
JDU on UCC | పట్నా: బిహార్‌లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుకు తాము వ్యతిరేకమని జేడీయూ స్పష్టంచేసింది. పార్లమెంట్‌లో యూసీసీ బిల్లుకు తాము మద్దతు తెలిపినప్పటికీ.. రాష్ట్రంలో అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆ పార్టీ సీనియర్‌ నేత శ్యామ్‌ రజక్‌ వెల్లడించారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత నీతీశ్‌ కుమార్‌ ఇప్పటికే స్పష్టంచేశారని చెప్పారు. 2029 నాటికి 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమల్లోకి వస్తుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (amit shah) చేసిన వ్యాఖ్యలపై శ్యామ్‌ రజక్‌ స్పందించారు. బిహార్‌లో ప్రస్తుతం సామ్రాట్‌ చౌధరి నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అధికారంలో ఉందని, ఎన్డీయేలో నీతీశ్‌ కుమార్‌ భాగస్వామిగా ఉన్నారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దానికి శ్యామ్‌ రజక్‌ బదులిచ్చారు. ముఖ్యమంత్రి భాజపాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ప్రభుత్వం మిత్రపక్షాల మద్దతుతో నడుస్తోందని గుర్తుచేశారు. యూసీసీ విషయంలో తమ వైఖరి సుస్పష్టం అని, కాబట్టి అమలు ప్రస్తావనే ఉత్పన్నం కాదని ఆయన పునరుద్ఘాటించారు. మరోవైపు, ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీ భాజపాపై విమర్శలు గుప్పించింది. మరోసారి ఆ పార్టీ విద్వేష రాజకీయాలకు తెరతీసిందని విమర్శించింది. ‘‘భాజపాకు ఇటీవల అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అందుకే తన పాత ఎత్తుగడ మొదలుపెట్టింది. విద్వేష రాజకీయాలను తిరిగి తీసుకొచ్చింది’’ అని పార్టీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ పేర్కొన్నారు. బిహార్‌ ప్రజల నరనరాల్లో లౌకికవాదం ఉంటుందనే విషయాన్ని భాజపా గుర్తుంచుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో యూసీసీ అమలుకు యత్నిస్తే తాము అడ్డుకుని తీరుతామని స్పష్టంచేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వినాయక చవితి వేడుకల వేళ దేశవ్యాప్తంగా భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వైవిధ్యభరితమైన గణనాథుడి ప్రతిమలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) ఘనంగా జరిగింది.





