
ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్
Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

Viral Video: ఆయ్.! నేను వెజిటేరియన్.. కుక్క పిల్లను పట్టుకుని చంపకుండా వదిలేసిన చిరుత.. వీడియో వైరల్ ఈ వార్తకు సంబంధించిన

వర్షాకాలంలో లభించే అతి ముఖ్యమైన కూరగాయల్లో బోడ కాకరకాయ ఒకటి.. దీనిని అడవి కాకరకాయ అని కూడా పిలుస్తారు. ఈ సీజనల్ కూరగాయ జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు ఎక్కువగా లభిస్తుంది. నగర మార్కెట్లలో, ముఖ్యంగా రైతు బజార్లలో బోడ కాకరకాయలు విస్తృతంగా విక్రయిస్తారు. ఈ కూరగాయకు ప్రస్తుతం అసాధారణమైన డిమాండ్ ఉంది.. ప్రధానంగా దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల వల్ల ఎంతో మంది దీనిని తినేందుకు ఇష్టపడతారు. బోడ కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ (కరోటిన్), విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ లభిస్తాయి. దీనిలోని డైటరీ ఫైబర్ (ఫైబర్) జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బోడ కాకరకాయలో అనేక పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇది ముఖ్యంగా షుగర్ (మధుమేహం) స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే షుగర్ వ్యాధితో బాధపడేవారు దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పండే బోడ కాకరకాయ ఇప్పుడు నగర ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తోంది. రైతులు తమ పొలాల నుండి తాజా బోడ కాకరకాయలను నేరుగా రైతు బజార్లకు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ కాయలు చాలా తాజాగా, మంచి ఆకృతితో కనిపిస్తాయి. ఇవి కొంత బొడిపెలుగా, గుండ్రంగా ఉంటాయి. బోడ కాకరకాయ రుచి కూడా ఎంతో బాగుంటుంది. దీన్ని కూరగా వండుకోవచ్చు

ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన శ్రీశైలం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య దర్శనం. కానీ, ఈ పుణ్యక్షేత్రంలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన, ఎంతో మహిమాన్వితమైన మరొక అద్భుత ప్రదేశం ఉంది. అదే దట్టమైన నల్లమల అడవుల మధ్య కొలువైన ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం. భారతదేశం మొత్తం మీద ‘ఇష్టకామేశ్వరి’ పేరుతో దేవి ఆలయం ఉన్న ఏకైక ప్రదేశం శ్రీశైలం మాత్రమే. సాధారణంగా కామేశ్వరీ దేవి అంటే ఎనిమిది భుజాలతో కనిపిస్తుంది. కానీ ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో ప్రత్యేక స్వరూపంలో దర్శనమిస్తారు. ఇష్టకామేశ్వరి దేవి ఆలయంలో జరిగే అద్భుతం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ విగ్రహం రాతితో మలచబడినప్పటికీ, భక్తులు అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టే సమయంలో ఆమె నుదుటి భాగం మనిషి చర్మంలా ఎంతో మెత్తగా తగులుతుంది. విగ్రహాన్ని తాకిన ప్రతిఒక్కరూ ఈ అనుభూతిని పొంది ఒళ్లు జలదరింపజేసే అద్భుతాన్ని కళ్లారా చూస్తారు. రాయిలా ఉండే విగ్రహం నుదుటి వద్ద మాత్రం మనుషుల చర్మంలా మెత్తగా ఉండటం వెనుక ఉన్న రహస్యాన్ని చూడటానికి ఎంతోమంది భక్తులు సాహసాలు చేసి మరి ఇక్కడికి వస్తుంటారు. తన వద్దకు వచ్చే భక్తులు మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా, ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు వెంటనే నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి నుదుటన బొట్టు పెట్టి, మనసులోని కష్టాన్ని చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ సమస్య తీరిపోతుందని ప్రతీతి. పూర్వం ఈ ప్రదేశం కాపాలికులు, సిద్ధులకు ప్రధాన ధ్యాన కేంద్రంగా ఉండేది. నాగార్జునుడు వంటి సిద్ధులు ఇక్కడి మూలికలతో ఎన్నో ప్రయోగాలు చేశారని కథనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడి గుహలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీశైలం ప్రధాన ఆలయం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహాలయానికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడికి సాధారణ

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోర్వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చనేది ప్రాథమికంగా అంచనా వేశామని అధికారులు చెప్పారని అన్నారు. ఈ మేరకు ఎక్స్(X)లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.. ఏనుగు మృతి ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళను అడవిలో వదిలేశారు. అక్కడ ఒంటరిగా ఉన్న సదరు మహిళను స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. భూపాలపల్లి, ఆగస్టు 22: మానవత్వాన్ని మంటగలుపుతూ కన్నవారే కసాయివారిలా మారారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులే అడవిలో వదిలేశారు. ఈ అమానుష ఘటన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి కుటుంబ సభ్యులు ఆమెను మేడారం-కాటారం రహదారిలోని పెద్దవాగు సమీప అడవిలో వదిలేశారు. ఒంటరిగా ఉన్న లలితను అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. ఆ వెంటనే 108కి సమాచారం అందించడంతో సిబ్బంది మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన కుటుంబమే అలా ఒంటరిగా వదిలేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన బాధితురాలి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

