
హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, తన 'v' సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. వివో v80 పేరుతో రాబోతున్న ఈ స హైదరాబాద్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, తన 'V' సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. వివో V80 పేరుతో రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌ను కంపెనీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అధికారిక ఇండియా వెబ్సైట్లో విడుదల చేసింది. ప్రస్తుతం, వివో ఇండియా వెబ్సైట్లో ఈ ఫోన్ కోసం ప్రత్యేక ల్యాండింగ్ పేజీని ఏర్పాటు చేసి 'Coming Soon' ట్యాగ్‌ను జోడించారు. ఈ టీజర్ ద్వారా ఫోన్‌కు సంబంధించిన కొన్ని డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి. టీజర్లో ఈ ఫోన్‌ను కంపెనీ 'క్రియేటివ్ పార్టనర్'గా అభివర్ణించడం గమనార్హం. దీని ద్వారా V80 ఫొటోగ్రఫీకి అధిక ప్రాధాన్యతనిచ్చే పరికరంగా ఉండనుందని స్పష్టమవుతోంది. మీ కథలు ఇప్పుడు సినిమా స్థాయిలో అప్‌గ్రేడ్ అవుతున్నాయి. మీ క్రియేటివ్ పార్టనర్ త్వరలో రాబోతోంది. #vivoV80 #MyCinematicMoments #ZEISSPortraitSoPro టీజర్లో వివో V80 ఆకర్షణీయమైన ఆరెంజ్ రంగులో కనిపిస్తోంది. డిజైన్ పరంగా ఇది వివో సాధారణ V-సిరీస్ శైలినే కొనసాగిస్తున్నట్లు అనిపిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వివో V70 మాదిరిగానే ఇందులో కూడా Zeiss-బ్రాండెడ్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. లీకైన రిపోర్ట్స్ ప్రకారం, కంటెంట్ క్రియేటర్లను ఆకట్టుకునేలా 50MP టెలిఫొటో లెన్స్ (3X ఆప్టికల్ జూమ్), 4K సినెమాటిక్ వీడియో రికార్డింగ్, సరికొత్త 'AI క్రియేటివ్ కెమెరా' ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ఈ ఫోన్ ప్రధాన హైలైట్లలో దీని బ్యాటరీ సామర్థ్యం ఒకటి కానుంది. వివో V80 స్మార్ట్‌ఫోన్ మునుపటి మోడల్స్ కంటే చాలా పెద్దదైన 7,200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో రానుందని సమాచారం. ఇది సుమారు రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని, దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల టాక్.





