
పీఎంపాలెం : విశాఖ జిల్లా మధురవాడ ఆర్టీసీ కాలనీలో కోమలి (30) అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా కాలంగా వాంబే కాలనీలో నివాసం ఉండే కోమలి.. ఇటీవల ఆర్టీసీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే ఉంటోంది. గతంలో మున్నా అనే వ్యక్తితో వివాహం కాగా.. వ్యక్తిగత కారణాలతో విడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తున్న ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయంపై పీఎంపాలెం పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారి జి.బాలకృష్ణ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





