
ఎటుచూసినా చవితి హడావిడే.యువత సందడే.వీధికో రూపంలో ఏర్పాటు చేసిన విఘ్న నాయకుడి పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఆదివారం బజార్లన్నీ వినాయకుడి ప్రతిమల, పూజా సామగ్రి కొనుగోళ్లతో కిక్కిరిసిపోయాయి. సామూహిక పూజలతో పాటు ఇంటింటా కొలువుదీర్చిన వినాయకులకు కూడా పూజాపునస్కారాలకు అంతా సిద్ధమయ్యారు.




