
అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేయడానికి సిద్ధపడ్డారని రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికాకు మోకరిల్లడం మానుకోవాలని హితవు పలికారు.
© 2026 nimisham.in

అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేయడానికి సిద్ధపడ్డారని రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికాకు మోకరిల్లడం మానుకోవాలని హితవు పలికారు.
దిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం చేయడానికి సిద్ధపడ్డారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. అమెరికాకు మోకరిల్లడం మానుకోవాలని హితవు పలికారు. ‘‘మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఒకసారి ఒక ప్రశ్న ఎదురైంది. మీరు లెఫ్ట్‌వైపు మొగ్గుతారా.. రైట్‌వైపు మొగ్గుతారా అని అడిగారు. అందుకామె.. తాను ఎటూ మొగ్గనని, నిటారుగా నిలుస్తానని సమాధానమిచ్చారు. కానీ ట్రంప్‌ ముందు మోదీ మోకరిల్లుతున్నారు. యూపీఐ ఛార్జీల ద్వారా దేశంలోని ప్రతి పౌరుడిపై ఆయన భారం మోపుతున్నారు. ఆ డబ్బంతా అమెరికాకు వెళ్తుంది’’ అని రాహుల్‌ ధ్వజమెత్తారు. యూపీఐ పన్నును ఉపసంహరించుకోవాలని ఎక్స్‌లో విడుదల చేసిన వీడియోలో ఆయన డిమాండు చేశారు. పండగల సీజను ప్రారంభమవుతున్న నేపథ్యంలో యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ అమలుమీద రిటెయిలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లాతింగ్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఎంఏఐ) ఆందోళన వ్యక్తం చేశాయి. తక్కువ మార్జిన్లతో పని చేసే చిన్న వర్తకులు ఈ రుసుములను తప్పించుకునేందుకు.. వినియోగదారుల నుంచి మళ్లీ నగదు స్వీకరించే దిశగా మొగ్గు చూపుతారని ఆర్‌ఏఐ సీఈవో రాజ్‌కుమార్‌ రాజగోపాలన్‌ అభిప్రాయపడ్డారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలను విధించడం దురదృష్టకరం. వ్యాపారులు ఆ భారాన్ని ప్రజలపైనే మోపుతారు.’’ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







