
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Best Time to Oil Hair: జుట్టుకు నూనె రాసుకోవడం భారతీయ కుటుంబాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అలవాటు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు నూనె రాయాలని పెద్దలు తరచుగా చెబుతుంటారు. అయితే నూనెను రాత్రంతా తలకు ఉంచుకోవాలా? ఉదయాన్నే రాసుకోవాలా? లేక తలస్నానానికి ముందు రాసుకోవాలా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి ఉదయం లేదా రాత్రి నూనె రాసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుందని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. నూనె వల్ల కలిగే ప్రయోజనాలు ప్రధానంగా ఉపయోగించే నూనె రకం, ఎంత మోతాదులో వాడుతున్నాం, జుట్టు మరియు తల చర్మం పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. స్నానానికి ముందు నూనె రాయడం మంచిదేనా? తలస్నానానికి 30 నిమిషాల నుంచి కొన్ని గంటల ముందు నూనె రాసుకోవడం సులభమైన పద్ధతి. ఇలా చేయడం వల్ల నూనె జుట్టుతో కొంత సమయం పాటు ఉండటమే కాకుండా, రాత్రంతా జిడ్డుగా ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా కొబ్బరి నూనెను తలస్నానానికి ముందు ఉపయోగించడం వల్ల జుట్టు ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని ఒక అధ్యయనం సూచించింది. అయితే దీని అర్థం కొబ్బరి నూనె జుట్టును వేగంగా పెంచుతుందని కాదు. జుట్టును దెబ్బతినకుండా కాపాడటం, దాని నాణ్యతను నిలబెట్టుకోవడంలో ఇది సహాయపడవచ్చు. ఉదయం నూనె రాసుకోవచ్చా? మీరు ఉదయం లేదా పగటిపూట తలస్నానం చేసే అలవాటు ఉన్నవారైతే, ఉదయం నూనె రాసుకుని కొన్ని గంటల తర్వాత తలస్నానం చేయవచ్చు. రాత్రంతా నూనె రాసుకుని నిద్రపోవడం ఇష్టం లేని వారికి ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. నూనెను రాత్రంతా ఉంచుకోవడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుందని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు. అంతేకాకుండా కొంతమందిలో ఎక్కువసేపు నూనెను ఉంచడం వల్ల తల చర్మం జిడ్డుగా మారడం, దురద లేదా పొలుసులు వంటి సమస్యలు కనిపించవచ్చు. రాత్రంతా నూనె ఉంచుకోవాలా? అవసరం లేదు. జుట్టుకు నూనె రాసిన తర్వాత 30

ధనియాలు వంటల రుచిని, సువాసనను పెంచడమే కాదు.. వీటిలో ఉండే పలు పోషకాలు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: వంటల్లో సువాసన, రుచిని పెంచేందుకు ధనియాలను విరివిగా ఉపయోగిస్తాం. అయితే ధనియాల్లో రుచితో పాటు పలు పోషకాలు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. అందుకే ధనియాలను నీటిలో నానబెట్టి తీసుకునే అలవాటు చాలామందిలో ఉంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ధనియాల నీటిని తాగితే జీర్ణక్రియకు మేలు చేస్తుందని చెబుతారు. ధనియాల నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు కొంత ఉపశమనం లభించవచ్చని భావిస్తారు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి స్వల్ప సమస్యల్లో ఉపయోగకరంగా ఉండొచ్చు. అయితే మలబద్ధకం లేదా ఎసిడిటీకి ఇది ఖచ్చితమైన చికిత్స కాదు. ధనియాల నీరు శరీరానికి ద్రవాలను అందించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఎక్కువగా కాకుండా కొద్దిగా తీసుకోవడం మంచిది. నిద్రకు ముందు అధికంగా ద్రవాలు తాగితే మధ్యలో బాత్రూమ్కు వెళ్లాల్సి రావచ్చు. ధనియాల్లో ఉండే కొన్ని సహజ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ధనియాల నీటిని మధుమేహానికి చికిత్సగా భావించకూడదు. మధుమేహానికి మందులు వాడుతున్న వారు ఇలాంటి పానీయాలను