
Green Cards: EB1 గ్రీన్ కార్డ్లకుబ్రేక్? సెప్టెంబర్ 30 నాటికి కోటా ఖాళీ!
Green Cards: EB1 గ్రీన్ కార్డ్‌లకు బ్రేక్? సెప్టెంబర్ 30 నాటికి కోటా ఖాళీ!

Green Cards: EB1 గ్రీన్ కార్డ్‌లకు బ్రేక్? సెప్టెంబర్ 30 నాటికి కోటా ఖాళీ!

చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కాప్రా, శాంతివిహార్ కాలనీ, గ్రీన్‌పార్క్, అశోక్ కాలనీ, రామ్దాస్నగర్ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు, లక్ష్మీపురం ఫీడర్ పరిధిలోని రుక్మిణీపురి, అయోధ్యనగర్, నయాక్రాంతినగర్, త్యాగరాయనగర్, లక్ష్మీపురం, బృందావన్ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, జనప్రియ ఫీడర్ పరిధిలోని జనప్రియ టౌన్‌షి్‌ప పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సైనిక్‌పురి సెక్షన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు. కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

అమెరికాలో గ్రీన్ కార్డ్ అందనంతదూరమేనా..? తాజా పరిణామాలు చూస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోంది. తమకలల నివాసానికి రాచబాట అయిన గ్రీన్ కార్డు కోసం ఐదేళ్లు, పదేళ్లు కాదు.. ఏకంగా వందల ఏళ్లు వెయిట్ చేయాల్సిన దారుణదుస్థితి దాపురించింది. అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వత నివాసం పొందాలనుకునే భారతీయులు.. ఏకంగా ..179 ఏళ్లపాటు వేచి చూడాల్సి రావొచ్చని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ (ఎన్ఎఫ్ఏపీ) తాజా అంచనా వెల్లడించింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో ఇతర దేశాల వారితో పోలిస్తే భారతీయులకే అత్యంత సుదీర్ఘ నిరీక్షణ ఉంటోందని తెలిపింది. డిసెంబరు 2025 నాటికి ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్ పెండింగ్ దరఖాస్తులు 12 లక్షలు దాటాయి. వీటిలో దాదాపు 10 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అంటే మొత్తం పెండింగ్ దరఖాస్తుల్లో భారతీయుల వాటా 79 శాతంగా ఉంది.జనవరి 2026 లేదా ఆ తర్వాత లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తు లేదా ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్ పిటిషన్ దాఖలు చేసిన భారతీయులకు ఈబీ-2 కేటగిరీలో గ్రీన్‌కార్డ్ రావడానికి 179 ఏళ్లు, ఈబీ-3లో 38 ఏళ్లు, ఈబీ-1లో 5 ఏళ్లు పట్టే అవకాశం ఉందని ఎన్ఎఫ్ఏపీ పేర్కొంది. అమెరికా చట్టాల ప్రకారం ప్రతి ఏడాది ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డులకు సుమారు 1.40 లక్షల పరిమితి ఉంది. ఇందులో ఉద్యోగితో పాటు అతడి కుటుంబ సభ్యులకూ గ్రీన్‌కార్డులు ఉంటాయి. మరోవైపు దేశాల వారీగా కూడా కోటా పరిమితులు ఉన్నాయి. జనాభా భారీగా ఉన్న భారత్ వంటి దేశాలకు చిన్న దేశాలతో సమానంగా పరిమిత సంఖ్యలో గ్రీన్‌కార్డులు లభిస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. చైనాకు చెందిన ఈబీ-2 దరఖాస్తుదారులకు సుమారు 25 ఏళ్ల నిరీక్షణ ఉండొచ్చని ఎన్ఎఫ్ఏపీ అంచనా వేసింది. చైనా ఈబీ-3 దరఖాస్తుదారులకు దాదాపు 7 ఏళ్ల సమయం పడొచ్చని తెలిపింది. భారతీయుల ఈబీ-2 క్యూ ఎలా పెరిగిందో గత గణాంకాలు కూడా చెబుతున్నాయి. 2016లో 47,601 మంది భారతీయుల ఈబీ-2

అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే ఆటోమేటిక్ పౌరసత్వం విషయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో సంచలన నిర్ణయానికి తెరదీస్తోంది. అమెరికాలో జన్మించిన చిన్నారులకు పాస్‌పోర్ట్ కావాలంటే ఇకపై కేవలం వారి బర్త్ సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు. దరఖాస్తు చేసుకునే సమయంలో తల్లిదండ్రులు కూడా తమ పౌరసత్వాన్ని లేదా అధికారిక ఇమ్మిగ్రేషన్ హోదాను కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుందనే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తోంది.బర్త్ టూరిజంకు చెక్ పెట్టడమే లక్ష్యం!కేవలం పిల్లలకు అమెరికా పౌరసత్వం సంపాదించడం కోసమే చాలామంది విదేశీయులు గర్భవతిగా ఉన్న సమయంలో పర్యాటక వీసాలపై యూఎస్ వస్తుంటారు. దీనిని అరికట్టడానికే ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 6న ఒక ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసింది. ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో భాగంగానే స్టేట్ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ రూపకల్పన చేస్తోంది. అమెరికన్ పౌరసత్వానికి ఉన్న విలువను కాపాడటానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ తేల్చి చెప్పారు. Passport అక్కర్లేదు.. ఐడీ కార్డుతోనే భారత్‌లోకి ఎంట్రీ? కొత్త ప్రపోజల్..ఏయే ఆధారాలు చూపించాలి?ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. పిల్లలకు పాస్‌పోర్ట్ అప్లై చేసేటప్పుడు తల్లిదండ్రులు తాము అమెరికన్ పౌరులమని నిరూపించుకోవడానికి చెల్లుబాటు అయ్యే యూఎస్ పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు విదేశీయులైతే తమ ఇమ్మిగ్రేషన్ హోదాను స్పష్టం చేసే ఐ-94 (I-94) ఫారం లేదా గ్రీన్ కార్డ్ వంటి కీలక పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఫోటో ఐడీ మాత్రమే అడుగుతున్నారు తప్ప, తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక ఆధారాలు అడగడం లేదు.Passport, Visa సేవలు బంద్! ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన..కోర్టు వివాదాలు.. న్యాయపోరాటాలు!పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ గతంలో తెచ్చిన ఆదేశాలను అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ

ఏ పండుకు లేని విశిష్టత యాపిల్ పండుకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. రంగులోనూ, ఆకారంలోనూ అందరినీ ఆకట్టుకునే ఈ పండు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ అగ్రస్థానంలో నిలుస్తుంది. “రోజుకు ఒక యాపిల్ తింటే వైద్యుడికి దూరంగా ఉండవచ్చు” అనే పెద్దలు చెప్పే సామెత దీని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. యాపిల్ పండ్లు సాధారణంగా ఎరుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, గులాబీ రంగులలో లభిస్తాయి. ఒక సాదారణ ఆపిల్‌లో సుమారు 95 క్యాలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. దీంతోపాటు.. విటమిన్లు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.. ఆహారంతో పాటు యాపిల్ పండును తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని ఆమ్లత్వాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్స్ తీసుకునే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యాపిల్ పండ్లు వివిధ రకాల తలనొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా యాపిల్, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని.. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరానికి తగినంత తేమను కూడా అందిస్తుంది. ముఖ్యంగా, బాగా పండిన యాపిల్ పండును తీసుకుని, దాని పైపొరను, మధ్యలోని గట్టి భాగాన్ని తొలగించి, కొద్దిగా ఉప్పు చేర్చి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తింటే రక్తహీనత వల్ల ఏర్పడిన తలనొప్పులు తగ్గుతాయి. ఆశించిన ఫలితాల కోసం దీనిని కనీసం రెండు నుండి మూడు వారాల పాటు తీసుకోవడం అవసరమని డైటీషియన్లు చెబుతున్నారు. యాపిల్ పండు ఆరోగ్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు తగ్గిపోతాయి. చంటి పిల్లలకు బాగా పండిన యాపిల్‌ను తినిపించడం ద్వారా వారు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. సమగ్ర పోషక విలువలతో కూడిన యాపిల్ పండును మీ రోజువారీ ఆహారంలో భాగం
ATM Charges Hike: ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ (Canara Bank) తమ ఖాతాదారులకు సడెన్ షాక్ ఇచ్చింది. తమ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలు పెంచింది. అలాగే నెలవారీ ఏటీఎం విత్ డ్రాయల్ ఉచిత లావాదేవీల పరిమితులను తగ్గించింది. వీటితో పాటు పొదుపు ఖాతాలో సరిపడ బ్యాలెన్స్ లేనప్పుడు విత్ డ్రాయల్‌కు ప్రయత్నిస్తే భారీగా పెనాల్టీలు విధించాలని నిర్ణయించింది. సవరించిన ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1, 2026 నుంచే అమలులోకి తెచ్చినట్లు వెల్లడించింది.కెనరా బ్యాంక్ కొత్త ఛార్జీలు ఇలా.. కెనరా బ్యాంక్ ఏటీఎంలలో నెలకు లభించే ఉచిత లావాదేవీల పరిమితి ఇప్పటి వరకు 6 ట్రాన్సాక్షన్లుగా ఉండగా దానిని 5కు తగ్గించారు. అంటే 5 ట్రాన్సాక్షన్ల తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇందులో ఫైనాన్షియల్, నాన్- ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అన్నింటికీ ఈ లిమిట్ వర్తిస్తుంది. బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ వంటివి చేసిన ట్రాన్సాక్షన్ గానే లెక్కిస్తారు. ఏటీఎం (ATM)లో నగదు ఉపసంహరణ చేయడానికి ప్రయత్నించినప్పుడు సేవింగ్స్ అకౌంట్లో సరిపడా డబ్బులు లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే భారీగా పెనాల్టీ పడనుంది. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత ఇలా ఫెయిల్ అయితే ఇప్పటి వరకు రూ.17 ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుండగా ఈ పరిమితిని రూ.23 ప్లస్ జీఎస్టీకి పెంచారు. నెలవారీ ఉచిత లిమిట్ దాటిన తర్వాత నగదు విత్ డ్రాయల్స్ (ICCW, UPI క్యాష్ విత్ డ్రాయల్స్తో సహా) చేస్తే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ GST ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు రూ.20 ఛార్జీ వసూలు చేసే వారు. అయితే, సీనియర్ సిటిజన్లకు కెనరా బ్యాంక్ ఊరట కల్పించింది. ఏటీఎంలలో నెలకు లభించే ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. నెలకు 8 ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. పరిమితి దాటిన తర్వాత ఒక్కో ట్రాన్సాక్షన్‌కి రూ.5

