
డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రూ.2వేల లోపు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండబోమని ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకులు డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రూ.2వేల లోపు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండబోమని ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకులు మరియు చెల్లింపు సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తూ, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10A కింద కేంద్ర ఆర్థికశాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, రూ.2000లోపు యూపీఐ ద్వారా డబ్బులు పంపడం లేదా స్వీకరించడం జరిగినా, బ్యాంకులు లేదా చెల్లింపు సంస్థలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేవు. అంతేకాకుండా, రూపే డెబిట్ కార్డులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టంగా పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా డిజిటల్ చెల్లింపుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. వినియోగదారులు ఈ లావాదేవీలను ఉచితంగా చేసుకోవడం ద్వారా, డిజిటల్ చెల్లింపుల పద్ధతులను మరింత ప్రోత్సహించేందుకు ఇది సహాయపడుతుంది. అయితే, రూ.2000 పైబడిన యూపీఐ చెల్లింపులపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ పేరిట ఛార్జీలు విధించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఛార్జీలు విధించినా, వాటిని వ్యాపారులు భరించాల్సి ఉంటుందని, వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. వ్యక్తిగత ఖాతాల మధ్య జరిగే నగదు బదిలీలు ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతాయి. ఈ నిర్ణయం దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరియు ఆర్థిక వ్యవస్థను మరింత స్థిరంగా ఉంచడానికి తీసుకున్న చర్యగా ప్రభుత్వం భావిస్తోంది.



