
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న చిత్రం 'దాదా'పై సినీ వర్గాల్లో గట్టి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని కొత్త అవతార్‌లో చూపించబోతున్నట్లు దర్శకుడు వెల్లడించాడు. 1980ల నాటి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, స్వాగ్ మరియు మేనరిజమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, 'నరసింహనాయుడు', 'సింహా' చిత్రాల తరహాలోనే ఇందులో ప్రేక్షకులు ఊహించని బలమైన ఫ్యామిలీ





