
అనురాధకు నివాళులు అర్పించిన మాజీ డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
అనురాధ అంత్యక్రియలు పాపన్నపేట లో నిర్వహించగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

అనురాధ అంత్యక్రియలు పాపన్నపేట లో నిర్వహించగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

EPIC Pre Release Event: ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు : నాగవంశీ

నేడు కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఇలా నలుపు తెలుపు చీరలో వచ్చి సందడి చేసింది.

నేడు కార్తీ సర్దార్ 2 సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మాళవిక మోహనన్ ఇలా వైట్ డ్రెస్ లో వచ్చి సందడి చేసింది.

మహేంద్రగిరి వారాహి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నటి మీనాక్షి గోస్వామి (Minakshi Goswami)ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుమంత్, ఐశ్వర్య రాజేష్‌లు నటించిన మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi Pre release event) మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హీరోలు అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డలు హాజరు అయ్యారు.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన రంభ ఊర్వశి మేనక సినిమా సెప్టెంబర్ 4 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రంభ ఊర్వశి మేనక పాత్రల్లో నటించిన రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయి మెరిపించారు. ముగ్గురూ ఒకే స్టేజిపై డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఈవెంట్లో ఈ ముగ్గురూ కలర్ ఫుల్ గా సందడి చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ..‘‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్‌లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్‌గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు”అని అన్నారు. నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ..‘‘మా సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్ పాత్ర పోషించా. ఫస్టాఫ్‌లో వైల్డ్ విలన్‌గా కనిపిస్తా. 20 ఏళ్లు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్‌లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్‌బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్‌బీ 7 ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్‌కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది. ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు

హెల్మెట్ లోపల వేడి, తేమ, చెమట ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఫంగస్ పెరిగేందుకు అవకాశం ఎక్కువ. ఇది తలపై తామర వంటి చర్మ వ్యాధులకు దారితీస్తుంది. మీ ఫ్రెండ్ తలలో పేలు ఉంటే, అవి హెల్మెట్ లోపలికి చేరతాయి. తర్వాత మీరు ఆ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు, ఆ పేలు మీ తలలోకి సులభంగా వచ్చేస్తాయి. హెల్మెట్‌లో పేరుకుపోయిన చెమట, మురికి చర్మానికి తగిలినప్పుడు దద్దుర్లు, దురద వంటి అలెర్జీలు వస్తాయి. హెల్మెట్‌లో చెమట ఎక్కువగా చేరడం వల్ల దుర్వాసన వస్తుంది. ఆ హెల్మెట్‌ను మీరు వాడినప్పుడు, ఆ వాసన మీ జుట్టుకు కూడా పడుతుంది. హెల్మెట్‌లో ఉండే బ్యాక్టీరియా వల్ల నుదుటిపై మొటిమలు, చిన్న చిన్న కురుపులు వంటి సమస్యలు వస్తాయి. మీకు సరిపోని సైజ్ హెల్మెట్ ధరించడం వల్ల తలనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు వస్తాయి. భద్రత కూడా తక్కువే. వీలైనంత వరకు ఇతరులతో హెల్మెట్ షేర్ చేసుకోవద్దు. ఒకవేళ తప్పనిసరి అయితే, లోపల యాంటీసెప్టిక్ స్ప్రే చేసి వాడండి. అలాగే, హెయిర్ కవర్ లేకుండా హెల్మెట్ పెట్టుకోవద్దు. ఇండియాలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే.. ధర, ఫీచర్లు అదుర్స్! Budget EV Cars : అత్యంత చౌక టాటా ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా? Petrol Saving : గురూ.. నీ పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఈ ట్రిక్స్ ఫాలోకా

ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ఆందోళన బాటలో ఉన్నాయి. పీఆర్సీ, ఐఆర్, డీఏ.. ఇలా ఎటు చూసినా బకాయిలు, పెండింగ్ అంశాలే కనిపిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం (AP Govt) వెనువెంటనే నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఇవన్నీ పెండింగ్ సమస్యలుగా మారిపోయాయి. వీటిపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించకుంటే.. వారిపై ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అలాగని ప్రశ్నిస్తే ప్రభుత్వం దృష్టిలో రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగితే జరిగిందని భావించి తాజాగా ఏపీ జేఏసీ అమరావతి నాయకులు మూడు దశల ఉద్యమాన్ని ప్రకటించారు. అన్నట్లుగానే నిరసనలు ప్రారంభించేశారు.జనసేన ఎమ్మెల్యేకు చంద్రబాబు ఊహించని షాక్- ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా ప్రభుత్వం ఉద్యోగుల (employees) పట్ల చూపుతున్న నిర్లక్ష్యంపై గతంలో చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోల్ని ప్రదర్శించడం వివాదాస్పదమైంది. దీంతో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళనలు, తాజాగా ఉద్యోగ సంఘాలు ప్రారంభించిన నిరసనల్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు.ఏపీ సర్కార్ కు ఉద్యోగుల షాక్..! మూడు దశల్లో ఉద్యమం- కార్యాచరణ ప్రకటన..!రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యోగ సంఘ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తనను కలిసిన ఉద్యోగ నేతలతో వెల్లడించారు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న రెవిన్యూ ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించి సమస్యలు పరిష్కరించాలని నేతలు మంత్రిని కోరారు. వీఆర్ఏ, విఆర్ఓ, సర్వేర్లు, రెవెన్యూ శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే అనేకసార్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చిన విషయం మరోసారి గుర్తుచేశారు. దీనిపై మంత్రి అనగాని స్పందిస్తూ రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే ఉద్యోగులుకు ఇవ్వవలసిన పెండింగ్ డీఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషన్ కు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలపై

ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు – బాలలు (2026) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మినహా ఇతర దేశాలలో నివసిస్తున్న ప్రవాస తెలుగు బాలబాలికల కోసం ప్రత్యేకంగా ‘ప్రవాస బాలల అంతర్జాల సాహితీ సమ్మేళనం’ నిర్వహింస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. పద్య పఠనం విభాగంలో పాల్గొనే పిల్లలు రెండు తెలుగు పద్యాలు చదవాల్సి ఉంటుంది, దీనికి 2 నిమిషాల వ్యవధి కేటాయించారు. అలాగే కవితా పఠనం కోసం సొంత కవిత లేదా వేరొకరి కవితను చదవవచ్చు దీనికి కూడా 2 నిమిషాల సమయం ఉంటుంది. ఏకపాత్రాభినయానికి 2 నిమిషాల వ్యవధి ఉండగా, కథ చెప్పే విభాగంలో పాల్గొనేవారు తమ కథను చెప్పడానికి 5 నిమిషాల సమయం కేటాయించబడింది. ఇక ‘పాడనా తెలుగు పాట’ విభాగంలో లలిత గీతాలు లేదా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన పాటలు పాడుకోవచ్చు, దీనికి 3 నిమిషాల వ్యవధి నిర్ణయించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహాక కమిటీ సభ్యుల తుది నిర్ణయం మేరకు, తెలుగు భాష, సంప్రదాయం, సంస్కృతికి విఘాతం కలిగించే ప్రదర్శన అంశాలు తిరస్కరిస్తారు లేదా నిలిపివేస్తారు. ఈ కార్యక్రమం 2026 సెప్టెంబర్ 26, శనివారం రోజున అంతర్జాల మాధ్యమంగా నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు అధికారిక వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైనది. మరిన్ని వివరాలకు లేదా సందేహాల కొరకు సంధానకర్తలు రాధిక మంగిపూడి (+91 9029409696), ఫణి మాధవ్ కస్తూరి (+91 9121906969)లను సంప్రదించవచ్చు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా.. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత.. ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు. ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో

