
గతంలో పలు వివాదాలకు కారణమైన వైరల్ ఫొటోపై బాలీవుడ్ నటి మందాకిని వివరణ ఇచ్చారు. కొన్నేళ్ల క్రితం అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పక్కన ఆమె కూర్చున్న ఓ ఫొటో బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తాజాగా నటి స్పందిస్తూ.. ఒక షో కోసం దుబాయ్ వెళ్లానని, అక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ ఫోటో తీశారని తెలిపారు. ఆ ఫొటో వల్ల తన కెరీర్ దెబ్బతిందని మందాకిని పేర్కొన్నారు. వివరాలకు..




