
మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు వాటి తాజాదనం, రంగు మాత్రమే చూస్తే సరిపోదు. వాటిపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు అవి తాజాగా, నాణ్యంగా ఉన్నాయా అని మాత్రమే చూస్తాం. కానీ వాటి ఉపరితలంపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. అందుకే కూరగాయలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడంతో పాటు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
పొలం నుంచి మార్కెట్ వరకు కూరగాయలు అనేక దశల్లో ఇతర పదార్థాలతో సంబంధం కలిగి ఉంటాయి. సాగు సమయంలో ఉపయోగించే పురుగుమందులు, కలుషిత నీరు, రవాణా సమయంలో అపరిశుభ్రత, మార్కెట్లో దుమ్ము, ఈగలు వంటి కారణాల వల్ల వాటిపై కాలుష్యం చేరవచ్చు. కూరగాయలను నేలపై ఉంచడం, శుభ్రత లేని ప్రదేశాల్లో నిల్వ చేయడం, మురికి సంచుల్లో రవాణా చేయడం వంటివి కూడా వాటిపై సూక్ష్మజీవులు చేరడానికి కారణమవుతాయి.
సరిగ్గా శుభ్రం చేయని కూరగాయలను తినడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆహార సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా..
కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన వాటిని ఎంచుకోవచ్చు.
కుళ్లిన లేదా దెబ్బతిన్న కూరగాయలను కొనకండి.
అసహజమైన రంగు ఉన్న వాటిని తీసుకోకపోవడం మంచిది.
చాలా ఎక్కువగా మెరుస్తున్న కూరగాయలను జాగ్రత్తగా పరిశీలించండి.
కూరగాయలు శుభ్రమైన ప్రదేశంలో ఉంచారా లేదా గమనించండి.
కాలువలు, చెత్త కుప్పల దగ్గర విక్రయించే కూరగాయలను వీలైనంత వరకు కొనకండి.
ఈగలు ఎక్కువగా వాలుతున్న కూరగాయలను తీసుకోకుండా ఉండటం మంచిది.
మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిన వెంటనే వాటిని ఒకసారి పరిశీలించి శుభ్రం చేయాలి. శుభ్రమైన ప్రవహించే నీటితో కూరగాయలను బాగా కడగడం ముఖ్యం. ఆకుకూరలను విడదీసి కడగడం వల్ల వాటిపై ఉన్న దుమ్ము వంటి మలినాలను తొలగించవచ్చు. కూరగాయలను కడగకుండా నేరుగా ఫ్రిజ్లో పెట్టడం కంటే, వాటిని సరిగ్గా శుభ్రం చేసి ఆరబెట్టిన తర్వాత నిల్వ చేయడం మంచిది.
కొంతమంది కూరగాయలను ఉప్పు నీటిలో నానబెడితే మరింత శుభ్రంగా అవుతాయని భావిస్తారు. అయితే అన్ని రకాల సూక్ష్మజీవులు లేదా పురుగుమందుల అవశేషాలను ఉప్పు నీరు పూర్తిగా తొలగిస్తుందని భావించకూడదు. కూరగాయలను శుభ్రమైన ప్రవహించే నీటితో బాగా కడగడం ప్రధానమైన జాగ్రత్త.
ప్రెషర్ కుక్కర్ విజిల్ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్






