
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో భారీ బస్ టెర్మినళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్లో టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. గాజులరామారంలో 100 ఎకరాలు, శంషాబాద్‌లో 150 ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్‌తో లాస్ట్‌మైల్ కనెక్టివిటీని సమన్వయం చేయనున్నారు. 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులను శివారు టెర్మినళ్లకే పరిమితం చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.





