
ఆసియా కప్ 2026 ఫైనల్లో శ్రీలంకపై ఘనవిజయం సాధించినా భారత మహిళల జట్టు ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోలేదు. ప్రెజెంటేషన్ వేడుకకు భారత ఆటగాళ్లు రాలేదు. దీంతో కోపంతో ఉన్న అభిమానులు స్టేడియంలో నఖ్వీని ఉద్దేశించి "ట్రోఫీ చోర్" అంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో నఖ్వీ అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. విన్నర్స్ ట్రోఫీ ప్రస్తుతం ఏసీసీ ఆఫీస్‌లోనే ఉండిపోయింది.





