యూట్యూబర్ అఖిల్, ఆయన భార్య మేఘకు సంబంధించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మేఘ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నో ఆశలతో అఖిల్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది. అయితే పెళ్లి తర్వాత అతడి ప్రవర్తన గురించి తనకు అనేక విషయాలు తెలిసాయని పేర్కొంది. తన భర్తకు ఇతర యువతులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ విషయంపై తాను అఖిల్‌ను ప్రశ్నించినప్పుడు తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె చెప్పినట్లు సమాచారం. పెళ్లి తర్వాత అత్తింటికి వచ్చినప్పటి నుంచి తనకు సంతోషం లేకుండా పోయిందని మేఘ పేర్కొంది. తనను సరిగ్గా చూసుకోకుండా తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించింది. ఈ పరిస్థితులతో తాను ఎంతో బాధపడ్డానని, చివరకు ఆ జీవితాన్ని వదిలి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో తాను ఓ కండక్టర్‌తో వెళ్లిపోయిన విషయంపై కూడా మేఘ స్పందించినట్లు తెలుస్తోంది. తనకు ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలని, అందుకే అఖిల్‌ను వదిలి వెళ్లినట్లు చెప్పింది. కండక్టర్ అయినా, క్లీనర్ అయినా అతడితోనే జీవిస్తానని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. అయితే మేఘ చేసిన ఈ ఆరోపణలపై అఖిల్ వైపు నుంచి ఎలాంటి పూర్తి వివరణ బయటకు వచ్చిందనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను నిర్ధారించేందుకు అధికారిక సమాచారం కూడా అవసరం. మేఘ ఈ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. నెల్లూరు, ఆగస్టు 14: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. వైసీపీ నేతలతో అంటకాగిన పలువురు అధికారులు... ఇష్టారాజ్యంగా భూములు, స్థలాలను పందారం చేసినట్లు తేలింది. వెంకటచాలం మండలం కనుపూరు బిట్ - 1లో దేవాదాయశాఖ భూముల్లో జగనన్న లే అవుట్ నిర్మించారని, 185 మందికి పట్టాలు పంపిణీ చేశారని, 310 స్థలాలకి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు అయినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అలాగే, సర్వేపల్లి బిట్ -2లో కోర్టుల్లో ఉన్న 57.16 ఎకరాల భూములని మాజీ మంత్రి కాకాణి అల్లుడికి చెందిన JKS ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సంస్థకి అధికారులు కారుచౌకగా కట్టబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ నివేదికల ఆధారంగా చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపక్రమించింది. ఆరుగురు తహశీల్దార్లు, ఆర్ఐ, సర్వేయర్, వీఆర్వోలపై అభియోగాలు నమోదు చేసిన అధికారులు.. పదిరోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బందిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రెవెన్యూశాఖ అధికార వర్గాల్లో హై టెన్షన్ నెలకొంది. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. మెడికో మృతి శ్రావణ మాసం మొదటి శుక్రవారం.. దుర్గమ్మ ఆలయంలో భక్తుల సందడి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. కర్నూలు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిన్న(గురువారం) కర్నూలులో ఎమ్మెల్యే విరుపాక్షితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జగన్ ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి (Venu Gopal Reddy) స్పందించారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ ఫొటోను తీసుకొని ములాఖత్‌కు అనుమతించామని స్పష్టం చేశారు. ములాఖత్ సమయంలో అమర్యాదగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. మాజీ సీఎం హోదాకు భంగం కలిగించలేదని వెల్లడించారు. ములాఖత్‌కు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకోవడం తప్పనిసరని తెలిపారు. ఆయన ఫొటో కూడా అలాగే తీసుకున్నామని వెల్లడించారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన తమ్ముడు శ్రీరాములను కలుస్తానని జగన్ కోరారని తెలిపారు. ఈ- ప్రిజన్స్ సాఫ్ట్వేర్ ప్రకారం ఎంతమంది ముద్దాయిలను కలుస్తానంటే అన్నిసార్లు ఫొటో తీసుకోవాలని చెప్పుకొచ్చారు. ఆ విధంగానే మాజీ సీఎం జగన్ ఫొటోను రెండుసార్లు తీశామని వెల్లడించారు. ఏ అధికారి, సిబ్బంది జగన్ గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సింగపూర్ మోడల్‌తో అమరావతిని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు వన్యప్రాణుల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారాలి: పవన్ కల్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డులో S ఆకారపు మలుపుపై అపోహలు వద్దు: ఏపీ సర్కార్

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కేవలం మూడు బ్యారేజీలకు మాత్రమే పరిమితం కాకుండా, డీపీఆర్ తయారీ నుంచి ముగింపు చెల్లింపుల వరకు సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే లేఖ రాయాలని, తానే స్వయంగా కేంద్ర హోంమంత్రిని కలిసి విచారణ ముందుకు సాగేలా కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 202 కోట్ల నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమితో చేపట్టనున్న ‘యూనిటీ మాల్’ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా విచారణ జరగాలని రఘునందన్ రావు అన్నారు. గతంలో కేటీఆర్ తప్పు చేస్తే విచారణ జరిపినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ తప్పులపైనా దర్యాప్తు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. 2018లో బీఆర్ఎస్ హయాంలో జరిగిన 10 ఎకరాల భూకేటాయింపుతో పాటు ప్రస్తుత యూనిటీ మాల్ ఒప్పందంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఎకరం భూమి విలువ వందల కోట్లకు చేరిందని, ప్రజల ఆస్తులను విక్రయించే హక్కు ప్రభుత్వాలకు లేదని, అవి కేవలం కస్టోడియన్లుగా మాత్రమే ఉండాలని ఎంపీ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రజల సొమ్మును దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని, అవినీతిలో ఈ రెండూ ఒకే నాణేనికి ఇరువైపులా ఉన్న అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. రింగ్ రోడ్డు, ఫార్ములా-ఈ రేస్, కాళేశ్వరం

సాక్షి, కర్నూలు జిల్లా: కర్నూలు జైలులో కూటమి సర్కార్ రెడ్‌బుక్ అరాచకానికి తెరలేపింది. మాజీ సీఎం జగన్‌ను అవమానించేందుకు కుట్రలు చేసింది. కావాలనే గ్రిల్స్ వెనుక నిలబెట్టి జైలు సిబ్బంది ఫొటోలు తీశారు. అడిగితే పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ జైలు సిబ్బంది చెప్పారు. చంద్రబాబు సర్కార్ కుట్రలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబుది శాడిస్ట్ మెంటాలిటీ. నన్ను అవమానించాలని చూశారు. మాజీ సీఎం అని చూడకుండా నన్ను అవమానించాలని చూశారు. ..నన్ను గ్రిల్ వెనుక నిలబెట్టి ఫొటో తీయించారు. అడిగితే పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అని చెప్పారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వమే ఉండదు. బాబు నాటిన తప్పుడు విత్తనాలే రేపు విషవృక్షాలవుతాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘వెన్నుపోటు పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుంది. బీసీ నాయకులపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ చేస్తే. వెన్నుపోటు పార్టీ కుట్ర కేసుగా మార్చింది. మహిళా ఎస్ఐని చంపబోయాడని చింతాడ రవిపై కేసు పెట్టారు. ముస్తఫా, కారుమూరి సునీల్‌పై కూడా అక్రమ కేసులు కట్టారు. ఇప్పుడేమో విరూపాక్షిపై అక్రమ కేసులు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) విరుపాక్షి ఏమైనా ఉగ్రవాదా ? కూటమికి జగన్ వార్నింగ్.. రచించిన కుట్ర రాజకీయాలు బాబు పై జగన్ ఫైర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే? LIVE: MLA విరూపాక్షితో ములాఖత్ అనంతరం YS జగన్ సంచలన PRESS MEET

తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఢిల్లీ: తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఇరువైపులా ఉన్నటువంటివని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనిటీ మాల్ పేరుతో జరిగిన ఒప్పందంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన రూ.202 కోట్లతో యూనిటీ మాల్ నిర్మించాలని నిర్ణయించారని ఎంపీ రఘునందర్ రావు అన్నారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆరు ఎకరాలకు పైగా భూమి ఇచ్చిందన్నారు. అయితే, ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై విచారణ జరగాలని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్ తప్పు చేస్తే విచారణ జరిగినప్పుడు, కాంగ్రెస్ తప్పు చేస్తే విచారణ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. 2018లో బీఆర్ఎస్ హయాంలో 10 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థకు కేటాయించారని, దానిపైనా విచారణ జరగాలన్నారు. ఈ రెండు భూకేటాయింపు ఒప్పందాలపై సమదృష్టితో దర్యాప్తు జరపాలని రఘునందన్ డిమాండ్ చేశారు. యూనిటీ మాల్, గత బీఆర్ఎస్ భూకేటాయింపులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ కోరుతూ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎంపీ చెప్పుకొచ్చారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుపై డీపీఆర్ నుంచి చివరి చెల్లింపు వరకు సీబీఐ విచారణ జరపాలన్నారు. కేవలం మూడు బ్యారేజీలపై కాకుండా మొత్తం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయాలన్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని ఎంపీ సూచించారు. దానిపై కేంద్ర హోంమంత్రిని కలిసి దర్యాప్తు జరిగేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మరోవైపు, రింగ్ రోడ్డు

టెస్సరాక్ట్ సంస్థ (Tesseract Company)కు కేటాయించిన భూములపై బీఆర్ఎస్ (BRS) రాజకీయం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ( Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆయన మాట్లాడారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో బీఆర్ఎస్ హయాంలో 54 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయి. వారి హయాంలో ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.80 లక్షల చొప్పున ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక 8 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయి. ఎకరా రూ.1.50 కోట్లకు కేటాయించాం. 5 ఎకరాలు కావాలని టెస్సరాక్ట్ సంస్థ 2024లో దరఖాస్తు చేసుకుంది. ఏడాదిపాటు పరిశీలించి ఆ సంస్థకు 2025లో భూమిని కేటాయించాం. అందరికీ కేటాయించినట్టుగానే ఆ సంస్థకు కూడా ఎకరా రూ.1.50 కోట్ల చొప్పున ఇచ్చాం. 2025 వరకు టెస్సరాక్ట్ సంస్థకు కొండల్ రెడ్డి (Kondal Reddy) డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ (Managing Director) కాదు అని తెలిపారు

వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని, ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రూప్-1లో భయంకర తప్పిదాలు.. అడ్డగోలుగా నిర్వహించిన వైసీపీ చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి.. డీఎస్సీపై మండలిలో యాగీయే వారి లక్ష్యం.. ఆధారాలతో వారి ప్రయత్నాల్ని తిప్పికొట్టండి 11 మందికే విపక్ష హోదా ఎలా ఇస్తారు.. మంత్రులతో భేటీలో సీఎం అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని, ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో బుధవారం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రూప్-1పై సిట్ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రస్తావించారు. దీనిపై సిట్ తన రిపోర్టును హైకోర్టుకు సమర్పించిందన్న సీఎం.. మంత్రులందరూ ఆ రిపోర్టును పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే లక్ష్యంగా వైసీపీ ఐదేళ్ల పాలన సాగిందన్నారు. డీఎస్సీలో ఎలాంటి తప్పిదాలు చేయలేదనీ, నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అడ్డగోలు విమర్శలు చేస్తోందని తెలిపారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ తప్పిదం జరిగిందో ఆధారాలతో అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. కానీ వారి ఉద్దేశం గందరగోళం సృష్టించడమేనని మండిపడ్డారు. డీఎస్సీపై మండలిలో ప్రస్తావించేందుకు వైసీపీ సిద్ధపడితే.. ఆధారాలతో దీటుగా తిప్పికొట్టాలని.. దూకుడు ప్రదర్శించాలన్నారు. వైసీసీ నేతలకు చట్టాలన్నా.. చట్ట సభలన్నా గౌరవం లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ గెలిచిన 11 స్థానాలకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఏ చట్టంలోనూ లేదన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలున్నారని, వారిలో నలుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని జగన్ ఏ ఉద్దేశంతో అన్నారని సీఎం ప్రశ్నించారు. పరిశ్రమలపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్, ఆగస్టు 12: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు. నిజమైన స్టార్టప్‌లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని తాము కష్టపడి ‘T-Hub’ను నిర్మిస్తే... సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం ‘అనుముల హబ్స్’ ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఇది ఫ్యామిలీ-రన్.. ఫ్యామిలీ-డ్రైవ్.. జీరో ఇన్నోవేషన్.. జీరో ఎంప్లాయీస్ స్కామ్ అంటూ ఆరోపించారు. అనుముల సోదరుల్లో ఒకరైతే చాలు.. ఎటువంటి ప్రశ్నలు లేకుండా వందల కోట్లు విలువైన భూములు దక్కించుకోవచ్చంటూ సెటైర్ విసిరారు. ‘సున్నా పెట్టుబడితో ‘Tesseract Advanced Systems Pvt Ltd’ అనే డిఫెన్స్ కంపెనీ పెట్టి, రాత్రికి రాత్రే కనీసం రూ.200 కోట్ల లాభం ఆర్జించినందుకు ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాల్సిందే. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి.. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా ఈ అద్భుతమైన ‘బిజినెస్ మోడల్’ ఏంటో నేర్పించండి. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వండి. ఈ మ్యాజిక్ ట్రిక్ కేవలం అనుముల కుటుంబానికే ఎందుకు పరిమితం కావాలి? తెలంగాణ యువత మొత్తానికి ఈ ‘అనుముల హబ్’ అవకాశాన్ని కల్పించండి’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. దోమల నివారణకు పురుగుమందు పిచికారీ.. కాసేపటికే ఇద్దరి మృతి విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లతో ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందిన కేరళకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్ జంట జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అఖిల్, మేఘనలుగా ప్రాచుర్యం పొందిన ఈ జంటలో, భార్య మేఘన తనను విడిచి ఒక బస్సు క్లీనర్‌తో వెళ్లిపోయిందంటూ భర్త అఖిల్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో అఖిల్, మేఘనలకు విశేష ఆదరణ ఉంది. వీరు పోస్ట్ చేసే ఆకర్షణీయమైన వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్‌తో నెటిజన్లకు ఫేవరెట్ కపుల్‌గా నిలిచారు. సోషల్ మీడియాలో ఎంతో అన్యోన్యంగా కనిపించే వీరి జీవితంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం వారి ఫాలోవర్లను విస్మయానికి గురిచేసింది.ఇటీవల అఖిల్ ఒక వీడియోను విడుదల చేస్తూ తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. మేఘన ఒక స్థానిక బస్సు క్లీనర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. వెళ్లే సమయంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను కూడా తీసుకువెళ్లిందని ఆయన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో తాను తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు అఖిల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.అయితే, ఈ వ్యవహారంలో ఇప్పటివరకు అఖిల్ చేసిన ఆరోపణలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మేఘన వైపు నుంచి దీనిపై ఎటువంటి స్పందన రాలేదు. ఆమె వెల్లడించే వివరణతోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది

ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ప్రశ్నించడమే పెద్ద పాపమన్నట్లుగా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఉందని, తమ అభిమానులను, సానుభూతిపరులను ఉద్దేశించి మంత్రి నీచమైన వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. ఆనం గెలిచినప్పటి నుంచి ఆత్మకూరులో ఇసుక దందా, చికెన్ వేస్ట్ మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయని, మర్రిపాడులో ఇసుక కొండనే మాయం చేశారని విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి ధనదాహానికి ఏడుగురు బలికావడమే కాకుండా, చివరకు పోలీస్ స్టేషన్ల నుంచే మామూళ్లు వసూలు చేసే నీచ సంస్కృతికి తెరతీశారని దుయ్యబట్టారు. ఐదేళ్లకోసారి పార్టీలు మారే ఊసరవెల్లి నైజం ఆనందేనని, జగన్‌ను తిట్టి మంత్రి పదవి తెచ్చుకున్న చరిత్రహీనుడని ఎద్దేవా చేశారు. కేవలం ఇసుక దందా ద్వారానే నెలకు రూ.3 కోట్లు ఆర్జిస్తున్నారని విమర్శిస్తూ.. "ఆనం అంటే అవినీతి, అవినీతి అంటే ఆనం" అని అభివర్ణించారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా, రాజీనామా చేయడానికైనా సిద్ధమని, ఈ సవాల్‌ను స్వీకరించే దమ్ము ఆనంకు ఉందా అని నిలదీశారు

న్యూఢిల్లీ: నీట్ (యూజీ) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతానికి సంబంధించి జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) డైరెక్టర్ విశ్వజిత్ కుమార్ సహా 17 మంది అధికారుల వాంగ్మూలాలను సీబీఐ తన చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జూలై 28న దాఖలు చేసిన ఈ చార్జ్‌షీట్‌లో మొత్తం 360 మంది సాక్ష్యాలను పేర్కొన్నారు. నీట్-యూజీ పేపర్ల తయారీ ప్రక్రియ ఏప్రిల్ 5 నాటికే పూర్తయిందని, మే 3న పరీక్ష జరగగా.. లీక్ కారణంగా మే 12న రద్దు చేసి జూన్ 21న రీ-టెస్ట్ నిర్వహించినట్లు విశ్వజిత్ కుమార్ సీబీఐకి వెల్లడించారు. ప్రశ్నపత్రాలు రూపొందించే నిపుణుల ఎంపికలో ఎలాంటి అప్రతిష్ట లేని వారికే ప్రాధాన్యత ఇచ్చామని, అయితే రసాయన శాస్త్రానికి చెందిన ఒక సీనియర్ నిపుణురాలు ప్రైవేట్ కోచింగ్ తరఫున తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి తాను ఆరా తీసినట్లు ఆయన తెలిపారు. ఎన్టీఏలో ఆమెకున్న మంచి పేరు కారణంగానే తాము అనుమానించలేదని వివరించారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉండే నిపుణులు ఎవరూ మొబైల్స్, పెన్నులు, కాగితాలు లోపలికి తీసుకెళ్లడానికి వీలే లేదని, అయితే నిపుణులను క్షుణ్ణంగా తనిఖీ (ఫ్రిస్కింగ్) చేసే విధానం ఎందుకు నిలిపివేశారనేదానికి తనకంటే ముందే ఉన్న పద్ధతినే కొనసాగించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు ఎన్టీఏ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ వద్ద నిపుణుల రాకపోకలపై ఎలాంటి తనిఖీ వ్యవస్థ లేదని నీట్ కన్సల్టెంట్ శిల్పి శర్మ సీబీఐకి తెలిపారు. కేవలం ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులు మాత్రమే వారిని ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. ఎన్టీఏ భవనంలోని ఒకటో అంతస్తులో 110 సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, రికార్డింగ్ నిల్వ సామర్థ్యం కేవలం 25 రోజులు మాత్రమే ఉండటం, సీసీటీవీ కంట్రోల్ రూమ్ సరిగ్గా లేకపోవడం వంటి భద్రతా లోపాలను సీబీఐ దర్యాప్తులో గుర్తించింది. ప్రశ్నలను కాగితపు చిట్టీలపై రాసుకోవడం, కొందరు వాటిని జ్ఞాపకం ఉంచుకుని హోటల్ గదుల్లో నోట్ చేసుకోవడం వంటి పద్ధతుల ద్వారా బయటకు తరలించినట్లు