
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

PG Building Collapse | ముగ్గురు మృతి.. తొమ్మిదిమందిని కాపాడిన అధికారులు..!

Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..

ఆగస్టు 26న నేపాల్‌లోని త్రిశూలి నది తీవ్ర రౌద్రరూపం దాల్చింది. ఉప్పొంగిన వరద నీరు తన దారిలో ఉన్న వాహనాలు, భవనాలు సర్వనాశనం చేస్తూ కొట్టుకుపోయింది. నువాకోట్ జిల్లాలోని డంగే బజార్ పరిసర ప్రాంతాలు మట్టి, రాళ్లు, మురుగుతో నిండిపోయాయి. అయితే, ఈ విధ్వంసం మధ్య ఒక అద్భుతం జరిగింది. పచ్చ రంగులో ఉన్న ఒక 40 ఏళ్ల నాటి పాత ఇల్లు భయంకరమైన వరదలను తట్టుకుని అలాగే నిలబడింది. ఈ పచ్చని ఇల్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చుట్టూ ఉన్న భవనాలన్నీ కొట్టుకుపోయినా, ఈ ఒక్క ఇల్లు ఎలా నిలబడిందనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వరద ఉధృతి మరింత గరిష్ఠ స్థాయికి చేరినప్పుడు ప్రకాష్, ఆయన కుటుంబంలోని ఆరుగురు సభ్యులు దాదాపు గంట నుండి గంటన్నర పాటు ఇంట్లోనే చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వారు భవనం పై అంతస్తుకు చేరుకుని గడిపారు. వరద నీటి మట్టం స్వల్పంగా తగ్గగానే, సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన ప్రజలు రక్షణ చర్యలు చేపట్టారు. వారు పొరుగు భవనాల మధ్య ఒక పెద్ద పైప్‌ను ఉంచారు. ఆ పైప్, తాళ్ల సహాయంతో అవతలి వైపు నుంచి వచ్చి ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సర్వస్వం కోల్పోయినా నిలిచిన ప్రాణాలు వరద రాక్షసి నుంచి కుటుంబ సభ్యులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరు ఖాట్మండ్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో వారి వాహనాలు, దుకాణంలోని సరుకులు, ఇంట్లోని నిత్యావసర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిరాణా షాప్ వరద నీటికి తీవ్రంగా దెబ్బతింది. "అందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నదంతా ధ్వంసమైంది లేదా మట్టిలో పూడిపోయింది. ఇప్పుడు మేమంతా మళ్లీ మొదటి నుంచి జీవితాన్ని నిర్మించుకోవాలి" అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రీన్ హౌస్ యజమాని ప్రకాష్. వరద తాకిడికి తన ఇల్లు

రోజంతా ఏసీ గదిలో ఉండటం హాయిగా అనిపిస్తుంది, సౌకర్యంగా ఉంటుంది. కానీ ఎక్కువసేపు ఏసీలో ఉంటే చర్మం పొడిబారడం, కళ్లలో మంట, ముక్కు-గొంతు పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువసేపు ఏసీ గదిలో ఉంటే, గదిలోని తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది. పెదాలు పగలడం, దురద వంటి సమస్యలు వస్తాయి. కొందరిలో కళ్ల మంట, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆస్తమా లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి చల్లని, పొడి గాలి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల శ్వాస సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఊపిరితిత్తుల వైద్యులు చెబుతున్నారు

నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ ఇంటి వీడియో ఇటీవల కాలంలో వైరల్‌గా మారింది. నాటి అద్భుతానికి కారణం ఎంటో తాజాగా ఇంటి ఓనర్ తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరదలను తట్టుకుని నిలబడ్డ ఓ భవనం తాలూకు వీడియో ఇటీవల నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో ఈ భవనం ఉంది. చుట్టూ ఇళ్లన్నీ జలసమాధి అవుతున్నా ఆ భవనం మాత్రం నిలబడ్డ తీరు జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయమై ఆ ఇంటి ఓనర్ ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. వరద సమయంలో భవనంలోనే ఉన్న ఆయన ఆ భయానక అనుభవం గురించి పలు విషయాలు చెప్పారు. ‘వరద చుట్టుముట్టే సమయంలో భవనంలో నాతో నా కుటుంబసభ్యులు ఐదుగురు ఉన్నారు. మొదట నేను బయట ఒక షాపు వద్ద ఉండగా వరద అలర్ట్ అందింది. వెంటనే నేను ఇంటికి వెళ్లాను. అందరం బయటకు వెళదామనుకున్నాము. కానీ అప్పటికే బయట నీటి ఉధృతి పెరిగింది. దీంతో, మేము నాలుగో అంతస్తుకు వెళ్లాము. అక్కడికి కూడా నీరు వచ్చేయడంతో చివరకు భవనంపైకి వెళ్లాము. ఆ సమయంలో నా ఆలోచన అంతా కుటుంబంపైనే ఉంది’ ‘ఆ సమయంలో నా కొడుకు స్కూల్లో ఉన్నాడు. మాకేమైనా అయితే వాడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన పెరిగిపోయింది. అదృష్టవశాత్తూ కొంత సేపటికి వరద ఉధృతి తగ్గింది. మాకు ప్రాణాపాయం తప్పింది’ అని ఆయన చెప్పారు. దాదాపు గంట పాటు ఆ కుటుంబం భవనంపైనే ఉండిపోయింది. ఆ తరువాత స్థానికులు కొందరు వచ్చి వారిని రక్షించారు. తమ ఇల్లు అంతటి వరద ఉధృతిని తట్టుకోవడానికి కారణం ఇంటి నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలే అని ఆయన చెప్పారు. ‘అది దాదాపు 40 ఏళ్ల నాటి భవనం. అప్పట్లో సిమెంట్, ఇతర సామగ్రి నాణ్యత ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేది. ఇంటి నిర్మాణం విషయంలో చాలా ఆలోచించి అనేక జాగ్రత్తలు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన నేపథ్యంలో 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్ శనివారం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తామని హెచ్చరించారు.కేవలం 50 గజాల స్వల్ప విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా ఏడంతస్తుల భవనాన్ని నిర్మించడమే కాకుండా, దానిపై అదనంగా పెంట్‌హౌస్‌ను కూడా నిర్మించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బిల్డర్ సాజిద్ నిర్మించే భవనాలన్నీ అత్యంత నాసిరకంగా ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నట్లు కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించారు.అంజయ్య నగర్ ప్రాంతంలో ఇటువంటి అక్రమ నిర్మాణాలు అనేకం ఉన్నాయని, కనీసం సెట్బ్యాక్లు కూడా పాటించకుండా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారని రంగనాథ్ పేర్కొన్నారు. నాలాలను ఆక్రమించి ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపట్టారని, వీటిలో అధిక శాతం ప్రస్తుతం హాస్టళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఆయా భవనాలను యజమానులు వెంటనే ఖాళీ చేయాలని ఆయన ఆదేశించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన అన్ని భవనాలను కూల్చివేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు

తెలంగాణలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో సీఆర్ఐఎఫ్ (CRIF) రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ (ROB) పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా పనుల పురోగతి మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 3,918 కి.మీ రోడ్లకు రూ.5,159 కోట్లతో 316 పనులు మంజూరు అయ్యాయని వివరించారు. 2025-26లో రూ.868 కోట్లతో 422.36 కి.మీ రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. హై లెవెల్ బ్రిడ్జిలు, ROB పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మిర్యాలగూడ, నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నార్కట్‌పల్లి బ్రిడ్జి పనుల పురోగతిపై ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో మరింత కష్టపడి పని చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 2026, డిసెంబర్ నాటికి సచివాలయంలో సోలార్ కార్ పార్కింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో సోలార్ కార్ పార్కింగ్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. సోలార్ పార్కింగ్తో సచివాలయానికి 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. దీంతో నెల వారీ విద్యుత్ బిల్లులో 16 శాతం ఆదా అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ.. పర్యాటకులకు షాక్.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hydraa ranganath reacts on gachibowli 7 stairs incident: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలీపోయిన ఘటనల తీవ్ర విషాదంగా మారింది. మాదాపూర్ సర్కిల్ లోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీని శిథిలాల కింద ఇద్దరు కార్మికులు చిక్కుకుని చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బిల్డింగ్ కుప్పకూలీనప్పుడు అది కాస్త పక్కన ఉన్న మరో బిల్డింగ్ మీద పడటంతో అది కూడా డ్యామేజ్అయ్యింది. పెద్ద శబ్దంతో బిల్డింగ్ కూలడంతో చుట్టుపక్కల వారు ఇళ్ల నుంచి భయంతో బైటకు పరుగులు పెట్టారు. వెంటనే హైడ్రా, డీఆర్ఎఫ్,మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన మోపత్, ఉమేష్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేవలం 50 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా సాజిద్ అనే బిల్డర్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా అక్కడ అనేక ప్రాంతంలో ఈవిధమైన నిర్మాణాలు ఉన్నాయనిస్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగనాథ్ దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాకుండా.. అంజయ్యనగర్‌లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తామని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై ఎవరినీ ఉపేక్షించబోమన్నారు. ఘటనాస్థలి పక్కన భవనాల వారు ఖాళీ చేసి ఇతర చోట్లకు వెళ్లాలని రంగనాథ్ ఆదేశించారు. బిల్డింగ్ యజమాని ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ బిల్డింగ్ నిర్మాణంపై సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్‌కి కొంతమంది ఫిర్యాదు చేశారని చెప్పారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం నోటీసులు జారీ
హైదరాబాద్ గచ్చిబౌలిలోనిఅంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయన్న రంగనాథ్.. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలు, నాలాను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు . శనివారం కుప్పకూలిన ఏడు అంతస్తుల భవనాన్ని.. సాజిద్ అనే బిల్డర్ కట్టినట్లు రంగనాథ్ తెలిపారు. సాజిద్ కట్టిన భవనాలు అన్నీ ఇదే తరహాలో ఉంటున్నట్లు స్థానికులు చెప్తున్నారని.. కొద్దిరోజుల్లో వాటిని కూల్చేస్తామని తెలిపారు.50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మించడమే కాకుండా పైన పెంట్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నారని రంగనాథ్ తెలిపారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు ఇంకా ఉన్నాయని.. చాలావాటికి సెట్బ్యాక్లు లేవని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అంజయ్య నగర్‌లోని భవనాలు హాస్టల్స్ కోసం ఉపయోగిస్తున్నారన్న రంగనాథ్.. వాటిని ఖాళీ చేయాలని యజమానులకు సూచించారు. నాలాను ఆక్రమించి భవనాలు కట్టారని.. అంజయ్య నగర్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.మరోవైపు గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేశ్ కారే (34), మోపత్ (42) అనే ఇద్దరు టైల్స్ కార్మికులు చనిపోయారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడ్డాయి. దీంతో అపార్టుమెంటులో నివశిస్తున్న ఇద్దరు వృద్ధులకు గాయాలయ్యాయి. అపార్ట్మెంట్ గోడలు కూడా ధ్వంసమయ్యాయి. భవనం నిర్మించిన సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.మరోవైపు సాజిద్ బిల్డింగులు అన్నింటిని పరిశీలిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన స్పష్టం

