
ఆదిలాబాద్ జిల్లా సిరికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి టీఎల్ఎం (బోధన అభ్యసన సామగ్రి) మేళా నిర్వహించారు.
© 2026 nimisham.in

ఆదిలాబాద్ జిల్లా సిరికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి టీఎల్ఎం (బోధన అభ్యసన సామగ్రి) మేళా నిర్వహించారు.
సిరికొండ: ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి టీఎల్ఎం (బోధన అభ్యసన సామగ్రి) మేళా నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు రూపొందించిన బోధనా సామగ్రిని ప్రదర్శించారు. ఈ మేళాను జిల్లా విద్యాధికారిణి మాధవి సందర్శించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధనలో వినూత్న పద్ధతులను వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అనంతరం పీఎంశ్రీ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను సందర్శించారు. సిరికొండ ఎంఈవో సునీల్ కుమార్, తహసీల్దార్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆట వస్తువులు అందించి.. ఉత్సాహం నింపి.. సిరికొండ : సిరికొండ మండలం సోంపల్లిలో ప్రీప్రైమరీ తరగతి గదిని ఎంఈవో సునీల్ కుమార్ గ్రామస్థులతో కలిసి ప్రారంభించారు. చిన్నారులకు కావలసిన ఆట వస్తువులు, పుస్తకాలు, బూట్లు తదితర వస్తువులను అందించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సర్పంచి లక్ష్మీకాంత్, ఉపసర్పంచి విలాస్, భాజపా మండల అధ్యక్షుడు అమూల్, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు సూర్యకాంత్, ప్రధానోపాధ్యాయుడు సంజీవ్ పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