రైల్వే ట్రాక్‌ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్‌పై దూసుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంటర్నెట్ డెస్క్: రైల్వే ట్రాక్‌ను భారీ ఏనుగుల గుంపు దాటుతోంది. అంతలో ట్రాక్‌పై దూసుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కొంత దూరంలో ఆగిపోయింది. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఏనుగుల గుంపు ట్రాక్ వైపు రావడాన్ని అటవీ శాఖ అధికారి గుర్తించారు. వెంటనే ఆయన స్పందించారు. ట్రాక్‌పై వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు ఆపాలంటూ ఆయన సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ ఏనుగుల గుంపు ట్రాక్ దాటే వరకు రైలును ఆపేశారు. ఈ వీడియోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అటవీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ఫలితం మాత్రం దారుణంగా ఉంటుందని అంటున్నారు. అయితే అస్సాంలో ఇది సర్వ సాధారణం అని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై అధికారులు నిఘా ఉంచుతారు. అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే ఏనుగుల గుంపును గమనించిన వెంటనే.. వారు రైల్వే అధికారులను లేదా ఎక్స్‌ప్రెస్ రైలులోని లోకో పైలట్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో ఆ జీవులు ట్రాక్ దాటే వరకు రైలును నిలిపివేస్తారు. మమ్మల్ని అలా పిలవద్దు.. నెటిజన్లను కదిలిస్తున్న చిన్నారి ఆవేదన మృత్యువు అంచుల దాకా వెళ్లి తప్పించుకున్నాడు.. వీడియో వైరల్

తిరుమల (Tirumala) కొండల్లో భక్తుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ (TTD) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించి, ప్రమాదం ఏర్పడే అవకాశాలను తగ్గించేందుకు ఆధునిక రోబోట్‌ను ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా మనుషులు వెళ్లడం కష్టంగా ఉండే ప్రాంతాల్లో ఈ పరికరం ద్వారా నిఘా పెట్టడం వల్ల అటవీ, భద్రతా సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి (C.H. Venkaiah Chowdary) గురువారం పద్మావతి అతిథిగృహం వద్ద రోబోట్ డాగ్ పనితీరును పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి దాని సామర్థ్యాలను తెలుసుకున్నారు. అడవుల్లో చిరుతలు, ఇతర జంతువుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దీనిని ఎలా వినియోగించవచ్చనే అంశంపై వివరాలు సేకరించారు. భక్తులు ప్రయాణించే మార్గాలకు సమీపంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఇది ఎంతవరకు సహాయపడుతుందనే దానిపై కూడా చర్చించారు. ఈ నాలుగు కాళ్ల రోబోట్‌లో అనేక ఆధునిక పరికరాలు ఉన్నాయి. సాధారణ కెమెరాతో పాటు థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ రకాల సెన్సార్లు ఇందులో అమర్చారు. కృత్రిమ మేధ (Artificial Intelligence) సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో వెలుతురు తక్కువగా ఉన్న సమయంలోనూ పరిసరాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. పొగమంచు లేదా చీకటి వంటి పరిస్థితుల్లో కూడా కదులుతున్న జీవులు, మనుషులు, వాహనాలను గుర్తించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. రోబోట్ సేకరించే సమాచారాన్ని కృత్రిమ మేధ ద్వారా విశ్లేషించి వివిధ వస్తువులు, జీవులను ప్రత్యేకంగా గుర్తించేలా రూపొందించారు. ఉదాహరణకు పెద్ద జంతువు కనిపిస్తే దాన్ని మనిషి లేదా వాహనంతో కలిపి చూడకుండా ప్రత్యేకంగా గుర్తించే సామర్థ్యం ఉంటుంది. ప్రమాదకరమైన ప్రాంతంలో వన్యప్రాణి కదలిక గుర్తించినప్పుడు దాని స్థానాన్ని ఆధారంగా చేసుకుని సంబంధిత సిబ్బందికి హెచ్చరికలు పంపే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలిపిరి (Alipiri) నుంచి తిరుమలకు

ఆంధ్రప్రదేశ్‌లోని అడవులను, వన్యప్రాణులను మరియు విలువైన అటవీ సంపదను ప్రతి అంగుళం కాపాడేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. అటవీ పరిరక్షణలో అత్యాధునిక సాంకేతికతను జోడించడం ద్వారా స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న అటవీ ఐటీ నివేదికలు, అక్కడి పరిరక్షణ నమూనాలను పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలించారు. అడవుల్లో జరిగే ప్రతి కదలికను క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా ఒక అత్యాధునిక ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేంద్రం ద్వారా అటవీ ప్రాంతాల్లో అక్రమ రవాణా, చెట్ల నరికివేత, వన్యప్రాణుల వేట వంటి అసాంఘిక కార్యకలాపాలకు శాశ్వతంగా బ్రేక్ వేయనున్నారు. కేవలం సాంకేతికతతో నిఘా పెట్టడమే కాకుండా, అటవీ సంపదను కాపాడటంలో ఎక్కడా రాజీ పడకూడదనే పటిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది విధుల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ‘ఈ-గస్తు’ తరహా ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ ద్వారా అటవీ అధికారులు, బీట్ సిబ్బంది నిర్వహించే గస్తీ (పెట్రోలింగ్) వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ రూపంలో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. కర్ణాటక అటవీ ఐటీ విభాగం సాధించిన విజయాలను ఏపీలోనూ వర్తింపజేస్తూ, త్వరలోనే రాష్ట్రంలో ఒక సమగ్ర ఆధునిక సాంకేతిక రక్షణ వ్యవస్థను తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ అటవీ అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు
తిరుపతి ఘాట్ రోడ్డులో చిరుత పులి తిరుపతి జిల్లా చిట్వేలు - రాపూర్ ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిట్వేలు నుంచి పెంచలకోన వైపు వెళ్తున్న ప్రయాణికులు రాత్రి వేళ మూడో మలుపు వద్ద చిరుత సంచరిస్తుండటాన్ని గమనించారు. ప్రస్తుతం పెంచలకోనలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బైక్‌లపై వెళ్లే భక్తులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘాట్ రోడ్డులో వెళ్లేవారు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు హెచ్చరించారు. ఈ వార్తకు సంబంధించిన

