
బంగ్లాదేశ్ రాజకీయంలో మరోసారి సంచలనాత్మక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చే డిసెంబర్లో భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, అవామీ లీగ్ పక్షానికి అక్కడి అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ భారీ షాక్ ఇచ్చింది. 2024లో చోటుచేసుకున్న విద్యార్థుల పోరాటం, ఉద్యమ అణచివేత కేసులో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అవామీ లీగ్ జనరల్ సెక్రటరీ ఒబైదుల్ ఖాదర్‌తో సహా ఏడుగురు సీనియర్ నాయకులకు మరణశిక్ష ఖరారు చేస్తూ జస్టిస్ నజ్రుల్ ఇస్లామ్ చౌదరి నేతృత్వంలోని ట్రైబ్యునల్ మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఒబైదుల్ ఖాదర్: ఆవామీ లీగ్ జనరల్ సెక్రటరీ & మాజీ మంత్రి బహావుద్దీన్ నసీమ్: జాయింట్ జనరల్ సెక్రటరీ మహ్మద్ అలీ అరాఫత్: మాజీ సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి షేఖ్ ఫజల్ షమ్స్ పరాష్, మైనుల్ హుస్సేన్ ఖాన్ నిఖిల్: జుబో లీగ్ నేతలు సద్దాం హుస్సేన్: ఛాత్ర లీగ్ అధ్యక్షుడు షేక్ వలీ ఆసిఫ్: ఛాత్ర లీగ్ జనరల్ సెక్రటరీ





