
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘సిగ్మా’ (Sigma) ద్వారా ఆయన డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. తెలుగు సినిమాలపై ఆసక్తిని