క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ధనియాల నీరు తాగడం వల్ల నేరుగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. అయితే ఇది తక్కువ కేలరీల పానీయం కావడంతో చక్కెర కలిపిన పానీయాలకు బదులుగా తీసుకుంటే ఆరోగ్యకరమైన ఎంపికగా ఉంటుంది. బరువు తగ్గడానికి సమతుల ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర ముఖ్యమైనవి. ధనియాల్లోని కొన్ని సహజ సమ్మేళనాలు శరీరానికి విశ్రాంతి కలిగించడంలో సహాయపడవచ్చని చెబుతారు. అయితే ధనియాల నీరు తాగితే నిద్ర నాణ్యత ఖచ్చితంగా మెరుగుపడుతుందని నిర్ధారించడానికి తగిన ఆధారాలు లేవు. రాత్రి తేలికపాటి ధనియాల నీటిని తీసుకోవడం వల్ల కొందరికి ఉదయం జీర్ణక్రియ సాఫీగా

మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు వాటి తాజాదనం, రంగు మాత్రమే చూస్తే సరిపోదు. వాటిపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు అవి తాజాగా, నాణ్యంగా ఉన్నాయా అని మాత్రమే చూస్తాం. కానీ వాటి ఉపరితలంపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. అందుకే కూరగాయలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడంతో పాటు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పొలం నుంచి మార్కెట్ వరకు కూరగాయలు అనేక దశల్లో ఇతర పదార్థాలతో సంబంధం కలిగి ఉంటాయి. సాగు సమయంలో ఉపయోగించే పురుగుమందులు, కలుషిత నీరు, రవాణా సమయంలో అపరిశుభ్రత, మార్కెట్లో దుమ్ము, ఈగలు వంటి కారణాల వల్ల వాటిపై కాలుష్యం చేరవచ్చు. కూరగాయలను నేలపై ఉంచడం, శుభ్రత లేని ప్రదేశాల్లో నిల్వ చేయడం, మురికి సంచుల్లో రవాణా చేయడం వంటివి కూడా వాటిపై సూక్ష్మజీవులు చేరడానికి కారణమవుతాయి. సరిగ్గా శుభ్రం చేయని కూరగాయలను తినడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆహార సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా.. కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన వాటిని ఎంచుకోవచ్చు. కుళ్లిన లేదా దెబ్బతిన్న కూరగాయలను కొనకండి. అసహజమైన రంగు ఉన్న వాటిని తీసుకోకపోవడం మంచిది. చాలా ఎక్కువగా మెరుస్తున్న కూరగాయలను జాగ్రత్తగా పరిశీలించండి. కూరగాయలు శుభ్రమైన ప్రదేశంలో ఉంచారా లేదా గమనించండి. కాలువలు, చెత్త కుప్పల దగ్గర విక్రయించే కూరగాయలను వీలైనంత వరకు కొనకండి. ఈగలు ఎక్కువగా వాలుతున్న కూరగాయలను తీసుకోకుండా ఉండటం మంచిది. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిన వెంటనే వాటిని ఒకసారి పరిశీలించి శుభ్రం చేయాలి. శుభ్రమైన ప్రవహించే నీటితో కూరగాయలను బాగా కడగడం ముఖ్యం. ఆకుకూరలను విడదీసి కడగడం వల్ల వాటిపై ఉన్న దుమ్ము వంటి మలినాలను తొలగించవచ్చు. కూరగాయలను కడగకుండా నేరుగా ఫ్రిజ్‌లో

బంధువుల ఇంటికి వెళ్లడం అంటే కేవలం వారిని కలవడం కాదు.. మన ప్రవర్తన, మాట తీరు, మర్యాద కూడా ముఖ్యమే. మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న తప్పులు బంధువుల ముందు మన గౌరవాన్ని తగ్గించడమే కాకుండా, మంచి సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు. ఇంటర్నెట్ డెస్క్: మనకు తెలియకుండానే చేసే చిన్న చిన్న తప్పులు కూడా మన గౌరవాన్ని, బంధాలను దెబ్బతీయవచ్చని ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. అందుకే బంధువుల ఇంటికి వెళ్లేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని సూచించారు. బంధువుల ఇంటికి వెళ్లే ముందు వారికి ఫోన్ చేసి చెప్పడం మంచిది. వారు ఏదైనా పనిలో ఉండవచ్చు, బయటకు వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండవచ్చు లేదా ఇంట్లో వేరే కార్యక్రమం ఉండవచ్చు. అలాంటి