Amazon River : దక్షిణ అమెరికా ఖండంలో ప్రవహించే అమెజాన్ నది కేవలం ఒక నీటి ప్రవాహం మాత్రమే కాదు, అది ఈ భూగోళానికి జీవనాడి. ప్రపంచంలోనే అత్యధిక నీటి ప్రవాహం కలిగిన నది ఈ అమెజాన్. దట్టమైన అడవుల గుండా ప్రయాణం, అరుదైన జీవరాశులు, విస్మయపరిచే సహజ వింతలతో నిండిన ఈ నది గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పెరూ దేశంలోని ఆండిస్ పర్వతాల్లో పుట్టే ఈ అమెజాన్ నది బ్రెజిల్ లో అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది. మధ్యలో మరో దేశం కొలంబియాలో కూడా ఈ నది ప్రవహిస్తుంది. ఇలా మూడు దేశాల గుండా దాదాపు 6,400 కిలోమీటర్ల (4,000 మైళ్ళు) దూరం ప్రయాణిస్తుంది. ప్రపంచంలోని అన్ని నదుల నుండి సముద్రాల్లో కలిసే నీటిలో 15 నుండి 20 శాతం ఈ అమెజాన్ నదివే. ఇలా ప్రపంచంలో అత్యధిక నీటి ప్రవాహం గల ఇలాంటి నదిపై ఒక్కటంటే ఒక్క బ్రిడ్జ్ లేకపోవడం ఆశ్చర్యకరం. వేల కిలోమీటర్ల పొడవునా ప్రవహించే అమెజాన్ నదిపై ఒక్కటంటే ఒక్క వంతెన (Bridge) కూడా లేకపోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. దట్టమైన వర్షాధార అడవులు ఉండటం, తీరం వెంట జనాభా చాలా తక్కువగా నివసించడం వల్ల ఇక్కడ వంతెనల అవసరం పడలేదు. పైగా వర్షాకాలంలో ఈ నది వెడల్పు విపరీతంగా పెరిగిపోతుంది. నది ఒడ్డున ఉన్న మట్టి చాలా మెత్తగా ఉండటం వల్ల ఇక్కడ వంతెనలు నిర్మించడం భౌగోళికంగా కూడా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడి ప్రజలు రవాణా కోసం ఎక్కువగా పడవలు, ఫెర్రీలనే ఉపయోగిస్తారు. అమెజాన్ నది ప్రవాహ పరిమాణం (Water Discharge) విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని సముద్రాల్లోకి కలిసే మొత్తం మంచి నీటి ప్రవాహంలో దాదాపు 20 శాతం నీరు ఒక్క అమెజాన్ నది నుంచే వస్తుంది. ఈ నది గుండా సెకనుకు ప్రవహించే నీటి పరిమాణం దాదాపు

మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది. కేసముద్రం(మహబుబాబాద్): మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామ శివారుల్లోని ఓ గ్రానైట్ క్వారీ వైపు వ్యవసాయ భూమి ఉన్న గండికోట కుమార్ తన పొలం వద్దకు వెళ్లగా చిరుతపులి కనిపించిందని గ్రామస్తులకు తెలిపాడు. సోమవారం సాయంత్రం తన పొలం వద్ద దూరంగా చిరుతపులిని చూసిన కుమార్ తీవ్ర భయాందో ళనకు గురయ్యాడు. తన పెంపుడు కుక్కతో సహా సమీపంలోని ఒక బావిగుంతలో దాక్కున్నట్లు పేర్కొన్నాడు. పులి వెళ్లిపోయిన తర్వాత తన పొలంలోని పాదముద్రలను ఫోన్లో ఫోటో తీసి గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయడంతో కలకలం రేపుతోంది. ఈ పులి ఆయనకు గత రెండు రోజులుగా కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా మూడు రోజుల క్రితం గూడూరు మండలం బొల్లెపల్లి ప్రాంతంలోనూ చిరుత కనిపించిందని అటవీశాఖాధికారులకు సమాచారం అందింది. అయితే అటవీశాఖాధికారులు వెతికినప్పటికీ పులిజాడ కనిపించలేదని తెలిసింది. ఈ విషయంపై అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ అర్పనపల్లి లో పాదముద్రలు లభించినట్లు గ్రామస్తులు సమాచారం అందించారని, ఇది అడవిపిల్లి పాదముద్రలు కూడా అయి ఉండొచ్చన్నారు. కాగా.. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తామని వెల్లడించారు. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే
అసెంబ్లీ సాక్షిగా సీఎం క్షమాపణలు.. మాజీ సీఎం ప్రస్తావనతో..! తమిళనాడు శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. హెల్త్, రెవెన్యూ పద్దులపై చర్చ సందర్భంగా అటవీ శాఖ మంత్రి ఆర్వి రంజిత్ కుమార్ మాజీ సీఎం కరుణానిధి పేరును నేరుగా ప్రస్తావించడంపై డీఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం కూడా జోక్యం చేసుకుని సభ సాంప్రదాయాలను గుర్తుచేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం సి. జోసెఫ్ విజయ్ సభలోనే క్షమాపణలు తెలిపారు. అనంతరం రూల్ 110 కింద సీఎం సభలో ప్రకటన చేస్తూ.. రూ. 75 వేల వరకు ఉన్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తం రుణమాఫీ ప్యాకేజీ రూ. 6,220 కోట్లకు చేరగా, 13.34 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ వార్తకు సంబంధించిన

ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రీనింగ్, 'రీఫారెస్టేషన్' (పునరటవీకరణ) కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును (నాగేంద్రరావు) ( MLC Konidela Nagendra Babu) ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో ఆర్టీ నంబర్ -93 ద్వారా ఈ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం, అడవుల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ఆయా కార్యక్రమాలను అమలు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో ఫారెస్ట్, ట్రీ కవర్‌ను 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఏపీ గ్రీన్ గవర్నింగ్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర గ్రీన్ లక్ష్యాల అమలు, సమన్వయం, పర్యవేక్షణలో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా కొణిదెల నాగేంద్రబాబును నియమించిన ఏపీ సర్కార్.. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ నిబంధనలకు లోబడి కేబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ గ్రీన్, జిల్లా గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీల కార్యకలాపాల సమర్థవంతంగా అమలు చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌ను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఏనుగుల సంచారం.. ప్రజలను అప్రమత్తం చేయండి: పవన్ కల్యాణ్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాల్లోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంబంధిత అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్లను వినియోగించాలని, అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ గస్తీని మరింత పెంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏనుగులు సంచరించే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇందుకోసం రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలు కనిపించిన వెంటనే సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో హనుమాన్ బృందాలను మోహరించి ఏనుగుల కదలికలను పర్యవేక్షించాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. ఏనుగులను రెచ్చగొట్టకుండా, వాటికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. చంద్రగిరి పరిసర గ్రామాల్లో ఏనుగుల సంచారంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. అటవీ సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏనుగులు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి అధికారులకు సమాచారం అందించాలని పవన్ కల్యాణ్ మార్గనిర్దేశం చేశారు. దమ్ముంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి: యరపతినేని ‘నిబంధనల ప్రకారమే జగన్‌ను ములాఖత్‌కు అనుమతించాం’ తిరుపతిలో ఆస్తి రిజిస్ట్రేషన్ వివాదం.. రైతు ఆత్మహత్యాయత్నం

స్వాతంత్ర్య సంబరాల వేళ గుజరాత్ అటవీ శాఖ ఒక అద్భుతమైన పర్యావరణ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశానికి స్వాతంత్ర్యమొచ్చి 80 ఏళ్లు పూర్తయిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని, ఒకప్పుడు కళకళలాడి కాలక్రమేణా బోసిపోయిన బన్నీ గడ్డిభూములకు మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ జామనగర్ వంతారా పునరావాస కేంద్రం సహకారంతో ఏకంగా 20 కృష్ణజింకలను కచ్‌లోని సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలోకి సురక్షితంగా వదిలిపెట్టారు.ఆడ, మగ జింకల కొత్త ప్రయాణంఈ విడతలో మొత్తం 5 మగ జింకలు, 15 ఆడ జింకలను అడవిలో విడిచిపెట్టారు. జామనగర్లోని వంతారా కేంద్రాం నుంచి వీటిని కచ్ ప్రాంతానికి తీసుకురావడానికి ముందు కేంద్ర జూ అథారిటీ నుంచి అన్ని అనుమతులు సాధించారు. సుదూర ప్రయాణంలో జింకలకు ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక వెటర్నరీ వైద్యుల సమక్షంలో, పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే అత్యంత జాగ్రత్తగా ఇక్కడికి తరలించారు.జీవావరణ వ్యవస్థకు కొత్త ఊపిరిఒకప్పుడు ఈ బన్నీ గడ్డిభూముల్లో కృష్ణజింకలు, చింకారా, నీల్గాయ్ వంటి జంతువులు విరివిగా సంచరించేవి. అయితే కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గిపోవడంతో ఇక్కడి పర్యావరణ సమతుల్యత దెబ్బతింది. ఇప్పుడు ఈ 20 జింకల రాకతో ఇక్కడ ఆహారపు గొలుసు మళ్లీ బలోపేతం కానుంది. భవిష్యత్తులో క్రూర మృగాలకు తగినంత ఆహారం లభించడంతో పాటు, గడ్డిభూముల సహజ సమతుల్యత దారిన పడుతుందని అధికారులు భావిస్తున్నారు.70 ఏళ్ల తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన రాక్షస పులి..ప్రాజెక్ట్ చీతా దిశగా మరో అడుగుభారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతా వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడనుంది. శాస్త్రీయ పద్ధతులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అటవీ ప్రాంతాలను తిరిగి అభివృద్ధి చేయవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రాబోయే రోజుల్లో బన్నీ ప్రాంతం మళ్లీ పచ్చటి జీవవైవిధ్యంతో కళకళలాడుతుందని అటవీ శాఖ తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తోంది.చీతాల రాజ్యంలో సరికొత్త రికార్డు.. స్వేచ్ఛా వనంలోకి మరో

