
మారుతున్న జీవనశైలి, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు పొడిబారడం, బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొడి జుట్టు తరచుగా చిట్లిపోవడం, గడ్డిలా చింపిరిగా మారడం జరుగుతుంది. ఈ సమస్యలకు సరళమైన, సమర్థవంతమైన పరిష్కారం కర్పూరం హెయిర్ మాస్క్.. ఇది జుట్టుకు అవసరమైన తేమను అందించి, ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మాస్క్ ద్వారా.. జట్టు రాలడం తగ్గడంతోపాటు.. ఒత్తుగా పెరుగుతుంది.
ఈ హెయిర్ మాస్క్ తయారీకి అవసరమైన పదార్థాలు: కర్పూరం, అలోవెరా జెల్, కాస్టర్ ఆయిల్ (ఆముదం), విటమిన్ ఇ ఆయిల్..
ముందుగా, కర్పూరాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. కర్పూరం స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
మూసుకుపోయిన హెయిర్ ఫాలికల్స్‌ను తెరిచి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు చిట్లడం, బలహీనపడటం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
అలోవెరా జెల్, కాస్టర్ ఆయిల్, విటమిన్ ఇ ఆయిల్ జుట్టుకు పోషణను అందించి, తేమను నిలుపుకోవడానికి తోడ్పడతాయి.
కర్పూరం, అలోవెరా జెల్, కాస్టర్ ఆయిల్ (ఆముదం), విటమిన్ ఇ ఆయిల్.. అన్ని పదార్థాలను కలిపి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు, స్కాల్ప్‌కు పూర్తిగా పట్టించాలి.
పది నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా అన్ని కాలాలలో జుట్టు పొడిబారకుండా ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి ఈ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
అయితే కర్పూరం నేరుగా స్కాల్ప్‌పై ఉపయోగించడం వల్ల కొందరికి చికాకు లేదా అలర్జీ కలగవచ్చు కాబట్టి ముందుగా చిన్న ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Found this helpful?
Share this story with your network







