
ఇంటర్నెట్‌ డెస్క్: ఈ నెల 16 నుంచి ఉజ్బెకిస్థాన్‌ వేదికగా ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌ (FIDE Chess Olympiad) ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు ఆ దేశంలోని సమర్‌కండ్‌కు చేరుకున్న భారత టీమ్‌కు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. భారత బృందం ఐదు గంటలకు పైగా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయిందని.. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి బసకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని గ్రాండ్‌మాస్టర్‌ శ్రీనాథ్ నారాయణన్ తెలిపారు. ‘‘ఫిడె చెస్ ఒలింపియాడ్‌లో దారుణమైన అనుభవం ఎదుర్కొంటున్నాం. భారత జట్టు సభ్యులు సమర్‌కండ్‌ విమానాశ్రయానికి చేరుకుని 5 గంటలు దాటింది. ఇప్పటికీ గదులు కేటాయించలేదు. ఎప్పుడు కేటాయిస్తారనే దానిపైనా ఎలాంటి స్పష్టత లేదు’’ అని శ్రీనాథ్‌ నారాయణన్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు. దీనిపై భారత యువ చెస్ స్టార్ విదిత్ గుజరాతీ స్పందించాడు. ఉజ్బెకిస్థాన్‌లో తమ వసతి ఏర్పాట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉందన్నాడు. తొలి భారత ప్లేయర్‌గా శ్రీ చరణి రికార్డు భారత్‌ తరఫున గుకేశ్‌, ప్రజ్ఞానంద, కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌, విదిత్‌ గుజరాతీ, అర్జున్‌ ఇరిగేశీ తదితరులు ఈ చెస్‌ ఒలింపియాడ్‌లో ఆడనున్నారు. ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 400 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో ఓపెన్ విభాగంలో 208 జట్లు, మహిళల విభాగంలో 192 జట్లు ఉన్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