ఉద్యోగం కావాలి.. ఏదో ఒక జాబ్ దొరికే వరకు దరఖాస్తులు పంపుతూనే ఉండాలి.. ఇదేనా మీ జాబ్ సెర్చ్ ప్లాన్? అయితే కాస్త ఆగండి. రోజంతా జాబ్ పోర్టల్స్ స్క్రోల్ చేస్తూ, కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేయడం వల్ల అవకాశాలు పెరగకపోగా అలసటే మిగులుతుందని లింక్డ్ఇన్ కెరీర్ నిపుణురాలు క్యాథరిన్ ఫిషర్ చెబుతున్నారు. ఈ అలవాటుకు ఆమె పెట్టిన పేరు ‘డూమ్జాబింగ్’. ఉద్యోగ వేటలో సంఖ్య కంటే వ్యూహమే ముఖ్యమని ఆమె సూచిస్తున్నారు.1. ముందుగా ఏం కావాలో తేల్చుకోండిఏ నగరంలో పని చేయాలి? ఏ రంగంలో చేరాలి? ఎలాంటి ఉద్యోగం కావాలి? ముందుగా స్పష్టత తెచ్చుకోవాలి. ఆ తర్వాత రెజ్యుమే, ప్రొఫెషనల్ ప్రొఫైల్‌ను ఆ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా మార్చుకోవాలి. ఏఐపై అవగాహన పెంచుకోవడం కూడా ఉపయోగపడుతుందని ఫిషర్ సూచిస్తున్నారు.2. పరిచయాలను పెంచుకోండిఉద్యోగం కోసం నేరుగా అడగడం కంటే.. ఆ రంగంలో పనిచేస్తున్న వారితో పరిచయం పెంచుకోవాలి. లింక్డ్ఇన్లో రెండో స్థాయి పరిచయాల ద్వారా కొత్త వ్యక్తులను సంప్రదించొచ్చు. వారి అనుభవం గురించి అడగడం ద్వారా సంభాషణ మొదలుపెట్టాలని నిపుణురాలు సూచిస్తున్నారు.3. బాధ్యతలు కాదు.. ఫలితాలు చెప్పండిరెజ్యుమేలో ఏం చేశారో మాత్రమే రాయడం సరిపోదు. ఆ పని వల్ల సంస్థకు ఏం ప్రయోజనం కలిగిందో చెప్పాలి. సాధించిన ఫలితాలను ఉదాహరణలతో వివరించాలి. గణాంకాలు వెల్లడించలేని సందర్భాల్లోనూ పని ప్రభావం అర్థమయ్యేలా వివరించాలని ఫిషర్ చెబుతున్నారు.4. ‘హ్యూమన్ స్కిల్స్’ను మర్చిపోవద్దుఏఐ సహా సాంకేతిక నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతున్నా.. కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు కూడా అంతే కీలకం

బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా హైదరాబాద్‌లో పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురిని అరెస్ట్ చేసి, 50 ఇంజెక్షన్ వాయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలో బాడీ బిల్డింగ్ పేరిట మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టైంది. టాస్క్‌ఫోర్స్ గోల్కొండ జోన్, గోషామహల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ఇంజెక్షన్ల సప్లయర్లు, మరో ఇద్దరు వినియోగదారులు ఉన్నారు. నిందితుల నుంచి రూ.1.85 లక్షల విలువైన 50 మెఫెంటర్మైన్ సల్ఫేట్ వాయిల్స్‌తో పాటు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో వాయల్‌ను రూ.160కు కొనుగోలు చేసి, దాదాపు రూ.900కు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి వాట్సాప్ ద్వారా ఇంజెక్షన్లను ఆర్డర్ చేసి, షాడోఫ్యాక్స్ కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు తెప్పిస్తున్నట్లు గుర్తించారు. జిమ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు.. మొదట కండరాల పెంపు కోసం ఈ ఇంజెక్షన్లను వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వాటి అక్రమ విక్రయాలపై దృష్టి సారించి గోషామహల్ ప్రాంతంలో కస్టమర్లకు విక్రయాలు సాగించినట్లు వెల్లడించారు. ఎంజే బ్రిడ్జి, భోలక్ష్మి మాత ఆలయం సమీపంలో కస్టమర్లకు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ దందా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భారత నావికులు ప్రయాణిస్తున్న నౌకపై ఇరాన్ దాడి.. బయటకొచ్చిన వీడియో.. నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు

రంగులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కాస్త కష్టమే. మన చుట్టూ ఉన్న ఇళ్లు, దేవాలయాలు, మ్యూజియంలు, ఆఫీసులు.. ఇలా ప్రతి నిర్మాణంలోనూ రంగులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే కొన్ని కట్టడాల్లో రంగులను కేవలం అలంకరణ కోసం కాకుండా.. ఆ నిర్మాణానికే ప్రత్యేక గుర్తింపుగా మార్చేశారు. ఎక్కడ చూసినా కళ, రంగులు, డిజైన్ కలగలిసి చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించిన అలాంటి అద్భుత నిర్మాణాల్లో కొన్ని ఇవి. రంగురంగుల ఆలయ నిర్మాణాలకు తమిళనాడు పెట్టింది పేరు. తిరుచిరాపల్లిలోని శ్రీరంగనాథస్వామి ఆలయం కూడా అందుకు ఉదాహరణ. శతాబ్దాల పాటు వివిధ రాజవంశాల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన ఈ ఆలయ సముదాయంలో అనేక గోపురాలు ఉన్నాయి. వాటిపై కనిపించే శిల్పాలు, రంగులు.. ఆలయానికి ప్రత్యేకమైన వైభవాన్ని తీసుకొచ్చాయి. ఆధ్యాత్మికతతో పాటు దక్షిణ భారత ఆలయ శిల్పకళను అద్భుతంగా పరిచయం చేసే ప్రదేశంగా ఇది నిలిచింది. స్పెయిన్‌లోని లెగనీస్ సెంట్రల్ లైబ్రరీ కూడా ఆకట్టుకుంటుంది. పుస్తకాలను షెల్ఫ్‌లలో అమర్చినట్టుగా భవనాన్ని నిర్మించారు. సూర్యకిరణాలు భవనంపై పడినప్పుడు గోడలపై కనిపించే రంగులు, టెక్చర్..పేజీలను తలపించేలా ఉంటాయి. లండన్‌లోని క్రాయ్డన్ ప్రాంతంలో పాదచారుల కోసం కట్టారు. 3డీ పోర్సిలైన్ టైల్స్‌ను ఉపయోగించి గోడలు, స్తంభాలను నిర్మించారు. ఏ మూల నుంచి చూసినా కొత్త డిజైన్ కనిపించేలా రూపొందించారు. ఇది కేవలం ఒక మార్గంలా కాకుండా.. ఒక కళాత్మక అనుభవాన్ని అందించాలన్న ఉద్దేశంతో దీనిని రూపొందించారు. చెత్తను కాల్చి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ అంటే సాధారణంగా పెద్ద పరిశ్రమ గుర్తుకొస్తుంది. కానీ జపాన్‌లోని మైషిమా ప్లాంట్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. రంగురంగుల గోడలు, విచిత్రమైన ఆకృతులు, కళాత్మక అలంకరణలతో ఇది బయట నుంచి చూస్తే ఒక థీమ్ పార్క్‌లా కనిపిస్తుంది. ఆస్ట్రియన్ కళాకారుడు ఫ్రీడెన్స్రైచ్ హండర్ట్వాసర్ రూపొందించిన ఈ నిర్మాణం పరిశ్రమల భవనాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్న ఈ ప్రసిద్ధ కాన్సర్ట్ హాల్ నిర్మాణం

ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రై కార్పొరేషన్లలోని ప్లానింగ్ విభాగం లీలలు హైదరాబాద్ సిటీ: ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల నుంచి ఓసీల జారీ వరకు.. ఫైల్‌కు ఇంత అని, అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం బట్టి రేట్లు నిర్ణయించి మరీ లంచాలు తీసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే నోటీసులు, కూల్చివేతలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతుండగా.. తామేమి తక్కువ కాదన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) యంత్రాంగం కూడా వారితో పోటీ పడుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల దోపిడికి అడ్డూ అదుపు ఉండడం లేదు. మాదాపూర్‌లో నోటరీ స్థలాల్లో నాలుగైదు అంతస్తుల భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి.. నిర్మాణదారుల నుంచి కొందరు అధికారులు వసూళ్లు చేస్తుండడం గమనార్హం. కూకట్పల్లి జోన్ పరిధిలోనూ పలువురు పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అంతా మేం చూసుకుంటాం.. అదనపు అంతస్తులు నిర్మించుకోండని భవన యజమానులకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్న ఓ వ్యక్తి అదనంగా మరో రెండంతస్తులు నిర్మించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోగా.. త్వరగా బయటి వైపు పనులు పూర్తి చేసి రంగులు వేయాలని సూచించినట్టు సమాచారం. చైన్‌మెన్ నుంచి టీపీఎస్, ఏసీపీ, సిటీ ప్లానర్ల వరకు అవినీతిలో భాగస్వాములుగా ఉంటున్నారు. ప్రతీ ఫైల్‌కు ముడుపులు ముట్టాల్సిందే అని కింది స్థాయి సిబ్బంది వద్ద పైఅధికారులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం

లోయర్ ట్యాంక్‌బండ్‌లో గల డా.బీ.ఆర్ అంబేడ్కర్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): లోయర్ ట్యాంక్‌బండ్‌లో గల డా.బీ.ఆర్ అంబేడ్కర్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.108 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు రాష్ట్ర షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేందిర బోయి ఉత్తర్వులు జారీ చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న పాత అంబేడ్కర్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, 12 ఏళ్ల నుంచి వినియోగంలో లేదని ఆ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. దీనిని సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు 10 అంతస్తుల కొత్త భవనంగా నిర్మించాలంటూ ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఆర్కిటెక్చరల్, నిర్మాణ సేవల కన్సల్టెన్సీకి రూ.25 కోట్లు కలిపి మొత్తం రూ.108 కోట్లను ఇవ్వాలని కోరడంతో ప్రభుత్వం మంజూరు చేసింది

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో... కోల్‌కతా, ఆగస్టు 19: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సుమారు 80మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రతి అంతస్తులో నాలుగైదు హోటళ్లు నడుస్తున్నాయని.. గాలి, వెలుతురు లేని ఇరుకైన గదులే ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి పేర్కొన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు

Manthani: మంథనిలో రూ.164 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రుల శంకుస్థాపన మంథని: పెద్దపల్లి జిల్లా మంథనిలో సుమారు 164 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. గంగపురిలో 20 కోట్లతో న్యాక్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బస్ డిపో నుంచి గోదావరినది వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి 22 కోట్ల నిధులు, సూరయ్యపల్లి నుండి కాకర్లపల్లి వరకు 29 కోట్ల నిధులు, గుంజపడుగు నుండి విలోచవరం వరకు 8 కోట్లు, కూనారం నుండి ముత్తారం వరకు 36 కోట్లు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు పలు గ్రామాలకు వైకుంఠ రథాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.... మంథని అభివృద్ధికి రూ.164 కోట్లు కాదు.. రూ.800 కోట్ల నిధులు ఇచ్చిన తక్కువేనని అన్నారు. మంథని ప్రాంతానికి చేసిన సేవలకు ఈ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాకుండా రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుకు చెప్పుకుంటామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. శ్రీధర్‌బాబు తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావుతో కలిసి పనిచేసిన అదృష్టం తమకు దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నిరుపేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని తుమ్మల తెలిపారు. మంథని నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్న మంత్రి శ్రీధర్‌బాబును నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఎప్పటికీ మర్చిపోవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మంథనిలో నేడు 164 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, మంథని పట్టణాన్ని

Rajole: రాజోలు ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణానికి సానుకూల స్పందన! Rajole: ఎస్సీ బాలుర వసతి గృహానికి నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హాస్టల్‌కు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కార్యదర్శి, డైరెక్టర్లతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమావేశమై రాజోలు ఎస్సీ బాలుర వసతి గృహానికి నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన అధికారులు SASCI పథకం కింద త్వరలోనే నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీంతో హాస్టల్ నిర్మాణానికి సంబంధించి ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, వసతి సౌకర్యాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అంశంపై ఎస్సీ సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనం పాటించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు

Rajahmundry: రాజమండ్రి: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల వినియోగం! Rajahmundry: ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాతే ఆయా భవనాలను యజమానులు వినియోగించాలని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. మంగళవారం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. గోరక్షణపేటలో ఆక్యునెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవన కొలతలను తనిఖీ చేశారు. అర్బన్ పరిధిలో నిర్మిస్తున్న భవనాలు వాటి అనుమతి పొందిన ప్లాన్లకు అనుగుణంగా కడితేనే నివాసయోగ్య ధృవీకరణ పత్రం జారీ చేయబడుతుందని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. భవన నిర్మాణ సమయంలోనే ర్యాంపులు ప్రహరీ లోపలే ఉండేలా చూడాలని.. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు తగిన డ్రైనేజి సిస్టం, గ్రీనరీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే భవనం పూర్తయ్యేంత వరకు నిర్మాణం జరిగే చోట బిల్డింగ్ ప్లాన్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని తెలియజేశారు. ఆయన వెంట ఏసీపీ కొండలరావు, ఇతర సిబ్బంది ఉన్నారు
ఏసీబీకి మరో అవినీతి చేప చిక్కింది. భవన నిర్మాణ అనుమతి ఫైల్‌ను ప్రాసెస్ చేసి, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమెన్స్మెంట్ లెటర్ జారీ చేసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చార్మినార్ జోన్‌కు చెందిన ఈ మేరకు సంతోష్‌నగర్ సర్కిల్-25 అధికారిణి సీహెచ్ ప్రభావతిని ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భవన నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్‌ను ప్రాసెస్ చేసి, సంబంధిత భవన నిర్మాణ అనుమతి ఉత్తర్వుతో పాటు పని ప్రారంభ లెటర్ అందించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ విభాగానికి ఉంది. అయితే ఈ పని పూర్తి చేసేందుకు ప్రభావతి సదరు వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.లంచం డిమాండ్ ఫిర్యాదు అందటంతో ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్వేశారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రభావతిని పట్టుకున్నారు. ఆమె వద్ద ఉన్న లంచం మెత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగినిగా తన అధికారిక విధులను నిష్పక్షపాతంగా నిర్వర్త్తించాల్సిన ఆమె ఇలా అడ్డదారులు తొక్కుతూ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ మేరకు ఆమెను నాంపల్లిలోని ఏసీబీ కేసుల అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.ఇదిలా ఉండగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అలాగే వాట్సాప్ నెంబర్ 9440446106కు కాల్ చేయాలని సూచించారు. ఫేస్బుక్ పేజీలో Telangana ACB , ట్విట్టర్ ఎక్స్‌లో @Telangana ACB ద్వారా

ఇల్లు బాగు చేయించుకుందామని తవ్వకాలు జరిపితే ఏకంగా వంద కోట్ల రూపాయల నిధి బయటపడితే ఎలా ఉంటుంది? బెల్జియంలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఈస్ట్ ఫ్లాండర్స్‌లో ఓ పురాతన భవనం రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డ్రైనేజీ సిస్టమ్ మార్పు కోసం ఇంటి పునాదుల వద్ద కార్మికులు డ్రిల్లింగ్ చేపట్టారు. ఆ సమయంలో డ్రిల్లింగ్ మిషన్‌కు ఏదో పసుపు రంగు అంటుకోవడం గమనించిన కార్మికులు ఆశ్చర్యపోయారు. మరింత లోతుగా తవ్వి చూడగా కుప్పలు కుప్పలుగా బంగారు నాణేలు, బిస్కెట్లు బయటపడ్డాయి. సుమారు 9 మిలియన్ల యూరోలు, అనగా భారత కరెన్సీలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన ఈ భారీ నిధిని చూసి వారంతా ఖంగుతిన్నారు. సైట్ మేనేజర్ మారియోకు ఈ విషయం తెలపగా.. ఆయన ఏమాత్రం ఆశపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని భద్రపరిచారు. బెల్జియం చట్టాల ప్రకారం ఈ నిధిని క్లెయిమ్ చేయడానికి ఐదేళ్ల సమయం ఉంటుందని, ఆ నిధికి సంబంధించి ఎవరైనా అసలు ఓనర్ ఉంటే వచ్చి ఐదేళ్లలోపు క్లెయిమ్ చేసుకోవాలని, లేనిచో అది ఆ స్థలం యజమానికి, కార్మికులకు చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ అపారమైన సంపద ఇక్కడకు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్

కోకాపేట్ చరిత్రను అర్థం చేసుకోవాలంటే హైదరాబాద్ సంస్థాన కాలానికి వెళ్లాలి. నిజాం పాలనలో హైదరాబాద్ చుట్టుపక్కల విస్తారమైన భూములు వివిధ రకాల భూవ్యవస్థల కింద ఉండేవి. జాగీర్ వ్యవస్థలో భాగంగా కొన్ని భూభాగాలు ప్రభావవంతమైన కుటుంబాలు, అధికారులు, సంస్థానానికి అనుబంధ వర్గాల ఆధీనంలో ఉండేవి. ఆ సమయంలో కోకాపేట్ నేటి నగర రూపానికి పూర్తిగా భిన్నంగా ఉండేది. వ్యవసాయమే ప్రధాన కార్యకలాపంగా ఉండేది. జనసాంద్రత తక్కువగా ఉండటంతో గ్రామీణ వాతావరణం కనిపించేది. హైదరాబాద్ ప్రధాన నగర ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతం పెద్దగా పట్టణీకరణకు లోనుకాలేదు. కోకాపేట్ భూముల్లో కొంత భాగం అప్పటి ప్రభావవంతమైన భూస్వామ్య కుటుంబాల ఆధీనంలో ఉన్నట్లు చారిత్రక ప్రస్తావనల్లో కనిపిస్తాయి. భారత స్వాతంత్రం తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అనంతరం హైదరాబాద్ ప్రాంతంలోని పాత భూవ్యవస్థల్లో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. జాగీర్ వ్యవస్థ రద్దుతో అనేక భూముల పరిపాలన విధానం మారిపోయింది. ఆ దశలో కోకాపేట్‌కు మాత్రం వెంటనే పట్టణ ప్రాంత హోదా రాలేదు. హైదరాబాద్ నగరం అప్పటికి ప్రస్తుత స్థాయిలో పశ్చిమ దిశగా విస్తరించలేదు. దీంతో కోకాపేట్ చాలాకాలం వరకు నగరానికి బయట ఉన్న ప్రశాంతమైన ప్రాంతంగానే కొనసాగింది. కాలం గడిచే కొద్దీ హైదరాబాద్‌లో జనాభా పెరిగింది. కొత్త నివాస ప్రాంతాల అవసరం ఏర్పడింది. ప్రధాన నగర ప్రాంతాల్లో భూముల కొరత, ధరల పెరుగుదలతో అభివృద్ధి సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు నగర శివార్ల వైపు దృష్టి సారించాయి. ఈ పరిణామం కోకాపేట్ భవిష్యత్తును మార్చే కీలక దశగా మారింది. హైదరాబాద్ ఐటీ రంగంలో వేగంగా ఎదగడం కోకాపేట్ అభివృద్ధికి మరో పెద్ద కారణమైంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో కార్యాలయాలు, ఐటీ సంస్థలు పెరగడంతో వాటి చుట్టుపక్కల నివాసాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోకాపేట్ భౌగోళిక స్థానం కీలకంగా మారింది. నగరంలోని ప్రధాన ఐటీ, ఆర్థిక కేంద్రాలకు సమీపంగా ఉండటంతో

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటనలోనే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ముంబైలోని తన కమర్షియల్ ఆస్తుల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తాజాగా అంధేరి వెస్ట్‌లోని ఓ వాణిజ్య భవనంలోని మూడు అంతస్తులను ఓ ప్రముఖ కంపెనీకి లీజుకు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఒప్పందం ద్వారా ఆయనకు నెలకు రూ. 33 లక్షల అద్దె రానుంది.ముంబై అంధేరిలోని ఓషివారా లింక్ రోడ్లో ఉన్న 'సిగ్నేచర్' భవనంలో అమితాబ్‌కు చెందిన ఆఫీస్ స్పేస్ ఉంది. దీనిలోని మూడు పై అంతస్తులను న్యూట్రిషన్ ఉత్పత్తుల సంస్థ 'ట్రూనేటివ్ ఎఫ్&బి ప్రైవేట్ లిమిటెడ్'కు లీజుకు ఇచ్చారు. ఈ ఒప్పందం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది. మొత్తం 8,428 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ స్థలానికి ఐదేళ్ల పాటు లీజు కుదిరింది. ఈ ఐదేళ్ల కాలంలో అమితాబ్‌కు అద్దె రూపంలో మొత్తం రూ. 21.88 కోట్ల ఆదాయం లభించనుంది. ఒప్పందంలో భాగంగా ట్రూనేటివ్ సంస్థ రూ. 1.98 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది. ఏటా అద్దెను 5 శాతం పెంచేలా నిబంధన చేర్చారు. దీంతో పాటు 9 కార్ల కోసం ప్రత్యేక పార్కింగ్ హక్కులను కూడా కల్పించారు.గతేడాది కూడా ఇదే 'సిగ్నేచర్' భవనంలోని నాలుగు ఆఫీస్ యూనిట్లను వార్నర్ మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అమితాబ్ లీజుకు ఇచ్చారు. ఆ ఒప్పందం ద్వారా నెలకు రూ. 17.30 లక్షల అద్దె వస్తోంది.ముంబైలో అమితాబ్‌కు విలువైన ఆస్తులు అనేకం ఉన్నాయి. ఆయన కుటుంబంతో నివసించే
గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆధునికీకరించే దిశగా కీలక ముందడుగు పడింది. ఈ గ్రంథాలయం నిర్మాణం కోసం సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ పెద్దమనసుతో సహకారం అందించనున్నారు. ఈ గ్రంథాలయ నిర్మాణాన్ని దాత చల్లా రాజేంద్రప్రసాద్ రూ.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారన్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాత చల్లా రాజేంద్రప్రసాద్, పౌర గ్రంథాలయ సంస్థ సంచాలకులు ఎ.కృష్ణమోహన్ ఎంవోయూ చేసుకున్నారు. చల్లా రాజేంద్రప్రసాద్ గొప్ప మనసుతో రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారు.. ఆయన దాతృత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.గుంటూరులోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మాధవి, చల్లా రాజేంద్రప్రసాద్, అధికారులు పరిశీలించారు. చల్లా రాజేంద్రప్రసాద్ వరల్డ్ లార్జెస్ట్ కాఫీ ఎక్స్‌పోర్టర్‌గా పేరున్న వెయ్యికి పైగా కాఫీ బ్రాండ్లను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాజేంద్రప్రసాద్ సహకారంతో రూ.20 కోట్లతో ఈ గ్రంథాలయాన్ని సెల్లార్+జీ+2 ప్రణాళికతో భవన నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసి త్వరలోనే మంత్రి లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామన్నారు.ఈ గ్రంథాలయం 1915లో ప్రారంభమై.. దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులకు జ్ఞాన కేంద్రంగా నిలిచిందన్నారు పెమ్మసాని. ఇప్పుడు ఆధునిక సదుపాయాలతో మరింత మెరుగైన వాతావరణాన్ని విద్యార్థులకు అందించేందుకు నూతన భవనం నిర్మించబోతున్నామన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తూ, గుంటూరును విద్యా కేంద్రంగా మరింత బలోపేతం చేయడం తమ లక్ష్యమన్నారు. 1915లో బ్రిటీష్‌వాళ్లు ఉన్న సమయంలో కమ్యూనిటీ హల్గా ప్రారంభమై.. 1958లో స్టేట్ రీజినల్ లైబ్రరీగా కన్వర్ట్ చేశారన్నారు.'ప్రస్తుతం గ్రంథాలయం ఉన్న ఈ భవనం పెచ్చులూడిపోతున్నాయి.. ఈ గ్రంథాలయాన్ని వరల్డ్ క్లాస్‌గా అభివృద్ధి చేయడానికి డబ్బులు ఎక్కువగా కావాలి. ఆ సమయంలో దాతల కోసం చూస్తున్న సమయంలో చల్లా రాజేంద్రప్రసాద్ ముందుకు వచ్చారు. ఫర్నీచర్ నుంచి అన్ని ఖర్చులు రాజేంద్రప్రసాద్ భరిస్తారు.. గంథ్రాలయానికి రాజేందప్రసాద్ సూచించిన పేరు పెట్టడానికి ప్రభుత్వం కూడా అనుమతి

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన అత్యాధునిక నివాస భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) క్షుణ్ణంగా పరిశీలించారు. రాజధాని పరిధిలోని రాయపూడి వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వసతి గృహాలను మంత్రులు పి. నారాయణ, నాదెండ్ల మనోహర్ మరియు ఉన్నతాధికారులతో కలిసి సీఎం సందర్శించారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రాజధాని నిర్మాణాలను వేగవంతం చేసి, వాటిని ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ పరిశీలన సాగింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఆధ్వర్యంలో రాయపూడి వద్ద మొత్తం 12 భారీ టవర్లుగా ఈ నివాస సముదాయాన్ని నిర్మించారు. వైశాల్యం పరంగా ఎక్కడా రాజీ పడకుండా, ఒక్కొక్క ఫ్లాట్‌ను దాదాపు 3,500 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రజాప్రతినిధుల అవసరాలకు తగినట్లుగా మొత్తం 288 లగ్జరీ ఫ్లాట్లను అన్ని రకాల మౌలిక వసతులు, ఆధునిక సదుపాయాలతో సిఆర్డిఏ అధికారులు నిర్మించారు. భవనాల లోపలి అలంకరణ, నాణ్యతా ప్రమాణాలు మరియు గదుల నిర్మాణ శైలిని సీఎం చంద్రబాబు స్వయంగా చూసి అధికారులకు పలు సూచనలు చేశారు. రాజధాని నిర్మాణంలో ఈ భవనాల పూర్తి కావడం ఒక మైలురాయి అని, త్వరలోనే వీటిని ప్రజాప్రతినిధులకు అధికారికంగా కేటాయించనున్నట్లు మంత్రులు వెల్లడించారు. అమరావతిలో మళ్లీ వేగం పుంజుకున్న అభివృద్ధి పనులకు ఈ భవన సముదాయమే నిదర్శనమని స్థానిక రాజకీయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి

ప్రజలు, ఉద్యోగులు, అధికారుల సమష్టి భాగస్వామ్యంతో 'పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా 'రోడ్ డాక్టర్' పేరుతో 'జీరో పాట్ హోల్ మిషన్'ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరంగా చేరువ చేయడం ద్వారా ప్రతి ఒక్కరినీ జాతి నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టేలా 'రోడ్ డాక్టర్' కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పనులను చిత్తశుద్ధితో చేపట్టినప్పుడు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని, భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతికి లభిస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తే వారే ప్రభుత్వానికి అండగా నిలుస్తారని, కర్నూలులో డీఎస్సీ-2025 ఉపాధ్యాయ అభ్యర్థులు చేపట్టిన కార్యక్రమమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. జులై నెలలో రాష్ట్రం 10.70 శాతం ఆర్థిక వృద్ధిని సాధించిందని వెల్లడించిన ఆయన, రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో

ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్‌నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్‌నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ఈరోజు (మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పార్టనర్స్ ఇన్‌నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలని మార్గనిర్దేశం చేశారు. ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలని సీఎం సూచించారు. గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు ఇన్వాల్వ్ అవుతారనడానికి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనే నిదర్శనమని తెలిపారు. అలాగే వాస్తవాలను ప్రజలకు వివరిస్తే... ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలుస్తారని.. దీనికి కర్నూలులో డీఎస్సీ-2025 టీచర్లు చేపట్టిన కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నెలవారీ ఆర్థిక ప్రగతి నివేదికపై సమీక్షించామని అన్నారు. జులైలో 10.70 శాతం వృద్ధిని నమోదు చేయగలిగామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఇప్పటి నుంచి ఎక్కువగా ఉండనుందని చెప్పారు. ఇప్పుడే అసలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. వీటిని అధిగమించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్ గుడ్‌న్యూస్.. పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

Maripeda: మర్రిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం – ఏఎస్సైకి తీవ్ర గాయాలు! Maripeda: మహబూబాబాద్ మరిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం. శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాను భయంకరమైన విపత్తు ముంచెత్తింది. సోమవారం సంభవించిన శక్తివంతమైన భూకంప ధాటికి పలు నగరాలు క్షణాల్లో అతలాకుతలమయ్యాయి. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ రాకాసి భూకంపం కారణంగా ఇప్పటివరకు కనీసం 77 మంది ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వందలాది బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు నేలమట్టం కావడంతో అమాక ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు.ఈ దారుణ విపత్తులో అత్యధికంగా రిసారాల్డా ప్రావిన్స్‌లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే వాలే డెల్ కాకా ప్రాంతంలో 27 మంది, చోకో ప్రావిన్స్‌లో నలుగురు, మణిజాలెస్ నగరంలో ముగ్గురు, అంటియోకియా ప్రావిన్స్‌లో ఒకరు మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ప్రముఖ నగరాలైన పెరీరాలో 18 మంది, కాలి నగరం ఉన్న వాలే డెల్ కాకా విభాగంలో 27 మంది బలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ భూకంపం: 7.4 తీవ్రతతో విలయతాండవం, 3 దేశాలు షేక్..భూమికి 107 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలురాజధాని బొగోటాకు పశ్చిమంగా దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో రీజియన్‌లోని శాన్ జోస్ డెల్ పాల్మర్ ప్రాంతంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు భూగర్భ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. భూమి అంతర్భాగంలో దాదాపు 107 కిలోమీటర్ల లోతున భారీ మార్పులు రావడం వల్లనే ఈ స్థాయిలో వినాశనం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రకంపనల ధాటికి పొరుగునే ఉన్న ఈక్వెడార్, పనామా దేశాలు కూడా తీవ్రంగా ఉలిక్కిపడ్డాయి.శతాబ్దపు మహా ప్రళయం.. 4 వేలు దాటిన శవాల కుప్పలు..యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలువిపత్తు సంభవించిన వెంటనే స్థానిక రెస్క్యూ బృందాలు, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. కూలిపోయిన భవనాల శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాధితుల హాహాకారాలతో