Mamitha Baiju: మలయాళ బ్యూటీ మమితా బైజు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆమెకు సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో పాటు, మెల్బోర్న్లో జరగాల్సిన ఓనం వేడుకలను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మమితా బైజు మెల్బోర్న్లో నిర్వహించనున్న Clyde Onam 2026 వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసం ఆమె ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. దీంతో మమితా పాల్గొనాల్సిన ఓనం వేడుకను కూడా నిర్వాహకులు వాయిదా వేసినట్లు సమాచారం. మమితా బైజు ప్రస్తుతం వైద్యుల సలహాలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే ఆమె నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సక్సెస్‌ను అందుకున్నారు. మమితా ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమెకు ఎదురైన అనారోగ్య సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్పత్రిలో ఎంతకాలం ఉండాల్సి వస్తుందనే విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు మాత్రమే తెలుస్తోంది. మమితా త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆస్ట్రేలియాలో వాయిదా పడిన ఓనం వేడుకకు సంబంధించిన కొత్త తేదీని నిర్వాహకులు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు

'ప్రేమలు' మూవీతో యూత్ హార్ట్స్ లో తిష్ట వేసిన భామ మమితా భైజు. రీసెంట్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ తో భారీ హిట్ అందుకొని సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ కావడం అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. హాస్పిటల్ లో జాయిన్ కావడానికి గల కారణాన్ని అధికారకంగా ప్రకటించకపోయినా జ్వరం, , ఆస్తమా, అలర్జీ లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ నెల 5న ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్లో జరగాల్సి ఉన్న 'క్లైడ్ మలయాళీ' ఓణం వేడుకలకి మమిత చీఫ్ గెస్ట్ గా హాజరుకావాల్సి ఉంది. దీంతో ఆ పర్యటన కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మమిత బైజూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో 'ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడం నాకు చాలా పెద్ద లోటు. అనుకున్న దాని ప్రకారం రాలేకపోతున్నందుకు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. వీలైతే ఎలాగైనా రావాలని అనుకున్నాను కానీ ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. మమిత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.సినిమాలతో నిరంతరం బిజీగా గడపడం, తీవ్రమైన పని ఒత్తిడి వల్లనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో మమిత బైజూ ఇలా ఆసుపత్రి పాలవ్వడం అందరినీ కలవరపెట్టినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఆమె త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్లలో పాల్గొంటారని అభిమానులు ఆశిస్తున్నారు. సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ 200 కోట్లకి చేరువలో: మరో డివోషనల్
తెలంగాణ వాణిజ్య పన్నుల ఆదాయంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో నమోదైన జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 69 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర మొత్తం జీఎస్టీ వసూళ్లలో నగరం ఏకంగా 91.1 శాతం వాటాను నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఆగస్టు జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 20.53 శాతం పెరిగి రూ.3,956 కోట్లకు చేరాయి. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో సుమారు 5.8 లక్షల మంది జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు నమోదై ఉన్నారు. వీరిలో దాదాపు 4 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. అంటే రాష్ట్రంలోని ప్రతి 10 మంది నమోదిత జీఎస్టీ చెల్లింపుదారుల్లో ఏడుగురు నగరానికి చెందినవారే. ఆగస్టులో తెలంగాణ మొత్తం రూ.4,341 కోట్ల జీఎస్టీ ఆదాయం సాధించగా.. అందులో హైదరాబాద్ నుంచే రూ.3,956 కోట్లు సమకూరాయి.పన్ను చెల్లింపుదారుల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం గణనీయంగా అధికంగా ఉండటానికి నగరంలో అధిక విలువ కలిగిన ఆర్థిక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐటీ, ఐటీఈఎస్, ఔషధ, రియల్ ఎస్టేట్ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉండటంతో పెద్ద మొత్తంలో పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కో నమోదిత పన్ను చెల్లింపుదారుపై సగటు జీఎస్టీ వసూళ్లు సుమారు రూ.98,900గా ఉండగా.. రాష్ట్ర సగటు రూ.74,845గా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో తెలంగాణ పరోక్ష పన్నుల ఆదాయం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ, వ్యాట్ కలిపి రూ.36,636 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.31,477 కోట్లతో పోలిస్తే ఇది 16.39 శాతం అధికం. అంటే ఈ ఐదు నెలల్లో అదనంగా రూ.5,159 కోట్ల ఆదాయం సమకూరింది.ఏప్రిల్-ఆగస్టు 2025లో రూ.17,414 కోట్లుగా

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) తెలుగులో సెప్టెంబర్ 4, 2026న విడుదలవుతోంది. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..! దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Apple| ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జాన్ టెర్నస్ (John Ternus)కు సంస్థ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. వార్షిక వేతనం, షేర్ల రూపంలో లభించే ప్రోత్సాహకాలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికి ఆయన మొత్తం 58 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.551 కోట్లు) అందుకోనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న టిమ్ కుక్కు సుమారు 47 మిలియన్ డాలర్లు (సుమారు రూ.446 కోట్లు) అందనున్నాయి. ఈ వివరాలను అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC)కి సమర్పించిన నివేదికలో యాపిల్ వెల్లడించింది. టెర్నస్‌కు 3 మిలియన్ డాలర్లు వార్షిక మూల వేతనం కాగా.. మరో 55 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులు అందనున్నాయి. ఆ స్టాక్‌లో 75 శాతం యాపిల్ షేరు పనితీరుతో ముడిపడి ఉంటుంది. మిగతా 25 శాతం కాలానుగుణంగా ఆయనకు దక్కుతుంది. మరోవైపు కుక్కు 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం.. 2027 ఆర్థిక సంవత్సరానికి 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు అందనున్నాయి. సెప్టెంబరు 1న జాన్ టెర్నస్ యాపిల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2001లో యాపిల్ సంస్థలో చేరిన టెర్నస్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల హార్డ్‌వేర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Qutubullapur: 14 ఎకరాల ఆలయ భూమికి హద్దులు; రంగంలోకి రెవెన్యూ! Qutubullapur: జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరి రక్షణకు రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మేడ్చల్ జిల్లా సర్వీ దేవాదాయ శాఖ కుత్బుల్లా పూర్ మండల రెవెన్యూ అధికారులు ఆలయ ప్రాంగ ణంలో స్థానిక నాయకులతో మంగళవారం సమా వేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆట యానికి కేటాయించిన Mఏకరాల 10 గుంటల స్థలం చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 318/1లో గల స్థలానికి సరిహద్దులను పరిశీలిస్తు న్నారు. కబ్జా అయిన ఆలయ స్థలాన్ని గుర్తించడా వికీ డిజిటల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహిస్తున్న అధికారులు వినాయక చవితి వండగలోపు డిజిటల్ సర్వేచేసి సరిహద్దులు ఏర్పాటుచేయాలని, కళ్ళా అయిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని తీర్మానించారు. సర్వే దేవి ఆలయ భూములను రికార్డుల్లోకి ఎక్కిబడను వ్నట్లు అధికారులు. అదికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 12 వారాల్లో సర్వేపూర్తి చేయాల్సి ఉన్నా స్థానిక రెవెన్యూ అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు వట్టాదారులతో ఉన్న మిబాబత్ వల్లనే ఇప్పటి వరకు సర్వే చేయకుండా తాత్సర్యం చేశారని నాయకులు ఆరోపించారు. కబ్జాదారుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్న రెవెన్యూ అది కబ్జాదారుల గుండెల్లో గుబులు జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరిరక్షణకు అధికారులు శ్రీకారం ముట్టడంతో కబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది. కుల సంఘాల ముసుగులో ఆలయ స్థలాన్ని కబ్జాచేసి గదులు కట్టి లక్షల రూపాయ బంచారు. రెవెన్యూ అధికారులు డిజిటల్ సర్వే చేస్తే కబ్జాల బాగోతం బయేట పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తమపై కేసులు నమోదు అవుతాయని కంగారు పడుతున్నారు. దీంతో అధికారులు, నాయకుల మాటూ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టారు. కాదులు వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తు న్నారని