– వన్యప్రాణుల వేటకు అమర్చిన బైండింగ్ వైరు స్వాధీనం – వివరాలు వెల్లడించిన పాల్వంచ సీఐ సతీష్ బూర్గంపహాడ్, ఆగస్టు 15 : వన్య ప్రాణుల వేట కోసం అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ మృతిచెందిన విషయం తెలిసిందే. నవీన్ మృతికి కారణమైన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పాల్వంచ సీఐ సతీష్ శనివారం తెలిపారు. ఈ నెల 11న రాత్రి నకిరిపేట అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అక్రమంగా అడవి జంతువులను వేటాడేందుకు వైర్లను అమర్చారని సమాచారం అందగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్, డీఆర్వో, తోటి సిబ్బందితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి సదరు వ్యక్తుల ఆచూకీ కోసం వెతుకుతుండగా విద్యుత్ వైర్లు తగిలి నవీన్ మృతిచెందగా డీఆర్వో అనార్కలీ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు నవీన్ మృతికి కారకులైన లక్ష్మీపురానికి చెందిన ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేష్, తాటి వీరబాబు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన కన్నెదారి అనంతయ్యపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నమ్మదగిన సమాచారంతో శనివారం ఆవుల నాగిరెడ్డితో పాటు అతని ఇంట్లోనే ఉన్న మిగిలిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితులు వన్య ప్రాణులను హతమార్చేందుకు ఉపయోగించిన బైండింగ్ వైరు, అక్కడ పాతడానికి ఉపయోగించిన కర్రలు, గడ్డపలుగు, ఖాళీ మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా అటవీ జంతువులను వేటడానికి అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చి అమాయక జంతువుల ప్రాణాలు, మనుషుల ప్రాణాలు పోవడానికి కారణమైతే చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు మేడా ప్రసాద్, నాగభిక్షం పాల్గొన్నారు

ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో అడవి జంతువులకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జంతువుల వేట, వాటి మధ్య జరిగే పోరాటం, ప్రకృతి అందాలకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అడవి జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు ఆశ్చర్యంతో పాటూ ఉత్కంఠను కలిగిస్తుంటాయి. అడవిలో అత్యంత వేగవంతమైన, చాకచక్యమైన వేటాడే కృర మృగాల్లో చిరుతపులి ఒకటి. తన వేగం, బలం, సమయస్ఫూర్తితో తన వేట కొనసాగిస్తుంది. తాజాగా ఓ చిరుత వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో.. చిరుత తన వేట కోసం అడవి పందిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. తొలుత తల్లి పందిని దాని పిల్లకు దూరంగా తీసుకెళ్లిన చిరుత.. ఆ తర్వాత అవకాశం రాగానే.. పింది పిల్లలు ఉన్న గోతిలోకి దూరింది. అనంతరం ఒక్కసారిగా చిరుత పిల్లపై దాడి చేసి, పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే మొదట ఓ పంది పిల్ల తప్పించుకున్నప్పటికీ, మరో పంది పిల్ల చిరుతకు చిక్కింది. పంది పిల్లను నోట కరుచుకున్న చిరుత.. అక్కడి నుంచి తాపీగా వెళ్లిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చిరుత వేట మామూలుగా లేదుగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

– అక్రమ విద్యుత్ ఉచ్చుల మూలాలపై సమగ్ర దర్యాప్తు – వందేళ్లలో ఇలాంటి సంఘటనా ఎక్కడా జరగలేదు – డీఎఫ్ఓ సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ బూర్గంపహాడ్, ఆగస్టు 13 : వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి విధి నిర్వహణలో చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ ప్రాణాలు కోల్పోయారని… ఈ ఘటనను అటవీ శాఖ అత్యంత సీరియస్ గా తీసుకుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. గురువారం చెరువు సింగారం బీట్ పరిధిలోని నకిరిపేట అటవీప్రాంతాన్ని ఆయన అటవీ అధికారులతో కలిసి పరిశీలించారు. అటవీ సిబ్బంది ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమ చర్యలను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ముసలిమడుగు సెక్షన్ పరిధిలో చెరువుసింగారం బీట్ లో సంఘటనా స్థలంలో అణువణువునా పరిశీలించారు. అక్రమ విద్యుత్ ఉచ్చు ఏర్పాటు చేసిన ప్రాంతం, విద్యుత్ సరఫరా జరిగిన విధానం, సంబంధిత విద్యుత్ లైన్లు, అక్రమంగా విద్యుత్ తీసుకున్న మార్గం, పరిసర ప్రాంతాల పరిస్థితులను పరిశీలించారు. ఈ ఘటన కేవలం వన్యప్రాణుల వేటకు సంబంధించిన నేరంగా మాత్రమే కాకుండా ప్రాణాంతకమైన అక్రమ విద్యుత్ వినియోగం, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ భద్రత, ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణ, అంతరశాఖల సమన్వయానికి సంబంధించిన అంశంగా పరిగణించారు. అక్రమ విద్యుత్ కనెక్షన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏ విద్యుత్ లైన్ నుంచి సరఫరా జరిగింది, ఎలాంటి విధానంలో విద్యుత్‌ను అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు, అక్రమ కనెక్షన్ ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి ఫీల్డ్ సిబ్బందికి ఎప్పుడైనా సమాచారం అందిందా, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లపై అవసరమైన పర్యవేక్షణ తనిఖీలు జరిగాయా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని డీఎఫ్ఓ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో అక్రమ విద్యుత్ ఉచ్చును ఏర్పాటు చేసిన వ్యక్తులు ఎవరు, వారికి విద్యుత్ సరఫరా ఎలా అందింది, ఈ

లార్ గిబ్బన్ కోతితో విక్రమ్ వీడియో వైరల్ కావడంతో తమిళనాడు అటవీశాఖ విచారణ చేపట్టింది. తాజాగా విక్రమ్‌కు నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) ప్రస్తుతం ఓ అరుదైన వన్యప్రాణికి సంబంధించిన వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇటీవల విక్రమ్ లార్ గిబ్బన్ ( Lar Gibbon) కోతితో విక్రమ్ ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వివాదం మరింత ముదిరింది. దీంతో ఈ విషయం తమిళనాడు అటవీశాఖ దృష్టిన పడింది. లార్ గిబ్బన్‌ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? దాన్ని పెంచేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసులో విక్రమ్‌కు అటవీశాఖ నోటీసులు జారీ చేశారు. లార్ గిబ్బన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా అటవీశాఖకు సమర్పించాలని అధికారులు విక్రమ్‌ను ఆదేశించారు. ఆ కోతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చెందినది, విక్రమ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల వద్దకు ఎప్పుడు తీసుకువచ్చారు వంటి వివరాలను ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే లార్ గిబ్బన్‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? దానికి సంబంధించిన పత్రాలు ఏమిటి? కోతి కొనుగోలు, బదిలీ, పెంపకానికి సంబంధించిన రికార్డులు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై కూడా అధికారులు వివరాలు కోరినట్లు తెలుస్తోంది

ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అమరావతి, ఆగస్టు 12: ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఏనుగు కేవలం అడవిలో జీవి మాత్రమే కాదని, పర్యావరణ సమతులత్యకు ప్రతీక అన్నారు. భారతదేశ వారసత్వంలో ఏనుగులు అంతర్భాగమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగులు, H.A.N.U.M.A.N. చొరవతో వన్యప్రాణుల రక్షణ రక్షణను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని పవన్ వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బంది, రెస్క్యూ మౌలిక వసతులు, సాంకేతికతతో వేగవంతంగా స్పందించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సురక్షిత సమాజాలు, రక్షిత అడవులు, ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యమని స్పష్టం చేశారు. ఏనుగులను కాపాడాలి.. అడవులను రక్షించాలి.. భవిష్యత్తును భద్రపరచాలి అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. వేంకటేశ్వర స్వామిని అవమానించిన వారిపై క్రిమినల్ కేసులు: భానుప్రకాశ్ రెడ్డి వైసీపీ హయాంలో గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు.. సిట్ ఏం తేల్చిందంటే

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది. బాండెడ్ క్రెయిట్గా గుర్తించిన అటవీ అధికారులు ఖానాపురం(వరంగల్): వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది. స్థానికులు వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు దాన్ని చూసి బాండెడ్ క్రెయిట్ అనే పాముగా గుర్తించారు. పసుపు, నల్లని చారికలతో పొడవుగా ఉండే ఈ విషసర్పాలు చైనా, నేపాల్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటాయన్నారు. తెలంగాణలో కనిపించడం చాలా అరుదని, ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియడం లేదని అన్నారు. ఇవి ప్రధానంగా నీటి లభ్యత ఉండే ప్రాంతాల్లో ఉంటాయని, చీమల పుట్టలు, పొదల్లో నివసిస్తాయని తెలిపారు. అనంతరం దాన్ని తీసుకెళ్లి పాకాల అడవుల్లో వదిలేశారు. మెట్రో ఫేజ్-1 రుణసేకరణ బాధ్యత ఎస్బీఐ క్యాప్స్‌దే

Kothagudem: జంతువుల ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్! ఈ వార్తకు సంబంధించిన

Sri Sathya Sai: కదిరి అటవీశాఖ అధికారుల మెరుపు దాడి: 7 మంది వేటగాళ్లకు రిమాండ్! ఈ వార్తకు సంబంధించిన

తమిళ సినీ నటుడు చియాన్ విక్రమ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక రీల్ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. అందులో ఆయన లార్ గిబ్బన్ అనే అరుదైన ప్రైమేట్తో సరదాగా సమయం గడుపుతూ కనిపిస్తారు. ఈ దృశ్యాలు బయటకు వచ్చిన వెంటనే వన్యప్రాణి రక్షణ చట్టాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా తమిళనాడు అటవీ శాఖ అధికారులు దీనిపై సమగ్ర విచారణను ప్రారంభించారు. ఆగస్టు 9న విక్రమ్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ దృశ్యాలు చెన్నైలోని ఇంజంబాక్కం ప్రాంతంలో ఉన్న ఆయన బంధువుల నివాసంలో తీసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ జీవి విక్రమ్ కుమార్తె మామ, ప్రముఖ వ్యాపారవేత్త సి.కె. రంగనాథన్‌కు చెందినదిగా సమాచారం వెలువడింది. అయితే చట్టపరమైన ప్రశ్నలు తలెత్తడంతో విక్రమ్ 24 గంటల వ్యవధిలోనే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. చెన్నై వన్యప్రాణి వార్డెన్ కులాల్ యోగేష్ విలాస్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ రాకేష్ కుమార్ డోగ్రా ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. అధికారులు రంగనాథన్ నివాసానికి వెళ్లి సదరు జీవికి సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ అరుదైన జీవి నివాసం మరియు దాని నిర్వహణపై పూర్తి వివరాలు సేకరించే ప్రక్రియ వేగవంతమైంది. ఫలితంగా, ఈ లార్ గిబ్బన్ జూన్ 2026లో మణిపూర్ నుండి ఈరోడ్‌కు చేరుకుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 5న ఈరోడ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి రంగనాథన్‌కు బదిలీ అయినట్లు ఫారమ్-I లో నమోదైంది. ఈ నేపథ్యంలో, బదిలీకి సంబంధించిన దరఖాస్తులు తమిళనాడు చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ వద్ద ఇంకా ఆమోదం కోసం పెండింగ్‌లోనే ఉన్నాయి. లార్ గిబ్బన్ ఆగ్నేయాసియా ప్రాంతానికి చెందిన అరుదైన జీవి కావడం వల్ల దీనికి అంతర్జాతీయంగా సీట్లు అపెండిక్స్-I కింద అత్యధిక రక్షణ ఉంటుంది. భారతదేశంలో దీనిని వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972కింద