ఆగస్టు 26న నేపాల్‌లోని త్రిశూలి నది తీవ్ర రౌద్రరూపం దాల్చింది. ఉప్పొంగిన వరద నీరు తన దారిలో ఉన్న వాహనాలు, భవనాలు సర్వనాశనం చేస్తూ కొట్టుకుపోయింది. నువాకోట్ జిల్లాలోని డంగే బజార్ పరిసర ప్రాంతాలు మట్టి, రాళ్లు, మురుగుతో నిండిపోయాయి. అయితే, ఈ విధ్వంసం మధ్య ఒక అద్భుతం జరిగింది. పచ్చ రంగులో ఉన్న ఒక 40 ఏళ్ల నాటి పాత ఇల్లు భయంకరమైన వరదలను తట్టుకుని అలాగే నిలబడింది. ఈ పచ్చని ఇల్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చుట్టూ ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా, ఈ ఒక్క ఇల్లు ఎలా నిలబడిందనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరద ఉధృతి మరింత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రకాష్, ఆయన కుటుంబంలోని ఆరుగురు సభ్యులు దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఇంట్లోనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు భవనం పై అంతస్తుకు చేరుకుని గడిపారు. వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గగానే, సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన ప్రజలు రక్షణ చర్యలు చేపట్టారు. వారు పొరుగు భవనాల మధ్య ఒక పెద్ద పైప్‌ను ఉంచారు. ఆ పైప్, తాళ్ల సహాయంతో అవతలి వైపు నుంచి వచ్చి ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సర్వస్వం కోల్పోయినా నిలిచిన ప్రాణాలు వరద రాక్షసి నుంచి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఖాట్మండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారి వాహనాలు, దుకాణంలోని సరుకులు, ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. "అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నదంతా ధ్వంసమైంది లేదా మట్టిలో పూడిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకోవాలి" అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ హౌస్ యజమాని ప్రకాష్. వరద తాకిడికి తన ఇల్లు

తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉంది. ఈ క్రమంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని తలపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలను తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించే క్రమంలో డిసెంబర్ నెలలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది. పారిశ్రామిక ప్రగతి సాధిస్తే రాష్ట్ర పురోగతి సాధ్యం అవుతుందని తెలంగాణా సర్కార్ భావిస్తోంది.ప్రజాభవన్‌లో వార్‌రూమ్ ఏర్పాటు చేసి రోజువారీ పురోగతి సమీక్షఈ క్రమంలో ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్‌లో వార్‌రూమ్ ఏర్పాటు చేసి రోజువారీ పురోగతిని సమీక్షించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సీనియర్ అధికారులను బాధ్యులుగా నియమించాలని చెప్పారు.తెలంగాణా రాష్ట్రానికి మేఘ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు!తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు ప్రపంచానికి చెప్పేలా ప్లాన్ఈమేరకు ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ సంజయ్ జాజు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్ -2026కు లోగో రూపొందించాలని, అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు.బ్రాండ్ తెలంగాణా.. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్!విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులకు ఆహ్వానంఅంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రచారం కోసం అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో ఢిల్లీలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులను ఆహ్వానించాలని, హైదరాబాద్ ప్రధాన కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే సమయంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 25వ వార్షికోత్సవంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దాలని అన్నారు.గ్రీన్ టెక్నాలజీలో అగ్రస్థానంరాష్ట్రాన్ని దక్షిణ కొరియా, జపాన్ స్థాయికి తీసుకెళ్లాలని, సుస్థిర గ్రీన్

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోపల తాను స్వయంగా పండించిన తాజా ఆకుకూరలను కోసి, తోటి వ్యోమగామి జెస్సికా మీర్‌తో కలిసి రుచికరమైన వంటకం తయారు చేసుకున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడు మరియు ఇతర సుదూర గ్రహాలపైకి చేపట్టే దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో తాజా ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయాలో ఈ ప్రయోగం ద్వారా నిరూపించారు. నాసాకు చెందిన ‘వెజ్జీ’ ప్లాంట్ గ్రోత్ చాంబర్లో ఈ కూరగాయలను దాదాపు నెల రోజుల పాటు శ్రమించి సాగుచేశారు. ఈ ప్రయోగంలో కేల్, వసాబి ఆవాల ఆకుకూరలను సేకరించి పరీక్షించినట్లు మీనన్ తెలిపారు. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తికి మొక్కలు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పంటల పెంపకంలో మార్గనిర్దేశం చేసిన నాసా వెజ్జీ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ది మార్షియన్’లో అంగారక గ్రహంపై బంగాళాదుంపలు పండించే మార్క్ వాట్నీ పాత్రను గుర్తుచేస్తూ, ఈ ప్రయోగాన్ని చూసి ఆయన కూడా ఎంతో గర్వపడతారని చమత్కరించారు. ఈ తరహా పరిశోధనలు కేవలం వ్యోమగాములకు పౌష్టికాహారాన్ని, మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా, భవిష్యత్తులో భూమి నుండి అంతరిక్షానికి రవాణా చేయాల్సిన ఆహార భారాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాయి. రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వెన్నులో వణుకే! యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం! LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త! లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్! అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు

చాలా సింపుల్ రెసిపీ ఇది. చికెన్ ఉంటే చాలు. క్షణాల్లో అయిపోయే డిష్. ఇది తింటుంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. వీకెండ్ కంప్లీట్ కావాలంటే ఇది ఉండాల్సిందే. స్టార్టర్ లాగా బాగుంటుంది. ఇంకా బగారన్నంలోకి సెట్ అవుతుంది. అలా సరదాగా తినడానికి పర్ఫెక్ట్ అంటే ఈ పచ్చిమిర్చి కోడి వేపుడు ఒకటే. పచ్చిమిర్చి పేస్ట్ కోసం: 15-20 పచ్చిమిర్చి, 8-10 వెల్లుల్లి, హాప్ అంగుళం అల్లం, తగినంత ఉప్పు, కొత్తిమీర-గుప్పెడు, నిమ్మకాయ-ఒకటి, కిలో చికెన్, వేయించిన ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కార్న్ ఫ్లోర్-2 టీ స్పూన్లు, మైదా-టీ స్పూన్, ఉల్లిపాయలు-పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్-టీ స్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, గరం మసాలా-పావు టీ స్పూన్, పసుపు, కొత్తిమీర. ముందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చికెన్‌లో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్, మైదా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు మ్యారినేట్ చేయాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. చికెన్ ఉడికి, బయటివైపు మంచి క్రిస్పీ టెక్స్చర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తగా మారిన తర్వాత వేయించిన చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. చివరగా గరం మసాలా, తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాలు హై ఫ్లేమ్‌పై టాస్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ పచ్చిమిర్చి కోడి వేపుడు రెడీ. వేడి వేడి అన్నం, పులావ్, బిర్యానీ, రోటీ, చపాతీ లేదా నాన్‌తో సర్వ్ చేస్తే అదిరిపోతుంది

