
ఇంటర్నెట్‌ డెస్క్‌: జైషే మహ్మద్‌ చీఫ్‌, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మసూద్‌ అజర్‌ (Masood Azhar) ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతిని 70 లక్షల పాకిస్థానీ రూపాయల (PKR)కు పెంచుతున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించడంపై భారత్‌ స్పందించింది. ఇలాంటి గిమ్మిక్కులు దాయాదికి కొత్తేం కాదంటూ విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశం ( Pakistan ) నుంచి ఇటువంటి ప్రకటన రావడం ఓ పద్ధతిలో భాగమేనని ఎద్దేవా చేశారు. ‘‘అటువంటి గిమ్మిక్కులు, మోసపూరిత ప్రకటనలు పాకిస్థాన్‌కు కొత్తేమీ కాదు. ఇలాంటివి మనం గతంలోనూ చాలాసార్లు చూశాం. అదో బూటకపు ప్రకటన. అనవసరపు ప్రకటనలు చేయడం కాకుండా.. కచ్చితమైన చర్యలు తీసుకోవాలి’’ అని జయస్‌వాల్‌ అన్నారు. హూతీల దాడులు.. ఇజ్రాయెల్‌ సాయం కోరిన సౌదీ! మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2019లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ జాతీయ దర్యాప్తు సంస్థ (FIA) కూడా 2021లో మసూద్‌ అజర్‌పై తొలిసారిగా రివార్డు ప్రకటించింది. పరారీలో ఉన్న మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదుల తాజా జాబితాను విడుదల చేసిన ఎఫ్‌ఐఏ.. గతంలో అజర్‌పై ఉన్న 20లక్షల రూపాయల రివార్డును 70లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





