
Rs 2000 UPI Transaction: కొంత కాలంగా యూపీఐ మర్చంట్ ట్రాన్సాక్షన్లపై కేంద్రం ఎండీఆర్ ఛార్జీలు విధిస్తుందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మరోసారి దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ. 2 వేల వరకు విలువైన యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, ఇతర పేమెంట్ అగ్రిగేటర్స్ ఎలాంటి ఛార్జీలు విధించొద్దని పేర్కొంది. అయితే అంతకంటే విలువైన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలుకు మార్గం సుగమమైంది.



