
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు మంచి అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (CHSL)-2026’ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాలు, ట్రైబ్యునళ్లలో లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో దాదాపు 2,536 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 7, 2026లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.





