
'పెద్ది' వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, తాజా ప్రాజెక్ట్ 'ఆర్సీ17' (వర్కింగ్ టైటిల్) పై భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.చరణ్ షాకింగ్ మేకోవర్ ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ముఖ్యంగా సుకుమార్ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా 15 కిలోల బరువు తగ్గనుండటం విశేషం. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా స్లిమ్‌గా, అల్ట్రా స్టైలిష్‌గా మారబోతున్నారు. ‘పెద్ది’లో పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్, కండలు తిరిగిన శరీరంతో ఆకట్టుకున్న చరణ్, ఈసారి మాత్రం 'లీన్ అండ్ స్టైలిష్' లుక్‌లోకి మారేందుకు కఠినమైన వర్కవుట్లు, ప్రత్యేక డైట్ ప్లాన్ మొదలుపెట్టారు. సుకుమార్ గతంలో తెరకెక్కించిన రూరల్ డ్రామా ‘రంగస్థలం’కి భిన్నంగా ఈ కథను అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తో సరికొత్త పంథాలో సిద్ధం చేయడంతో చరణ్ క్యారెక్టరైజేషన్, లుక్స్ అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతున్నాయని టాక్.* నేనూ సైబర్ క్రైమ్ బాధితుడినే... వారానికోసారి పాస్వర్డ్ మారుస్తా : అక్కినేని నాగార్జునఆపరేషన్ సక్సెస్... రెస్ట్ మోడ్‌లో చరణ్'పెద్ది' చిత్రంలో క్లిష్టమైన హై-వోల్టేజ్ యాక్షన్, కుస్తీ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు కార్టిలేజ్‌కు తీవ్ర గాయమైంది. నొప్పి ఉన్నప్పటికీ షూటింగ్‌ను పూర్తి చేసిన ఆయన, జూలై 27న కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అమెరికన్ హ్యాండ్ సర్జన్ డాక్టర్ అలెజాండ్రో బడియాతో పాటు డాక్టర్ ఎస్. రాజశేఖరన్, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం చరణ్ పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన పూర్తి ఫిట్నెస్తో తిరిగి కసరత్తుల్లో పాల్గొననున్నారు.* ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన రెబల్ స్టార్... ‘ఫౌజీ’ లుక్‌తో ప్రభాస్ సరికొత్త విధ్వంసం నవంబర్ నుంచి షూటింగ్ఈ హై-ఆక్టేన్ యాక్షన్ డ్రామాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో చిత్ర యూనిట్ సమక్షంలో అధికారిక పూజా కార్యక్రమాలను నిర్వహించి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను జరిపేందుకు ప్లాన్ చేశారు. 'రంగస్థలం' వంటి క్లాసిక్ తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కాంబో రిపీట్ అవుతుండటం, దానికితోడు చరణ్ 15 కేజీల బరువు తగ్గి సరికొత్త గెటప్‌లో కనిపించనుండటంతో 'ఆర్సీ17' బాక్సాఫీస్ వద్ద మరో ఇండస్ట్రీ హిట్ ఖాయమని ఫిల్మ్‌నగర్ ధీమాగా ఉన్నాయి.





