
హమీర్పూర్: సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలకు లైక్స్, వ్యూస్ కోసం కొందరు యువత ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ప్రమాదకర ప్రదేశాల్లో విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. లోతైన నీటిలో ప్రమాదకరంగా ఈత కొడుతూ, విన్యాసాలు చేస్తున్న కొందరు యువకులకు పోలీసులు వినూత్న రీతిలో గుణపాఠం చెప్పారు.