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఆయన చేయడమే కాకుండా, అభిమానులకు, ప్రజలకు కూడా ఆయన ఈ పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ మెగాబ్రదర్ ఏం చేశారో తెలుసా.. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ (కదంబవాసిని) మొక్కలను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ.. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గమని తెలిపారు. అంతేకాదు, ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుందని తెలుపుతూ.. ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలని కోరుతూ.. సోదరుడు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతోంది.. దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. ఈ కారణంగా అదనంగా బస్సులు అవసరమయ్యాయి.. కేంద్రం సహకారంతో రాష్ట్రానికి విద్యుత్ బస్సులు విడతలవారీగా వస్తున్నాయి. కొత్త బస్సులతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ మరో వినూత్నమైన ఆలోచన చేసింది.. పాత బస్సుల్ని ఏసీ ఈవీ బస్సులుగా మారుస్తోంది. పాత సూపర్‌లగ్జరీ బస్సును పుణెకు చెందిన కల్యాణి పవర్ట్రైన్ లిమిటెడ్ సంస్థ తక్కువ ఖర్చుతో రెట్రీఫిట్మెంట్ ద్వారా గ్రీన్ ఇంద్ర ఏసీ విద్యుత్ బస్సుగా మార్చేశారు. ఈ బస్సును తిరుపతి నుంచి కాణిపాకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ విద్యుత్ బస్సు రెండు నెలల క్రితం విజయవాడ నుంచి తిరుపతికి తీసుకొచ్చారు. అనంతరం బస్సుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, రోడ్డు కన్వెర్షన్ సహా అవసరమైన అనుమతులు తీసుకున్నారు. జులై 24న ఈ బస్సును తిరుపతి నుంచి కాణిపాకం ట్రయల్ రన్ నిర్వహించారు.. ఆ తర్వాత బస్సును రెగ్యులర్ సర్వీసుగా ప్రారంభించాలని భావించారు. కానీ ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది.. దీంతో ఆర్టీసీ అధికారులు ఈ బస్సు డిపోలో ఖాళీగా ఉంటుందని గమనించారు. ఇలా ఖాళీగా ఉంచే బదులు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే మంచిదని భావించారు.ఈ నెల 16న కాణిపాకానికి ఈ బస్సు రెండు ట్రిప్పులు నడిచింది.. ఆ సమయంలో కొన్ని లోపాలు గుర్తించారు. ఈ నెల 17న ఈ బస్సును గ్యారేజీకి తీసుకెళ్లి లోపాలను సరిచేశారు. ఈ విద్యుత్ బస్సు మంగళవారం రోజు తిరుపతి నుంచి కాణిపాకానికి 22మంది ప్రయాణికులతో బయలదేరి వెళ్లింది. అనంతరం కాణిపాక నుంచి చిత్తూరు వెళ్లి అక్కడ అవసరమైన కొన్ని తనిఖీలు చేసిన తర్వాత మళ్లీ 20మంది ప్రయాణికులతో తిరుపతి చేరుకుంది. మొత్తం మీద ఏపీఎస్ఆర్టీసీ చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది. గ్రీన్ ఇంద్ర ఏసీ బస్సు అందరిని ఆకట్టుకుంటోంది.పాత సూపర్ లగ్జరీ బస్సును విజయవాడలోని వర్క్‌షాప్‌కు తరలించి విద్యుత్ బస్సుకు అవసరమైన మార్పులు చేశారు. రూ.90 లక్షలతో గ్రీన్ ఇంద్ర బస్సుగా

భారతీయులు ఒకప్పుడు కలగా భావించిన అమెరికా ప్రయాణాలు, అక్కడి వీసాలు, గ్రీన్ కార్డుల్ని ట్రంప్ సర్కార్ రానురానూ మరింత కఠినంగా మార్చేస్తోంది. ముఖ్యంగా అమెరికాలో వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులు, ఇతర వలసదారులకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా తీసుకొస్తున్న గ్రీన్ కార్డు నిబంధనల్ని (US Green Card Rules) ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 18 నుండి అమలులోకి రానున్నాయి. దీని ప్రభావం పర్మనెంట్ రెసిడెన్సీ దరఖాస్తులపై తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వ సాయం పొందుతున్న వలసదారులకు కష్టాలు తప్పవు.తాజా గ్రీన్ కార్డ్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత సమర్పించే స్టేటస్ అడ్జస్ట్మెంట్ దరఖాస్తులకు (ఫారం ఐ-485) మాత్రమే కొత్త మార్గదర్శకాలు వర్తింపజేస్తారు. గడువు ముగిసిన తర్వాత పాత వెర్షన్ ఫారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు స్వీకరించరు. దరఖాస్తుదారుల వయస్సు, ఆరోగ్య స్థితి, నిధులు, విద్య, విభిన్న నైపుణ్యాల ఆధారంగా అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు. వలసదారులు తమ స్వయం సమృద్ధిని నిరూపించుకోవడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశ్యం. ఈ సవరణల వల్ల పబ్లిక్ ఛార్జ్ పరిధి చాలా విస్తృతంగా మారనుంది. సెప్టెంబర్ 18 తర్వాత వలసదారులు పొందే ప్రభుత్వ ప్రయోజనాలు వారి అర్హతపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. US వెళ్లాలనుకునే భారతీయులకు షాక్: EB-1 గ్రీన్ కార్డ్ దక్కడం కష్టమేనా?గతంలో తెచ్చిన నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ నగదు రూప సహాయం, వైద్య సంస్థలలో దీర్ఘకాలిక చికిత్స వంటి వాటిని మాత్రమే దీనికి పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇకపై హౌసింగ్ అసిస్టెన్స్, ఫుడ్ స్టాంప్స్, కాలేజీ చదువుల కోసం ప్రభుత్వం అందించే ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కూడా దరఖాస్తు తిరస్కరణకు ప్రాతిపదికగా మార్చనున్నారు. కుటుంబ ఆధారిత వలసల విషయంలో స్పాన్సర్ల అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ (ఫారం ఐ-864) మరింత కీలకంగా మారింది. గ్రీన్ కార్డ్ పొందే వ్యక్తికి పూర్తి

అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే కీలక మార్పులు రాబోతున్నాయి. 'పబ్లిక్ ఛార్జ్' నిబంధనను పునరుద్ధరిస్తూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆర్థిక స్థితి, వారు పొందిన ప్రభుత్వ ప్రయోజనాలపై అధికారులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. ఇది గ్రీన్ కార్డ్ ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చనుంది.యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఈ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. దీని ప్రకారం.. దరఖాస్తుదారులు ప్రభుత్వ గృహ వసతి సహాయం (హౌసింగ్ అసిస్టెన్స్), ఫుడ్ స్టాంప్స్, కళాశాల విద్యకు ఆర్థిక సహాయం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందితే, వారి దరఖాస్తులను పరిశీలించేటప్పుడు అధికారులు ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. భవిష్యత్తులో వారు ప్రభుత్వానికి భారం (పబ్లిక్ ఛార్జ్) అయ్యే అవకాశం ఉందా? లేదా? అని అంచనా వేస్తారు. బైడెన్ ప్రభుత్వ హయాంలో 2022లో తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేస్తూ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ కొత్త తుది రూల్‌ను జులై 16న ప్రకటించింది.సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత పోస్ట్‌మార్క్ చేయబడిన లేదా ఆన్లైన్లో సమర్పించిన గ్రీన్ కార్డ్ (ఫారం I-485) దరఖాస్తులకు ఈ కొత్త, కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి. అయితే, 2022 డిసెంబర్ 23 నుంచి 2026 సెప్టెంబర్ 17 మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి పాత (2022)

Rajahmundry: రాజమండ్రి: వీధి వ్యాపారులకు 'జోన్ల' భరోసా! Rajahmundry: నగరంలో ఏ ఒక్క వీధి వ్యాపారికి అన్యాయం జరగకుండా వీధులను జోన్లు వారీగా విభజించినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వీధి వ్యాపారస్తుల చట్టం ప్రకారం పట్టణ ప్రణాళిక మరియు మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించినట్లు చెప్పారు. నగర పరిధిలోగల వీధులన్నీ జోన్లు వారీగా విభజించి నివేదికను సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. విద్యా సంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జంక్షన్ లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించినట్లు తెలిపారు. నిర్దేశిత సమయాలు, నిర్దేశిత రోజులలో వ్యాపారాలు చేసుకునే ప్రాంతాలను యాంబర్ జోన్లుగా మిగతా ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించటం జరిగిందన్నారు. మొత్తంగా నగర పరిధిలో 62 గ్రీన్, 26 యాంబర్, 58 రెడ్ జోన్లను గుర్తించినట్లు వెల్లడించారు. రెడ్ జోన్లకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నట్లయితే.. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి తెలియజేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. జోన్ల గుర్తింపు అనంతరం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీ చేసి వెండింగ్ జోన్లలో స్థలాలను కేటాయించి తగు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వీధి వ్యాపారుల జీవనోపాధికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, ఒక స్పష్టమైన మరియు యోచనాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. సమీక్షలో అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, సీఎంఎం రామలక్ష్మి, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై పి.శ్రీనివాసరావు, టౌన్ వెండింగ్ కమిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎన్జీఓ రాంబాబు, ఇతర సభ్యులు పాల్గొన్నారు

