
ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత మహిళల జట్టు విజేతగా నిలిచినప్పటికీ, ట్రోఫీ అందుకోకుండానే వెనుతిరిగింది. ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఏసీసీ వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ అల్ జరూనీతో ట్రోఫీ ఇప్పించాలని భారత్ కోరినా నఖ్వీ తానే ఇస్తానని పట్టుబట్టారు. దీంతో ప్రెజెంటేషన్ వేడుకలో భారత్ ట్రోఫీ, మెడల్స్ అందుకోలేదు. సుమారు అరగంట సేపు వేదికపైనే ఉన్న నఖ్వీ.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.





