
Who Is Neha Pachisia Katni Police Officer Suspended Over Murder Case Accused Land Garbage Allegations In Madhya Pradesh
ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్ అధికారిణి నేహా పచీసియా తీవ్ర అవినీతి, అక్రమ ఆరోపణల్లో చిక్కుకున్నారు.
ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్ అధికారిణి నేహా పచీసియా తీవ్ర అవినీతి, అక్రమ ఆరోపణల్లో చిక్కుకున్నారు. కట్నీ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP)గా విధులు నిర్వర్తించిన ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కుత్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు సీఎస్పీ నేహా పచీసియాను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలంలో ఆమె భోపాల్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ అయి ఉంటారు.జైలులో ఉన్న హత్య కేసు నిందితుడు రమేష్ లోధి కుటుంబంపై అధికారాన్ని ఉపయోగించి ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్ లేదా ప్రభుత్వ రికార్డుల ప్రకారం రూ. 82.86 లక్షల విలువైన ఆస్తిని కేవలం రూ. 18.20 లక్షలకే మారూఫ్ అహ్మద్ హనాఫీ అనే వ్యక్తికి విక్రయించేలా చేశారని విచారణలో తేలింది.రిజిస్ట్రేషన్ ప్రకారం రూ. 15 లక్షలు చెక్కు ద్వారా, రూ. 3.20 లక్షలు నగదుగా చెల్లించారు. కానీ, జులై 11, 2025 నాటికి కొనుగోలుదారుడు హనాఫీ బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 3,036 మాత్రమే ఉండటం గమనార్హం.రిజిస్ట్రేషన్ జరిగిన ఏప్రిల్ 15, 2026 నాడే హనాఫీ ఖాతాలోకి రూ. 10 లక్షలు సైన్ పార్ట్నర్స్ నుంచి, రూ. 5 లక్షలు క్షితిజ్ రాజ్ బారాపాత్రే అనే మరో వ్యక్తి ఖాతా నుంచి జమ అయ్యాయి. అయితే, ఈ రెండు ఖాతాలు ఒకే పాన్ కార్డుతో అనుసంధానమై ఉన్నాయని, బారాపాత్రే నేహా పచీసియాకు అత్యంత ఆప్తుడని విచారణలో బయటపడింది. ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడానికి లోధి కుటుంబం రద్దుచేసుకోడానికి ప్రయత్నించగా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, గతంలో కూడా ఒక ట్రాన్స్పోర్ట్ వ్యాపారి వద్ద రూ. 30,000 లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై విచారణ నడుస్తోంది.2012లో ఎంపీపీఎస్సీ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు సాధించిన నేహా పచీసియా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. భోపాల్ విజిలెన్స్ బ్రాంచ్ ఫిర్యాదు, జబల్పూర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రమోద్ వర్మ ఆదేశాల మేరకు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ముందు ఐపీఎస్ అను బెనివాల్ నిర్వహించిన విచారణలో ఈ భూ లావాదేవీని, దాని చుట్టూ ఉన్న ఆరోపణలను పరిశీలించారు. ‘‘మోసం, బలవంతం, నేరపూరిత కుట్ర వంటి ఆరోపణలపై సీఎస్పీ, ఇతర నిందితులపై కేసు నమోదు చేశాం’’ అని ఆయన అన్నారు.వివాదాస్పద భూ బదలాయింపును రద్దు చేయడానికి తమ తండ్రి ప్రయత్నించడంతో తమ కుటుంబాన్ని బెదిరించారని రమేష్ లోధి కుమారుడు ఆకాష్ ఆరోపించారు. కాగా, తనపై నమోదైన ఆరోపణలపై మధ్యప్రదేశ్ హైకోర్టును పచీసియా ఆశ్రయించగా.. అక్కడ ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.