అమెరికాలో దాదాపు 27 ఏళ్లుగా చట్టబద్ధంగా నివాసముంటూ, గ్రీన్ కార్డ్ కలిగిన భారత సంతతికి (తెలుగు) చెందిన వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే వృద్ధురాలిని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు హఠాత్తుగా నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమె డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) కేసుకు సంబంధించి గతంలోనే ఇమ్మిగ్రేషన్ కోర్టు అనుకూల తీర్పు ఇచ్చినప్పటికీ, షెడ్యూల్డ్ చెకింగ్ సమయంలో అధికారులు ఆమెను అరెస్టు చేసి జార్జియాలోని నిర్బంధ కేంద్రానికి తరలించడం తీవ్ర సంచలనంగా మారింది. నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వెంకట నరసమాంబ వాసంశెట్టి, 2013 నుంచి గ్రీన్ కార్డ్ హోల్డర్‌గా ఉన్నారు. 2022లో తన అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని పరామర్శించేందుకు భారత్‌కు వచ్చిన ఆమె, కోవిడ్ బారిన పడటంతో దాదాపు 7 నెలల పాటు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే, ఆమె అమెరికా శాశ్వత నివాస హక్కును వదులుకున్నారనే ఆరోపణలతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కేసు నమోదు చేసింది. కానీ, తగిన ఆధారాలు చూపించకపోవడంతో 2026 మేలో ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆ కేసును కొట్టివేశారు. కోర్టు కేసు కొట్టివేసినప్పటికీ, క్రమం తప్పకుండా ఐసీఈ చెకప్‌లకు హాజరవుతున్న వెంకట నరసమాంబను ఆగస్టు 11న నిర్వహించిన తనిఖీల్లో అధికారులు నిర్బంధించారు. ఎటువంటి నేర చరిత్ర లేని వృద్ధురాలిని చట్టవిరుద్ధంగా బంధించారని, ఆమె కుటుంబం అత్యవసర ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేయగా, ఆమెను ఏ చట్టబద్ధమైన ప్రాతిపదికన నిర్బంధించారో 3 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఫెడరల్ జడ్జి ఐసీఈ అధికారులను ఆదేశించారు

మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు వాటి తాజాదనం, రంగు మాత్రమే చూస్తే సరిపోదు. వాటిపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు అవి తాజాగా, నాణ్యంగా ఉన్నాయా అని మాత్రమే చూస్తాం. కానీ వాటి ఉపరితలంపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. అందుకే కూరగాయలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడంతో పాటు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పొలం నుంచి మార్కెట్ వరకు కూరగాయలు అనేక దశల్లో ఇతర పదార్థాలతో సంబంధం కలిగి ఉంటాయి. సాగు సమయంలో ఉపయోగించే పురుగుమందులు, కలుషిత నీరు, రవాణా సమయంలో అపరిశుభ్రత, మార్కెట్లో దుమ్ము, ఈగలు వంటి కారణాల వల్ల వాటిపై కాలుష్యం చేరవచ్చు. కూరగాయలను నేలపై ఉంచడం, శుభ్రత లేని ప్రదేశాల్లో నిల్వ చేయడం, మురికి సంచుల్లో రవాణా చేయడం వంటివి కూడా వాటిపై సూక్ష్మజీవులు చేరడానికి కారణమవుతాయి. సరిగ్గా శుభ్రం చేయని కూరగాయలను తినడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆహార సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా.. కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన వాటిని ఎంచుకోవచ్చు. కుళ్లిన లేదా దెబ్బతిన్న కూరగాయలను కొనకండి. అసహజమైన రంగు ఉన్న వాటిని తీసుకోకపోవడం మంచిది. చాలా ఎక్కువగా మెరుస్తున్న కూరగాయలను జాగ్రత్తగా పరిశీలించండి. కూరగాయలు శుభ్రమైన ప్రదేశంలో ఉంచారా లేదా గమనించండి. కాలువలు, చెత్త కుప్పల దగ్గర విక్రయించే కూరగాయలను వీలైనంత వరకు కొనకండి. ఈగలు ఎక్కువగా వాలుతున్న కూరగాయలను తీసుకోకుండా ఉండటం మంచిది. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిన వెంటనే వాటిని ఒకసారి పరిశీలించి శుభ్రం చేయాలి. శుభ్రమైన ప్రవహించే నీటితో కూరగాయలను బాగా కడగడం ముఖ్యం. ఆకుకూరలను విడదీసి కడగడం వల్ల వాటిపై ఉన్న దుమ్ము వంటి మలినాలను తొలగించవచ్చు. కూరగాయలను కడగకుండా నేరుగా ఫ్రిజ్‌లో

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. extend EV commercial vehicle age limit: దేశంలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయానికి రెడీ అయ్యింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సీఎన్జీతో నడిచే కమర్షియల్ వెహికల్స్ లైఫ్ లిమిట్ ను మరో 5 ఏళ్లు పెంచాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలు చేస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ కీలక ముసాదాయిను రిలీజ్ చేసింది. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీతో నడిచే వెహికల్స్ యజమానులకు పెద్దపీట వేయాలన్నలక్ష్యంతోనే సర్కార్ ఈ ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నేషనల్ పర్మిట్ వ్యవస్థలో కొన్ని రకాల కమర్షియ్ వెహికల్స్ కు ఉన్న 12,15ఏళ్ల గడువును .. ఈ కొత్త సవరణ ద్వారా 17,20 ఏళ్లకు పెంచనున్నారు. అయితే ఈ మినహాయింపు అన్నిరకాల వాణిజ్య వెహికల్స్ వర్తించదని కేవలం బ్యాటరీతో నడిచేవి, హైడ్రోజన్ అండ్ నేచురల్ గ్యాస్ ఆధారంగా నడిచే వెహికల్స్ కు మాత్రమే పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేసింది. కమర్షియల్ రంగంలో క్లీన్ ఎనర్జీ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా వెహికల్స్ నేషనల్ పర్మిట్ ప్రక్రియను మరింత ఈజీగా చేయడంతోపాటు ఆన్ లైన్ డాక్యుమెంటేషన్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దరఖాస్తుదారులు కోరుకుంటే నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్ ను ఒకేసారీ 5ఏండ్ల వరకు ఎలక్ట్రానిక్ విధానంలో పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికోసం ఏడాదికి 16వేల 500 చొప్పున ఐదేళ్లకు 82వేల ఫీజు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే వాహన్ పోర్టల్ వినియోగాన్ని మరింత విస్త్రుతం చేసి డీలర్లు

ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రీచ్మెంట్ (ఏపీ గ్రీన్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2047 నాటికి ఏపీ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ సుసంపన్నం కోసం ఏపీ గ్రీన్ సొసైటీకికార్యనిర్వాహక కమిటీ, జిల్లాస్థాయిలో జిల్లా హరిత అభివృద్ధి సంస్థల (డీజీడీఏ) పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైన నాగబాబుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047లో భాగంగా ‘50 శాతం గ్రీన్ కవర్’ సాధించే లక్ష్యాన్ని నాగబాబు సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆకాంక్షించారు. అటవీ విస్తీర్ణం పెంపు, పునర్అటవీకరణ, పర్యావరణ పరిరక్షణ, హరితాంధ్ర నిర్మాణం వంటి కార్యక్రమాలు నాగబాబు నాయకత్వంలో మరింత వేగంగా, ఫలితాల దిశగా సాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ కీలక బాధ్యతలో ఆయన విజయవంతం కావాలన్నారు. నాగబాబును క్యాబినెట్ హోదాలో ఏపీ గ్రీన్ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మద్దతు తెలిపిన కూటమి పక్షాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ గ్రీన్ సొసైటీ లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. హరితాంధ్రప్రదేశ్ సాధన కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ హోదాతో కూడిన కీలక పదవి దక్కిన అనంతరం జనసేన నేత నాగబాబు తొలిసారిగా స్పందించారు. ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా తనను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తన సోదరుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నాగబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పదవిని కేవలం ఒక ప్రొటోకాల్‌గా కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం అప్పగించిన గురుతర బాధ్యతగా భావిస్తున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. మొక్కలు నాటడం తన జీవనశైలిలో ఒక భాగమని వెల్లడించిన ఆయన, ఈ నూతన బాధ్యతతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా, ఆరోగ్యవంతంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని నాగబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం తన వంతుగా పూర్తి స్థాయిలో శ్రమిస్తానని ఆయన స్పష్టం చేశారు