సమయంలో ముందుగా చెప్పకుండా వెళ్లడం వారికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే ఎంత సన్నిహితమైన బంధువులైనా సరే, వీలైనంత వరకు ముందుగానే సమాచారం ఇచ్చి వెళ్లడం మంచిది. వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకండి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు వారి కుటుంబ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. వారు తమ ఇంటిని ఎలా నిర్వహిస్తున్నారు, పిల్లలను ఎలా పెంచుతున్నారు, డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు వంటి విషయాలపై అవసరం లేకుండా ప్రశ్నలు అడగడం లేదా సలహాలు ఇవ్వడం మంచిది కాదు. ఎవరైనా స్వయంగా సలహా అడిగితే మాత్రమే మీ అభిప్రాయాన్ని చెప్పడం మంచిది. ఇతరుల వ్యక్తిగత విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బంధువులు లేదా స్నేహితుల ఇంటికి వెళ్లేటప్పుడు వీలైతే ఏదైనా చిన్న కానుక తీసుకెళ్లడం మంచి పద్ధతి. పండ్లు, స్వీట్లు లేదా వారికి ఉపయోగపడే చిన్న వస్తువు ఏదైనా తీసుకెళ్లవచ్చు. దాని విలువ కంటే, వారిని గుర్తు చేసుకుని తీసుకెళ్లామనే భావన ముఖ్యం. ఇది మన ఆప్యాయతను తెలియజేస్తుంది. బంధువుల ఇంట్లో ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదు. ఎంత సన్నిహితమైన బంధువులైనా
బాదంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. బాదం గింజలు తింటే నిద్రబాగా పడుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. చామంతి టీలో అపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గిస్తుంది. చామంతి టీ తాగితే గాఢ నిద్ర పడుతుంది. కివీ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్ర త్వరగా పట్టేందుకు సాయపడతాయి. నిద్రపోవడానికి గంట ముందు కివీ తింటే మంచిది. సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ డి కూడా లభిస్తుంది. సాల్మన్ తింటే నిద్ర నాణ్యత పెరుగుతుంది. వాల్నట్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. మైండ్‌ని రిలాక్స్‌గా ఉంచుతాయి. వాల్నట్స్ తింటే నిద్రబాగా పడుతుంది. అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్ర నాణ్యతను పెంచుతాయి. చిలగడదుంపల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నిద్ర నాణ్యతను పెంచుతాయి. గోరు వెచ్చని పాలు తాగితే నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. ఇందులోని ట్రిఫ్టోఫాన్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో నిద్ర పడుతుంది. నిద్రపోవడానికి ముందు కాఫీ, టీలు తాగొద్దు. ఇవి నాడీ వ్యవస్థను యాక్టివ్ చేసి నిద్రను దూరం చేస్తాయి

ఉద్యోగం, ఉన్నత చదువులు, టూరిజం లేదా బంధువులను కలవడానికి తొలిసారి అమెరికా వెళ్తున్న భారతీయులు అక్కడి జీవన విధానం, రూల్స్ పై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంతో పోలిస్తే అమెరికాలోని చట్టాలు, రవాణా, ఖర్చులు, అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. సరైన ముందస్తు ప్లాన్ లేకపోతే విమానాశ్రయం ల్యాండింగ్ దగ్గర నుంచే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అమెరికాకు చేరుకోవడానికి సరైన వీసా లేదా కొన్ని అర్హత కలిగిన దేశాల వారికి ఈఎస్టీఏ అవసరం. భారతీయులకు సాధారణంగా B1/B2, H-1B, F-1 వంటి వీసాలు ఉంటాయి. అయితే, కేవలం చేతిలో వీసా ఉంటే సరిపోదు. అమెరికా విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఇమిగ్రేషన్ అధికారుల ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీ ప్రయాణ ఉద్దేశం, తిరుగు ప్రయాణ, టికెట్, వసతి వివరాలకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే మీ పాస్‌పోర్ట్ కనీసం 6 నెలల వాలిడిటీ కలిగి ఉండేలా చూసుకోవాలి. అమెరికాలో వైద్య సేవలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. చిన్న డాక్టర్ సంప్రదింపుల నుంచి అత్యవసర చికిత్సల వరకు భారీగా ఖర్చువుతుంది. ఇన్సూరెన్స్ లేకపోతే ఒక్క రోజు హాస్పిటల్ స్టేకే వేల డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే కనీసం $50,000 నుంచి $100,000 కవరేజీ ఉన్న ప్రాపర్ ట్రావెల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకెళ్లడం చాలా అవసరం. డాలర్ విలువ ఎక్కువగా ఉండటమే కాకుండా, అక్కడి జీవన వ్యయం కూడా గణనీయంగా ఉంటుంది. హోటల్స్, ఇళ్ల అద్దెలు, రెస్టారెంట్లు, రవాణా ఖర్చులు భారత్‌తో పోలిస్తే చాలా ఎక్కువ. డబ్బుల విషయంలో సరైన ప్లానింగ్ లేకపోతే ఆర్థికంగా భారంగా మారే ప్రమాదం ఉంది. అమెరికా సంస్కృతిలో టిప్పింగ్ ఒక సామాజిక బాధ్యతగా ఉంటుంది. రెస్టారెంట్లు, క్యాబ్‌లు, బార్బర్ షాప్‌లు, డెలివరీ సర్వీసుల్లో సర్వీస్ అందించిన వారికి బిల్లులో సాధారణంగా 15% నుంచి 20% వరకు టిప్ ఇవ్వడం ఆనవాయితీ. ట్యాక్స్ కాకుండా

అలియా భట్ తన 28వ ఏట, 2022 ఏప్రిల్ 14న రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. బాంద్రాలోని తమ ఇంట్లోనే చాలా సింపుల్‌గా వీరి పెళ్లి వేడుక జరిగింది.అలియా భట్ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భర్త రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టు రామాయణలో నటిస్తున్నారు. ఈ సినిమాపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న తన 30వ ఏట అడుగుపెట్టకముందే, 2026 ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరో కాగా రష్మిక పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తోంది.పుష్ప, ఛావా, యానిమల్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాల్లో రష్మిక హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ, రష్మిక కలసి ప్రస్తుతం రణబలి అనే చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం మైసాలో నటిస్తోంది. జెనీలియా తన 24 ఏళ్ల వయసులోనే, 2012 ఫిబ్రవరి 3న రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుంది.జెనీలియా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి. సై, బొమ్మరిల్లు, ఢీ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్, రామ్ పోతినేని లాంటి స్టార్స్ తో జెనీలియా స్క్రీన్ షేర్ చేసుకుంది. రవీనా టాండన్ తన 29వ ఏట, 2004 ఫిబ్రవరి 22న అనిల్ తడానిని వివాహం చేసుకుంది. రవీనా టాండన్ బాలీవుడ్ లో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా ఉన్నారు. కొన్ని తెలుగు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. బంగారు బుల్లోడు, పాండవులు పాండవులు తుమ్మెద, ఆకాశ వీధిలో లాంటి తెలుగు చిత్రాల్లో ఆమె నటించింది

చాలామంది జీవితంలో ఎదుర్కొనే సాధారణ సమస్యలలో నిద్రలేమి ఒకటి. తినకముందు ఏ పనినైనా చేసే ఉత్సాహం, డిన్నర్ తర్వాత హఠాత్తుగా నిద్ర ముంచుకొచ్చే అనుభవం మనందరికీ తెలిసిందే.. ఆహారానికి నిద్రను కలిగించే తత్వం ఉంటుందని, సరైన ఆహారాలను ఎంచుకోవడం ద్వారా సుఖమైన, గాఢమైన నిద్ర పొందవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. రాత్రిపూట డిన్నర్లో లేదా డిన్నర్ తర్వాత తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.. కఫ సంబంధిత సమస్యలు లేని వారికి ఈ ఆహారాలు అద్భుతమైన నిద్రకు సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండు: నిద్రకు సహాయపడే ఆహారాలలో అరటిపండు ముఖ్యమైనది. అరటిపండులో పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నొప్పులు (మజిల్ క్రాంప్స్) తగ్గించడానికి తోడ్పడతాయి. అంతేకాకుండా, ఇది కడుపు నిండుగా ఉండి ఆకలి అనే భావన లేకుండా చేస్తుంది. దీని వల్ల హాయిగా, కమ్మగా నిద్రపడుతుంది. డిన్నర్ చేసిన తర్వాత ఒకటి లేదా రెండు గంటలు ఆగి అరటిపండు తింటే సుఖమైన నిద్ర మీ సొంతమవుతుందని పేర్కొంటున్నారు. చెర్రీస్: మంచి నిద్ర కోసం చాలామందికి తెలియని, కానీ అత్యంత ప్రభావవంతమైన ఆహారం చెర్రీస్. చెర్రీస్‌లో మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపించే ప్రత్యేకమైన తత్వం ఉంటుంది. మెలటోనిన్ అనేది సహజమైన స్లీప్ హార్మోన్, ఇది నిద్రను ప్రేరేపించడానికి, నియంత్రించడానికి సహాయపడుతుంది. చెర్రీస్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.. ఇది గాఢమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. పెరుగు: అనాదిగా మనం ఉపయోగిస్తున్న, గాఢమైన నిద్రకు తోడ్పడే మరో ఆహారం పెరుగు. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పెరుగు “స్తోతస్సుల” పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను అందించే “మనోవహ స్తోతస్సుల”ను అడ్డగించడం ద్వారా చక్కటి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. కాల్షియం కండరాల నొప్పులు రాకుండా చేస్తుంది. ఇది ప్రశాంతమైన నిద్రకు చాలా అవసరం. మంచి గడ్డపెరుగు రాత్రిపూట

నేడు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మెగా సిటీగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కీలకమైన వ్యాపార కేంద్రంగా దుబాయ్ వెలుగుగొందుతోంది. అయితే, సరిగ్గా 1947 స్వాతంత్ర్య సమయానికి ముందు చరిత్ర ఇంకో మలుపు తిరిగి ఉంటే... నేడు దుబాయ్ భారతదేశంలోనో లేదా పాకిస్తాన్లోనో ఒక భాగంగా ఉండేది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా, ఇది ముమ్మాటికీ నిజమంటున్నారు ప్రముఖ చరిత్రకారుడు శామ్ డాల్రింపుల్. ఆయన రాసిన ష్యాటర్డ్ ల్యాండ్స్ పుస్తకం ఆధారంగా వెలుగులోకి వచ్చిన ఈ నిజాలు ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.ఢిల్లీ కేంద్రంగా సాగిన అరబ్ పాలకుల పాలనఒకప్పుడు అరబ్ ప్రాంతాలు నేరుగా బ్రిటన్ రాజధాని లండన్ నుంచి కాకుండా, బ్రిటిష్ ఇండియా రాజధాని అయిన ఢిల్లీ నుంచే పాలించబడేవి. పర్షియన్ గల్ఫ్ పరిధిలోని అనేక అరబ్ సంస్థానాలు, రక్షణ ప్రాంతాలు వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఆధీనంలో పనిచేసేవి. 1889 నాటి అప్పటి చట్టాల ప్రకారం కువైట్, అడెన్, అబుదాబి వంటి ప్రాంతాలను చట్టబద్ధంగా భారతదేశంలో భాగంగానే భావించేవారు. ఎంతలా అంటే, అబుదాబి పేరు భారత్‌లోని స్వదేశీ సంస్థానాల అధికారిక జాబితాలో ఉండేది. అలాగే అప్పట్లో అక్కడి ప్రజలకు ఇండియన్ ఎంపైర్ పాస్‌పోర్ట్‌లను సైతం జారీ చేసేవారు. రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో నెహ్రూ సర్కార్ వద్దన్నాక తీరిన ఆశలు1947లో భారత్, పాకిస్తాన్‌లు విడిపోతున్న తరుణంలో, బ్రిటీష్ అధికారుల ముందు ఒక పెద్ద ప్రశ్న వచ్చి పడింది. భారత్ వీడి వెళ్తున్న దొరలు, పర్షియన్ గల్ఫ్ లోని ఈ అరబ్ ప్రాంతాల బాధ్యతను కాబోయే భారత ప్రభుత్వానికి లేదా పాకిస్తాన్‌కు అప్పగిద్దామని భావించారు. అయితే, ఆ సమయంలో ఢిల్లీలోని భారత అధికారులు, అప్పటి పాలకులు గల్ఫ్ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. సముద్రం దాటి ఉన్న ఆ ప్రాంతాలను నిర్వహించడం భారత్‌కు పెద్దగా ప్రయోజనకరం కాదని భావించడంతో, ఈ ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు