
ఖైరతాబాద్ బడా గణేశుడికి ‘మహా హారతి’
ఖైరతాబాద్ బడా గణేశ్(Khairatabad Ganesh)ను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచే పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
© 2026 nimisham.in

ఖైరతాబాద్ బడా గణేశ్(Khairatabad Ganesh)ను చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచే పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.

బయట వాతావరణం చల్లగా ఉన్నా 'చాలామంది పొడి జుట్టుతో బాధపడుతుంటారు. ఎక్కువగా తలకు నూనె పెట్టకపోవడం, వేడి వేడి నీళ్లు తలపై పోసుకోవడం, నిద్రలేమి, బలమైనవి తినక పోవడం వల్ల ఇలా జుట్టు డ్రైగా మారిపోతుంది. ఈ సమస్యను ముందే గుర్తించాలి.

ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతి (Khairatabad) భక్తులకు దర్శనమిస్తున్నారు.

vinayakachavithi festivities in Hyderabad... When is the first puja for the Khairathabad Bada Ganesh?హైదరాబాద్‌లో వినాయక చవితి సందడ.. ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజ ఎప్పుడంటే..?

ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు... న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) చైర్మన్‌గా మోహిత్ జైన్ ఎన్నికయ్యారు. బెన్నెట్ కోల్మన్ అండ్ కో లిమిటెడ్ (బీసీసీఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (పబ్లిషింగ్), బోర్డు సభ్యుడిగా ఉన్న మోహిత్ జైన్ 2026-27 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 43 ఏళ్ల తర్వాత బీసీసీఎల్‌కు చెందిన ప్రతినిధి మరోసారి ఏబీసీ చైర్మన్ పదవిని చేపట్టినట్లయింది. ప్రింట్ మీడియా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మోహిత్ జైన్.. ప్రచురణ, వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కెమికల్ ఇంజనీరింగ్‌తో పాటు ఎంబీఏ చదివిన జైన్.. 2021-22లో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) అధ్యక్షుడిగా సేవలందించారు. రెండు దశాబ్దాలకు పైగా ఐఎన్ఎ్సతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ గ్లోబల్ సూపర్వైజరీ బోర్డులోనూ మోహిత్ జైన్ మూడేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ దక్షిణాసియా విభాగం బోర్డు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాగా, ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా విక్రమ్ సఖుజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ
అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్న ఆహారాన్ని తినండి. బయోటిన్, విటమిన్ ఎ, ఇ, ప్రోటీన్ ఫుడ్ తింటే జుట్టు, గోళ్లు, చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతాయని హెల్త్‌లైన్ తెలిపింది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినండి. అవకాడో, సాల్మన్, ఆలివ్ ఆయిల్ తీసుకుంటే చర్మం అందంగా మారుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. గోళ్లు కూడా బలంగా మారుతాయి. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగండి. నీరు తాగడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. చర్మం, జుట్టుకి సహజ మెరుపు వస్తుంది. రోజుకి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. నిద్రలో కణాల పునరుద్ధరణ వేగంగా జరుగుతుంది. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి పెరగడం వల్ల జుట్టు రాలడం తీవ్రం అవుతుంది. ఒత్తిడి తగ్గేందుకు ప్రతిరోజూ ధ్యానం చేయండి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. చర్మానికి ప్రతిరోజూ సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి. ముఖ్యంగా ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాయండి. దీంతో యూవీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. కొబ్బరి నూనె, జొజొబా ఆయిల్‌తో తలను సున్నితంగా మసాజ్ చేసుకోండి. దీని వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తినడం వల్ల కొల్లాజెన్ విచ్ఛిన్నం అవుతుంది. దీని వల్ల చర్మంపై ముడతలు వస్తాయి. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండండి

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. అసలేమైందంటే.. ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది.. యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం

విధి చేసిన గాయం ఆ పసిపాప కాళ్లను తుంచేసింది. వయసు ఏడేళ్లు.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన సమయంలో ఒక కాలు లేక నరకం అనుభవిస్తోంది. ఊతకర్ర లేదు, చక్రాల కుర్చీ అంతకంటే లేదు.. కానీ, చదువుకోవాలనే ఆ చిన్నారి సంకల్పం ముందు ఆ వైకల్యం కూడా ఓడిపోయింది! విపరీతమైన పేదరికం, ఒంటికాలితో కుంటుతూ వెళ్లాల్సి వస్తున్నా సరే.. చదువుపై ఉన్న ఆరాటంతో రోజూ వందల మీటర్లు దూకుతూ బడి బాట పడుతోంది ఉత్తరప్రదేశ్ బాలిక రాగిణి. ఈ పసిపాప కష్టాన్ని చూసి ఇటు ఊరి జనం, అటు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఆరు నెలల వయసులోనే కోలుకోలేని దెబ్బ!యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి కథ ఇది. ఈ చిన్నారికి కేవలం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పాప ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది. తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ. తీవ్రమైన పేదరికం వల్ల ఆ చిన్నారికి సరైన వైద్యం చేయించలేకపోయారు. కాలక్రమేణా ఒక కాలు పూర్తిగా పాడైపోయింది. అలాగని రాగిణి ఇంట్లో కూర్చోలేదు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే తాను కూడా వెళ్తానని ఏడ్చేది. అలా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరింది. Viral Video: వరదలో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువురోడ్డుపై ఏడుస్తూనే పాఠశాలకు..ఇంటి నుంచి బడికి ఉన్న 400 మీటర్ల దూరాన్ని రాగిణి ఒంటికాలితో ఎగురుతూ, కుంతుతూ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. దారి మధ్యలో అలసిపోయి, నొప్పి తట్టుకోలేక రోడ్డుపైనే కూర్చుని ఏడుస్తూ నాకే ఎందుకీ శిక్ష దేవుడా అని ప్రశ్నిస్తుంటుంది. మళ్లీ కాసేపటికి కన్నీళ్లు తుడ్చుకుని ఒంటికాలితోనే బడి వైపు అడుగులు వేస్తుంది. ఈ దయనీయ స్థితిని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమిత్ పాల్ యాదవ్

బ్లూ టీ.. షుగర్ ఉన్నవారు తాగొచ్చా..? బ్లూ టీ.. షుగర్ ఉన్నవారు తాగొచ్చా..? September 02 Jyothi Gadda యాంటీఆక్సిడెంట్ల నిధి: బ్లూ టీలో ఆంథోసైనిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఉచిత రాడికల్స్ నాశనం చేసి కణాల నష్టాన్ని సమర్థవంతంగా అరికడతాయి. బరువు తగ్గడానికి సహాయం: ఈ టీలో కేలరీలు మరియు ఫ్యాట్ ఉండవు. ఇది జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. చర్మ, కేశ సంరక్షణ: బ్లూ టీ తాగడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మంపై ముడతలు రాకుండా వృద్ధాప్య ఛాయలను తగ్గించి, జుట్టు దృఢంగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన నివారణ: బ్లూ టీలో ఉండే సహజ పదార్థాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసటను తగ్గించి మూడ్‌ని తక్షణమే మెరుగుపరుస్తాయి. మధుమేహ నియంత్రణ: ఈ టీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా అడ్డుకుని డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుదల: బ్లూ టీ చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తూ హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. మెదడు చురుకుదనం పెంపు: ఇందులో ఉండే అసిటైల్ కోలైన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి, వయస్సుతో పాటు వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలను అరికడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు: పరగడుపున బ్లూ టీ తాగడం వల్ల శరీరంలో నిలిచిపోయిన వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్! ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే! వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!

