
ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన శ్రీశైలం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య దర్శనం. కానీ, ఈ పుణ్యక్షేత్రంలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన, ఎంతో మహిమాన్వితమైన మరొక అద్భుత ప్రదేశం ఉంది. అదే దట్టమైన నల్లమల అడవుల మధ్య కొలువైన ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం. భారతదేశం మొత్తం మీద ‘ఇష్టకామేశ్వరి’ పేరుతో దేవి ఆలయం ఉన్న ఏకైక ప్రదేశం శ్రీశైలం మాత్రమే. సాధారణంగా కామేశ్వరీ దేవి అంటే ఎనిమిది భుజాలతో కనిపిస్తుంది. కానీ ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో ప్రత్యేక స్వరూపంలో దర్శనమిస్తారు. ఇష్టకామేశ్వరి దేవి ఆలయంలో జరిగే అద్భుతం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ విగ్రహం రాతితో మలచబడినప్పటికీ, భక్తులు అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టే సమయంలో ఆమె నుదుటి భాగం మనిషి చర్మంలా ఎంతో మెత్తగా తగులుతుంది. విగ్రహాన్ని తాకిన ప్రతిఒక్కరూ ఈ అనుభూతిని పొంది ఒళ్లు జలదరింపజేసే అద్భుతాన్ని కళ్లారా చూస్తారు. రాయిలా ఉండే విగ్రహం నుదుటి వద్ద మాత్రం మనుషుల చర్మంలా మెత్తగా ఉండటం వెనుక ఉన్న రహస్యాన్ని చూడటానికి ఎంతోమంది భక్తులు సాహసాలు చేసి మరి ఇక్కడికి వస్తుంటారు. తన వద్దకు వచ్చే భక్తులు మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా, ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు వెంటనే నెరవేరుస్తుందని నమ్ముతారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి నుదుటన బొట్టు పెట్టి, మనసులోని కష్టాన్ని చెప్పుకుంటే 41 రోజుల్లో ఆ సమస్య తీరిపోతుందని ప్రతీతి. పూర్వం ఈ ప్రదేశం కాపాలికులు, సిద్ధులకు ప్రధాన ధ్యాన కేంద్రంగా ఉండేది. నాగార్జునుడు వంటి సిద్ధులు ఇక్కడి మూలికలతో ఎన్నో ప్రయోగాలు చేశారని కథనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడి గుహలో కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రీశైలం ప్రధాన ఆలయం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహాలయానికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడికి సాధారణ