
మీరు జీవితంలో విజయం సాధించాలంటే ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా మీకు రోజులో ఎక్కువ సమయం లభిస్తుంది. పనులు సమయానికి పూర్తి అవుతాయి. ఉదయం నిద్ర నుంచి లేచాక ఒక గ్లాసు వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల బాడీ యాక్టివ్గా మారుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ప్రశాంతంగా, ఏకాగ్రతతో పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రతిరోజూ ఉదయం కాసేపు సూర్యరశ్మిలో ఉండటం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీకు కావాల్సిన విటమిన్ డి అందుతుంది. మీరు చురుకుగా ఉంటారు. ఉదయం లేచాక ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. స్ట్రెచింగ్, వాకింగ్, యోగా వంటివి చేస్తే బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. యాక్టివ్గా ఉంటారు. ఉదయం పూట మీ ఆరోగ్యాన్ని కాపాడే హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు చేర్చుకోండి. ఉదయం నిద్ర లేవగానే మొబైల్ చూడకండి. పైన చెప్పిన పనులు అన్నీ పూర్తి అయ్యాక మొబైల్ వాడండి. లేదంటే ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఉదయం లేవగానే చేయాల్సిన పనులు ప్లాన్ ప్రకారం రాసుకోండి. ఇలా చేయడం వల్ల పనులు సమయానికి పూర్తి అవుతాయి. గజిబిజీ ఉండదు. ఉదయం లేవగానే మీ జీవితంలో జరిగిన విషయాలకు కృతజ్ఞత చెప్పండి. ఇలా చేయడం వల్ల మీలో పాజిటివిటీ పెరుగుతుంది. ప్రశాంతంగా ఉంటారు.