సౌందర్య పోషణలో భాగంగా హెయిర్ డైలు వేసుకోవడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల రంగులు చర్మానికి అంటుకుని అక్కడ మచ్చలు పడతాయి. వీటిని తొలగించడంలో కొన్ని ఇంటి చిట్కాలు సమర్థంగా పనిచేస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. ⚛ వినెగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో మచ్చలు పడిన చోట రుద్దడం వల్ల అవి పోయే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ⚛ బేబీ ఆయిల్‌తో పాటు కొన్ని ఎసెన్షియల్ నూనెలు కూడా డై మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి అంటున్నారు నిపుణులు. కొన్ని చుక్కల నూనెను తీసుకొని దాన్ని మచ్చపై అప్లై చేసి చేతి మునివేళ్లతో రుద్దాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే ఫలితం ఉంటుంది. అయితే రసాయనాలు కలవని, చర్మానికి అంటినా మచ్చలు పడని హెయిర్ డైలు కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. సాధ్యమైనంతవరకు ఇలాంటి వాటిని నిపుణుల సలహాతో ఎంచుకోవడం మంచిది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్‌లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్‌లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ప్రేమ కథలు, పెళ్లి ముచ్చట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే రీల్ లైఫ్‌లో తమ్ముడికి రోమాంక్ చేసి, రియల్ లైఫ్‌లో అన్నయ్యను వివాహం చేసుకున్న హీరోయిన్ల ముచ్చట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా నటి కావ్య కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు కాల భైరవ తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ ఆసక్తికరమైన అంశం మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ తమ్ముడైన యంగ్ హీరో శ్రీసింహా కోడూరి సరసన ఉస్తాద్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత కాల భైరవతో ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వెళ్తోంది. ఇక గతంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన జంటలు టాలీవుడ్, కోలీవుడ్‌లలో వార్తల్లో నిలిచాయి. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, ప్రముఖ నటుడు అనిల్ కపూర్ సరసన మిస్టర్ ఇండియా వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య, నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇదే వరుసలో నటి శ్రియా రెడ్డి కూడా విశాల్ సరసన పొగరు చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో విశాల్ - శ్రియా రెడ్డి రొమాంటిక్ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఆ సెట్ లో శ్రియాకు విశాల్ అన్నయ్య, నిర్మాత విక్రమ్ కృష్ణ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. అలాగే సోనియా అగర్వాల్, ధనుష్ సరసన కాదల్ కొండేన్ చిత్రంలో నటించి
తెల్ల జుట్టు రావడానికి జీన్స్ ప్రధాన కారణం. తల్లిదండ్రుల్లో ఎవరికైనా తెల్ల జుట్టు ఉంటే మీకు కూడా తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఉందని హెల్త్‌లైన్ తెలిపింది. ఒత్తిడి అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఒత్తిడి తీవ్రం అయినప్పుడు విడుదల అయ్యే హార్మోన్లు, రసాయనాల వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. విటమిన్ బి12 లోపించడం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. కుదుళ్లు కూడా బలహీనంగా మారుతాయి. ఐరన్, జింక్, రాగి, విటమిన్ డి వంటివి జుట్టుకు రంగును అందిస్తాయి. వీటి లోపం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ తాగడం వల్ల శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీంతో జుట్టు తెల్లగా మారుతుంది. థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవడం వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. హైపో థైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వల్ల కూడా జుట్టు నెరిసిపోతుంది. ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. విటిలిగో, అలోపేసియా ఏరియాటా వంటి వ్యాధుల వల్ల తెల్ల జుట్టు వస్తుంది. కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుంది. కాబట్టి సహజ ఉత్పత్తులను మాత్రమే వాడండి. కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం వల్ల అందం పాడువుతుంది. జుట్టు తెల్లగా మారుతుంది. యూవీ కిరణాల బారిన పడటం వల్ల కూడా జుట్టు అందం పాడవుతుంది

సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ నటి కావ్య కళ్యాణ్‌రామ్‌తో తన ప్రేమను బహిరంగంగా చాటుకుంటూ పోస్ట్ చేశారు. కావ్యను తన ఇల్లుగా వర్ణిస్తూ ఆగస్టు 31న ఆయన సోషల్ మీడియాలో రాసిన కవితాత్మక భావాలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. నెలల తరబడి సాగుతున్న ప్రచారానికి ఈ నిర్ణయంతో అధికారిక ప్రకటన వచ్చినట్లయింది. కాలభైరవ కావ్య కళ్యాణ్‌రామ్ లవ్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వీరి పరిచయం 2023లో శ్రీసింహ కథానాయకుడిగా తెరకెక్కిన ఉస్తాద్ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రారంభమైనట్లు సమాచారం. ఆ సినిమాలో కావ్య కథానాయికగా నటించగా, కాలభైరవతో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. మార్చి 2026లో హైదరాబాద్ వేదికగా జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఇద్దరూ జంటగా కనిపించడంతో ప్రచారం ఊపందుకుంది. ఇరు కుటుంబాలు ఈ సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కథనాలు వచ్చినప్పటికీ ఇన్నాళ్లూ అధికారిక ధృవీకరణ లేదు. కావ్యతో గడిపే ప్రతి క్షణం పచ్చని పర్వతాల మధ్య జలపాతాన్ని చూస్తున్నంత ప్రశాంతంగా ఉంటుందని కాలభైరవ పేర్కొన్నారు. చలికాలపు ఉదయం వేడి కాఫీలా ఆమె మాటలు హాయినిస్తాయని, ఆమెను కలిసినప్పుడు ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న సొంత గూటికి చేరుకున్న భావన కలిగిందని తెలిపారు. దీంతో ఇన్నాళ్లూ వీరి వ్యవహారంపై ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి స్పష్టత వచ్చింది. ఇదిలా ఉండగా ఈ ప్రేమికుల భావోద్వేగ ప్రకటనకు సినీ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మొదట ఈ అనుబంధాన్ని ఏమని పిలవాలో తెలియలేదని, కాలక్రమంలో ఇది కేవలం ఆకర్షణ మాత్రమే కాదని అర్థమైందని కాలభైరవ వెల్లడించారు. జీవితాంతం ఒకరికొకరు అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమని ఇంత సున్నితంగా చెప్పడం ఆయనకే సాధ్యమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుమారుడైన కాలభైరవ

తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధరవర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నేతలు శ్రీధరవర్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధరవర్మ పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉద్యోగులందరితో సమన్వయంతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని శ్రీధర్ వర్మ తెలిపారు. శ్రీ రంగనాయకుల మండపంలో ఆశీర్వాదాలు అందుకున్న ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారు అనంతరం తిరుమల నుండి తిరుపతికి చేరి ఎస్విబిసి చైర్మన్ గా తన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి రామకృష్ణ గారు, నందమూరి మోహన రూపా గారు, కామినేని సీమంతిని గారు, దగ్గుబాటి నివేదిత గారు హాజరై శ్రీధర్ వర్మ గారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ గారు మాట్లాడుతూ... "నా సోదర సమానుడు శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ చైర్మన్ గా ఎంపికైనందుకుగాను నా శుభాకాంక్షలు. రక్తం పంచుకుని పుట్టకపోయినా ఆప్యాయత అనురాగాలలో నాకు మా సోదరుడు ఎలాగో రాజు గారి పిల్లలు కూడా అంతే. నాడు రామారావు గారు తొలి పార్టీ టికెట్ రాజు గారికి ఇచ్చినప్పటికీ ఆయన తనకు టికెట్ వద్దు అని అనడంతో శ్రీవారి సేవలో ఉండాలంటూ నాన్నగారి కోరికను కాదనకుండా టిటిడి కోసం పనిచేశారు. అభివృద్ధి కోసం ఆయన స్వయంగా ముందుకు వచ్చి తన భూమిని దానం చేశారు. నాన్నగారి

