
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ.. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన వరుణ్.. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అయితే గత ఏడేళ్లుగా సినిమాలు ఆశించి స్థాయిలో ఆడకపోవడంతో బాధ పడ్డానని, తాను మళ్లీ హిట్ కొడతానని అనుకోలేదని వరుణ్ చెబుతున్నారు.శుక్రవారం సాయంత్రం వైజాగ్ లో 'కొరియన్ కనకరాజు' మెగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''కొరియన్ కనకరాజు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉంది. నా యాక్టింగ్ శిక్షణ అంతా ఇక్కడ మా సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేశాను. మళ్ళీ ఇక్కడికి రావడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా హ్యాపీగా ఉంది. ఒక సినిమా సక్సెస్ వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఈ సినిమాలో పని చేసిన మా టీంలోని ప్రతి ఒక్కరికి నేను థాంక్స్ చెప్తున్నా'' అని అన్నారు.''గాంధీ, నేనూ.. డైరెక్టర్ హీరోలా కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా పని చేసాం. అదే ఈరోజు ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణమని అనుకుంటున్నాను. మళ్ళీ తప్పకుండా కలిసి సినిమా చేస్తాం. మా ప్రొడ్యూసర్స్ యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ థాంక్యూ సో మచ్. సినిమాకి పనిచేసిన వారందరికీ పేరు పేరునా పెద్ద థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'ఓజీ' నుంచి దుమ్ము లేపుతున్నాడు. నాకు OG లెవెల్ వద్దులే కానీ, ఎంతో కొంత ఇవ్వమని తమన్ ని అడిగాను. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి పిల్లర్ గా నిలిచాడు. రితికా నాయక్ జర్నీ తెలుగులో గొప్పగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను''''సత్య నా బాయ్ ఫ్రెండ్. నిజంగా ఫస్ట్ నుంచి నాకు ఒక మంచి సినిమా రావాలని, తను ఆ సినిమాలో ఉండాలి.. జనాల్ని ఎంటర్టైన్ చేయాలని చాలా కష్టపడి, చాలా ఇన్వాల్వ్ అయి సత్య ఈ సినిమా చేశాడు. తను చాలా చాలా డెడికేటెడ్ యాక్టర్. చిరంజీవి గారు చెప్పినట్టు సత్య ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. గత 7 ఏళ్లుగా నా సినిమాలు సరిగా ఆడకపోవడం వల్ల చాలా బాధగా ఉండేది. సినిమాలు చేయగలుగుతానా లేదా? మళ్లీ హిట్టు కొడతానా లేదా? అనే సెల్ఫ్ డౌట్ ఉండేది. కానీ నా వైఫ్ లావణ్య నాకంటే ఎక్కువ నమ్మింది. నాకు ఎప్పుడూ ఒక సపోర్ట్ సిస్టంగా నాతో నిలబడింది. ఆమె నాకు దొరకడం నా అదృష్టం. మా అమ్మానాన్నలకు థ్యాంక్స్''''నేను మా పెదనాన్నని చూస్తూ పెరిగాను. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఫస్ట్ నుంచి నేను ఏ సినిమా చేసినా ఆయన వచ్చి సపోర్ట్ చేసేవారు. ఒక రెండు మూడు సినిమాలకి పిలిచాను. ఆ సినిమాలు సరిగ్గా ఆడలేదు. నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. ఈసారి హిట్టు కొట్టి పెద్దనాన్నని పిలుద్దాం అనుకున్నాను. ఈ సినిమా ఎంతో కొంత సక్సెస్ అవ్వడం.. సక్సెస్ ఈవెంట్ కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా రావడం.. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ సో మచ్ డాడీ. ఫస్ట్ నుంచి మా ఇంట్లో పెద్దనాన్న, బాబాయి, మా నాన్న నాకు ఒకే మాట చెప్తారు. నువ్వు నమ్మిన పనిని ఎంతో నిజాయితీగా చేస్తూ ఉంటే, నీకు ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని చెప్పారు. మాకు ఇలా ఎప్పుడూ మంచి మాటలు చెప్పి పెంచారు'' అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.