మాజీ ఎమ్మెల్యే, విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా రూ.కోట్లు దండుకుంది.... ప్రజల నుంచి అక్రమంగా రూ.2 వేల కోట్లు సేకరణ: ఈడీ కోటి నగదు, 6 లగ్జరీ కార్లు స్వాధీనం.. 182 ఖాతాలు ఫ్రీజ్ విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే, విశాఖ వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రజల నుంచి అక్రమంగా రూ.కోట్లు దండుకుంది. చట్ట నిబంధనలు ఉల్లంఘించి రూ.రెండు వేల కోట్లు సేకరించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో వెల్లడైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భారీ స్థాయిలో డిపాజిట్లను సేకరించినట్టు ఈడీ గుర్తించింది. ఈనెల ఐదో తేదీన విశాఖపట్నం, హైదరాబాద్‌లలో కంపెనీ ఎండీ మళ్ల విజయప్రసాద్, డైరెక్టర్లు వరాహ రామకృష్ణ, సత్య శ్రీనివాసరావు తదితరులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో భువనేశ్వర్ ఈడీ జోనల్ కార్యాలయ అధికారులు సోదాలు జరిపారు. పలు రాష్ర్టాల్లో చిట్‌ఫండ్ కుంభకోణంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేశారు. సోదాల్లో గుర్తించిన ఉల్లంఘనలు, ఇతర అంశాలను సోమవారం ఈడీ ఓ ప్రకటనలో వివరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) 2002లోని సెక్షన్ 17 కింద ఈ నెల ఐదో తేదీన సోదాలు చేసినట్లు తెలిపింది. ఈ సోదాల్లో రూ.1.01 కోట్ల నగదు, వివిధ స్థిర, చరాస్తులు, నేరపూరిత అంశాలను సూచించే కీలక పత్రాలు, మొబైల్ ఫోన్లు, డిజిటిల్ పరికరాలు స్వాధీనం చేసుకుంది. అలాగే 182 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. వారికి సంబంధించి ఆరు లగ్జరీ కార్లు సీజ్ చేసింది. డిపాజిట్ల సేకరణను దాచిపెట్టేందుకు ఆర్థిక నివేదికలను తారుమారు చేసినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తులో ఒడిసా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, ఏపీ తదితర రాష్ట్రాలకు చెందినవారి నుంచి అనధికారికంగా డిపాజిట్లు సేకరించినట్లు తేలింది

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాచీన తీర ప్రాంతమైన కోరంగి (కొరింగ) ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, సాంకేతికంగా ముందంజలో ఉన్న నౌకా నిర్మాణ కేంద్రంగా విరాజిల్లింది. నాటి కాలంలోనే ఇక్కడి శిల్పులు తయారు చేసే నావలు అత్యుత్తమ నాణ్యతతో, సముద్ర ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా ఉండేవి. అయితే 1839 నవంబరు 25న సంభవించిన పెను ఉప్పెన ఈ చారిత్రక నగర వైభవాన్ని అట్టడుగుకు తొక్కేసింది. దాదాపు 40 అడుగుల ఎత్తున లేచిన రాకాసి అలలు తీరాన్ని ముంచెత్తడంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. దాదాపు 20వేల నౌకలు నీటిపాలు అయ్యయి. ఈ పెను విపత్తు భారత వాణిజ్య రంగానికి కోలుకోలేని దెబ్బగా మారింది. ఉప్పెన తీవ్రత, నౌకా రంగానికి జరిగిన భారీ నష్టం1839 నాటి ప్రకృతి విపత్తులో సంభవించిన నష్టం అపారమైనది. స్థానిక నౌకాశ్రయంలో లంగరు వేసి ఉన్న నౌకలతో పాటు అనేక బోట్లు ఈ ఉప్పెన ధాటికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల మందికి పైగా ప్రజలు మరణించారని, అలాగే సుమారు 20 వేల వరకు చిన్న, పెద్ద నౌకలు సముద్రంలో మునిగిపోయాయని లేదా కొట్టుకుపోయాయని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ గణాంకాలు నాటి కోరంగి ప్రాంతంలో నౌకా పరిశ్రమ ఎంత భారీ స్థాయిలో విస్తరించి ఉండేదో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యూరప్ దేశాల్లోని నౌకాశ్రయాల కంటే ఎంతో ముందే గోదావరి తీరంలో అంతర్జాతీయ స్థాయి వాణిజ్య కార్యకలాపాలు సాగాయి. బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక కుట్రలు, అణచివేత ధోరణి కోరంగి నౌకా నిర్మాణం అక్కడి వ్యాపార వృద్ధి లండన్ నౌకాశ్రయం, బ్రిటిష్ వ్యాపారులకు అతిపెద్ద పోటీగా మారాయి. భారత నౌకల నాణ్యతతో బ్రిటన్‌లో తయారయ్యే నౌకలు పోటీ పడలేకపోయేవి. ఈ క్రమంలో భారత నౌకా రంగాన్ని దెబ్బతీయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ తీవ్రమైన పన్నుల భార మోపడం, నిబంధనలను కఠినతరం చేయడం వంటి కుట్రలకు పాల్పడింది. స్వదేశీ