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులకు నాణ్యమైన కలపను ఎటువంటి లాభాపేక్ష లేకుండా, కేవలం అసలు ధరకే అందించాలని ఆయన అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆగస్టు 11న జరిగిన సమీక్షా సమావేశంలో ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్’ల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను ఆయన ఖరారు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న చేతివృత్తుల కళాకారులకు ముడిసరుకు కొరత ప్రధాన సమస్యగా మారింది. మార్కెట్లో మధ్యవర్తుల ప్రమేయం పెరగడంతో, నాణ్యమైన కలప అధిక ధరలకు లభిస్తోంది, దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోంది. ఈ సమస్యను గుర్తించిన పవన్ కళ్యాణ్, ముడిసరుకు సేకరణ నుంచి రవాణా మరియు నిల్వ వరకు అయ్యే ఖర్చులను మాత్రమే వసూలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కళాకారులకు కావాల్సిన ముడిసరుకు అత్యంత సరసమైన ధరలకే అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని 6 ప్రధాన కేంద్రాల్లో ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. కొండపల్లి, ఎటికోప్పాక, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి మరియు బొబ్బిలి ప్రాంతాల్లో ఈ కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏర్పాటు వల్ల స్థానిక చేతివృత్తుల వారికి రవాణా ఖర్చులు కూడా తగ్గనున్నాయి. కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన తేలికపాటి పొనికి కలపను, ఎటికోప్పాక బొమ్మలకు అంకుడు కలపను ఈ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఫలితంగా బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే జాక్ ఫ్రూట్ మరియు రోజ్‌వుడ్ వంటి ఖరీదైన కలప కూడా ఇక నుంచి కళాకారులకు సులభంగా దొరుకుతుంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ వుడ్ బ్యాంక్ ద్వారా వెదురు మరియు టేకు వంటి రకాలను కూడా సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా, అరుదైన కలప జాతులను గుర్తించి వాటిని అటవీ నర్సరీలలో పెంపకం చేపట్టాలని పవన్ కళ్యాణ్

తక్కువ ధరకే నాణ్యమైన కలప ఆరు క్లస్టర్లలో వుడ్ బ్యాంకులు దళారుల వ్యవస్థకు చెక్ పెడుతూ Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ, వారసత్వ హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు వాటిని నమ్ముకున్న కళాకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)నేతృత్వంలో అటవీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముడిసరకు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొయ్య బొమ్మలు, వీణల తయారీదారులకు నాణ్యమైన కలపను లాభాపేక్ష లేకుండా, కేవలం రవాణా, నిర్వహణ ఖర్చులకే తక్కువ ధరలో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్రమ కలప సేకరణను అరికడుతూనే దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే సరుకు సరఫరా చేయడం ద్వారా కళాకారుల ఉత్పత్తి ఖర్చులు భారీగా తగ్గనుంది. ఈ చర్యలు భావితరాలను సంప్రదాయ కళల వైపు ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రాన్ని క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేస్తాయి. Rajasthan: రూ.5 లక్షలు భూమిలో పాతిపెట్టాడు.. మర్చిపోయాడు.. తీరా కొన్నాళ్ల తరువాత చూస్తే షాక్.. క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు, కలప లభ్యత ప్రణాళిక: రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్ లను ఏర్పాటు చేయడానికి అటవీశాఖ చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బొమ్మల తయారీ కోసం తెల్లపొణికి కలపను, విశాఖ పరిధిలోని ఏటికొప్పాక లక్క బొమ్మల కోసం అంకుడు కర్రను అందుబాటులో ఉంచారు. అన్నమయ్య జిల్లా శెట్టిగుంటలో టేకు, నాన్-టేకు కలపను, తిరుపతి జిల్లా మాధవమాలలో సంప్రదాయ చెక్కతో పాటు నారియేపి, తుమ్మ, ఎర్రచందనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఉదయగిరి చెక్క కళాకారులతో పాటు విజయనగరం జిల్లా బొబ్బిలి వీణల తయారీకి అవసరమైన పనస, రోజ్‌వుడ్ కలపను సిద్ధం చేశారు. అటవీ వనరుల సంరక్షణ, భవిష్యత్తు కార్యాచరణ: వుడ్ బ్యాంకుల డిజైన్, నిర్వహణలో ఒకే రకమైన నమూనా పాటించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. అరుదైన అంకుడు

