
హాయ్ బ్రో.. గుడ్ మాణింగ్. వచ్చే దారంతా చెరువులు ఎండి బావురుమంటున్నాయి. భూములు బీళ్లై నోళ్లు తెరిచాయి. పెట్టిన పంటలు నిలువునా ఎండి మోడులే మిగిలాయి. ఎటుచూసినా కరువు విలయతాండవం. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా డస్సిపోయిన జనం. దానికి మమ్మేం చేయమంటావు, విధి రాత, మా ఖర్మ అంటావా.




