
కార్డుదారులకు ఇవ్వకుండా పక్కదారి కలెక్టరేట్, న్యూస్‌టుడే బహిరంగ మార్కెట్‌లో పంచదార ధరకు రెక్కలొచ్చాయి. డిమాండ్‌ పెరగడంతో కేజీ రూ. 70కి పైగా పలుకుతోంది. నాణ్యతను బట్టి రూ. 80 వరకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా చౌక దుకాణాల్లో దందాకు తెరలేపారు. కార్డుదారులకు అర కేజీ చొప్పున పంపిణీ చేయాల్సిన పంచదారను పక్కదారి పట్టిస్తున్నారు. కార్డుదారులు ఎవరైనా ప్రశ్నిస్తే ఈ నెల కోటా తక్కువగా వచ్చిందని, ముందొచ్చిన వారికి ఇచ్చేశామంటూ మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. స్టాక్‌ లేదంటే ఫిర్యాదు చేయండి: కార్డుదారులందరికీ తప్పనిసరిగా పంచదార ఇవ్వాలి. అలా ఇవ్వకుండా డీలర్లు పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. క్రమం తప్పకుండా డిపోలను తనిఖీ చేస్తున్నాం. కార్డుదారులు అందరికీ సరిపడా పంచదార నిల్వలు డిపోలకు పంపాం. స్టాక్‌ అయిపోయిందని డీలర్లు చెబితే ఫిర్యాదు చేయవచ్చు. మూర్తి, పౌరసరఫరాల జిల్లా అధికారి .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