రాష్ట్రంలోని సంప్రదాయ హస్తకళాకారులకు అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి అవసరమైన నాణ్యమైన కలపను ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అసలు ధరకే అందించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల’ ఏర్పాటుపై సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కలప సేకరణ, రవాణా, నిల్వకు అయ్యే వాస్తవ వ్యయాన్ని మాత్రమే వసూలు చేస్తూ చేతివృత్తుల వారికి ముడిసరుకును సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ముడిసరుకు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులకు ఈ వుడ్ బ్యాంకులు ఒక భరోసాగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రక్రియలో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా కళాకారుల ఉత్పత్తి వ్యయం తగ్గి, వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని వివరించారు.రాష్ట్రంలోని కొండపల్లి, ఏటికొప్పాక, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి, బొబ్బిలి వంటి ఆరు ప్రధాన కేంద్రాల్లో ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. కొండపల్లి బొమ్మలకు అవసరమైన తెల్లపొనికి, ఏటికొప్పాక హస్తకళలకు వినియోగించే అంకుడు, బొబ్బిలి వీణల తయారీకి వాడే పనస, రోజ్‌వుడ్ వంటి కలపను ఈ బ్యాంకుల ద్వారా సరఫరా చేస్తారు. అలాగే, రాజమండ్రి సెంట్రల్ వుడ్ బ్యాంకులో వెదురు, టేకు వంటివి అందుబాటులో ఉంటాయి. అరుదైన కలప జాతుల లభ్యతను మ్యాపింగ్ చేసి, వాటిని అటవీ నర్సరీలలో సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ అధికారులను ఆదేశించారు

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం కు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు సిద్దం చేసారు. ఈ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో తాజా ప్రతిపాదనల మేరకు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 2లేన్లుగా నిర్మించాలని భావించిన కారిడార్‌ను 4లేన్లుగా నిర్మించాలని నిర్ణయించింది. అలాగే, ఈ ప్రాజెక్టును కేంద్ర రోడ్డు-రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్) నుంచి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు బదిలీ చేసింది. దీని ద్వారా అనుమతులు.. పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నారు.శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ పైన వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మోర్త్ పరిధిలో ఉన్న 54 కిలోమీటర్ల ఈ కారిడార్ ను పనుల పర్యవేక్షణ అనువుగా ఉండేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎన్హెచ్ఏఐ (NHAI)కి బదిలీ చేస్తూ నిర్ణయించారు. భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను 2 లేన్లకు బదులుగా 4 లేన్లుగా నిర్మించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ప్రతిపాదించారు.శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, దర్శనంలో కీలక మార్పులు..!!ఒకే పిల్లర్‌పై రెండు వైపులా ప్రయాణించేలా నిర్మించడం వల్ల భవిష్యత్తులో సాంకేతిక, టెండర్ల సమస్యలు ఉండవని భావిస్తున్నారు. అయితే ఈ విస్తరణ వల్ల దాదాపు 2 లక్షల చెట్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, అధికారులు కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా (ఎన్‌హెచ్-765) ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు ప్రస్తుతం గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తోందని చర్చల వేళ ప్రస్తావనకు వచ్చింది.దీంతో, ఈ సమస్య నుంచి బయటపడేందుకు తుక్కుగూడ దగ్గర ఓఆర్ఆర్ దిగిన తర్వాత నుంచీ డిండి వరకు ఒక రోడ్డును ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించగా, ఆ తరువాత కొంగర్‌కలాన్ నుంచి ఆమనగల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును ప్రతిపాదించింది. ఫలితంగా ఏపీకి వెళ్లేందుకు ప్రయాణ సమయం భారీగా

శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ గుండా నిర్మించతలపెట్టిన ప్రతిష్ఠాత్మక ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటివరకు 2 లేన్లుగా నిర్మించాలనుకున్న ఈ ప్రాజెక్టును 4 లేన్లకు విస్తరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇదే సమయంలో, ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు పర్యవేక్షణ బాధ్యతలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నుంచి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి-765లో ఆమనగల్ నుంచి మన్ననూరు చెక్‌పోస్ట్ వరకు ఇప్పటికే ఎన్హెచ్ఏఐ పరిధిలో ఉండగా, మధ్యలోని 54 కిలోమీటర్ల అటవీ భాగం మాత్రమే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ పరిధిలో ఉండేది. దీనివల్ల సాంకేతిక విశ్లేషణలు, టెండర్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని భావించిన కేంద్రం, సమగ్ర పర్యవేక్షణ కోసం మొత్తం మార్గాన్ని ఎన్హెచ్ఏఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ తెలంగాణ విభాగం అధికారులు, వైల్డ్‌లైఫ్ బోర్డు ప్రతినిధులతో కలిసి అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.గతంలో 2 లేన్ల కారిడార్ నిర్మాణానికి రూ. 7,668 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఒకేసారి 4 లేన్ల నిర్మాణం చేపట్టడమే సరైనదని భావిస్తున్నారు. ఒకే పిల్లర్‌పై ఇరువైపులా వాహనాలు వెళ్లేలా పేవ్డ్ షోల్డర్లతో దీన్ని నిర్మించనున్నారు. ఈ మార్పులకు అనుగుణంగా ఎన్హెచ్ఏఐ త్వరలోనే కొత్త డీపీఆర్ సిద్ధం