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన దృశ్య కావ్యం 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైథలాజికల్ సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చి విమర్శకుల ప్రశంసలతో పాటు వేల కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కల్కి 2' రాబోతోంది. అయితే, ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ షూటింగ్ అప్డేట్పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లోనూ, నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు 'కల్కి 2' షూటింగ్ గురించి యాంకర్ సుమ నుండి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఎంతో చమత్కారంగా, నిజాయితీగా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 'కల్కి 2' సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ తెలిపారు. మళ్లీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతం తనకు కూడా ఒక 'బర్నింగ్ క్వశ్చన్' అని నవ్వుతూ చెప్పారు. "గ్రహాలన్నీ ఒక వరుసలోకి వచ్చి ఓ రౌండ్ కూడా తిరిగేశాయి.. మళ్లీ అవన్నీ సరైన స్థానానికి వచ్చినప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారని, ఆయన డేట్స్ ఖాళీ అయ్యి ఫ్రీ అయిన వెంటనే 'కల్కి 2' చిత్రీకరణను సుదీర్ఘమైన షెడ్యూల్‌తో లాంగ్ స్ట్రెచ్‌లో పూర్తి చేస్తామని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ 3న విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని చిత్ర యూనిట్‌కు

ప్రతీఒక్కరూ బ్యాంక్‌కు ఒక్కసారి అయినా వెళ్లి ఉంటారు. బ్యాంకులో డిపాజిట్ లేదా విత్ డ్రా ఫామ్ నింపి లావాదేవీలు నిర్వహించి ఉంటారు. ఈ ఫామ్స్ నింపేటప్పుడు అమౌంట్‌ను సంఖ్య రూపంలో రాయడమే కాకుండా పదాల రూపంలో కూడా వివరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.10 వేలు డిపాజిట్ చేస్తున్నా లేదా విత్ డ్రా చేస్తుంటే.. టెన్ తౌజెండ్ రూపీస్ ఓన్లీ అని రాస్తూ ఉంటాం. చివరిలో ఓన్లీ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి కానీ చివరిలో 'Only' అనేది రాయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.“Ten Thousand” అని రాసిన తర్వాత ఖాళీగా వదిలేస్తే వేరే పదాలు రాయడానికి అవకాశం ఉంటుంది. అదే చివరిలో ఓన్లీ అనేది రాయడం వల్ల అక్కడితో వాక్యం పూర్తయిందని ఎవరికైనా అర్థమవుతుంది. దీని వల్ల వేరే పదం చేర్చే అవకాశం ఉండదని చెప్పవచ్చు. దీని వల్ల ఎలాంటి మోసాలు జరగవు. అయితే ఓన్లీ అనేది చివరిలో రాయకపోతే మీ చెక్కు లేదా డిపాజిట్, విత్ డ్రా ఫామ్ చెల్లదని కాదు. మీరు రాయకపోయినా అది చెల్లుతుంది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి ప్రత్యేక నిబంధన విధించలేదు. కేవలం భద్రతాపరమైన కారణాల వల్ల చివరిలో ఓన్లీ అనేది రాయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. మొత్తాన్ని స్పష్టంగా రాయడం, ఖాళీ స్థలం వదలకపోవడం అనేది భద్రత కోసమేనని చెప్పవచ్చు. బ్యాంక్ సిబ్బంది కూడా చివరిలో ఓన్లీ అనేది చేర్చాలని సూచిస్తూ ఉంటారు. కేవలం సాధారణంగానే దీనిని సూచిస్తూ ఉంటారు. ఇక బ్యాంక్ సిబ్బంది స్వీకరించిన తర్వాత అమౌంట్, పదాల్లో ఒకేలా ఉందా.. లేదా అనేది పరిశీలిస్తారు. అంకెల్లో అమౌంట్ ఒకలా.. పదాల్లో ఒకలా ఉంటే సులువుగా గుర్తు పడతారు. చెక్ ప్రాసెసింగ్ సమయంలో దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు చెక్కు జమ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు దీనిని పరిశీలించుకోవాలి. రెండు చోట్ల ఒకేలా ఉందా..లేదా అనేది చూసుకోవాలి. రెండు చోట్ల

సుమన్త్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం మహేంద్రగిరి వారాహి విడుదల తేదీ మరియు ప్రీరిలీజ్ ఈవెంట్ వివరాలు అధికారికంగా ఖరారయ్యాయి. ఈ భక్తిరస మిస్టరీ థ్రిల్లర్ మూవీ ప్రీరిలీజ్ వేడుకను సెప్టెంబర్ 6న అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. అనంతరం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని చిత్ర బృందం స్పష్టం చేసింది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక వినూత్నమైన డివోషనల్ మిస్టరీ కథాంశాన్ని ఎంచుకున్నారు. కథ ప్రకారం 150 ఏళ్ల నాటి ఒక రాజకుటుంబపు శాపం మరియు వారాహి అమ్మవారి శక్తి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. సుమన్త్ ఇందులో ఒక నమ్మకం లేని ఇన్వెస్టిగేటర్ మరియు ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపిస్తూ ఈ శాపం వెనుక ఉన్న రహస్యాలను చేధించడానికి ప్రయత్నిస్తారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ పతాకాలపై మధు కలిపు మరియు లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలోని ప్రధాన తారాగణం మరియు సాంకేతిక నిపుణుల వివరాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. వారాహి మాత పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి గోస్వామి మరియు మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో పాటు హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన మెరుపు పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మరియు రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే చాలా భిన్నంగా మరియు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. చిత్ర యూనిట్ ఆలయ సందర్శనలు చేయడం మరియు థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫలితంగా ట్రైలర్ హైప్ మరియు వినూత్న ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఇదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునే అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. టికెట్ రహిత ఆదాయాన్ని పెంచుకునేందుకు తెలంగాణా ఆర్టీసీ మెట్రో రైలు తరహాలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తోంది. రూట్‌వేవ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని హయత్‌నగర్-2 డిపోకు చెందిన పది ఎలక్ట్రిక్ బస్సుల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.డిజిటల్ స్క్రీన్స్ పై ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయానికి ప్లాన్ ఈ డిజిటల్ స్క్రీన్లపై వాణిజ్య ప్రకటనలతో పాటు రాబోయే బస్ స్టాప్ల వివరాలు, ఆర్టీసీ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారం ప్రదర్శించనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్స్ ఆర్టీసీ బస్సుల్లో వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు మెట్రో రైలు తరహాలోనే ముందుగా స్టేజీల పేర్లు చూపించడం వల్ల నగరానికి కొత్తగా వచ్చినవారు, మార్గాలు తెలియని ప్రయాణికులు సులభంగా గమ్యస్థానం వద్ద దిగగలుగుతారు.ఒక ఆలోచనతో మూడు ప్రయోజనాలు అంతేకాదు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయటం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పే అవకాశం కలుగుతుంది. ఈ మూడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు పైలట్ ప్రాజెక్టు కోసం హయత్‌నగర్-పటాన్చెరు రద్దీ మార్గాన్ని ఎంపిక చేశారు. పది బస్సుల్లో ఇప్పటికే స్క్రీన్లు అమర్చారు.హయత్ నగర్ పటాన్ చెరు రూట్ లో పైలట్ ప్రాజెక్ట్ ప్రయాణికుల స్పందన, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం, సాంకేతిక పనితీరును పరిశీలించిన తర్వాత నగరంలోని ఇతర డిపోల ఎలక్ట్రిక్ బస్సులకు కూడా ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. గతంలో డిజిటల్ స్క్రీన్లు ప్రధానంగా వినోదం, ప్రకటనలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సదుపాయాలు జోడించి ప్రయాణికులకు ఉపయోగపడే సమాచార వేదికగా మారుస్తున్నారు.ఏపీలో పట్టణ ప్రాంతాలలో ఇల్లులేని వారికి తీపికబురు.. ఇక మొదలెట్టండి!పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే అన్ని

