
Ap Cm Chandrababu Reviews Departments At Rtgs And Calls For People Participation In Nation Building Vk 1549051
ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతో పార్టనర్స్ ఇన్నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ఈరోజు (మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పార్టనర్స్ ఇన్నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలని మార్గనిర్దేశం చేశారు.
ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలని సీఎం సూచించారు. గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు ఇన్వాల్వ్ అవుతారనడానికి భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనే నిదర్శనమని తెలిపారు.
అలాగే వాస్తవాలను ప్రజలకు వివరిస్తే... ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలుస్తారని.. దీనికి కర్నూలులో డీఎస్సీ-2025 టీచర్లు చేపట్టిన కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నెలవారీ ఆర్థిక ప్రగతి నివేదికపై సమీక్షించామని అన్నారు. జులైలో 10.70 శాతం వృద్ధిని నమోదు చేయగలిగామని తెలిపారు. ఎల్నినో ప్రభావం ఇప్పటి నుంచి ఎక్కువగా ఉండనుందని చెప్పారు. ఇప్పుడే అసలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. వీటిని అధిగమించాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రౌడీలను, గంజాయి బ్యాచ్లను అణిచివేస్తాం.. సీఎం వార్నింగ్
గుడ్న్యూస్.. పొగాకు రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణం
వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం
Read Latest AP News And Telangana News And National News






