
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు ఏడు అరబ్ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి సైనికాధికారులు జర్మనీలో రహస్యంగా సమావేశమయ్యారు.
© 2026 nimisham.in

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు ఏడు అరబ్ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి సైనికాధికారులు జర్మనీలో రహస్యంగా సమావేశమయ్యారు.
పాల్గొన్న అమెరికా, ఇజ్రాయెల్, అరబ్‌ దేశాల సైనికాధికారులు వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు ఏడు అరబ్‌ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి సైనికాధికారులు జర్మనీలో రహస్యంగా సమావేశమయ్యారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం, ప్రాంతీయ భద్రత, హూతీల దాడులు, హర్ముజ్‌ జలసంధి పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు అని ఆక్సియోస్‌ నివేదిక వెల్లడించింది. అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ అధిపతి అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఈజిప్ట్‌ సైనికాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఆయా ప్రభుత్వాలు ముందుగా ఈ సమావేశాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ 8 దేశాల సీనియర్‌ సైనికాధికారులతో షెడ్యూల్‌ ప్రకారం జర్మనీలో ఈ సమావేశం నిర్వహించినట్లు సెంట్‌కామ్‌ ధ్రువీకరించింది. ఇరాన్‌ నుంచి అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగుతున్నప్పటికీ, పశ్చిమాసియా నుంచి తమ బలగాలను ఉపసంహరించుకునే ఆలోచన లేదని ఈ భేటీలో బ్రాడ్‌ కూపర్‌ చెప్పినట్లు ఆక్సియోస్‌ కథనం వెల్లడించింది. అలాగే హర్మూజ్‌ జలసంధి మీదుగా వాణిజ్య నౌకల రాకపోలకు మరింత పెంచేందుకు అమెరికా అనురిస్తున్న వ్యూహాల గురించి ఆయన వివరించినట్లు తెలిపింది. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ సైనిక చర్యల గురించి ఐడీఎఫ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ జనరల్‌ ఎయాల్‌ జమీర్‌ వివరించినట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌కు రూ.26 వేల కోట్ల (2.8 బిలియన్‌) భారీ ఆయుధ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది ఇందులో ఒక్కొక్కటి టన్ను బరువున్న 40 వేల బాంబులు ఉన్నాయి. వీటిలో 20 వేల ఎంకే 84 , 20 వేల బీఎల్‌యూ-117లు ఉన్నాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. వీటితో పాటు 20వేల ఐ-2000 పెనెట్రేటర్‌ వార్‌హెడ్స్‌ కూడా ఉన్నాయి.అమెరికా ఆయుధగారంలో ఉన్న అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల్లో ఎంకే-84 ఒకటి. ఇజ్రాయెల్‌ ఈ తరహా బాంబులను లెబనాన్, గాజాలో పలుమార్లు ఉపయోగించింది. దాంతో అప్పట్లో బైడెన్‌ ప్రభుత్వం వాటి డెలివరీని నిలిపివేసింది. కానీ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిలుపుదలను ఎత్తివేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








