
వినాయక చవితి సందర్భంగా విజయవాడ(Vijayawada)లోని డూండి సేవా సమితి వరుసగా ఆరోసారి పూర్తిగా మట్టితో తయారుచేసిన మహా గణపతిని ఏర్పాటుచేసింది. విజయవాడ విద్యాధరపురంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల పంచముఖ మహాగణపతి ఆగమన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. డప్పులు, బాణాసంచా, కాంతులు, భక్తుల నృత్యాల సందళ్ల మధ్య ఈ కార్యక్రమం సాగింది. మహిళల కోలాటం ఆకట్టుకుంది. మంత్రి సవిత ఆగమన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డూండిసేవా సమితి ఐదేళ్లుగా మట్టి, జనపనార, కొబ్బరిపీచు, కర్రలతోనే విగ్రహాన్ని రూపొందిస్తోంది. ఈ వార్త చదివారా: క్యూలైన్లలో వైకుంఠ వైభవం!



