
తరుచూ రసాయనాలతో నిండిన షాంపూ ఉపయోగించడం వల్ల తల చర్మం పీహెచ్ దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి రాస్తే తల చర్మం పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది.
నీటిలో కలిపిన యాపిల్ సైడర్ను తలకు రాయడంతో తలపై మలినాలు తొలగుతాయి. తలపై మిగిలిపోయిన స్టైలింగ్ ఉత్పత్తులు, షాంపూ ఉత్పత్తులను యాపిల్ సైడర్ వెనిగర్ తొలగిస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ఎసిటిక్ ఆమ్లం జుట్టుకు మెరుపును అందిస్తుంది. వెనిగర్ రాస్తే నల్లని మెరిసే కురులు ఈ సొంతం అవుతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దురద కంట్రోల్ అవుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌ని అప్లై చేయడంతో స్కాల్ఫ్ దగ్గర చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక నూనె ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో జిడ్డు ఉండదు.
చర్మంపై ఈస్ట్ ఎక్కువగా పెరగడం వల్ల వచ్చే చుండ్రును యాపిల్ సైడర్ వెనిగర్ తగ్గిస్తుంది. దీంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ రాయడం వల్ల హెయిర్ ఉపరితలం మృదువుగా మారుతుంది. దీంతో దువ్వడం ఈజీ అవుతుంది. చిక్కులు తొలగుతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ క్యూటికల్స్ పొరను కాపాడుతుంది. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. కుదుళ్లు బలంగా మారుతాయి.
యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వెనిగర్‌ను నీటిలో కలిపి డైల్యూట్ చేసి వాడాలి. గాయాలు అయినచోట రాయవద్దు.





