
ఇంటర్నెట్‌ డెస్క్‌: తనను వెంబడిస్తున్న వారిని వారించినందుకు కొందరు వ్యక్తులు ఓ మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటన గురుగ్రామ్‌ (Gurugram)లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. గురుగ్రామ్‌కు చెందిన సియా స్పోర్ట్స్ బైక్‌ (Sports Bike) నడుపుతుండగా కొందరు వ్యక్తులు కారులో ఆమెను వెంబడించారు. ఇది గమనించిన ఆమె తన వెంటపడొద్దని వారిని వారించింది. కొంత దూరం వెళ్లాక వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను బలంగా తాకుతూ వెళ్లింది. దీంతో సియా రోడ్డుపై పడిపోగా.. బైక్‌ కొంత దూరం మేర జారుతూ వెళ్లిపోయింది. ఈ సంఘటన సియా బైక్‌పై అమర్చిన యాక్షన్ కెమెరాలో రికార్డ్ అయింది. అదే సమయంలో సియా వెనుక వస్తున్న ఆమె స్నేహితులు కారును ఆపడానికి ప్రయత్నించారు. కాగా, కారులోని వ్యక్తి వారితో దుర్భాషలాడుతూ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను సియా సోషల్‌ మీడియాలో షేర్‌చేయడంతో వైరల్‌గా మారింది. దూరంగా వెళ్లమన్నందుకు కారులోని వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించారని.. ఆ సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు. రోడ్డుపై వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుగ్రామ్‌ పోలీసులను కోరారు. ఇదీ చదవండి: ఇసుకలో గీతలు.. మారుతున్న తలరాతలు! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