Best Time to Oil Hair: జుట్టుకు నూనె రాసుకోవడం భారతీయ కుటుంబాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అలవాటు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు నూనె రాయాలని పెద్దలు తరచుగా చెబుతుంటారు. అయితే నూనెను రాత్రంతా తలకు ఉంచుకోవాలా? ఉదయాన్నే రాసుకోవాలా? లేక తలస్నానానికి ముందు రాసుకోవాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి ఉదయం లేదా రాత్రి నూనె రాసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుందని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. నూనె వల్ల కలిగే ప్రయోజనాలు ప్రధానంగా ఉపయోగించే నూనె రకం, ఎంత మోతాదులో వాడుతున్నాం, జుట్టు మరియు తల చర్మం పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. స్నానానికి ముందు నూనె రాయడం మంచిదేనా? తలస్నానానికి 30 నిమిషాల నుంచి కొన్ని గంటల ముందు నూనె రాసుకోవడం సులభమైన పద్ధతి. ఇలా చేయడం వల్ల నూనె జుట్టుతో కొంత సమయం పాటు ఉండటమే కాకుండా, రాత్రంతా జిడ్డుగా ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా కొబ్బరి నూనెను తలస్నానానికి ముందు ఉపయోగించడం వల్ల జుట్టు ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని ఒక అధ్యయనం సూచించింది. అయితే దీని అర్థం కొబ్బరి నూనె జుట్టును వేగంగా పెంచుతుందని కాదు. జుట్టును దెబ్బతినకుండా కాపాడటం, దాని నాణ్యతను నిలబెట్టుకోవడంలో ఇది సహాయపడవచ్చు. ఉదయం నూనె రాసుకోవచ్చా? మీరు ఉదయం లేదా పగటిపూట తలస్నానం చేసే అలవాటు ఉన్నవారైతే, ఉదయం నూనె రాసుకుని కొన్ని గంటల తర్వాత తలస్నానం చేయవచ్చు. రాత్రంతా నూనె రాసుకుని నిద్రపోవడం ఇష్టం లేని వారికి ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. నూనెను రాత్రంతా ఉంచుకోవడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. అంతేకాకుండా కొంతమందిలో ఎక్కువసేపు నూనెను ఉంచడం వల్ల తల చర్మం జిడ్డుగా మారడం, దురద లేదా పొలుసులు వంటి సమస్యలు కనిపించవచ్చు. రాత్రంతా నూనె ఉంచుకోవాలా? అవసరం లేదు. జుట్టుకు నూనె రాసిన తర్వాత 30
తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమాని రామచంద్ర రాజు అలియాస్ ఎన్టీఆర్ కుమారుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా.. ఆయనతో కలసి నందమూరి రామకృష్ణ , మోహనకృష్ణ కుటుంబంతో స్వామివారిని దర్శించుకున్నారు. రామచంద్రరాజుతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. శ్రీధర్ వర్మకు తన తండ్రి ఎన్టీఆర్, ఎన్టీఆర్ రాజు ఆశీస్సులు ఉండాలంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.ఎన్టీఆర్ రాజు రెండుసార్లు వరుసగా పాలకమండలిలో సభ్యుడిగా ఉన్నారని.. మూడోసారి పదవి ఇవ్వబోతే ఎన్టీఆర్ వద్దని చెప్పిన విషయాన్ని నందమూరి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఎన్టీఆర్ టీటీడీ పాలకమండలి సభ్యుల పదవీ కాలానికి సంబంధించి ఓ నిబంధనను తీసుకొచ్చారని.. టీటీడీ పాలకమండలిలో రెండుసార్లకు మించి ఎవరూ ఉండకూడదని ఎన్టీఆర్ జీవో తెచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజు సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిరావడం ఆనందంగా ఉందన్నారు నందమూరి మోహనకృష్ణ. శ్రీధర్ వర్మ తండ్రి ఎన్టీఆర్ రాజుతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ రాజు పిల్లలు మాకు సోదరసమానులు.. అందరం అన్నదమ్ముల్లా ఉంటామన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఎన్టీఆర్ రాజును పోటీచేయమని కోరితే.. ఆయన నిరాకరించి 'మీకు సేవ చేసుకుంటాను' అని చెప్పిన మాటన గుర్తు చేశారు. ఎన్టీఆర్ కోరితేనే టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారని.. ఆయన భూ దానం కూడా చేశారన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ రాజు గతేడాది కన్నుమూశారు.. ఆయన పాడెను మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుమారులు నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ మోశారు.టీడీపీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ టీటీడీకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు
తలకు రక్త ప్రసరణ మెరుగుపర్చి జుట్టుకు కావాల్సిన పోషణ అందించడంలో ఈ చిట్కా సహాయపడుతుంది. దీనికోసం బెడ్ మీద పడుకుని తలను, జుట్టును కిందకు వాలేలా చేయండి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. రెండు చేతి వేళ్ల గోళ్లను రాపిడి చేస్తూ ఉండటం ద్వారా జుట్టు పెరుగుతుందని చెబుతారు. దీనినే బలయామ్ యోగా అని పిలుస్తారు. అందుకే రోజులో ఒకసారి ఈ చిట్కా పాటించండి. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే ఆయిల్ మసాజ్ తప్పనిసరి. కానీ చాలామంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొబ్బరి నూనె, బాదం, నూనె, ఆముదం నూనె ఇందులో ఏదో ఒక నూనె తీసుకుని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నపడు తలకు పట్టించండి. గంట తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే సరిపోతుంది. చర్మాన్ని మెరిపించడమే కాకుండా జుట్టును ఒత్తుగా మార్చడంలో బియ్యం నీళ్లు సహాయపడతాయి. దీనికోసం నీళ్లలో బియ్యం గంటసేపు నానబెట్టి ఈ నీటితో తలను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఉపయోగించే పిల్లో (తలగడ) కూడా మీ జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కుదుళ్లలో రాపిడి తగ్గాలంటే వీలైనంత వరకు సిల్క ్లేాద సాటిన్ పిల్లో వాడటం అలవాటు చేసుకోండి. దీనివల్ల కుదుళ్లలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జుట్టు హెల్తీగా పెరుగుతుంది. జుట్టు హెల్తీగా పెరిగేందుకు ప్లాస్టిక్ దువ్వెన కంటే చెక్క దువ్వెన ఎక్కువగా మేలు చేస్తుంది. అలాగే దువ్వెన దంతాలు వెడల్పుగా ఉండాలి. అప్పుడు రాపిడి తగ్గి జుట్టు హెల్తీగా పెరుగుతుంది. తడి జుట్టును టవల్‌తో గట్టిగా రుద్దడం, దువ్వడం చేయకూడదు. ఎందుకంటే తడి జుట్టు సెన్సిటివ్‌గా ఉండి తొందరగా రాలుతుంది. అందుకే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వాలి. అలాగే జుట్టు ఆరబెట్టేందుకు హీట్ పరికరాలు వాడొద్దు. ఇంట్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉంటాయి. వీటితోనే మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. దీనికోసం ఉల్లిపాయల నుంచి రసం తీసి తలకు రాసుకోండి

అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గల పైనా ఇవి పెరుగుతుంటాయి. ఫలితంగా ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గల పైనా ఇవి పెరుగుతుంటాయి. ఫలితంగా ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అయితే సహజసిద్ధమైన పద్ధతులను పాటించి కూడా ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ⚛ రెండు టేబుల్స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసానికి.. పది టేబుల్స్పూన్ల నీళ్లు చేర్చి కలుపుకోవాలి. ఇది కాస్త చిక్కపడే దాకా మరిగించుకొని చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ గ్రోత్ దిశలో అప్లై చేసి, వ్యతిరేక దిశలో తొలగించుకోవాలి. ⚛ రెండు టేబుల్స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసం తీసుకొని.. దానికి టేబుల్‌స్పూన్ తేనె కలుపుకోవాలి. దీన్ని ఐదు నిమిషాల పాటు వేడి చేస్తే చిక్కబడుతుంది. ముందు వెంట్రుకలు ఉన్న చోట కార్న్‌స్టార్చ్ అప్లై చేసుకొని.. చల్లారిన చక్కెర మిశ్రమాన్ని వెంట్రుకలు మొలిచే దిశలో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ సహాయంతో వ్యతిరేక దిశలో తొలగించుకోవాలి. ⚛ టేబుల్‌స్పూన్ చొప్పున తేనె, నిమ్మరసం తీసుకొని.. దానికి ఐదు టేబుల్స్పూన్ల బంగాళాదుంప రసం కలుపుకోవాలి. మరోవైపు రాత్రంతా నానబెట్టిన శెనగపప్పును పేస్ట్ చేసుకోవాలి. వీటన్నింటినీ కలుపుకొని సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. అయితే ఈ చిట్కా ఈ చిట్కా అవాంఛిత రోమాలను తొలగించే ప్రక్రియలో వాటిని బలహీనపరచడానికి ఉపయోగపడుతుందట. అయితే ఈ చిట్కాల వల్ల ఆశించిన ఫలితం లేకపోయినా, వీటిని పాటించేంత ఓపిక, సమయం లేవనుకున్నా; ఇతర దుష్ప్రభావాలేమైనా ఎదురైనా.. చర్మ సంబంధిత నిపుణుల్ని సంప్రదించి ఆరోగ్యకరమైన పద్ధతుల్లో తగిన చికిత్స తీసుకోవడం మంచిది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు. కూటమి ప్రభుత్వం విధానాలతో టెక్నాలజీ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం క్వాంటం వ్యాలీతో అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళిక గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు విస్తృత అవకాశాలు ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి కొత్త పెట్టుబడులతో రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అమెరికా (న్యూజెర్సీ): ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టెక్నాలజీ రంగంలో తీసుకొస్తున్న మార్పులు, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను అమెరికాలోని ఐటీ పారిశ్రామికవేత్తలకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ వివరించారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. క్వాంటం వ్యాలీతో అమరావతికి కొత్త గుర్తింపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక టెక్నాలజీ రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని మన్నవ మోహన కృష్ణ తెలిపారు. అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేయనున్న ‘క్వాంటం వ్యాలీ’ రాష్ట్ర టెక్నాలజీ ప్రస్థానంలో కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్, పరిశోధన, ఆవిష్కరణల వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ఇది వేదికగా మారనుందని తెలిపారు. 'చంద్రబాబు నాయకత్వంలో గతంలో హైదరాబాద్ ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇప్పుడు అదే దార్శనికతతో అమరావతిని భవిష్యత్తు టెక్నాలజీకి కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం మన ముందుంది. క్వాంటం వ్యాలీ ఈ ప్రయాణంలో కీలక భాగం' అని మన్నవ మోహన కృష్ణ అన్నారు. అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు, అమరావతి అభివృద్ధి, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Uppal Balu Akkineni Nagarjuna: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' త్వరలోనే సీజన్ 10తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, సామాన్యులకు హౌస్‌లోకి వెళ్లే సువర్ణావకాశాన్ని కల్పించేందుకు నిర్వాహకులు 'అగ్నిపరీక్ష 2' ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఆడిషన్స్ నుంచి ఎలిమినేట్ అయిన సోషల్ మీడియా ఫేమ్ ఉప్పల్ బాలు వ్యవహారం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. జడ్జిలపై సంచలన ఆరోపణలు.. ఇటీవల బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్స్‌కు వెళ్లిన ఉప్పల్ బాలు అక్కడ ఎలిమినేట్ అయ్యారు. అనంతరం ఆయన షో జడ్జిలైన నవదీప్, బిందు మాధవి, అభిజిత్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జడ్జి నవదీప్ తన వీడియోలు చాలా వల్గర్ (అసభ్యంగా) ఉంటాయని అంటూ తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో జడ్జి బిందు మాధవి తనను 'ట్రాన్స్'వా అని ప్రశ్నించిందని బాలు పేర్కొన్నారు. కేవలం బాలు మాత్రమే కాకుండా, ఎలిమినేట్ అయిన ఇతర కంటెస్టెంట్స్ కూడా నిర్వాహకులు, జడ్జిలపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ట్విస్ట్ ఇచ్చిన ఉప్పల్ బాలు.. అయితే, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పల్ బాలు పోస్ట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. జడ్జిలపై విమర్శలను పక్కన పెట్టి, ఈసారి ఆయన బిగ్‌బాస్ నిర్వాహకులకు, హోస్ట్ నాగార్జునకు నేరుగా ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. "ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి.. దయచేసి నన్ను తీసుకోండి" అంటూ ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానైనా

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియను బహిష్కరిస్తూ అధికార కూటమి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.మండలి ఛైర్మన్ మోషేనురాజు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియను చేపట్టగానే, టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో వైసీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే మిగిలారు. వైసీపీ తరఫున మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఛైర్మన్ ప్రకటించారు.అనంతరం పలువురు సభ్యులు 'జై జగన్' అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడిపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం వివాదాస్పదమైంది. అయితే, ఆ తర్వాత ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్‌ను కోరారు.కూటమి సభ్యుల వాకౌట్‌పై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధమని, రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో కక్షలు ఉండకూడదని, సభా గౌరవాన్ని కాపాడాలని హితవు పలికారు. ఎన్నిక ముగిసిన అనంతరం, నూతన డిప్యూటీ ఛైర్మన్ మాధవరావు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు. సోమవారం హుండీ ఆదాయం: రూ.6.12 కోట్లు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,905 తలనీలాలు సమర్పించినవారు: 33,539 ఈ వార్తలు కూడా చదవండి: యూఎస్‌కు తగ్గని భారత్ ఎగుమతులు హోటల్లో అగ్ని ప్రమాదం.. 9మంది మృతి Read Latest AP News And Telangana News And International News And Telugu News

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి, ఆగస్టు 19: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ఎప్పటికప్పుడు గాలింపు చర్యలకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ ఉండాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన కోనసీమ జిల్లాలోని మత్స్యకారుల గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు బుధవారం ఆరా తీశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్‌గా సమావేశమయ్యారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. గాలింపు చర్యలు ఏ మేరకు జరుగుతున్నాయని వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్స్, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారని సీఎంకు వారు వివరించారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఇప్పటికే రెండు డార్నియర్ విమానాలు, నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టామని ఉన్నతాధికారులు వివరించారు. పారాదీప్‌కు 14 నాటికల్ మైళ్ల దూరంలో కొన్ని పడవలను గుర్తించామని.. వాటి గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలపై కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్

ఏపీలో కీలకమైన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్ పర్సన్లను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకునేందుకు మార్గం సుగమం అయింది. గతంలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2005లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు నిన్న కేబినెట్లో ఆమోదించిన బిల్లును ఇవాళ అసెంబ్లీలో (AP Assembly)ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో మున్సిపల్ చట్టంలో సవరణలు రానున్నాయి.మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని మంత్రి నారాయణ ఈ బిల్లుపై మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు బలమైన ప్రజామోదం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల మేయర్ లేదా చైర్మన్‌పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదన్నారు. తొలి రోజే మండలి డిప్యూటీ ఛైర్మన్ కు కూటమి షాక్..! బొత్స ఫైర్..!ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది పనికొస్తుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం చేసుకుంటూ పనులను

ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్ (Gaddar) అని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) కొనియాడారు. హైదరాబాద్‌లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ డాక్యుమెంటరీ పోస్టర్ (Documentary poster)ను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దర్ వంటి మహనీయుడి డాక్యుమెంటరీ తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అభినందనీయం. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కుమార్తె, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల (Vennela), చిత్ర నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అమరావతి, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి పూర్తి వివరాలను పై వీడియోలో వీక్షించండి
ఉసిరికాయల్లోని విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల జుట్టు రాకుండా కాపాడుతాయి. దీనికోసం ప్రతిరోజూ ఉసిరి తినడం లేదా ఉసిరి జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి. జుట్టుకు నల్ల రంగు అందించే పిగ్మెంట్ ఉత్పత్తిని పెంచడంలో కరివేపాకు సహాయపడుతుంది. దీనికోసం మీ ఆహారంలో కరివేపాకు ఎక్కువగా చేర్చుకోండి. అలాగే మీరు ఉపయోగించే నూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడి వేసి గోరువెచ్చగా ఉన్నపుడు తలకు రాసుకోండి. గంట తర్వాత తలస్నానం చేస్తే మంచిది. జుట్టుకు నలుపు రంగు ఇచ్చే మెలనిన్ ఉత్పత్తికి ఐరన్ కాపర్ చాలా అవసరం. ఈ పోషకాలు నల్ల నువ్వుల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెల్ల జుట్టు నివారణకు రోజూ ఒక స్పూన్ నల్ల నువ్వులు తీసుకోండి. తెల్ల జుట్టు తొందరగా రావడానికి విటమిన్ బి6, బి12 లోపం కూడా ఓ కారణం. అందుకే ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే అరటి పండు, పాల పదార్థాలు, కోడిగుడ్లు ఎక్కవగా తీసుకోండి. ఇవి తెల్ల జుట్టు రాకను ఆలస్యం చేస్తాయి. నల్లటి జుట్టు కోసం కాపర్ చాలా అవసరం. అందుకోసం ఈ కాపర్ ఎక్కువగా లభించే బాదం, జీడిపప్పు, శనగలు వంటివి ఎక్కువగా తీసుకోండి. కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపర్చి తెల్ల జుట్టు రాకుండా కాపాడటంలో ఆయిల్ మసాజ్ సహాయపడుతుంది. దీనికోసం కొబ్బరి నూనెలో భృంగరాజ్ ఆకులు వేసి మరిగించి తలకు రాసుకోండి. గంట తర్వాత తలస్నానం చేయండి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి ఒత్తిడి ప్రధాన కారణం. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోండి. దీనికోసం ప్రతిరోజూ కాసేపు ధ్యానం, యేగా చేయండి. స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తాగితే శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి పెరిగి తెల్ల జుట్టు వస్తుంది. అందుకే ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. జుట్టుకు కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రోడక్టులు వాడకండి. ముఖ్యంగా సల్ఫేట్ ఫ్రీ షాంపూ, కండిషనర్ వాడడం మంచిది