అనుభవ్ అగర్వాల్ గ్రూప్‌లో భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ఓర్వకల్ పారిశ్రామిక వాడలో సుమారు రూ. 7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12 GW ఇంగాట్ , వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయంగా సౌర ఉత్పాదక సామర్థ్యాలు మరింత బలోపేతం కావడంతో పాటు, ప్రత్యక్షంగా , పరోక్షంగా 3,500కు పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్టు ముఖ్యాంశాలు: కర్నూలు ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్లో రూ. 7,800 కోట్ల భారీ పెట్టుబడితో ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. 12 GW సమీకృత ఇంగాట్ , వేఫర్ ఉత్పాదనల ద్వారా కంపెనీ ప్రస్తుత సోలార్ సెల్ , మాడ్యూల్ తయారీ సామర్థ్యాలు మరింత బలపడతాయి. దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని గ్లోబల్ సోలార్ ఫోటోవోల్టాయిక్ తయారీలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అనుభవ్ అగర్వాల్ గ్రూప్ , నేతల స్పందన: అనుభవ్ అగర్వాల్ (చైర్మన్): భారతదేశ ఇంధన పరివర్తనపై తమకు ఉన్న విశ్వాసాన్ని ఈ ప్రాజెక్టు ప్రతిబింబిస్తోందని, దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు పటిష్టమైన ఇంధన పర్యావరణ వ్యవస్థ అవసరమని తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ఏపీలో పారిశ్రామిక వృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టి.జి. భరత్‌లకు అగస్త్య ఎనర్జీ యాజమాన్యం హృదయపూర్వక అభినందనలు తెలిపింది. పియూష్ బిచోరియా , బెర్నార్డ్ రాక్ (డైరెక్టర్ & CEO): ఇంగాట్, వేఫర్, సెల్ , మాడ్యూల్ తయారీని ఒకే వేదికపైకి తెచ్చే ఈ సమీకృత ప్రాజెక్టు భారతదేశ 'మేక్ ఇన్ ఇండియా' , 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలకు సంపూర్ణంగా అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు,ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి దక్కింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబును ఏపీ ప్రభుత్వం నియమించింది. నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నాగబాబును అభినందించారు. సతీమణితో కలిసి నాగబాబును సత్కరించారు. మెడలో పూలమాల వేసి అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా నాగబాబుకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మరోవైపు రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్)’ ఏర్పాటు చేసింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు పేరును నామినేట్ చేస్తూ ఏపీ పర్యావరణ, అటవీ శాఖ జీవో జారీ చేసింది. ఈ నియామకంతోపాటు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.గ్రీన్ కవర్‌ను మన రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని 2047 నాటికల్లా సాధించేందుకు ఏపీ గ్రీన్ పనిచేయనుంది. ఇందులో భాగంగా ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లాస్థాయి పాలక మండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కమిటీ ఛైర్మన్‌గా.. ఏపీ గ్రీన్ లక్ష్యాలు, కార్యక్రమాల అమలులో సమన్వయం, వేగవంతం చేయడం, పురోగతిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నాగబాబు నిర్వహించనున్నారు. మరోవైపు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో చంద్రబాబుప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇప్పుడు కేబినెట్ మంత్రి హోదాతో కూడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబును నియమించారు.మరి ముందు ముందు రోజులలో నాగబాబుకు మంత్రిగా అవకాశం దక్కుతుందా.. వేరొకరికి ఛాన్స్ ఉంటుందా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటుచేసుకుంది. జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ సైంటిఫిక్ అండ్ ఎకోలాజికల్ గ్రీనింగ్, రీఫారేస్టేషన్ ప్రాజెక్ట్ (AP GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా నాగబాబును నియమిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారిక ఉత్తర్వులు (G.O. Rt No. 93) జారీ చేసింది. అంతేకాకుండా, ఈ పదవిలో ఉన్నంత కాలం ఆయనకు ప్రత్యేకంగా కేబినెట్ హోదా ర్యాంకును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యావరణ, అటవీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈ శాఖ పరిధిలోని ఏపీ గ్రీన్ సొసైటీ గవర్నింగ్ బోర్డు ఛైర్మన్‌గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తుండగా, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ బాధ్యతలను తన సోదరుడైన నాగబాబుకు అప్పగించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు వెనుక ప్రభుత్వం ఒక భారీ విజన్ ప్రణాళికను రూపొందించింది. 2047 నాటికి రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, చెట్ల కవరేజీని ఏకంగా 50 శాతానికి పెంచడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతమున్న పచ్చదనాన్ని రెట్టింపు చేస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఒక శక్తివంతమైన వ్యవస్థాగత యంత్రాంగం అవసరం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చి హరిత కార్యక్రమాలను అమలు చేసే నోడల్ ఏజెన్సీగా ఈ గ్రీన్ సొసైటీ పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కొణిదెల నాగబాబు పొలిటికల్ జర్నీ వైపు చూస్తే.. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ, ధైర్యం వీడకుండా పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం

ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రీనింగ్, 'రీఫారెస్టేషన్' (పునరటవీకరణ) కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును (నాగేంద్రరావు) ( MLC Konidela Nagendra Babu) ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ నంబర్ -93 ద్వారా ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం, అడవుల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ఆయా కార్యక్రమాలను అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో ఫారెస్ట్, ట్రీ కవర్‌ను 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర గ్రీన్ లక్ష్యాల అమలు, సమన్వయం, పర్యవేక్షణలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొణిదెల నాగేంద్రబాబును నియమించిన ఏపీ సర్కార్.. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ నిబంధనలకు లోబడి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల కార్యకలాపాల సమర్థవంతంగా అమలు చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Alluri Sitaramaraju International Airport: భోగాపురంలో ప్రారంభించిన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపేరు పెట్టారు. ఉత్తరాంధ్రకు గేట్ వేగా విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిలిచిందని ఆప్రాంత వాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జీఎంఆర్ ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను నిర్మించిన జీఎంఆర్ సంస్థ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించింది. ఆదివారం రాత్రి 10.45 నిమిషాలకు విశాఖ నుంచి ఢిల్లీ విమానం బయలు దేరింది. ఆ తర్వాత విశాఖలో వాణిజ్యపరమైన సేవలు నిలిచిపోయాయి. విశాఖ నుంచి చిట్టచివరి సర్వీసుగా నిలిచిపోయింది. విశాఖ విమానాశ్రయంలో పనిచేస్తున్న వెయ్యి మంది సిబ్బంది సేవలను ఎక్కడ యూజ్ చేసుకుంటారనేది చూడాలి. ఆదివారం అర్ధరాత్రి నుంచి భోగాపురం నుంచి స్కూట్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం రాత్రి ఇక్కడ నుంచి సింగపూర్‌కు పయనమైంది. దీంతో అధికారిక సేవలు ప్రారంభమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాలకు రెగ్యులర్ సర్వీసులు.. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ, ముంబై,కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై,బెంగళూరు నగరాలకు రెగ్యులర్ సర్వీసులు ఉండనున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో లాంటి దేశీయ విమానాయన సర్వీసులతో పాటు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్ లైన్స్ సింగపూర్‌కు, ఇండియా విమానాల నుంచి అబుదాబి, దుబాయ్‌లకు విమాన సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి భోగాపురం విమానాశ్రయానికి తొలి విమానం

హైదరాబాద్ నగరంలో పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించి హరిత రవాణాను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026కు ఈ క్రమంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌లోని పొల్యూషన్ కు కారణం అవుతున్న పెట్రోల్, డీజిల్ ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చనున్నారు.18,766 పాత ఇంధన ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగామొదటి దశలో సుమారు 18,766 పాత ఇంధన ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం అర్హులైన ఆటో డ్రైవర్లకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఎలక్ట్రిక్ ఆటో పైన లక్షా 50 వేల రూపాయల సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా నగరంలో పొల్యూషన్ తగ్గుతుంది. ఇంధన ధరల భారం నుంచి డ్రైవర్లకు ఉపశమనం లభిస్తుంది.ఎలక్ట్రిక్ ఆటో కన్వర్షన్ కు రూ.1.50 లక్షల సబ్సిడీఇందులో లబ్ధిదారులకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంచారు. పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోలో ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ అమర్చుకోవచ్చు. లేదా పాత ఆటోను స్క్రాప్ చేసి కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయవచ్చు. రెండు ఆప్షన్లలోనూ రూ.1.50 లక్షల సబ్సిడీ వర్తిస్తుంది. కన్వర్షన్ కిట్ల సాంకేతిక ప్రమాణాలు, వాహన భద్రత, బ్యాటరీ లైఫ్‌పైన కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు.16 వారాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన రవాణా శాఖ ఈ పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయడానికి రవాణా శాఖ 16 వారాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. తొలి 8 వారాల్లో ఆటో యూనియన్లతో అవగాహన సదస్సులు నిర్వహించనుంది. ఆపై ప్రామాణిక కిట్ల తయారీ సంస్థల ఎంపిక, ధరల స్థిరీకరణ జరుగుతాయి. 8వ వారం నాటికి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. దరఖాస్తు, అర్హతల ధ్రువీకరణ, ఆర్టీవో వెరిఫికేషన్

