
వెల్లకిలా పడుకుంటే నాలుక, గొంతు వెనుక భాగంలోని కణజాలం కొంత వెనక్కి వెళ్లి గాలి వెళ్లే మార్గం ఇరుకుగా అవుతుంది. దీంతో గురక ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. పక్కకు తిరిగి పడుకుంటే కొందరిలో గురకను తగ్గించడంలో సహాయపడుతుందని JMIRFR అధ్యయనం పేర్కొంది. నిద్రలో పదేపదే వెల్లకిలా తిరిగే అలవాటు ఉంటే పక్కకు పడుకునేలా సౌకర్యవంతమైన దిండును ఉపయోగించవచ్చు.
జలుబు, అలర్జీ, ముక్కులో రద్దీ కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం పెరిగి గురక రావచ్చు. ముక్కు మూసుకుపోయినప్పుడు గదిలో తేమ సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవడం, ఆవిరి పట్టడం సురక్షితమైన పద్ధతులు కొందరికి ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది. అయితే ముక్కు రద్దీ తరచూ వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడం మేలు.
మద్యం తీసుకోవడం వల్ల గొంతు కండరాలు ఎక్కువగా సడలిపోయి కొందరిలో గురక పెరగవచ్చు. పొగాకు కూడా శ్వాస మార్గాలను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల ముఖ్యంగా నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం, స్మోకింగ్ మానేయండి. ఇది గురకను తగ్గించడమే కాదు మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవటం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోండి. నిద్రలేమి, అలసట వల్ల గొంతు కండరాలు మరింత సడలిపోయి కొందరిలో గురక ఎక్కువ కావచ్చు. పడుకునే ముందు ఫోన్, డిజిటల్ క్రీన్ వాడటం తగ్గించండి.
గురకకు కారణం కేవలం నిద్రించే భంగిమ మాత్రమే కాకపోవచ్చు. స్లీప్ అప్నియా వంటి నిద్ర సంబంధిత శ్వాస సమస్యల్లో కూడా బిగ్గరగా గురక రావచ్చు. నిద్రలో శ్వాస ఆగినట్లు ఇతరులు గమనించడం, గాలి కోసం ఉక్కిరిబిక్కిరిగా మేల్కొనడం, ఉదయం తలనొప్పి, పగటిపూట అధిక నిద్రమత్తు వంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. పిల్లల్లో తరచూ గురక వస్తున్నా వైద్య సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి



