
ఒకసారి రవి అనే వ్యక్తి బైక్పై ఆఫీసుకు బయలుదేరాడు. దారిలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. రెడ్ లైట్ ఉండటంతో ఆగాడు. గ్రీన్ సిగ్నల్ పడగానే బయలుదేరాడు. కొంతదూరం వెళ్లగానే మరో సిగ్నల్ వచ్చింది. అక్కడ కూడా ఆగి.. గ్రీన్ లైట్ కోసం ఎదురుచూశాడు. మరికొంత దూరం వెళ్లగానే మూడో సిగ్నల్ వచ్చింది. అప్పటికే ఆఫీసుకు ఆలస్యం అవుతోంది. ఈసారి రవికి ఓపిక లేకపోయింది. ‘ఇక్కడ ఏ వెహికల్స్ లేవు కదా.. వెళ్లిపోదాం’ అనుకుని గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూడకుండా ముందుకు వెళ్లాడు. అంతలోనే వేగంగా వచ్చిన ఓ లారీ అతని బైక్ను ఢీకొట్టింది. ఒక్క క్షణం ఓపిక పట్టి ఉంటే రవి ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేవాడు. ఈ చిన్న సంఘటన మనకు ఒక పెద్ద పాఠాన్ని చెబుతుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒక్క క్షణం ఓపిక కూడా మన జీవితాన్ని మార్చగలదు.