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, బందరు పోర్టులను అనుసంధానించేలా రెండు భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమాంతరంగా పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్వే లైన్, ఫ్యూచర్ సిటీ-బందరు పోర్టు 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను పక్కపక్కనే నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా అంగీకరించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్-విజయవాడ ప్రస్తుత జాతీయ రహదారికి ఎడమవైపు ఎక్స్‌ప్రెస్‌వే, కుడివైపు హైస్పీడ్ రైలు మార్గం ఉండేలా అలైన్మెంట్ ఖరారు చేశారు.760 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గంహైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య ప్రతిపాదించిన ఈ హైస్పీడ్ రైల్వే కారిడార్ మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. ఈ మార్గంలో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2.24 లక్షల కోట్లు కాగా, దాదాపు 790 హెక్టార్ల భూమి అవసరమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఈ మార్గంలో మార్కింగ్ పనులు పూర్తయ్యాయి.298 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేహైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్యలో ఉన్న ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం కానుంది. ఇది అమరావతి మీదుగా మచిలీపట్నం-బందరు పోర్టుకు అనుసంధానమవుతుంది. మొత్తం 297.82 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు (40 గ్రామాల మీదుగా), ఏపీలో మిగిలిన భాగం (60

రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు.. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, హైస్పీడ్ రైల్వే లైన్ ప్రాథమిక అలైన్మెంట్లపై స్పష్టత రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హైస్పీడ్ ట్రైన్ శంషాబాద్, ఫ్యూచర్‌సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు 40 గ్రామాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పొడవు 297 కిలోమీటర్లు.. అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్వే లైన్.. ఫ్యూచర్‌సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు ప్రతిపాదించిన 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలు పక్కపక్కనే వెళ్లనున్నాయి. ఈ రెండింటిలో రోడ్డు ఎడమవైపు.. రైలు మార్గం కుడివైపు ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎడమవైపు అంటే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రస్తుత రహదారికి ఎడమవైపు.. ఫ్యూచర్‌సిటీ-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఉంటుంది. కుడివైపు రైలు మార్గం ఉండనుంది. వీటికి సంబంధించిన అలైన్మెంట్ల విషయంలోనూ ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం.. హైదరాబాద్-అమరావతి- చెన్నై కారిడార్‌లో శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి దగ్గర స్టేషన్లు రానున్నాయి. ఈ లైన్ శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్ దగ్గర నిర్మించనున్న 21 కిలోమీటర్ల కొత్త రేడియల్ రోడ్డుకు దగ్గర్లో ప్రారంభమయ్యే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే వద్ద కలుస్తుంది. ఈ రైల్వే లైన్ పొడవు మొత్తం 760 కిలోమీటర్లు కాగా.. రాష్ట్రపరిధిలో 180 కిలోమీటర్లు ఉండనుంది. దీనికి సంబంధించి ఆ మార్గంలో పలుచోట్ల మార్కింగ్‌లు కూడా

ఆగస్టు నెల డబ్బు సంపాదించడానికి అద్భుతమైన అవకాశం ఇస్తుంది. రైతులు ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఈ మూడు కూరగాయలు పండిస్తే మంచి డబ్బు సంపాదించవచ్చు. ఏయే పంటలు వేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఈ నెలలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. త్వరలో నవరాత్రులు, దసరా, దీపావళి పండుగలు రాబోతున్నాయి. కాబట్టి ఈ పంటలు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. దీనికి ఎక్కువ పొలం కూడా అవసరం లేదు. ఆగస్టులో కాలీఫ్లవర్ పండించడం మొదలుపెట్టండి. ఈ సమయంలో నాటిన మొక్కలు అక్టోబర్ నాటికి పంటకొస్తాయి. అప్పటికి క్యాబేజీ ఇంకా మార్కెట్లోకి రాదు. సరఫరా తక్కువగా ఉండటంతో మంచి ధర వస్తుంది. ప్రతి వారం మీ జేబులోకి డబ్బులు రావాలంటే పచ్చిమిర్చి పండించండి. ఆగస్టులో నాటడం చాలా మంచిది. ఒక్కసారి నాటితే కొన్ని నెలల పాటు ఆదాయం వస్తూనే ఉంటుంది. ఆగస్టు చివరి వారంలో కొత్తిమీర నాటడం ఉత్తమం. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుంది. కేవలం 35 నుంచి 40 రోజుల్లోనే పంట కోతకు సిద్ధమవుతుంది! వర్షాకాలం కావడంతో మార్కెట్లో కొత్తిమీరకు డిమాండ్ ఎక్కువగా, సరఫరా తక్కువగా ఉంటుంది. దీంతో కిలో ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. అందుకే లాభాలు కూడా భారీగా ఉంటాయి. Silver Rings: తక్కువ బడ్జెట్లో వచ్చే వెండి ఉంగరాలు.. ఓ లుక్కేయండి! Curd Face Pack: పెరుగు ఫేస్ ప్యాక్ తో మ్యాజిక్.. చర్మం మెరిసిపోతుంది! Necklace Designs: పెళ్లి కళ ఉట్టిపడేలా చేసే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు Kurti Designs: డైలీవేర్ కి అదిరిపోయే డిజైన్ లో కుర్తీలు.. ఓ లుక్కేయండి

రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లకు కూడా.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్రం ప్రభుత్వం నిర్మాణ అనుమతులకు 50శాతం టీడీఆర్ ఇచ్చినా చాలు.. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఊతమిచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ సిటీ: ట్రాన్స్ఫరబుల్ డెవల్‌పమెంట్ రైట్స్ (టీడీఆర్)పై చిక్కుముడులు వీడాయి. హెచ్ఎండీఏ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు టీడీఆర్ తీసుకోవడంపై భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టులన్నింటికీ టీడీఆర్‌లను జారీ చేసే అధికారం ఆ సంస్థకే కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియలో టీడీఆర్‌లను ఎవరు జారీ చేయాలనే దానిపై ఇప్పటివరకు సందిగ్ధత నెలకొని ఉండేది. ఏ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ/ఎంఎంసీ)పరిధిలో భూ సేకరణ చేస్తే సంబంధిత కార్పొరేషనే ఇప్పటివరకు టీడీఆర్ జారీ చేసేది. అయితే, రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రతన్‌టాటా రేడియల్ రోడ్డుకు పరిహారంగా టీడీఆర్ కావాల్సినవారు ఎంఎంసీని సంప్రదించాలా? హెచ్ఎండీఏను సంప్రదించాలా? లేదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని సంప్రదించాలా అనే సందేహం ఉండేది. ఈ నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీనే (హెచ్ఎండీఏ) టీడీఆర్ జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ టీడీఆర్‌లను హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో హెచ్ఎండీఏ పరిధిలో భూసేకరణ, అభివృద్ధి పనులకు ఇక మరింత ఊతం లభించనుంది. బిల్డ్నౌలోనే సింగిల్ బ్యాంకు టీడీఆర్ పొందిన నిర్వాసితులు క్రయ, విక్రయాలు చేసుకోవడానికి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు ప్రత్యేకంగా వెబ్సైట్లోనే టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేశాయి. అయితే, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఎంఎంసీ, సీఎంసీలు, పెరీ అర్బన్ రీజియన్ పరిధిలో ఎఫ్సీడీఏలు వచ్చాయి. దీంతో రాష్ట్రం మొత్తానికి ఒకే టీడీఆర్ బ్యాంకును బిల్డ్ నౌలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక టీడీఆర్‌ను పలు నిర్మాణ అనుమతులకు వినియోగిస్తూ తప్పదోవ

హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమైంది. ఇప్పటివరకు నాలుగైదు భాగాలుగా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణను సొంతం చేసుకున్న అనకొండ తరహా చిత్రాల మాదిరి ‘బివేర్ బోయునా’ (BEWARE BOIÚNA) సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మైక్ పి. నెల్సన్ (Mike P. Nelson) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెస్సికా రోతే, కియానా మదీరా, లోగాన్ మార్షల్-గ్రీన్, జాక్సన్ బ్యూస్, జువాన్ పాబ్లో షుక్, విల్ క్లోజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం ఆక్టోబర్ 2న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ఓ వైద్య బృందం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌కు వెళ్లగా అక్కడ అతి భయంకరమైన భారీ బోయునా సర్పం వారి వెంటాడుతుంది. ఈ క్రమంలో ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితుల నడుమ వారు అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారనేది ప్రధానాంశం. ఆ బోయినా వారి వెంట ఎందుకు పడింది చివరకు వారు బయట పడ్డారా లేదా అనే ఆసక్తికరమైన కథతో ఉత్కంఠభరిత సన్నివేశాలు, భయపెట్టే విజువల్స్‌తో సర్వైవల్ అంశాలను హారర్‌తో మిళితం చేస్తూ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమైందని, భవిష్యత్తులో దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతి అభివృద్ధిపై ఆలోచించాలని, రాబోయే రోజుల్లో రాజధాని నిర్మాణం అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లి వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. 96 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్డు.. 190 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టూ 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు, 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం కూడా ఆమోదం తెలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పనులను ప్రారంభించారని, 2028లో భారతదేశం మెచ్చే అమరావతి ప్రారంభోత్సవానికి ప్రధాని మళ్లీ వస్తారని పేర్కొన్నారు. ఇక, అమరావతి వాస్తు పరంగా కూడా అద్భుతమైన ప్రాంతమని చంద్రబాబు అన్నారు. స్పీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయిన తర్వాత అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం ఒకవైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమరావతి ఉద్యమంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర గతంలో వైసీపీ నాయకులు రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. అమరావతి రాజధాని ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మద్దతుగా పోరాడారని గుర్తుచేశారు. ముళ్లకంపలను సైతం లెక్కచేయకుండా రైతులకు అండగా పవన్ నిలిచారని పేర్కొన్నారు. తన భార్య చేతి గాజులను కూడా అమరావతి కోసం విరాళంగా ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఆధునిక మౌలిక వసతులతో రాజధాని అన్ని కష్టాలను అధిగమించి అమరావతి రాజధాని నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించామని చంద్రబాబు అన్నారు. రాజధానిలో విద్యుత్ తీగలు, కరెంట్ పోల్స్ కనిపించకుండా
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య డార్విన్‌లోని మార్రారా స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు, అనుభవానికి పెద్దపీట వేస్తూ అత్యంత సీనియర్లతో కూడిన ప్లేయింగ్ లెవన్‌ను ఎంపిక చేసింది. ఈ 11 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే 30 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న ఆటగాడు ఉండటం గమనార్హం.ఆస్ట్రేలియా తుది జట్టును పరిశీలిస్తే.. 27 ఏళ్ల ఆల్ రౌండర్ కెమెరాన్ గ్రీన్ మాత్రమే 30 ఏళ్ల లోపు వయసున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. మిగిలిన 10 మంది ఆటగాళ్లు 30 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. జట్టులో అత్యంత సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్ 38 ఏళ్ల వయస్సులో ఉండగా, దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 37 ఏళ్లతో తదుపరి స్థానంలో ఉన్నాడు. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్ (36), జోష్ హేజిల్‌వుడ్ (35) లతో పాటు వికెట్ కీపర్ అలెక్స్ కారీ 34 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడు.జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వయస్సు 33 ఏళ్లు కాగా, డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషేన్, ఆల్ రౌండర్ బ్యూ వెబ్స్టర్లు 32 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నారు. మరొక ఓపెనర్ జేక్ వెదరాల్డ్ 31 ఏళ్లతో ముప్పై పడి దాటిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. సాధారణంగా యువ రక్తాన్ని ప్రోత్సహించే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, రెడ్ బాల్ క్రికెట్లో స్థిరత్వం కోసం ప్రస్తుతం సీనియర్ల అనుభవాన్నే పూర్తిగా నమ్ముకున్నట్లు స్పష్టమవుతోంది.సాధారణంగా టెస్టు క్రికెట్లో యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇచ్చే కంగారూల విధానానికి భిన్నంగా, ఈ తరహా 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' ఫార్ములాను అమలు చేస్తోంది. రాబోయే రెండేళ్లలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కమిన్స్ సేన

Taskin Ahmed Celebration Video: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ సంచలన వికెట్ తో మెరిశాడు. డేంజరస్ ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను పెవిలియన్ కు పంపి, ఆ తర్వాత అతను చేసిన వింత సెలబ్రేషన్ మైదానాన్ని ఊపేసింది. ఈ విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజే తీవ్ర ఉత్కంఠకు తెరలేచింది. డార్విన్ పిచ్ పై మంచి ఊపులో కనిపిస్తున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను అవుట్ చేసిన తర్వాత టాస్కిన్ అహ్మద్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 22వ ఓవర్ లో టాస్కిన్ వేసిన బంతిని గ్రీన్ లెగ్ సైడ్ వైపు తిప్పడానికి ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా బ్యాట్ కు తగలకుండా గాల్లోకి లేచింది. మిడ్ వికెట్ లో ఉన్న సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ దాన్ని అద్భుతమైన క్యాచ్ గా మలుచుకున్నాడు. గ్రీన్ అవుట్ కాగానే టాస్కిన్ తన నాలుక బయటకు పెట్టి విచిత్రంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లంతా రహీమ్ వైపు పరుగెత్తగా, టాస్కిన్ మాత్రం ఒంటరిగా చేసిన ఈ సరదా డ్యాన్స్ కెమెరాలో రికార్డై క్షణాల్లో వైరల్ గా మారింది. టాస్ తో పాటు బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కు తొలి సెషన్ లోనే బంగ్లాదేశ్ పేసర్లు ఊహించని షాక్ ఇచ్చారు. పచ్చిక ఉన్న పిచ్ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుని హసన్ మహమూద్, టాస్కిన్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. ఎలాంటి నష్టం లేకుండా 45 పరుగులు చేసిన ఆస్ట్రేలియాను ఒక్కసారిగా కష్టాల్లోకి నెట్టారు. హసన్ మహమూద్ వరుస ఓవర్లలో వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. లోకల్ హీరో జేక్ వెదర్‌ఆల్డ్ ను 23 పరుగుల వద్ద పెవిలియన్ పంపిన హసన్

అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్ జంటగా నటించిన క్లాసిక్ చిత్రం ‘గీతాంజలి’ (Geethanjali) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్కినేని నాగార్జున(Nagarjuna), గిరిజ శెట్టర్ జంటగా నటించిన క్లాసిక్ చిత్రం ‘గీతాంజలి’ (Geethanjali) మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ ప్రేమకథను ఆగస్టు 28న 4Kలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. (Geethanjali Re Release) ‘గీతాంజలి’ తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రేమకథా చిత్రం. ప్రేమ, భావోద్వేగాలు, అనుబంధాలను మణిరత్నం తనదైన శైలిలో తెరకెక్కించారు. నాగార్జున, గిరిజ శెట్టర్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం మరో ప్రత్యేకత. సినిమాలోని పాటలు అప్పట్లో ఎంతగా హిట్ అయ్యాయో.. ఇప్పటికీ అంతే ఆదరణ పొందుతున్నాయి. ప్రేమకథకు ఇళయరాజా సంగీతం మరింత అందాన్ని తీసుకొచ్చింది. పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేకమైన విజువల్ ఫీల్‌ను తీసుకొచ్చింది. బి. లెనిన్, వి.టి. విజయన్ ఎడిటింగ్, తోట తరణి ఆర్ట్ డైరెక్షన్ సినిమాను మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఇప్పుడు ఈ క్లాసిక్ చిత్రం 4K క్వాలిటీతో మరోసారి థియేటర్లలోకి వస్తుండటంతో నాగార్జున అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అప్పట్లో థియేటర్లలో ‘గీతాంజలి’ని చూసిన వారికి ఇది పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేయనుంది. అదే సమయంలో కొత్త తరం ప్రేక్షకులకు ఈ క్లాసిక్ ప్రేమకథను పెద్ద తెరపై ఆస్వాదించే అవకాశం లభించనుంది. ఆగస్టు 28న ‘గీతాంజలి’ 4Kలో రీ-రిలీజ్ కానుండటంతో కింగ్ నాగార్జున అభిమానులు, మణిరత్నం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంచి ప్రేమకథలకు కాలంతో సంబంధం లేదని మరోసారి నిరూపించేందుకు ‘గీతాంజలి’ సిద్ధమవుతోంది. స్పా సెంటర్ లో నటికి ఏం జరిగిందంటే.. Raviteja

