
Jasprit Bumrah World Record: భారత క్రికెట్ జట్టు (Team India) స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బుమ్రా అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. మ్యాచ్ తొలి ఓవర్లోనే పరుగులేమీ ఇవ్వకుండా అద్భుతమైన లైన్, లెంగ్త్, స్వింగ్, బౌన్స్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశారు. అఫ్గాన్ కెప్టెన్, ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) ఆరు బంతుల్లోనూ ఒక్క పరుగు కూడా తీయలేకపోయారు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఒక మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను బుమ్రా మెయిడెన్‌గా ముగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో ఆయన పొట్టి ఫార్మాట్లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.