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు అన్ని పార్టీల సభ్యులు కలిసి రావాలని మండలి చైర్మన్ కోరారు. అయితే కూటమి పార్టీలకు చెందిన సభ్యులు చైర్మన్ సీటు వద్దకు రాలేదు. దీంతో వారి తీరుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, అన్ని పార్టీల సభ్యులు కలిసి కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం సభా సంప్రదాయంలో భాగమని చైర్మన్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అయితే కూటమి సభ్యులు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటంపై మండలిలో చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాధవరావు డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో డిప్యూటీ చైర్మన్‌గా మాధవరావు ఎన్నిక కావడం పట్ల వైఎస్సార్సీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మాధవరావు ఎన్నికతో మండలి డిప్యూటీ చైర్మన్ పదవి వైఎస్సార్సీపీకి దక్కింది. అనంతరం సభలో బొత్స మాట్లాడుతూ..‘అన్ని పక్షాలను సమదృష్టితో చూడాలని కోరుకుంటున్నా. డిప్యూటీ చైర్మన్‌ను చైర్‌పై కూర్చోబెట్టడానికి అధికార పార్టీ రాకపోవడం దురదృష్టం. మంత్రులు సభ రూల్స్ గురించి చెప్తున్నారు.. డిప్యూటీ చైర్మన్‌కి గౌరవం ఇవ్వరా?. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా జరగలేదు. ప్రజలు చూస్తున్నారు.. చైర్ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజం. సభా సాంప్రదాయాలు, గౌరవాలు శాశ్వతం. వెన్నుపోటు పార్టీ తీరు మరోసారి రుజువైంది. రాబోయే రోజుల్లో ఇలాంటి అగౌరవ ఘటనలు జరగకూడదు. మంత్రులు రూల్స్ బుక్స్ పట్టుకుని నీతులు చెప్పడం కాదు. విలువలు, సాంప్రదాయాలు

ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికలు పెను మార్పును తెచ్చాయి. అప్పటివరకూ 150కి పైగా ఎమ్మెల్యేలతో దుర్బేద్యంగా కనిపించిన వైసీపీ (YSrCP) కాస్తా ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లకు పడిపోయింది. అదే సమయంలో శాసనమండలిలో (AP Legislative Council) మాత్రం 50 ఎమ్మెల్సీలు ఉండటంతో పటిష్టంగా కనిపించింది. అయినా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో.. మండలిపై వైసీపీ పట్టు కొనసాగించడం అంత సులువు కాదని అంతా భావించారు. కానీ రెండున్నరేళ్ల పాలన తర్వాత కూడా కూటమి మండలిపై పట్టు సాధించడంలో విఫలం కాగా.. వైసీపీ మాత్రం అదే పట్టు కొనసాగిస్తుండటం విశేషం.ఆ జిల్లాకు చంద్రబాబు పేరు..? సర్కార్ కు టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్ ..!ఈ నేపథ్యంలో తాజాగా మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వచ్చింది. గతంలో వైసీపీ మండలి ఛైర్మన్ గా గెలిపించుకున్న జకియా ఖానం.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. అయినా ఛైర్మన్ రూపంలో కొయ్యే మోషేన్ రాజు ఉండటంతో కూటమి ఫిరాయింపులు రాజకీయాలు పనిచేయలేదు. వైసీపీ నుంచి కూటమిలోకి ఆరుగురు ఎమ్మెల్సీలు ఫిరాయించినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మోషన్ రాజు సైలెంట్ గా ఉండిపోవడంతో చంద్రబాబు కూడా చేసేదేమీ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్ధితుల్లో జకియా ఖానం పదవీకాలం ముగిసిపోయి మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రావడంతో కూటమి కచ్చితంగా అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకుంటుందని అంతా భావింంచారు. కానీ ఇక్కడా సీన్ రివర్స్ అయింది. ఏపీ మండలి ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం? ఒకే ఒక్క నామినేషన్ ..!వైసీపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నిలబెట్టిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుకు పోటీగా కూటమి నుంచి అభ్యర్దిని నిలబెట్టలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ కాబోతున్నారు. దీంతో మండలిలో ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు, విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ తర్వాత మూడో కీలక పదవిలోనూ మరో వైసీపీ

కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ నియామకాలలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)... బెంగళూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యోగ నియామకాలలో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించారు. కర్ణాటక రాజధాని బెంగళూరు, పలు జిల్లాలు, గుజరాత్‌లోని అహ్మదాబాద్ సహా మొత్తం 21 చోట్ల ఏకకాలంలో మంగళవారం దాడులు జరిపారు. కేపీఎ్‌ససీ కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. ఈ వ్యవహారంలో కేపీఎ్‌ససీ చైర్మన్ శివశంకరప్ప సాహకార్ సస్పెండైన విషయం తెలిసిందే. శివశంకరప్ప ఉంటున్న డాలర్స్ కాలనీలోని ఇల్లు, కలబురగి జిల్లా ఆళందలోని నివాసంపైనా, కేపీఎ్‌ససీ ద్వారా వెటర్నరీ ఆఫీసర్ ఉద్యోగాలు పొందిన పలువురి నివాసాలపైనా ఈడీ దాడులు జరిపింది. కేపీఎ్‌ససీ ఆధ్వర్యంలో జరిగిన పశువైద్యాధికారుల నియామకంలో ఒక్కో అభ్యర్థి నుంచి శివశంకరప్ప రూ.70-80 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, కేపీఎ్‌ససీ చైర్మన్ శివశంకరప్ప సాహుకార్‌ను సస్పెండ్ చేస్తూ గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం
తరుచూ రసాయనాలతో నిండిన షాంపూ ఉపయోగించడం వల్ల తల చర్మం పీహెచ్ దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి రాస్తే తల చర్మం పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. నీటిలో కలిపిన యాపిల్ సైడర్ను తలకు రాయడంతో తలపై మలినాలు తొలగుతాయి. తలపై మిగిలిపోయిన స్టైలింగ్ ఉత్పత్తులు, షాంపూ ఉత్పత్తులను యాపిల్ సైడర్ వెనిగర్ తొలగిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ఎసిటిక్ ఆమ్లం జుట్టుకు మెరుపును అందిస్తుంది. వెనిగర్ రాస్తే నల్లని మెరిసే కురులు ఈ సొంతం అవుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దురద కంట్రోల్ అవుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ని అప్లై చేయడంతో స్కాల్ఫ్ దగ్గర చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక నూనె ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో జిడ్డు ఉండదు. చర్మంపై ఈస్ట్ ఎక్కువగా పెరగడం వల్ల వచ్చే చుండ్రును యాపిల్ సైడర్ వెనిగర్ తగ్గిస్తుంది. దీంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ రాయడం వల్ల హెయిర్ ఉపరితలం మృదువుగా మారుతుంది. దీంతో దువ్వడం ఈజీ అవుతుంది. చిక్కులు తొలగుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ క్యూటికల్స్ పొరను కాపాడుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. కుదుళ్లు బలంగా మారుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వెనిగర్‌ను నీటిలో కలిపి డైల్యూట్ చేసి వాడాలి. గాయాలు అయినచోట రాయవద్దు

ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2047 నాటికి ఏపీ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ సుసంపన్నం కోసం ఏపీ గ్రీన్ సొసైటీకికార్యనిర్వాహక కమిటీ, జిల్లాస్థాయిలో జిల్లా హరిత అభివృద్ధి సంస్థల (డీజీడీఏ) పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైన నాగబాబుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047లో భాగంగా ‘50 శాతం గ్రీన్ కవర్’ సాధించే లక్ష్యాన్ని నాగబాబు సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆకాంక్షించారు. అటవీ విస్తీర్ణం పెంపు, పునర్అటవీకరణ, పర్యావరణ పరిరక్షణ, హరితాంధ్ర నిర్మాణం వంటి కార్యక్రమాలు నాగబాబు నాయకత్వంలో మరింత వేగంగా, ఫలితాల దిశగా సాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ కీలక బాధ్యతలో ఆయన విజయవంతం కావాలన్నారు. నాగబాబును క్యాబినెట్ హోదాలో ఏపీ గ్రీన్ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మద్దతు తెలిపిన కూటమి పక్షాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ గ్రీన్ సొసైటీ లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. హరితాంధ్రప్రదేశ్ సాధన కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో కూడిన కీలక పదవి దక్కిన అనంతరం జనసేన నేత నాగబాబు తొలిసారిగా స్పందించారు. ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా తనను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తన సోదరుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నాగబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పదవిని కేవలం ఒక ప్రొటోకాల్‌గా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం అప్పగించిన గురుతర బాధ్యతగా భావిస్తున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. మొక్కలు నాటడం తన జీవనశైలిలో ఒక భాగమని వెల్లడించిన ఆయన, ఈ నూతన బాధ్యతతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యవంతంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని నాగబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం తన వంతుగా పూర్తి స్థాయిలో శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు,ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి దక్కింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబును ఏపీ ప్రభుత్వం నియమించింది. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నాగబాబును అభినందించారు. సతీమణితో కలిసి నాగబాబును సత్కరించారు. మెడలో పూలమాల వేసి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా నాగబాబుకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరోవైపు రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్)’ ఏర్పాటు చేసింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు పేరును నామినేట్ చేస్తూ ఏపీ పర్యావరణ, అటవీ శాఖ జీవో జారీ చేసింది. ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.గ్రీన్ కవర్‌ను మన రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని 2047 నాటికల్లా సాధించేందుకు ఏపీ గ్రీన్ పనిచేయనుంది. ఇందులో భాగంగా ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లాస్థాయి పాలక మండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కమిటీ ఛైర్మన్‌గా.. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో సమన్వయం, వేగవంతం చేయడం, పురోగతిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నాగబాబు నిర్వహించనున్నారు. మరోవైపు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో చంద్రబాబుప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇప్పుడు కేబినెట్ మంత్రి హోదాతో కూడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబును నియమించారు.మరి ముందు ముందు రోజులలో నాగబాబుకు మంత్రిగా అవకాశం దక్కుతుందా.. వేరొకరికి ఛాన్స్ ఉంటుందా

ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రీనింగ్, 'రీఫారెస్టేషన్' (పునరటవీకరణ) కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును (నాగేంద్రరావు) ( MLC Konidela Nagendra Babu) ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ నంబర్ -93 ద్వారా ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం, అడవుల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ఆయా కార్యక్రమాలను అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో ఫారెస్ట్, ట్రీ కవర్‌ను 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర గ్రీన్ లక్ష్యాల అమలు, సమన్వయం, పర్యవేక్షణలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొణిదెల నాగేంద్రబాబును నియమించిన ఏపీ సర్కార్.. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ నిబంధనలకు లోబడి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల కార్యకలాపాల సమర్థవంతంగా అమలు చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె

మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు పొడిబారడం, బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొడి జుట్టు తరచుగా చిట్లిపోవడం, గడ్డిలా చింపిరిగా మారడం జరుగుతుంది. ఈ సమస్యలకు సరళమైన, సమర్థవంతమైన పరిష్కారం కర్పూరం హెయిర్ మాస్క్.. ఇది జుట్టుకు అవసరమైన తేమను అందించి, ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్క్ ద్వారా.. జట్టు రాలడం తగ్గడంతోపాటు.. ఒత్తుగా పెరుగుతుంది. ఈ హెయిర్ మాస్క్ తయారీకి అవసరమైన పదార్థాలు: కర్పూరం, అలోవెరా జెల్, కాస్టర్ ఆయిల్ (ఆముదం), విటమిన్ ఇ ఆయిల్.. ముందుగా, కర్పూరాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. కర్పూరం స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మూసుకుపోయిన హెయిర్ ఫాలికల్స్‌ను తెరిచి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు చిట్లడం, బలహీనపడటం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలోవెరా జెల్, కాస్టర్ ఆయిల్, విటమిన్ ఇ ఆయిల్ జుట్టుకు పోషణను అందించి, తేమను నిలుపుకోవడానికి తోడ్పడతాయి. కర్పూరం, అలోవెరా జెల్, కాస్టర్ ఆయిల్ (ఆముదం), విటమిన్ ఇ ఆయిల్.. అన్ని పదార్థాలను కలిపి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, స్కాల్ప్‌కు పూర్తిగా పట్టించాలి. పది నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా అన్ని కాలాలలో జుట్టు పొడిబారకుండా ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే కర్పూరం నేరుగా స్కాల్ప్‌పై ఉపయోగించడం వల్ల కొందరికి చికాకు లేదా అలర్జీ కలగవచ్చు కాబట్టి ముందుగా చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బెంగళూరు: బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ)కి చెందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఆగస్టు 15న సంయుక్త ప్రకటన విడుదల చేశారు. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆహ్వానాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. నల్సార్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని నల్సార్ విశ్వవిద్యాలయానికి చెందిన 2026 గ్రాడ్యుయేట్ల ఎన్‌రోల్‌మెంట్‌ను రాష్ట్ర బార్ కౌన్సిళ్లు నిలిపివేయాలని బీసీఐ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో ఆ ఉత్తర్వులను బీసీఐ అనంతరం ఉపసంహరించుకుంది. అయితే ఈ చర్య దేశవ్యాప్తంగా భావ ప్రకటన స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపిందని ఎన్ఎల్ఎస్ఐయూ విద్యార్థులు ఆరోపించారు. బాధ్యత వహించకుండా మిశ్రా హాజరుకావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, నల్సార్ వివాదంలో సీజేఐ హాజరును కూడా పునఃసమీక్షించాలని కోరుతున్నట్లు సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై 165 మంది గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు, 409 మంది ప్రస్తుత విద్యార్థులు, 128 మంది పూర్వ విద్యార్థులు సంతకాలు చేశారు. ఇది కూడా చదవండి: 4 నెలల్లో 22 మందికి మరణ శిక్ష.. యూపీ జడ్జి సంచలన తీర్పులు! విశాఖ : వెనక్కి వెళ్లిన సముద్రం ...ఆర్.కె బీచ్ లో సండే సందడి (ఫొటోలు) హైదరాబాద్ ఉప్పల్‌లో సినీనటి శ్రీలీల సందడి (ఫొటోలు) భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) వాడు మనిషేనా... మీ నాయకుడు ఇదే నేర్పాడా బోండా ఉమా నీకు... మాస్టర్ స్కెచ్.. CCTV దృశ్యాలు.. అసలు ఏం జరిగిందంటే.. తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ VS వైఎస్ఆర్ సీపీ నేతలు చింతమనేని కోసం సర్వం కోల్పోయాం.. భాను ప్రకాష్

కాజు తింటే లావవుతారా? ప్రతిరోజూ మితంగా తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే!కాజు తింటే లావవుతారా? ప్రతిరోజూ మితంగా తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే! August 16 Jyothi Gadda బరువు నియంత్రణ: జీడిపప్పులోని ప్రోటీన్లు, ఫైబర్ కడుపును నిండుగా ఉంచి అతిగా తినకుండా నిరోధిస్తాయి. దీనిలోని మంచి కొవ్వులు జీవక్రియను పెంచి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యం: కాజులో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు అదుపు: జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను ప్రశాంతపరచి, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి గుండెను సురక్షితంగా ఉంచుతుంది. ఎముకల దృఢత్వం: కాజులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, ఎముకలు బలహీనపడకుండా మరియు ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తి: జీడిపప్పులో ఉండే జింక్, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కలిగిస్తాయి. మెదడు పనితీరు: కాజులో ఉండే లినోలెయిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు కణాల ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. మెరిసే చర్మం: జీడిపప్పులో కాపర్ (రాగి), జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తాయి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. జుట్టు ఆరోగ్యం: కాజులోని రాగి పదార్థం జుట్టుకు సహజమైన నలుపు రంగును ఇచ్చే మెలానిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే ఐరన్, జింక్ వల్ల కుదుళ్లు బలంగా మారి జుట్టు ఊడటం తగ్గుతుంది. కంటి చూపు: జీడిపప్పులో లుటీన్, జీజాంతిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికారక కాంతి నుంచి కళ్లను కాపాడి, వయస్సుతో వచ్చే కంటి సమస్యలను
.webp)
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా మరొక ఘటన వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. అలిపిరి మెట్ల మార్గంలో ఒక వ్యక్తి యథేచ్ఛగా సిగరెట్ తాగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో భక్తులు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల కొండకు కాలినడకన వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో దాదాపు 2,600వ మెట్టు సమీపంలో ఒక వ్యక్తి కూర్చొని ధూమపానం చేస్తున్న వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. తిరుమల పరిసరాల్లోకి సిగరెట్లు, బీడీలు వంటి నిషేధిత వస్తువులు ఎలా వస్తున్నాయంటూ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై టీటీడీ యంత్రాంగాన్ని వైసీపీ తీవ్రస్థాయిలో నిలదీసింది. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భద్రత మరియు తనిఖీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ తీవ్రంగా విఫలమయ్యాయని ఆరోపించింది. ప్రత్యేకంగా టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడును లక్ష్యంగా చేసుకుంటూ విపక్షాలు ఘాటు విమర్శలు గుప్పించాయి. తనకు ఇతర వ్యాపారాలు ఉన్నాయని, ఇదొక్కటే పని కాదని వ్యాఖ్యానించిన వ్యక్తిని దేవస్థానం ఛైర్మన్‌గా నియమించడం వల్లే ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోందని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల నమ్మకాలను దెబ్బతీసేలా అలిపిరి తనిఖీ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బంది తీరు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిషేధిత వస్తువులు కొండపైకి రాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టడంలో టీటీడీ భద్రతా విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ రకమైన ఘటనలు ఆధ్యాత్మిక వాతావరణానికి హాని కలిగిస్తాయని, తిరుమల క్షేత్ర మహత్యాన్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా తనిఖీలను తక్షణమే సమీక్షించాలని డిమాండ్ చేశారు. తాజా ఘటనపై సాధారణ భక్తుల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలతో పాటు కొండపై ప్రతిపాదిత తనిఖీ వ్యవస్థను మరింత కఠినతరం చేయాలని

కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..!కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..! August 15 Jyothi Gadda జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయాన్నే పచ్చి కరివేపాకులను బాగా నమలి తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర అదుపు: కరివేపాకులో ఉండే ప్రత్యేక పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయం: కరివేపాకులో ఉండే ఇథైల్ అసిటేట్, మహనింబిన్ వంటి రసాయనాలు శరీరంలో కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కరివేపాకులో విటమిన్- బి, సి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు తగిన పోషణను అందించి జుట్టు రాలడాన్ని అరికడతాయి. క్రమంగా ఒత్తైన, నల్లని దృఢమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇందులో విటమిన్- ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఉదయాన్నే కరివేపాకు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రేచీకటి, కంటి పొడిబారడం వంటి సమస్యల నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇవి కాలేయాని కి రక్షణగా నిలిచి దాని పనితీరును మరింత చురుగ్గా మారుస్తాయి. కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున నమలడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరిగి, అనిమియా లేదా రక్తహీనత సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు చేరకుండా కరివేపాకులోని భాగాలు నిరోధిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ttd chairman br naidu big alert to Tirumala devotees: కలియుగ దైవం, తిరుమల శ్రీవారిని దర్శించుకొవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఒకవైపు సెలవులు, లాంగ్ వీకెండ్ కూడా కలిసి రావడంతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్ లలో వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో విపరీతమైన భక్తులు రద్దీతో టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో .. భక్తులు తిరుమల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తమ యాత్రను ముందుగా ప్లాన్ చేసుకొవాలన్నారు. దర్శన సమయంలో సంయమనం పాటిస్తూ, టీటీడీ సిబ్బందికి సహకరించాలని కోరారు. వీకెండ్ కావడంతో కంపార్ట్ మెంట్ లు అన్ని భక్తులతో నిండిపోయి, వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరాయన్నారు. ప్రస్తుతం దర్శన టికెట్లు, టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి సుమారు 18 నుంచి 20 గంటల సమయం పడుతోందని వెల్లడించారు. భక్తులకు అవసరమైన అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సేవలుశ్రీవారి సేవకులతో టీటీడీ నిరంతరాయంగా అందిస్తోందన్నారు. కేవలం మూడు రోజుల్లో దాదాపు 33 వేల వాహనాలు తిరుమలకు వచ్చాయని టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు. దీంతో కాలుష్య నియంత్రణ అత్యంత అవసరమని టీటీడీ భావిస్తోందన్నారు. Read more: Manasa Varanasi: హీరోయిన్‌తో సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తులు.. ఒకర్ని మరోకరు నెట్టుకుంటూ.. వీడియో వైరల్... టీటీడీ దాతల సహకారంతో తిరుమలలో మరో

Chevella: మున్సిపాలిటీలో స్వాతంత్య్ర వేడుకలు జెండా ఎగురవేసిన చైర్పర్సన్! Chevella: చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్మన్ దేవర సమత వెంకట్ రెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ. మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..మన దేశానికి స్వాతంత్ర్యం ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితం. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదు. యువత దేశానికి వెన్నెముక. విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సేవా భావాన్ని అలవర్చుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు రావాలని చేవెళ్ల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని యువత మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని, నూతన ఆలోచనలతో దేశ ప్రగతికి బాటలు వేయాలి,స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు మనందరం ఐక్యంగా కృషి చేద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు,వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన శ్రీధర్ వర్మ టీటీడీ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన శ్రీధర్ వర్మ టీటీడీ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్రను, తిరుపతి జేఈఓ శరత్‌ను కలిసి శ్రీధర్ వర్మ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యుడు సంతారావును కూడా శ్రీధర్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకే శ్రీధర్ వర్మను చైర్మన్‌గా నియమించినట్లు టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ఎస్వీబీసీని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో శ్రీధర్ వర్మ కీలకంగా వ్యవహరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో ఛానల్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీధర్ వర్మ ఈ నెల 22న ఎస్వీబీసీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు

టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, టీటీడీ తిరుపతి జేఈవో శరత్ గారిని కలిసి నియామక పత్రాన్ని అందుకున్న టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ – అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని, టీటీడీ బోర్డు సభ్యులు సంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ* శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన శ్రీధర్ వర్మ గారు, టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, టీటీడీ తిరుపతి జేఈవో శరత్ గారిని కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు గారు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు గారు, తదితరులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు గారు శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ ముద్దాడ రవిచంద్ర గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్‌గా నియామక పత్రాన్ని శ్రీధర్ వర్మ అందుకున్నారు. అనంతరం అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని, టీటీడీ బోర్డు సభ్యులు సంతారావు గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకు శ్రీధర్ వర్మను చైర్మన్‌గా నియమించినట్లు ఎండీ ముద్దాడ రవిచంద్ర గారు తెలిపారు. ఆయన నాయకత్వంలో ఎస్వీబీసీ మరింత అభివృద్ధి సాధించి, కొత్త శిఖరాలను చేరుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్ వర్మ గారు ఈ నెల 22వ తేదీన టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్‌గా అధికారికంగా ప్రమాణ శ్రీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కుదుళ్లలో నేచురల్ ఆయిల్స్ తగ్గిపోతాయి. దీంతో తల పొడిబారిపోయి జుట్టు బలహీనంగా మారుతుంది. తద్వారా జుట్టు పల్చబడుతుంది. అందుకే వీలైనంత వరకు గోరువెచ్చని లేదా చల్లటి నీళ్లతో తలస్నానం చేయడం మేలు. తలస్నానం చేశాక కొంతమంది జుట్టు ఆరడం కోసం టవల్‌తో గట్టిగా రుద్దుతుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి వెంట్రుకలు తెగిపోతాయి. దీంతో జుట్టు పల్చగా మారుతుంది. అందుకే టవల్‌ను నెమ్మదిగా ఉపయోగించడం మేలు. కొంతమంది సమయం లేదని తడి జుట్టుతోనే దువ్వుతుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు తొందరగా తెగిపోయి పల్చగా మారుతుంది. అందువల్ల వీలైనంత వరకు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వడం మేలు. షాంపూ, కండిషనర్ వంటి వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటే అవి కుదుళ్లకు హాని చేస్తాయి. తద్వారా జుట్టు బలహీనపడి రాలుతుంది. అందుకే వీలైనంత వరకు కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ప్రోడక్టులు ఉపయోగించడం మేలు. హెయిర్ స్టైటెనర్, కర్లింగ్ ఐరన్, హెయిర్ డ్రైయర్ వంటి హీట్ స్టైలింగ్ పరికరాలు ఉపయోగించడం వల్ల ఆ వేడికి జుట్టు తొందరగా డ్యామేజ్ అవుతుంది. దీంతో జుట్టు పల్చగా మారుతుంది. పోనీ టైయిల్, బన్ వంటి టైట్ హెయిర్ స్టైల్స్ వల్ల కుదుళ్లపై రాపిడి పెరిగి జుట్టు పల్చగా మారుతుంది. అందుకే వీలైనంత వరకు లూజ్ హెయిర్ స్టైల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కొంతమంది వారం వరకు తలస్నానం చేయకుండా ఉంటారు. ఇలా చేస్తే జుట్టు కుదుళ్లలో మురికి, జిడ్డు పేరుకుపోయి జుట్టు రాలుతుంది. అందుకే కనీసం వారానికి 2-3 సార్లు తలస్నానం చేయాలి. అలాగే వారంలో రెండుసార్లు గోరువెచ్చని నూనెతో తలకు మర్దన చేసుకోవాలి. జంగ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అందుకే జుట్టు ఆరోగ్యానికి సహాయపడే జింక్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. దీంతో జుట్టు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. N Chandrasekar TATA Sons : రెండు దఫాల్లో సంస్థకు సారథిగా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసేందుకు ఆరునెలల వ్యవధి ఉన్నప్పటికీ.. బోర్డు సమావేశానికి ముందే పదవినుంచి తప్పుకుంటామని ప్రకటించారు. సంస్థాగతంగా ఉద్యోగులు, కార్మికులు ఖంగుతిన్నారు. ఆ సంస్థలో ఛైర్మన్ రాజీనామాతో కుదుపులు.. స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపాయి. టాటా సన్స్ సంస్థలో ఎందుకు విభేదాలు వచ్చాయి? ఛైర్మన్ పదవినుంచి ఆయన ఎందుకు తప్పుకోవాల్సివచ్చిందనే దానిపై అందరు చర్చించుకుంటున్నారు. ఇంతకీ టాటా సన్స్ లో ఏమి జరుగుతోందనేది కార్పోరేట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా సన్స్ లో అభిప్రాయ భేదాలు బెడిసి కొట్టాయి. పదేళ్లపాటు టాటా సన్స్ కు సారథ్యం వహించిన చంద్రశేఖరన్ నిర్ణయం… ఆ సంస్థలో ప్రకంపనలు సృష్టించింది. 2027 ఫిబ్రవరితో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే.. ఆ తర్వాత తన పునర్నియామకం ఉండబోదని.. గడువు పూర్తయ్యే వరకు కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. బోర్డు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలతో తన నాయకత్వానికి మద్ధతు లభించలేదని టాటా సన్స్ ఛైర్మన్ పదవినుంచి చంద్రశేఖరన్ తప్పుకుంటామని ప్రకటించారు. ఆరు నెలల పదవీ కాలం ముందే ఆయన సంచలన ప్రకటన చేశారు. మాములు ఉద్యోగి నుంచి చైర్మన్ దాకా.. చంద్రశేఖరన్ టాటా గ్రూప్ లో 1987లో చిన్న ఉద్యోగిగా చేరారు. అక్కడినుంచి ఆయన అంచలంచెలుగా ఎదిగారు. టాటా సన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖరన్.. 2009లో టీసీఎస్ సీఈఓగా