భారత్ వ్యవసాయ వైవిధ్యానికి పెట్టింది పేరు. మన వంటల్లో సాధారణంగా ఉపయోగించే మసాలాల నుంచి.. అరుదుగా లభించే విలువైన గింజలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల వరకు ఎన్నో ప్రత్యేకమైన పదార్థాలు ఇక్కడ పండుతాయి. వీటిలో కొన్నింటి ధరలు సాధారణ పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్రత్యేక వాతావరణం, పరిమిత దిగుబడి, సాగులో ఉండే శ్రమ వంటి కారణాలతో ఖరీదైనవిగా మారిన భారత్‌లోని 9 ఆహార పదార్థాలేంటో చూద్దాం.1. కశ్మీరీ కుంకుమపువ్వుకశ్మీర్లోని పాంపోర్ ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసే కుంకుమపువ్వును ‘ఎర్ర బంగారం’గా పిలుస్తారు. కుంకుమ పువ్వులోని సున్నితమైన ఎర్రని కేశరాలను చేతితోనే సేకరించాలి. ఒక్కో పువ్వు నుంచి చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఇది లభిస్తుంది. దీంతో దీని సాగు, కోత చాలా శ్రమతో కూడుకున్నది. నాణ్యమైన కశ్మీరీ కుంకుమపువ్వు కొన్ని గ్రాములకే రూ.వేలు పలుకుతుంది.2. పచ్చి యాలకులుటీ, బిర్యానీ, స్వీట్లలో కొద్దిగా మాత్రమే ఉపయోగించినా పచ్చి యాలకులు ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. కేరళ, కర్ణాటక, తమిళనాడులో వీటి సాగు ఎక్కువగా జరుగుతుంది. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంతో పాటు ప్రత్యేకమైన సంరక్షణ అవసరం. యాలకులను సరైన దశలోనే కోయాలి. ఘాటు సువాసన, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ వీటి ధరను పెంచుతాయి.3. సహజ వెనిల్లావెనిల్లా రుచి కలిగిన ఉత్పత్తులు ఎన్నో ఉన్నప్పటికీ సహజ వెనిల్లా మాత్రం చాలా ఖరీదైన పదార్థం. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో దీనిని సాగు చేస్తారు. వెనిల్లా పువ్వులకు సాధారణంగా చేతితోనే పరాగసంపర్కం చేయాల్సి ఉంటుంది. కోత తర్వాత
Noida Airport Waterlogging : ఇటీవలే ప్రారంభమై కార్యకలాపాలు సాగిస్తున్న ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జెవార్ ఎయిర్పోర్ట్) వద్ద కురిసిన భారీ వర్షం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం కురిసిన వర్షానికి విమానాశ్రయ ఆవరణలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా ఇక్కడ విమానాలు నడుస్తాయా లేక పడవలు నడుస్తాయా అంటూ ప్రశ్నించారు.అసలేమైందంటే?టర్మినల్‌ను పార్కింగ్ ప్రాంతంతో అనుసంధానించే మార్గంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విమానాశ్రయ సిబ్బంది నిలిచిన నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న 28 సెకన్ల వీడియో క్లిప్‌ను అఖిలేష్ యాదవ్ తన అధికారిక ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ముఖ్యంగా ఈ వీడియో కింద "ఇప్పుడు ఈ విమానాశ్రయంలో విమానాలకు బదులు పడవలు నడుపుతారా?" అంటూ అఖిలేష్ యాదవ్ ఘాటుగా ప్రశ్నించారు.స్పందించిన విమానాశ్రయ అధికారులు..!ఈ ఉదంతంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వివరణ ఇచ్చాయి. ఊహించని రీతిలో అత్యంత భారీ వర్షం కురవడం వల్లే తాత్కాలికంగా నీరు నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన విమానాశ్రయ బృందాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే నిలిచిన నీటిని పూర్తిగా తొలగించాయని.. ఆ మార్గంలో రాకపోకలు వెంటనే సాధారణ స్థితికి వచ్చాయని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. విమాన సర్వీసులు, ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని.. వాతావరణ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు.మార్చి 28న ప్రారంభోత్సవం జరుపుకుని.. జూన్ 15వ తేదీ నుంచి సేవలు అందిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం కింద నిర్మించారు. అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణ పనులు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నాటికి పూర్తి చేసి.. ఈ

గ్రీన్ టీలో కెఫీన్, ఎల్-థియనిన్ అని పిలిచే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఈ రెండూ కలిసి ఏకాగ్రతను పెంచి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతాయి. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. గ్రీన్ టీని రోజూ తాగితే రక్తనాళాల పనితీరు చక్కగా ఉంటుంది. అలాగే, శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గ్రీన్ టీలో ఉండే EGCG వంటి సమ్మేళనాలు మెదడుకు రక్షణ కల్పిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. గ్రీన్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గ్రీన్ రోజూ 2 కప్పుల నెల రోజుల పాటూ తాగి చూడండి. ఇది జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అమ్మాయిలు గ్రీన్ టీ తాగితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్ Gold Necklace: పది గ్రాముల బంగారంలో అదిరిపోయే స్టోన్ నక్లెస్ డిజైన్లు Pregnancy Diet: ప్రెగ్నెన్సీ టైంలో ఈ పండ్లు తింటే ఎంత మంచిదో!
మహిళా సంఘాలకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న చీరల ఉత్పత్తి వేగంగా కొనసాగుతోంది. మహిళా సంఘాలకు అందించే చీరల కోసం మే నెలలో 4.62 కోట్ల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటివరకు 1.74 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. గతంలో నీలం రంగు చీరలను పంపిణీ చేయగా.. ఈ ఏడాది చిలకపచ్చ రంగును ఎంపిక చేశారు. చీరల ఉత్పత్తి ద్వారా రాజన్న సిరిసిల్ల పవర్లూమ్, మ్యాక్స్ సంఘాలకు పని లభించడంతో నేతన్నల్లో ఆశలు పెరిగాయి.ఈ ఏడాది మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న చీరల కోసం ప్రభుత్వం రూ.450 కోట్లను కేటాయించింది. ఇందులో ఇటీవల రూ.142 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. టెస్కోకు నిధులు మంజూరైన వెంటనే చీరల ఉత్పత్తి చేస్తున్న మ్యాక్స్ సంఘాలకు చెల్లింపులు జరగనున్నాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. తొలుత 133 మ్యాక్స్ సంఘాలకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు కేటాయించారు. వీటిలో 80 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేసిన 61 సంఘాలను గుర్తించి ఇటీవల రెండో విడతగా మరో 1.62 కోట్ల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చారు.ఉత్పత్తి పూర్తయిన వస్త్రాన్ని టెస్కో సేకరిస్తోంది. ఒక్కో చీరకు జాకెట్ వస్త్రంతో కలిపి 6.6 మీటర్ల మేర తయారు చేస్తున్నారు. ఒక్కో చీర ఉత్పత్తికి సుమారు రూ.238 ఖర్చవుతోంది. దీనికి అదనంగా ప్రాసెసింగ్, ప్రింటింగ్, రవాణా తదితర ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. మొత్తం చీరల ఉత్పత్తి లక్ష్యాన్ని సెప్టెంబరు 20లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. అక్టోబరులో మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దీంతో గడువులోగా ఉత్పత్తి పూర్తి చేసేందుకు మ్యాక్స్ సంఘాలు పనులను వేగవంతం చేస్తున్నాయి.మరోవైపు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏకరూప దుస్తుల వస్త్రం విషయంలో నెలకొన్న సమస్యకు కూడా పరిష్కారం లభిస్తోంది. ఫిబ్రవరిలో జిల్లా పరిశ్రమకు 63 లక్షల మీటర్ల వస్త్ర

ఇవి తెలిస్తే రోజుకొక మిర్చి అన్నంలోనే తినేస్తారు ఇవి తెలిస్తే రోజుకొక మిర్చి అన్నంలోనే తినేస్తారు Prasanna Yadla 08 August 2026 Pic credit - Pinterest వర్షంలో గోధుమ పిండి పకోడీలను ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని లాగిస్తారు. ఎలా చేయాలో ఇక్కడ చదివి చూద్దాం.. గోధుమ పిండి పకోడీ పచ్చిమిర్చిలో ఎక్కువగా విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పచ్చిమిర్చి ఈ మిర్చి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే అన్ని కూరల్లో దీనిని వేస్తారు అన్ని కూరల్లో దీనిని వేస్తారు ఇంకా ఈ మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలోని వేడిని పెంచడంలో ఇది హెల్ప్ చేస్తుంది శరీరంలోని వేడిని మీరు వీటిని సరైన మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది జీర్ణక్రియ పనితీరు ఈ పచ్చిమిర్చి చాలా తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి దీనిని మీ రోజువారీ వంటల్లో కూడా తీసుకోవచ్చు పచ్చిమిర్చి ఇంకా దీనిలో ఉండే విటమిన్ C శరీర రోగనిరోధక వ్యవస్థకు ఎంతగానో ఇది హెల్ప్ చేస్తుంది శరీర రోగనిరోధక వ్యవస్థ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి