
Penalty Kick viral video: ఇంటర్నెట్ ప్రపంచంలో క్రీడలకు సంబంధించిన వినూత్న విన్యాసాలు, సరదా సన్నివేశాలు ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తుంటాయి. తాజాగా ఫుట్‌బాల్ (Football) ఆటకు చెందిన ఒక వినోదాత్మక వీడియో సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా చక్కర్లు కొడుతోంది. సాధారణంగా పెనాల్టీ వద్ద బంతిని ఉంచి నేరుగా గోల్ కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో గోల్‌కీపర్ బంతి దిశను అంచనా వేసి ఆపేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ మాత్రం ఆటగాడు వేసిన ప్లాన్ చూసి అందరూ నివ్వెరపోయారు. పెనాల్టీ షూట్ చేయడానికి వచ్చిన సదరు వ్యక్తి బంతిని ముందుకు తన్నకుండా, ముందుకు వంగి షూని సరిచేస్తున్నట్లు ఫోజులు ఇచ్చి, కళ్లుమూసి తెరిచేలోపు కాలితో బంతిని నెట్టి నెట్లోకి పంపాడు. ఈ ఊహించని ట్రిక్ చూసిన గోల్‌కీపర్ బుర్ర కరాబైంది.





