వాణిజ్య నౌక
Actor ProfilePolitician

వాణిజ్య నౌక

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources2
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు
Eenadu1 Nov 2026
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒమన్‌ తీరం వద్ద హర్మూజ్‌ (Hormuz) జలసంధిలోవాణిజ్య నౌక జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీపై ఇరాన్‌ (Iran) చేసిన దాడిలో ఒక భారతీయుడు గల్లంతయ్యాడు. ఈ దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. సైప్రస్‌ జెండాతో వెళ్తున్న ఈ నౌకలో మొత్తం 11 మంది భారతీయులు ఉండగా.. వారిలో 10 మందిని రక్షించారు. ఈ విషయాన్ని భారత దౌత్య కార్యాలయం ధ్రువీకరించింది. ‘‘ వాణిజ్య నౌక జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీపై ఒమన్‌ తీరంలో దాడిచేయడాన్ని మేము ఖండిస్తున్నాం. దీనిలో ఉన్న 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించారు. ఒకరి జాడ గల్లంతైంది. ఒమన్‌లోని మా దౌత్య కార్యాలయం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది. గాలింపు చర్యల్లో ఒమన్‌ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. ఒమన్‌ ప్రభుత్వం అందించిన సాయానికి ధన్యవాదాలు’’ అని భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. హర్మూజ్‌ జలసంధిలో జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీ నౌకపై ఇరాన్‌ దాడి చేయడంతో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది ఆ నౌకను వదిలేసి ఒక చిన్న లైఫ్‌బోట్‌లో బయటపడ్డారు. నౌక ఇంజిన్‌ రూమ్‌ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనతో హర్మూజ్‌ జలసంధి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఇరాన్‌లోని మొత్తం 140 లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ గుర్తింపు
Andhra Jyothy20 Sept 2026
విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ గుర్తింపు

విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు. విశాఖపట్నం, జులై 5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం సముద్రంలో

సముద్రంలో గల్లంతైన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ లభ్యం
Eenadu19 Sept 2026
సముద్రంలో గల్లంతైన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ లభ్యం

విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఐదుగురి ఆచూకీని గుర్తించారు. గల్లంతైనవారిలో కారె చిన్నాను వాణిజ్య నౌక సిబ్బంది కాపాడారు. వాణిజ్య నౌక ఎక్కలేకపోయిన నలుగురి