Warangal: 22A భూములు అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సత్య శారద సమీక్ష! ఈ వార్తకు సంబంధించిన

ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్‌లో (Apple) కీలక నాయకత్వ మార్పు జరిగింది. 15 ఏళ్లుగా సంస్థ సీఈవోగా కొనసాగిన టిమ్ కుక్ (Tim Cook) ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ (John Ternus) సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2011 ఆగస్టులో సీఈవో బాధ్యతలు స్వీకరించిన కుక్.. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ‘‘రేపటి నుంచి నా పదవి మారుతుంది, కానీ యాపిల్ సంస్థపై నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నిరంతరం నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. తదుపరి నిర్వర్తించాల్సిన బాధ్యతలపై నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. సీఈవో పదవి నుంచి వైదొలిగినప్పటికీ.. కుక్ యాపిల్‌కు దూరం కావడం లేదు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. సంస్థకు సంబంధించిన కీలక అంశాల్లో సహకరించనున్నారు. 2011లో సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ కుక్ సారథ్యంలో ప్రస్తుతం 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జాన్ టెర్నస్ (John Ternus) 2001లో యాపిల్‌లో చేరారు. ఆయన ఇప్పటి వరకు హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబరు 9న జరగనున్న యాపిల్ కార్యక్రమంలో టెర్నస్ తొలిసారి సీఈవోగా వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ప్రేమలు సినిమా మేకర్స్ నుంచి వస్తున్న మరో ఫీల్ గుడ్ రోమ్కామ్ చిత్రం బెత్లెహేమ్ కుటుంబ యూనిట్. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన గ్రాండ్ ప్రి-రిలీజ్ వేడుకను సెప్టెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ దాస్పల్లా హోటల్లో ఈ వేడుక చాలా వైభవంగా జరగనుంది. ఈ చిత్రంలో నివిన్ పౌలీ మరియు మమిత బైజూ ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళంలో ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన రన్ పూర్తి చేసుకుని మంచి ఆదరణ పొందింది. దీంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు మైత్రి మరియు ఫ్యూచర్ రన్అప్ సంస్థలు సంయుక్తంగా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4వ తేదీన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ చిత్రాన్ని తెలుగు థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు మరియు ప్రేక్షకులకు చిత్ర బృందం ఒక తీపి కబురు అందించింది. ఈ వేడుకకు సంబంధించిన పాస్‌లను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించింది. ఫలితంగా ఆసక్తి ఉన్న వారు యూ వి మీడియా డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఉచిత పాస్‌లను బుక్ చేసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో అభిమానులు పెద్ద ఎత్తున వేడుకకు తరలివచ్చే అవకాశం ఉంది. గతంలో ప్రేమలు వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు గిరీష్ ఏడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది ఒక చక్కని పొరుగు ప్రాంతంలో జరిగే కుటుంబ కథా చిత్రంగా రూపొందింది. ఇందులో కథానాయకుడు నివిన్ పౌలీ ఎంతో సులువైన శైలిలో ఉండే ఎంపీ3 కింగ్ జస్టిన్ అనే పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా మమిత బైజూ ఆష్లీ అనే ఆసక్తికరమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. తెలుగు చిత్రసీమలో ప్రముఖ నిర్మాణ మరియు పంపిణీ సంస్థలైన మైత్రి మరియు ఫ్యూచర్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తెలుగు ఆడియెన్స్ గురించి దుల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I am Game). మెగా బ్లాక్‌బస్టర్ ‘లోకా చాప్టర్ 1: చంద్ర’ తర్వాత వే ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా, ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘‘నా ప్రొడక్షన్ బ్యానర్లో తెరకెక్కిన అత్యంత భారీ చిత్రమిది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో మాట్లాడినప్పుడు కూడా ఇది ఒక పెద్ద స్ట్రెయిట్ తెలుగు సినిమా లాగే ఉందని వారు ప్రశంసించారు. ట్రైలర్లో సినిమాలోని అన్ని అంశాలను చూపించలేదు.. థియేటర్లలో చూసినప్పుడు ఇందులో ఉండే ఒక ప్రత్యేకమైన ఎలిమెంట్ మీ అందరినీ తప్పకుండా సర్ప్రైజ్ చేసి విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది. తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమించే విధానం, హీరోలను ఆదరించే తీరు మాటల్లో చెప్పలేనిది. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి.. ఏ స్టార్ పేరు చెప్పినా.. ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ మ్యాజికల్‌గా ఉంటుంది. ఇతర భాషల నుంచి వచ్చిన నన్ను కూడా మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు నేనే స్వయంగా తెలుగులో డబ్బింగ్

మొబైల్ ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (IMEI) నంబర్‌ను ట్యాంపర్ చేయడం లేదా ఆ నంబర్ మార్పులు చేసిన ఫోన్లను వాడటంపై కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని సోమవారం స్పష్టం చేసింది.దేశంలో మొబైల్, డిజిటల్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెలికాం ఐడెంటిఫైయర్ల దుర్వినియోగం పౌరుల భద్రతకు, నెట్‌వర్క్‌ల సమగ్రతకు పెను సవాలుగా మారిందని టెలికాం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ చట్టంలోని సెక్షన్ 42(3)(c) ప్రకారం IMEI నంబర్లతో సహా ఎలాంటి టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్లను ట్యాంపర్ చేయడం నిషేధం.ఈ నిబంధనలను ఉల్లంఘించడం కాగ్నిజబుల్ (వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయదగిన), నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణిస్తామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారికే కాకుండా, దానికి సహకరించిన లేదా ప్రోత్సహించిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని సెక్షన్ 42(6) చెబుతోందని వివరించింది. మోసపూరిత మార్గాల్లో, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి సిమ్ కార్డులు పొందడం కూడా నేరమేనని పేర్కొంది.పౌరులకు పలు కీలక సూచనలు చేసింది. మార్పులు చేసిన IMEI నంబర్లు ఉన్న మోడెమ్‌లు, సిమ్ బాక్సులు వంటి పరికరాలను ఉపయోగించవద్దని హెచ్చరించింది. ముఖ్యంగా, తమ పేరు మీద తీసుకున్న సిమ్ కార్డులను ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Karnataka MLA controversy:శ్రీరంగపట్నం సమీపంలోని అరేకెరె గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే తల్లి పుట్టినరోజు సందర్భంగా ఒక వినోద కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాటకం, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది కళాకారులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం, కళాకారులకు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండేందుకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా కార్యక్రమానికి ముందు వారు అక్కడే మేకప్ వేసుకుని సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఒక మహిళా కళాకారిణి ఆసుపత్రి లోపల నుంచి రీల్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ కార్యక్రమానికి ఉపయోగించారనే విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు వైద్యం అందించే ప్రదేశం. అలాంటి చోట ప్రైవేట్ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అసలు ఆసుపత్రిలో కళాకారులు ఉండేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? అధికారికంగా అనుమతి తీసుకున్నారా? అనే విషయాలపై స్థానికులు స్పష్టత కోరుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగులకు లేదా వైద్య సేవలకు ఇబ్బంది కలిగిందా అనే అంశంపైనా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వానికి చెందిన వైద్య సదుపాయాలను వ్యక్తిగత కార్యక్రమాల కోసం ఉపయోగించడంపై విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు స్థానికులు అధికార దుర్వినియోగంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hydraa ranganath reacts on gachibowli 7 stairs incident: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలీపోయిన ఘటనల తీవ్ర విషాదంగా మారింది. మాదాపూర్ సర్కిల్ లోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీని శిథిలాల కింద ఇద్దరు కార్మికులు చిక్కుకుని చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బిల్డింగ్ కుప్పకూలీనప్పుడు అది కాస్త పక్కన ఉన్న మరో బిల్డింగ్ మీద పడటంతో అది కూడా డ్యామేజ్అయ్యింది. పెద్ద శబ్దంతో బిల్డింగ్ కూలడంతో చుట్టుపక్కల వారు ఇళ్ల నుంచి భయంతో బైటకు పరుగులు పెట్టారు. వెంటనే హైడ్రా, డీఆర్ఎఫ్,మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన మోపత్, ఉమేష్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేవలం 50 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సాజిద్ అనే బిల్డర్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా అక్కడ అనేక ప్రాంతంలో ఈవిధమైన నిర్మాణాలు ఉన్నాయనిస్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగనాథ్ దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాకుండా.. అంజయ్యనగర్‌లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై ఎవరినీ ఉపేక్షించబోమన్నారు. ఘటనాస్థలి పక్కన భవనాల వారు ఖాళీ చేసి ఇతర చోట్లకు వెళ్లాలని రంగనాథ్ ఆదేశించారు. బిల్డింగ్ యజమాని ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ బిల్డింగ్ నిర్మాణంపై సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్‌కి కొంతమంది ఫిర్యాదు చేశారని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం నోటీసులు జారీ
హైదరాబాద్ గచ్చిబౌలిలోనిఅంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయన్న రంగనాథ్.. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలు, నాలాను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు . శనివారం కుప్పకూలిన ఏడు అంతస్తుల భవనాన్ని.. సాజిద్ అనే బిల్డర్ కట్టినట్లు రంగనాథ్ తెలిపారు. సాజిద్ కట్టిన భవనాలు అన్నీ ఇదే తరహాలో ఉంటున్నట్లు స్థానికులు చెప్తున్నారని.. కొద్దిరోజుల్లో వాటిని కూల్చేస్తామని తెలిపారు.50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మించడమే కాకుండా పైన పెంట్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నారని రంగనాథ్ తెలిపారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు ఇంకా ఉన్నాయని.. చాలావాటికి సెట్బ్యాక్లు లేవని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అంజయ్య నగర్‌లోని భవనాలు హాస్టల్స్ కోసం ఉపయోగిస్తున్నారన్న రంగనాథ్.. వాటిని ఖాళీ చేయాలని యజమానులకు సూచించారు. నాలాను ఆక్రమించి భవనాలు కట్టారని.. అంజయ్య నగర్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.మరోవైపు గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేశ్ కారే (34), మోపత్ (42) అనే ఇద్దరు టైల్స్ కార్మికులు చనిపోయారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడ్డాయి. దీంతో అపార్టుమెంటులో నివశిస్తున్న ఇద్దరు వృద్ధులకు గాయాలయ్యాయి. అపార్ట్మెంట్ గోడలు కూడా ధ్వంసమయ్యాయి. భవనం నిర్మించిన సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.మరోవైపు సాజిద్ బిల్డింగులు అన్నింటిని పరిశీలిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన స్పష్టం

దోమల నివారించాలంటే ఇదే చాలా ముఖ్యమైన విషయం. నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టి సంతానాన్ని పెంచుకుంటాయి. ఇంటి చుట్టూ ఉన్న చిన్న నీటి గుంటలు, పూల కుండీల కింద ప్లేట్లు, పాత బకెట్లు, వాటర్ కూలర్లు, డ్రైనేజీలు, వర్షపు నీరు చేరే చోట తరచూ క్లీన్ చేసుకోవాలి. కొంచెం నీరు నిలిచినా దోమలు గుడ్లు పెట్టేస్తాయి. అందుకే కనీసం వారానికి రెండుసార్లు శుభ్రం చేయడం మంచిది. కొన్ని సువాసన వెదజల్లే మొక్కలను ఇంటి ముందు, కిటికీలు, బాల్కనీ దగ్గర ఉంచడం ద్వారా దోమలు రాకుండా చేయొచ్చు. తులసి, పుదీనా, లెమన్‌గ్రాస్, బంతి వంటి మొక్కలను ఇంటి చుట్టూ పెంచుకోవచ్చు. ఇంట్లో దోమలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలిపి ఉంచండి. వాటిపై దోమలు పడితే మళ్లీ ఎగరలేవు. నిమ్మకాయను సగానికి కోసి అందులో కొన్ని లవంగాలను గుచ్చి కిటికీలు, టేబుల్స్ లేదా దోమలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో పెట్టండి. నిమ్మ, లవంగాల వాసనకు దోమలు పారిపోతాయి. ఫ్యాన్ గాలి ఎక్కువగా ఉంటే దోమలు మనుషులపై వాలలేవు. అందుకే దోమలు ఎక్కువగా ఉండే సమయంలో గదిలో సీలింగ్ లేదా టేబుల్ ఫ్యాన్‌ను ఉపయోగించడం కొంతవరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవాలి

రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. న్యూఢిల్లీ, ఆగస్టు 22: రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి బెట్టియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. చిన్న పాప జన్మదినం సందర్భంగా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఆ కుటుంబం నిర్వహించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఆ పాప తండ్రి కూడా మరణించారని పోలీసులు చెప్పారు. మృతులందరిని గుర్తించామని పేర్కొన్నారు. అతి వేగంతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో ఆర్కేస్ట్రా వైపు బస్సు దూసుకెళ్లిందని వివరించారు. ఈ కార్యక్రమం వద్ద ప్రజలు గుంపుగా ఉన్నారని పోలీసులు చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి
చిరంజీవి క్యారెక్టర్, క్యాలిబర్ మీకేం తెలుసు.. బండ్ల గణేష్ మాస్ స్పీచ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో నిర్మాత బండ్ల గణేష్ పాల్గొని ప్రసంగించారు. చిరంజీవి అంటే తనకు ప్రాణమని, ఆయన వల్లే తనలాంటి సామాన్యులు సినీ పరిశ్రమలోకి వచ్చారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే చిరంజీవి స్పూర్తిదాయక జీవితాన్ని రాబోయే తరాల కోసం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ఆయన కోరారు. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వార్తకు సంబంధించిన
మెగాస్టార్ చిరంజీవి ని మెగా ఫ్యాన్స్ అయితే అన్నయ్యా అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇదే మాట ఇండస్ట్రీలో చాలామంది నోట నుంచి కూడా వినిపిస్తుంటుంది. అన్నయ్యా, బాస్, మెగాస్టార్ ఇలా చాలా పేర్లతోనే చిరంజీవిని కీర్తిస్తుంటారు. అయితే గత రాత్రి హైదరాబాద్‌లో జరిగిన మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్‌ని హర్ట్ అయ్యేట్టు చేశాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ ఈవెంట్‌కి ఇండస్ట్రీ పాపులర్ యాక్టర్స్‌తో పాటు.. హైపర్ ఆది లాంటి కమెడియన్లను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఈ మెగా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలకి మైక్ ఇవ్వగా.. బిగ్ బాస్ విన్నర్ అంటూ అరుపులు అరిచారు. అయితే మనోడు రావడం రావడమే పంచ్ వేశాడు. ‘అవన్నీ అయిపోయాయి అన్నా.. ఇప్పుడు యాక్టర్’ అని అన్నాడు. ఇతనికి క్రేజ్ వచ్చిందీ.. నలుగురు గుర్తు పడుతున్నారంటే బిగ్ బాస్ వల్లే. కానీ అక్కడ మాత్రం బిగ్ బాస్ అనేసరికి.. అవన్నీ అయిపోయాయ్.. ఇప్పుడు యాక్టర్ అని అన్నాడు.లాస్ట్ ఇయర్ వరకూ నేను మీతో పాటు కూడా కూర్చోవడానికి అర్హతలేని వాడ్ని.. ఇప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నానంటే మీ దయవల్లే. నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవిగారు. ఇది బాస్ బర్త్ డే. ఆయన బర్త్ డే సెలబ్రేషన్ ఈవెంట్. చాలామందికి ఇన్స్పిరేషన్ అతను. అతని గురించి మాట్లాడుకుందాం అని అన్నాడు కళ్యాణ్ పడాల.అక్కడ మొదలైంది.. మనోడి స్పీచ్ ఎండ్ అయ్యేవరకూ మెగా ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. ఎందుకూ అంటే.. మెగాస్టార్ చిరంజీవిని పదే పదే.. అతను.. అతను అంటూ మాట్లాడటం. అక్కడికి పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఇండస్ట్రీ పెద్దలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా వచ్చారు. వాళ్లు చిరంజీవిని గారు.. అన్నయ్య అంటూ ఆయనకి ఇవ్వాల్సిన
వెల్లకిలా పడుకుంటే నాలుక, గొంతు వెనుక భాగంలోని కణజాలం కొంత వెనక్కి వెళ్లి గాలి వెళ్లే మార్గం ఇరుకుగా అవుతుంది. దీంతో గురక ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పక్కకు తిరిగి పడుకుంటే కొందరిలో గురకను తగ్గించడంలో సహాయపడుతుందని JMIRFR అధ్యయనం పేర్కొంది. నిద్రలో పదేపదే వెల్లకిలా తిరిగే అలవాటు ఉంటే పక్కకు పడుకునేలా సౌకర్యవంతమైన దిండును ఉపయోగించవచ్చు. జలుబు, అలర్జీ, ముక్కులో రద్దీ కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం పెరిగి గురక రావచ్చు. ముక్కు మూసుకుపోయినప్పుడు గదిలో తేమ సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవడం, ఆవిరి పట్టడం సురక్షితమైన పద్ధతులు కొందరికి ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముక్కు రద్దీ తరచూ వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడం మేలు. మద్యం తీసుకోవడం వల్ల గొంతు కండరాలు ఎక్కువగా సడలిపోయి కొందరిలో గురక పెరగవచ్చు. పొగాకు కూడా శ్వాస మార్గాలను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల ముఖ్యంగా నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం, స్మోకింగ్ మానేయండి. ఇది గురకను తగ్గించడమే కాదు మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవటం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోండి. నిద్రలేమి, అలసట వల్ల గొంతు కండరాలు మరింత సడలిపోయి కొందరిలో గురక ఎక్కువ కావచ్చు. పడుకునే ముందు ఫోన్, డిజిటల్ క్రీన్ వాడటం తగ్గించండి. గురకకు కారణం కేవలం నిద్రించే భంగిమ మాత్రమే కాకపోవచ్చు. స్లీప్ అప్నియా వంటి నిద్ర సంబంధిత శ్వాస సమస్యల్లో కూడా బిగ్గరగా గురక రావచ్చు. నిద్రలో శ్వాస ఆగినట్లు ఇతరులు గమనించడం, గాలి కోసం ఉక్కిరిబిక్కిరిగా మేల్కొనడం, ఉదయం తలనొప్పి, పగటిపూట అధిక నిద్రమత్తు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లల్లో తరచూ గురక వస్తున్నా వైద్య సలహా తీసుకోవడం మంచిది. ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఇంటర్నెట్ డెస్క్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని వచ్చిన ఆరోపణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. రూ.5 కోట్ల జరిమానా విధించింది (Supreme Court Art of Living). ఎన్జీటీ విధించిన జరిమానాను రవిశంకర్ నేతృత్వంలోని ఫౌండేషన్ చెల్లించింది (Art of Living Rs 5 crore refund). అలాగే అదే సమయంలో న్యాయపోరాటం కూడా ప్రారంభించింది. దాదాపు పదేళ్ల పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు ఊరట లభించింది. ఫౌండేషన్ చెల్లించిన రూ.5 కోట్లను తిరిగి ఇవ్వాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు

టీజర్‌ను రిలీజ్ చేసిన ప్రముఖ నటుడు తణికెళ్ల భరణి మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను తణికెళ్ల భరణి విడుదల చేశారు. ఈ మేరకు తణికెళ్ల భరణి మాట్లాడుతూ .. ‘సురేష్ కొండేటి సామాన్య జర్నలిస్ట్ నుంచి పత్రికాధినేతగా ఎదగడం మామూలు విషయం కాదు. ‘సంతోషం’ అనే పేరులోనే ఓ పాజిటివిటీ ఉంది. ‘ప్రేమనే ఊరిలో’ చిత్రంతో తండ్రి గొప్పదనం చక్కగా చూపించారనిపిస్తోంది. నేను గతంలో చెప్పిన నాన్న మీద కవిత ఎంతగానో ప్రాచుర్యం పొందింది. తండ్రే తల్లిలా పెంచిన కథతో ‘ప్రేమనే ఊరిలో’ సినిమాని తీశారు. ప్రేమతో దేన్నైనా సాధించగలం. అలాంటి ప్రేమతో తీసిన ఈ చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. *నిర్మాత చందు శ్రీనివాస్ మాట్లాడుతూ* .. ‘మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ‘ప్రేమనే ఊరిలో’ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. మా టీజర్‌ను విడుదల చేసిన తణికెళ్ల భరణి గారికి థాంక్స్’ అని అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ టీజర్ చూసిన తర్వాతే ఈ చిత్రాన్ని తెలుగు వారికి అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ టీజర్‌కి శ్రీకాంత్ గారి వాయిస్ ఓవర్ అద్భుతంగా కుదిరింది. మా కోసం టీజర్ రిలీజ్ చేసిన తణికెళ్ల భరణి గారికి ధన్యవాదాలు. నాన్న ఎందుకో వెనకబడ్డారు అంటూ తణికెళ్ల భరణి గారు చెప్పిన మాటలు ఎప్పటికీ నిలిచిపోయింది. ఈ టీజర్ చూసిన తర్వాత నేను ఆయనతోనే ఈ టీజర్‌ను రిలీజ్ చేయాలని అనుకున్నాను. మా కోసం ఆయన టీజర్‌ను రిలీజ్

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. ఇందిరానగర్, నల్లకుంట 11 కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు, నారాయణగూడ, ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 11.30 నుంచి 12.30 గంటల వరకు, రాఘవేంద్రస్వామి పరిధిలో 12 నుంచి 12.30 గంటల వరకు, కమలానగర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 3.45 గంటలవరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. సైదాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అలాగే 11కేవీ ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఫీడర్.. లక్ష్మీనగర్ ఎక్స్ రోడ్డు, రామాలయం, వాణినగర్, పటేలమ్మ మడిగలు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, దోబీఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో 2 నుంచి 3 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. సాదత్‌నగర్ ఫీడర్.. పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ఏఎస్రావు నగర్: చర్లపల్లి సాయినగర్ ఫీడర్లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం ఆ ఫీడర్ పరిధిలోని ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఎంఆర్ఆర్ కాలనీ, కృష్ణారెడ్డినగర్, సుభా్‌షనగర్, రెడ్డికాలనీ, సాయినగర్, ఎన్ఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కొత విధిస్తున్నట్లు ఏఈ టి.బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు గమనించి తమతో సహకరించాలని ఆయన కోరారు. కాప్రా: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆర్టీసీ కాలనీ ఫీడర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, జెడ్టీఎస్ తిరుమలనగర్, హనుమాన్‌నగర్, డాక్టర్ కృష్ణానగర్

భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నకిలీ పాస్ పుస్తకాలను రద్దు చేస్తాం: మంత్రి పొంగులేటి జగిత్యాల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే అనంతరం అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, నకిలీ పాస్ పుస్తకాలను గుర్తించి రద్దు చేస్తామని రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా అర్హతలేని వారంతా రైతుబంధు ప్రయోజనాలు పొందారని అన్నారు. భూ రీసర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు. జగిత్యాల నియోజకవర్గ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లాకు 70 గ్రామాల్లో భూముల రీ సర్వే జరుగుతున్నదని, ఏడాదిన్నర కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వేను పూర్తి చేస్తామన్నారు

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు దక్కింది. కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా రూ.9 వేల కోట్ల నిధులు సమీకరించినందుకు ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ అవార్డుతో APMDCని సత్కరించారు. ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMDC)కు ప్రతిష్ఠాత్మక ASSOCHAM అవార్డు లభించింది. ‘బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్’ విభాగంలో APMDC ఈ పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా కార్పొరేట్ బాండ్ మార్కెట్ ద్వారా భారీగా నిధులు సమీకరించినందుకు ఈ గుర్తింపు దక్కింది. సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ ద్వారా APMDC సుమారు రూ.9 వేల కోట్ల నిధులను సమీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్థిక వనరులను సమర్థవంతంగా సమీకరించడంతో పాటు బాండ్ మార్కెట్‌ను వినియోగించుకున్న తీరుకు ASSOCHAM నుంచి ప్రశంసలు లభించాయి. APMDC చేపట్టిన ఈ భారీ నిధుల సమీకరణ సంస్థ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని చాటిచెప్పిందని అధికారులు పేర్కొన్నారు. సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్(NCD) ద్వారా సమీకరించిన నిధులతో సంస్థకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూరడమే కాకుండా.. కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా APMDC స్థానం మరింత బలోపేతమైంది. పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ, మార్కెట్ ఆధారిత నిధుల సమీకరణ, సంస్థాగత ఆర్థిక ప్రణాళికకు గుర్తింపుగా ASSOCHAM అవార్డును భావిస్తున్నారు. రూ.9 వేల కోట్ల స్థాయిలో నిధులను సమీకరించిన APMDC పనితీరుకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ పట్టివేత

ఒంటరితనం కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు.. గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: గుండె ఆరోగ్యం అంటే కేవలం కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా రోజుకు ఎన్ని అడుగులు నడిచామన్నది మాత్రమే కాదు. మన మానసిక ఆరోగ్యం, ఇతరులతో మనకున్న సంబంధాలు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధూమపానం, అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఒంటరితనం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఒంటరితనం గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఒంటరితనం అంటే ఇంట్లో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. మనసుకు దగ్గరైన వారితో మాట్లాడే అవకాశం లేకపోవడం, ఇతరులతో అనుబంధం లేకపోవడం కూడా ఒంటరితనంలోకి వస్తాయి. ఎక్కువ కాలం ఇలా ఒంటరిగా ఉంటే ఒత్తిడి పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ పరోక్షంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. పరిశోధనల్లోనూ దీర్ఘకాలిక ఒంటరితనం, సామాజికంగా ఇతరులకు దూరంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరిగే అవకాశం ఉందని తేలింది. గుండె ఆరోగ్యం కోసం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ధూమపానం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఒంటరితనాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇతరులతో బంధాలు కొనసాగించాలి. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఒంటరితనం ఒక్కటే గుండె జబ్బులకు కారణమవుతుందని ఖచ్చితంగా చెప్పలేం. గుండె జబ్బుల ముప్పుపై వయసు, వంశపారంపర్యం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, ధూమపానం, ఆహారం, శారీరక శ్రమ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే గుండె ఆరోగ్యం కేవలం ఆహారం, వ్యాయామంపైనే ఆధారపడదు. మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని నియంత్రించుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమే. Note: ఇందులోని

రోజంతా ఆఫీసులో కుర్చీకే పరిమితమవుతున్నారా? రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల శరీరంలో కదలిక తగ్గుతుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యల ముప్పు పెరగొచ్చు. అయితే రోజువారీ జీవితంలో నడక, చిన్న చిన్న కదలికలను పెంచడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.8 గంటలు కూర్చుంటే ఏం జరుగుతుంది?ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే కాళ్లలోని కండరాలు పెద్దగా పనిచేయవు. దీంతో శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అంతేకాదు.. రక్తంలో చక్కెర నియంత్రణ, రక్త ప్రసరణ, కొవ్వు జీవక్రియ వంటి ప్రక్రియలపై కూడా ప్రభావం పడొచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే రోజుకు 8 గంటలు కూర్చోవడం వల్ల వెంటనే వ్యాధి వస్తుందని కాదు. కదలిక తక్కువగా ఉండే జీవనశైలి ఎక్కువకాలం కొనసాగినప్పుడు ఆరోగ్య ముప్పు పెరుగుతుంది.రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?8 గంటలు కూర్చోవడం వల్ల కలిగే అన్ని ప్రభావాలను పూర్తిగా తొలగించే నిర్దిష్ట అడుగుల సంఖ్య ఏదీ లేదు. అయితే రోజుకు 30-40 నిమిషాల మోస్తరు స్థాయి వ్యాయామం, ముఖ్యంగా వేగంగా నడవడం ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తి వయసు, ఫిట్నెస్, ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజుకు 7,000-10,000 అడుగులు మంచి లక్ష్యంగా ఉండొచ్చు.ఒక పరిశోధనలో రోజుకు 8,000 అడుగులు వేసేవారిలో మరణ ప్రమాదం 4,000 అడుగులు వేసేవారితో పోలిస్తే దాదాపు సగం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇది పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే కావడంతో 8,000 అడుగులు వేస్తే మరణ ప్రమాదం సరిగ్గా సగానికి తగ్గుతుందని చెప్పలేం.30-40 నిమిషాలు నడిస్తే

తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకి రాసిన లేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి ఘాటుగా బదులిచ్చారు. హరీష్ రావు ని టార్గెట్ చేశారు.హరీష్ రావుకు పొంగులేటి ఘాటు కౌంటర్తెలంగాణలో సెక్షన్ 22ఏ నిషేధిత భూముల వివాదం పైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు, రాహుల్ గాంధీకి రాసిన లేఖకు స్పందిస్తూ మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని మండిపడ్డారు.ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!అవినీతి, కమీషన్ల గురించి మీరే మాట్లాడాలిఅవినీతి, కమీషన్ల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా వెల్లడించిన విషయాలను గుర్తు చేశారు. హరీష్ రావు చేసిన అవినీతి పైన కవితే స్వయంగా అనేక విషయాలు మాట్లాడారని గుర్తు చేశారు.కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు మీ దోపిడీ తెలియదాబీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు ఎలా సంపాదించారో, ఏం వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో బాగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించాలని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు అని సెటైర్లు వేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న వారు ఇప్పుడు కమీషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Kagaznagar: ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు! Kagaznagar: కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. అధిత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలునిర్వహించారుఈసందర్భంగాపట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి బి. అధిత పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మార్కెట్ ప్రాంతంలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌక్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అక్కడ శ్రమదానం చేపట్టారు. ఈ సందర్భంగా బి.అధిత మాట్లాడుతూ యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేలా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమైన S.I.R. ప్రక్రియలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అర్హులైన యువతకు ఫారం–6 దరఖాస్తులను అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. బూత్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఫారం–6 దరఖాస్తు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు

నిషేధిత జాబితాలో చేరినవి ఎన్ని? లెక్కలు తేల్చండి.. వివరాలు ఇవ్వండి! 22ఏ సెక్షన్ నేపథ్యంలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు సబ్ రిజిస్ర్టార్లతో సంప్రదింపులు జరపాలని సూచన జిల్లాలో రోజువారీ రిజిస్ర్టేషన్ల ప్రక్రియపై ఆరా హైదరాబాద్ సిటీ: 22ఏ కింద నిషేధిత జాబితాలో చూపుతున్న లక్షలాది మంది నిరుపేదల నివాసాలు, ఖాళీ స్థలాలతో పాటు పెద్ద పెద్ద భవనాలను ఆ జాబితా నుంచి బయటపడేసేందుకు జిల్లా రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో చర్చిస్తూ, రికార్డులను సరిచూస్తున్నారు. ప్రధానంగా రిజిస్ర్టేషన్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ర్టార్లు తిరస్కరిస్తున్న సర్వే నంబర్లలో ఉన్న మొత్తం భూమి ఎంత.. అందులో ఎంతవరకు ప్రైవేట్ పట్టా స్థలాలు ఉన్నాయి.. వాటి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఎన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి.. అనే వివరాలను ఆరా తీస్తున్నారు. అధికారుల తప్పిదంతో నిషేధిత జాబితాలోకి.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెలలుగా 22ఏ సెక్షన్ తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో 50 ఏళ్లకు పైబడిన ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్లు సైతం అనుకోకుండా ప్రోహిబిటెడ్ లిస్టులోకి వెళ్లాయి. అయితే కొంతమంది రెవెన్యూ అధికారుల తప్పిదంతోనే ఈ పొరపాట్లు చోటుచేసుకున్నాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులుగా దిద్దుబాటు చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నివేదిక ఇచ్చేందుకు హడావుడి వాస్తవంగా జిల్లాలో 12 లక్షలకు పైగా భూములు వివిధ కోర్టు కేసుల్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి ఇవి కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. కౌంటర్లు దాఖలు చేయడంలో కొంతమంది తహసీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మగ్గుతున్నాయి. దీంతో కొంత మంది వాటిని ఆక్రమించుకుని పట్టాలు సైతం పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. 22A Land Complaints Call Center: 22ఏ నిషేధిత భూముల అంశంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించే దిశగా రెవెన్యూ శాఖ చర్యలను మరింత వేగవంతం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాల్ సెంటర్‌కు వచ్చే ప్రతి దరఖాస్తును కేవలం ఒక ఫిర్యాదుగా కాకుండా.. ఒక బాధ్యతగా తీసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజలు ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నిజమైన హక్కుదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 22A సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్ పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు అందిన సుమారు 400 కాల్స్ వివరాలు, వస్తున్న ప్రధాన సమస్యలు, ప్రజలకు అందిస్తున్న సమాచారాన్ని అధికారులు మంత్రికి వివరించారు. కాల్ సెంటర్‌కు వచ్చే దరఖాస్తులను కేవలం నమోదు చేయడంతో సరిపెట్టకుండా, పూర్తి వివరాలను తక్షణమే సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో, సబ్రిజిస్ట్రార్లకు చేరవేయాలని మంత్రి చెప్పారు. సమస్య కొలిక్కి వచ్చేంతవరకు పురోగతిని నిరంతరం ట్రాక్ చేయాలన్నారు. "ఆన్లైన్ ద్వారా అందిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించాలి. సదరు భూమి 22A పరిధిలోకి ఎలా వచ్చింది..? దరఖాస్తుదారుడి క్లెయిమ్ సరైనదేనా అనే అంశాలను క్షేత్రస్థాయిలో విచారించి, స్పష్టమైన ఆధారాలతో నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారి ఫిర్యాదు చేసిన బాధితులు పరిష్కారం కోసం మళ్లీ మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఆగస్ట్ 21న విడుదలయ్యేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ (Director Ramana Reddy Soma) దర్శకత్వం వహించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా.. ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ.. ‘అమీర్ లోగ్’ సినిమాను ఇప్పటికి చాలా సార్లు చూశాం. కచ్చితంగా హిట్టు బొమ్మ అనే ఫీల్నే ఇస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదని చెప్పగలను. అలాంటి ఓ గొప్ప అటెంప్ట్ నేను చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే మేం హిట్ కొట్టేశాం, మేం అనుకున్నది సాధించేశామనేది అర్థమైంది. మలయాళంలో తీసినట్టుగా మన దగ్గర రావడం లేదని అంటుంటారు కదా.. ఇకపై హైదరాబాద్ ఎరా స్టార్ట్ అయింది. ఆగస్ట్ 21న నైజాంలో స్టార్ట్ అయ్యే సౌండ్.. అన్ని వుడ్లకు చేరుకుంటుందని అన్నారు. నిర్మాత మాధవి రెడ్డి సోమ మాట్లాడుతూ.. నన్ను ముందు నిలబెట్టి నడిపిస్తోన్న నా భర్త రమణకు థాంక్స్. ఆయనే రైటర్, డైరెక్టర్, నిర్మాతగా అన్నీ పనులు చూసుకున్నారు. ఆయన ఈ ‘అమీర్ లోగ్’ సినిమాను అందమైన పెయింటింగ్‌గా తీర్చిదిద్దారు. ఈ సినిమా చూసి బయటకు వెళ్లేటప్పుడు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక ఎమోషన్‌ను ఇంటికి తీసుకెళ్తారని తెలిపారు. కో ప్రొడ్యూసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా నుంచి రీసెంట్‌గానే వచ్చాను. అమెరికాలో కూడా