
ఇంటర్నెట్‌ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒహాయో వ్యాలీ బృందం ‘గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ’ స్ఫూర్తితో నిర్వహించిన బ్యాక్‌ప్యాక్ పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది. అరోరా సిటీ కో-ఆర్డినేటర్ రామారావు పంగులూరి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీజనల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం బ్యాక్‌ప్యాక్‌లు పంపిణీ చేశారు. తానా ఒహాయో వ్యాలీ క్లీవ్‌ల్యాండ్ - యాక్రన్ నాయకత్వ బృందం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం సేకరించిన బ్యాక్‌ప్యాక్‌లను అరోరా పాఠశాలల ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ యార్లగడ్డ, నరేష్ బొడ్డు, సుహాసిని అడ్డగడ, సాయి రెడ్డి టేకుర్తి తదితరులు పాల్గొన్నారు. స్థానిక విద్యార్థుల విద్యా ప్రయాణానికి సహకరించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధులు, వలంటీర్లు, స్పాన్సరర్‌లు, స్థానిక నాయకులు, పాఠశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం అందించిన తానా అధ్యక్షుడు డా|| నరేన్ కొడాలి.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శివ చావా, కమ్యూనిటీ సర్వీస్ కో-ఆర్డినేటర్ సాయి బొల్లినేని, ఒహాయో వ్యాలీ బ్యాక్‌ప్యాక్ కో - చైర్ సతీష్ దంతులూరి, తానా బ్యాక్‌ప్యాక్ చైర్ నరేష్ బొడ్డులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన తానా టీమ్ స్క్వేర్ ఒహాయో కో - చైర్ సుహాసిని అడ్డగడ, ఒహాయో వ్యాలీ బాలోత్సవం కో - చైర్ ప్రియాంక యడ్లపల్లి, ఒహాయో వ్యాలీ కళాశాల కో - చైర్ లక్ష్మి యార్లగడ్డలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. బ్యాక్‌ప్యాక్‌ల సేకరణ, ప్యాకింగ్, రవాణా, పంపిణీలో సహకరించిన వలంటీర్లు, స్పాన్సర్లు, అరోరా పాఠశాలల నాయకత్వ బృందం, ఉపాధ్యాయులు, సిబ్బంది, సమాజ సభ్యులందరికీ తానా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





