
కన్నడ నటుడు డాలీ ధనంజయ్ తెలుగు సినీ అభిమానులకు కూడా బాగా సుపరిచితమే. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాల్లో జాలి రెడ్డి పాత్రతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న డాలీ అప్పుడప్పుడు తెలుగుసినిమాల్లోనూ మెరుస్తున్నాడు. పుష్ప, పుష్ప 2తో పాటు సత్యదేవ్ తో కలిసి జీబ్రా అనే ఓ తెలుగు సినిమాలోనూ కీ రోల్ పోషించాడు డాలీ. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన శివ కార్తికేయన్ పరాశక్తి సినిమాలోనూ ఓ కీలక పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. గతేడాది ఫిబ్రవరిలో ధన్యత అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు డాలీ ధనంజయ. తమ అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఈ ఏడాది మేలో తమ జీవితంలోకి ఒక పండంటి మగ బిడ్డను ఆహ్వానించారు లవ్లీ కపుల్. ఇక తాజాగా వినాయక చవితి పండగను పురస్కరించుకుని తమ బిడ్డకు నామకరణ మహోత్సవం నిర్వహించారు డాలీ దంపతులు. ఈ సందర్భంగా తమ కుమారుడికి ‘ఎరేయ’ అని పేరు పెట్టారీ దంపతులు. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అలాగే అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.





