
వ్యవసాయోత్పత్తుల్లో మితిమీరిన రసాయన అవశేషాలు అ లంపూర్‌ నియోజకవర్గంలో గత యాసంగిలో సాగుచేసిన మిర్చి ఇది. నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకుపైగా మిర్చి సాగుచేశారు. అధిక వర్షాలకు కొంత నష్టపోగా లక్షలాది టన్నుల దిగుబడి రైతులకు అందింది. గుంటూరు మార్కెట్‌కు తరలించి విక్రయించగా విదేశాలకు ఎగుమతి చేసిన వ్యాపారులకు చుక్కెదురైంది. మోతాదుకు మించి రసాయనిక అవశేషాలు ఉన్న కారణంగా పంట తిరస్కరణకు గురైనట్లు సమాచారం. గద్వాల, శాంతినగర్, న్యూస్‌టుడే: ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వాణిజ్య పంటలతో పాటు ఆహార పంటలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగులో వీటి వాడకంతో ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు మోతాదుకు మించి ఉంటున్నాయి. ఏటా వ్యవసాయ శాస్త్రవేత్తలు దీనిపై హెచ్చరికలు చేస్తున్నా.. పంట చేతికి రావాలంటే వీటి వాడకం తప్పడం లేదని రైతులు అంటున్నారు. విదేశీ సంస్థల తిరస్కరణ : ఉమ్మడి జిల్లాలో పండించే మిర్చి, మామిడి, కూరగాయలు, పండ్లు, ఇతర వాణిజ్య పంటలు చాలా వరకు హైదరాబాద్, గుంటూరు, బెంగళూరు ఇతర మార్కెట్లలో రైతులు విక్రయిస్తుంటారు. వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే కొంత కాలంగా ఇక్కడి నుంచి ఎగుమతి అయిన ఉత్పత్తులను పురుగు మందుల అవశేషాల స్థాయి కారణంగా విదేశీ వ్యాపార సంస్థలు తిరస్కరిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 22 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. అందులో 10 లక్షల ఎకరాలు పత్తి సాగు ఉండగా మిగిలిన పొలాల్లో ఆహార పంటలు, కూరగాయలు, పండ్ల తోటలు ఉన్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