Jammikunta: జమ్మికుంటలో 500 అడుగుల జాతీయ జెండాతో భారీ 'తిరంగా' ర్యాలీ! ఈ వార్తకు సంబంధించిన

హైదరాబాద్‌లోని నాగోల్ ఎక్స్‌రోడ్‌లో త్రిరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తిగా మట్టితోనే 72 అడుగుల భారీ ఎకో-ఫ్రెండ్లీ మహా గణపతి తయారవుతోంది. శ్రీ అష్టసిద్ధి మహా గణపతి పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను పూర్తిగా తొలగించి, ప్రకృతి స్నేహపూర్వక సందేశం ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. నగరంలో వినాయక చవితి అనగానే సాధారణంగా ఖైరతాబాద్ బడా గణేశుడే గుర్తుకు వస్తాడు, కానీ ఈసారి నాగోల్ మట్టి గణేశుడు అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. త్రిరంగ్ యూత్ అసోసియేషన్ గత పదేళ్లుగా కేవలం ఎకో-ఫ్రెండ్లీ వినాయకులనే పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేస్తోంది. గతేడాది 63 అడుగుల విశ్వసేన మహా గణపతిని ఏర్పాటు చేసిన నిర్వాహకులు, ఈసారి మరింత ఉత్సాహంతో విగ్రహం ఎత్తును 72 అడుగులకు పెంచారు. అసోసియేషన్ అధ్యక్షులు సాయి తెలిపిన వివరాల ప్రకారం రాబోయే 30 రోజుల్లో ఈ నిర్మాణం పూర్తవుతుంది. పండగకు మూడు రోజుల ముందు నుంచే భక్తులు ఈ భారీ విగ్రహాన్ని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ విగ్రహ నిర్మాణంలో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన 21 మందికి పైగా నిపుణులైన శిల్పులు గత నెల రోజులుగా నిరంతరాయంగా నిమగ్నమయ్యారు. ప్రధాన విగ్రహం పైన ఏడు విభిన్న రూపాల్లో చిన్న గణేశ ప్రతిమలను కూడా వారు ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో ఐరన్ లేదా ఇతర మెటల్స్ ఏమీ ఉపయోగించకుండా కేవలం స్వచ్ఛమైన మట్టితోనే ఈ నిర్మాణం సాగుతుండటం విశేషంగా నిలిచింది. ఇదిలా ఉండగా పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని శిల్పి కొత్తకొండ నగేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో పీఓపీ విగ్రహాలు నీటి వనరులను కలుషితం చేస్తున్న నేపథ్యంలో, మట్టి విగ్రహాల అవశ్యకతపై యువతకు అవగాహన కల్పించడమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఫలితంగా మట్టి విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోయి జలాశయాలకు

ఇంటర్నెట్ డెస్క్: టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు నటరాజన్ చంద్రశేఖరన్ ప్రకటనతో టాటా గ్రూప్ నాయకత్వంలో మరోసారి అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు టాటా సన్స్ (Tata Sons) పగ్గాలను ఎవరు చేపడతారనేది కార్పొరేట్ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. కాగా.. ఈ పదవి రేసు (Tata Succession)లో టీవీ నరేంద్రన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈయన ఎవరు..? ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడితే.. ఆయన ముందున్న సవాళ్లేంటీ? 61 ఏళ్ల టీవీ నరేంద్రన్ (TV Narendran) ప్రస్తుతం టాటా స్టీల్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తదుపరి ఛైర్మన్‌గా ఈయన పేరును టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. నరేంద్రన్కే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కార్పొరేట్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీవీ నరేంద్రన్ తిరుచిలోని ఎన్ఐటీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత ఐఐఎం కలకత్తా నుంచి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన.. 1988లో టాటా గ్రూప్‌లో చేరారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇదే గ్రూప్‌లో పనిచేస్తున్నారు. తొలినాళ్లలో సేల్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి విభాగాల్లో పనిచేశారు. ఆగ్నేయ ఆసియాలో టాటా స్టీల్‌ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. 2013లో టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నరేంద్రన్.. ఆ తర్వాత సీఈఓగా పదోన్నతి పొందారు. కాగా.. తదుపరి ఛైర్మన్ రేసులో ఈయనతో పాటు నోయెల్ టాటా, సౌరభ్ అగర్వాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రశేఖరన్ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. అప్పటిలోగా కొత్త ఛైర్మన్‌ను టాటా సన్స్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్‌కు మూడు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్ విభాగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా నష్టాలు దాదాపు రెండు రెట్లు పెరిగి రూ.22,238 కోట్లకు చేరాయి. అహ్మదాబాద్

టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకూ ఉన్నప్పటికీ తక్షణ నిష్క్రమణకు గల కారణాలు, కొత్త నాయకత్వ ఎంపిక గురించి చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. ఆంధ్రజ్యోతి, ఆగస్టు 12: ఆగస్టు 18న జరగనున్న టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశానికి (AGM) ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియాల్సి ఉంది. ఈ సందర్భంగా తన రాజీనామాకు గల కారణాలు, కొత్త నాయకత్వ ఎంపిక గురించి చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. మరో దఫా పొడిగింపునకు నిరాకరణ: ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత టాటా సన్స్ ఛైర్మన్‌గా తిరిగి కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, ఈ విషయాన్ని బోర్డుకు స్పష్టం చేశానని చంద్రశేఖరన్ తెలిపారు. ఐకమత్యం కొరవడటమే కారణం: ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయి. అయితే బోర్డులోని ఒక సభ్యుడు దీనిని వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవ మద్దతు లభించలేదని వివరించారు. ఆరు నెలలుగా పెండింగ్‌లోనే స్పష్టత: ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేశానని, అయితే గత ఆరు నెలలుగా ఈ విషయమై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేకపోయారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు వ్యూహాత్మక ప్రాజెక్టుల దృష్ట్యా: ప్రస్తుతం టాటా గ్రూప్ అనేక కీలక ప్రాజెక్టులను అమలు చేస్తోందని, ఇలాంటి కీలక సమయంలో సంస్థ పురోగతికి, ఉద్యోగులు, పెట్టుబడిదారుల నమ్మకానికి నాయకత్వంపై స్పష్టత ఉండటం చాలా అవసరమని స్పష్టం చేశారు. త్వరితగతిన కొత్త నాయకత్వ ఎంపిక: సంస్థలో నాయకత్వ మార్పిడి సునాయాసంగా జరిగేందుకు వీలుగా, వెంటనే తదుపరి ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని టాటా సన్స్ బోర్డును చంద్రశేఖరన్ కోరారు